సంపాదకీయం

అతార్కిక ‘ప్రచారం..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్‌లోని ‘అధీన రేఖ’- లైన్ ఆఫ్ కంట్రోల్- ఎల్‌ఓసీ- గుండా పాకిస్తాన్‌తో జరుగుతున్న ‘సీమాంతర వాణిజ్యం’ తాత్కాలికంగా రద్దుకావడం హర్షణీయ పరిణామం! కానీ, లోక్‌సభ ఎన్నికల తరువాత అధికార పదవీ బాధ్యతలను స్వీకరించే మన ప్రధానమంత్రికి పాకిస్తాన్ ‘ప్రధాని’గా చెలామణి అవుతున్న ప్రచ్ఛన్న బీభత్సకారుడు ఇమ్రాన్‌ఖాన్ జూన్‌లో ‘తటస్థ పడనున్నాడన్నది’ జరుగుతున్న ప్రచారం. ఇలాంటి మహా విషయాలను ముందుగానే కనిపెట్టి ప్రచారం చేయడానికి ఉవ్విళ్లూరుతున్న మాధ్యమాల వారు మన దేశంలో మెండు.. మన ప్రధాని జూన్‌లో చైనాకు వెళ్లక తప్పదన్నది ఈ ‘మాధ్యమ మహాశయుల’ నిర్ధారణ. ఎందుకంటె జూన్ పదునాలుగవ పదహైదవ తేదీల్లో కిర్గిఝస్థాన్ రాజధాని ‘బిష్‌కెక్’లో ‘షాంఘయి సహకార సమాఖ్య’ దేశాల- షాంఘయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్- ఎస్‌సీఓ- ప్రభుత్వాధినేతల సమావేశం జరుగనుంది. మన దేశం చైనా ఆధిపత్యంలోని ఈ ‘షాంఘయి సమాఖ్య’లో సభ్యురాలు కనుక మన ప్రధాని తప్పