సంపాదకీయం

‘తెలుగు’ తీర్పు..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవనం ప్రాతిపదికగా రూపొందిన చలనచిత్రం- బయోగ్రాఫికల్ పిక్చర్- బయోపిక్- విడుదలను-ప్రదర్శనను- నిలిపి వేయడం ‘ఎన్నికల సాధికార సంఘం’-ఎలక్షన్ కమిషన్-ఈసీ- వారి స్వతంత్ర, నిష్పక్ష ప్రవృత్తికి నిదర్శనం. ఇదీ, ఇలాంటి మరికొన్ని దృశ్య మాధ్యమ రూపాలు ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ‘‘నైతిక ప్రవర్తన నియమావళి’’- మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్- ఎమ్‌సిసి-కి విరుద్ధమన్నది ‘ఎన్నికల సాధికార సంఘం’ వారి నిర్ధారణ! గురువారం దేశవ్యాప్తంగా జరిగిన మొదటి విడత ‘మత ప్రదాన’-పోలింగ్- ఘట్టానికి బుధవారం నాటి ఈ ‘ఈసీ’ నిర్ణయం నేపథ్యం. ఎన్నికల సాధికార సంఘం వారు ‘్భరతీయ జనతాపార్టీ’కి అనుకూలంగాను, తమ పార్టీకి వ్యతిరేకంగాను ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నారని ‘తెలుగుదేశం పార్టీ’- తెదెపా- అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపిస్తుండడం సమాంతర విపరిణామం. బుధవారం నాడు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఎదుట ఈ ముఖ్యమంత్రి నిరసన ప్రదర్శనను నిర్వహించడం అభూత పూర్వ ఘటన! ఇది ‘సంఘటనా’? లేక ‘దుర్ఘటనా?’ అన్నది సాపేక్షం.. ‘ఈసీ’ వారు ‘్భజపా’కు అక్రమ ప్రయోజనం సిద్ధింపచేయడానికి యత్నిస్తున్నారని బుధవారం నాటి చంద్రబాబు నాయుడి ఆరోపణకు, నరేంద్ర మోదీ ‘బయోపిక్’ ప్రదర్శనను ‘ఈసీ’ నిరోధించడానికి మధ్య పొంతన కుదరడం లేదు. ఇలా పొంతన కుదరకపోవడం గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల ‘మత ప్రదాన’ ప్రక్రియకు విచిత్ర నేపథ్యం. రాజకీయవేత్తలకు ‘‘నోళ్లున్నది పారేసుకోవడానికేనన్నది..’’ ధ్రువపడిన వాస్తవం, జన మెరిగిన సత్యం. అందువల్ల రాజకీయవేత్తలు తమ నోళ్లను నిరంతరం ప్రత్యర్థులపై పారేసుకుంటుండడం ఆశ్చర్యకరం కాదు. చంద్రబాబు నాయుడికి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోని, దేశంలోని దాదాపు రాజకీయవేత్తలందరికీ వర్తించే అంశం ఇది. చంద్రబాబు నాయుడికి మించిన రీతిలో పరుష పదజాలంతో, అతార్కిక పదజాలంతో, అసభ్య పదజాలంతో, అశ్లీల పదజాలంతో నోళ్లకు పదునుపెడుతున్న నాయకులు తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు, దేశమంతటా ఉన్నారు. గురువారం ముగిసిన మత ప్రదానానికి ముందు నడచిన ప్రచార ఘట్టం ఇందుకు నిదర్శనం. కానీ చంద్రబాబు నాయుడి వంటి పరిణతి చెందిన రాజకీయవేత్త లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను నిర్వహిస్తున్న ‘రాజ్యాంగ సాధికార సంస్థ’- ఈసీ-పై ఇలా నోరు పారేసుకోవడం మాత్రం విస్మయకరం.
ఈ విస్మయాన్ని ప్రచార ఘట్టం పొడవునా చంద్రబాబు ప్రదానం చేశాడు. ‘ఎన్నికల సాధికార సంఘం’ వారు చేసిన ఉన్నత అధికారుల బదిలీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు జరుగకుండా తాత్కాలికంగా నిరోధించడం పరాకాష్ఠ. ఈ ‘బదిలీ’ ఉత్తరువులను ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయడం మరో వైపరీత్యం. ఎన్నికల ‘నైతిక ప్రవరవ్తన నియమావళి’- ఎమ్‌సిసి- అమలులోకి వచ్చిన తరువాత, ఎన్నికల ప్రక్రియ ఆరంభమైన తరువాత ‘ఈసీ’ కార్యకలాపాలలో నిర్ణయాలలో ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాలు జోక్యం కల్పించుకోవు. ఈ సంగతిని న్యాయస్థానాలు పదే పదే స్పష్టం చేశాయి. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ‘ఈసీ’కి వ్యతిరేకంగా న్యాయస్థానాలకెక్కడం విస్మయకృత్యాల ఆవిష్కరణలో భాగం. తమకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి జట్టు కట్టారన్నది, కత్తికట్టారన్నది చంద్రబాబు ప్రచారంలోని ప్రధాన అంశం. కట్టారా? లేదా? అన్నది విషయాంతరం.. కానీ ఈ ‘‘జట్టు’’చెప్పినట్టు ‘ఈసీ’ ప్రవర్తిస్తోందన్న ఆరోపణ చేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగని పని! ‘ఈసీ’ ఒకవేళ అలాంటి స్థితికి దిగజారినట్టయితే న్యాయస్థానాలకు ఫిర్యాదుచేసి నిరూపించాలి. మతవర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల ప్రచార సమయంలో ప్రసంగాలు చేశాడన్న ‘విశ్వహిందూ పరిషత్’ ప్రాంత అధ్యక్షుడు ఎమ్.రామరాజు చేసిన ఫిర్యాదు ప్రాతిపదికగా ‘ఈసీ’ విచారణ చేపట్టింది. పన్నండవ తేదీలోగా సమాధానం చెప్పవలసిందిగా చంద్రశేఖరరావునకు పదవ తేదీన ‘తాకీదు’ జారీచేసింది. చంద్రశేఖరరావు కూడ రాజకీయవేత్త కనుక ఆయన నోరుపారేసుకోవడం ఆశ్చర్యం కాదు. ‘చంద్రశేఖరరావు ముక్కు బాగాలేదని’ ప్రధానమంత్రి, ‘్భజపా’ నాయకుడు నరేంద్ర మోదీ వ్యాఖ్యానించాడట! ఈ సంగతిని చంద్రశేఖరరావు స్వయంగా చెప్పి ఉన్నాడు! నరేంద్ర మోదీ అలా వ్యాఖ్యానించి ఉండినట్టయితే అది కూడ ప్రధానమంత్రి స్థాయికి తగని పని. కానీ చంద్రశేఖరరావు ‘నోరు’మాత్రం మంచిగ లేదన్నది ‘విశ్వహిందూ పరిషత్’ ఆరోపణ. ఈ ఆరోపణ ప్రాతిపదికగా తెలంగాణ ముఖ్యమంత్రిని సంజాయిషీ కోరడం ‘ఈసీ’ వారి స్వతంత్ర, నిష్పక్ష ప్రవర్తనకు మరో సాక్ష్యం. తెలుగు రాష్ట్రాలలో గురువారం ముగిసిన ‘పోలింగ్’నకు ఇదంతా నేపథ్యం. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ‘ఈసీ’ని ఇలా దుయ్యబట్టాడు. జనం మెచ్చుకుంటారా?
ఇలా నిష్పక్షంగా, స్వతంత్రంగా ‘ఈసీ’ వ్యవహరిస్తున్నప్పటికీ ‘మతదాన’- పోలింగ్- ప్రక్రియలో ‘ఇవిఎమ్’లు మొరాయించడం మరో విస్మయకర విపరిణామం. ఆంధ్రప్రదేశ్‌లో గురువారం దాదాపు ముప్పయి శాతం ‘ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్’- ఇవిఎమ్-లు పనిచేయలేదన్న పుకార్లు కూడ వ్యాపించాయి. అయితే సహకరించని ‘ఇవిఎమ్’ల సంఖ్య నాలుగువందలకు లోపేనన్నది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ చేసిన స్పష్టీకరణ! తెలంగాణలో సైతం పలుచోట్ల ‘ఇవిఎమ్’లు పాడయిపోవడం గురువారం ఆవరించిన వైఫల్య ఛాయ! గంటల తరబడి ఈ ‘యంత్రాలు’ సహకరించకపోవడంతో నిలబడలేని, సహనం కోల్పోయిన ‘వోటర్లు’ వెనుతిరిగిపోయిన దృశ్యాలు ఆంధ్రప్రదేశ్ అంతటా ఆవిష్కృతమయ్యాయి. మరో గంటసేపు ‘మతదాన ప్రక్రియ’ను ‘ఈసీ’ పొడిగించినప్పటికీ వెనుదిరిగిపోయినవారు మళ్లీ వచ్చి ‘వోట్లు’ వేశారా? అన్నది ప్రశ్న.. ఇదంతా వైఫల్యం కాకపోవచ్చు. యంత్రాలు మొరాయించడం ప్రతి ఎన్నికలోను తప్పనిసరి కావచ్చు. తప్పని మానవ వైఫల్యం మతదాన ప్రక్రియలో హింస చెలరేగడం, తెలంగాణలో ‘ఘర్షణలు’ పెద్దగా జరగలేదు, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దాదాపు ఇరవైచోట్ల పెద్దఎత్తున దొమీ జరిగింది. మతదాన కేంద్రాల వద్ద సంకుల సమరం జరిగిన దృశ్యాలు మాధ్యమాలలో విస్తృతంగా ఆవిష్కృతమయ్యాయి. ప్రధానంగా తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం తలబడి- ముందుగానే సిద్ధం చేసుకొని ఉండిన- కర్రలతో పరస్పరం చితకబాదుకోవడం కనిపించిన దృశ్యాలు. సత్తెనపల్లిలో శాసన సభాపతి కోడెల శివప్రసాదరావునే ప్రత్యర్థి ‘కార్యకర్తలు’ కొట్టబోవడం పరాకాష్ఠ. ఈ బీభత్సకాండను నిరోధించలేకపోవడం మాత్రం పోలీసుల, భద్రతాదళాల వైఫల్యం మాత్రమే కాదు.. అధికార వ్యవస్థ వైఫల్యం, ‘ఈసీ’ వైఫల్యం! వోటు వేయడానికి విశ్వాసంతో వచ్చినవారి వోట్లు గల్లంతయిపోయాయి. ఇది కూడ వ్యవస్థ వైఫల్యం! తాము ఒకరికి వోటు వేసినప్పుడు, అది మరొకరికి వేసినట్టుగా ‘వివిపాట్’లో కనిపించిందన్న ఫిర్యాదులు కూడ వినబడినాయి! ఇది మరీ ‘చమత్కారం’ ‘ఇవిఎమ్’లలో నిహితమై ఉన్న చమత్కారం!
అవగాహన లేక ‘వోటు’ వేయనివారు అమాయకులు. అవగాహన ఉండి ‘మతప్రదాన కేంద్రాల’కు రానివారు దుర్మార్గులు. ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియకు సహకరించాలన్న తపన లేకపోవడం వీరి దుర్మార్గం. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీ గురువారం పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ వోటువేయకపోవడం ఈ దుర్మార్గం. మహానగరాలలోనే ఈ దుర్మార్గ నాగరికుల సంఖ్య ఎక్కువన్నది గురువారం జరిగిన ‘మత ప్రదానం’ ధ్రువపరచిన వాస్తవం..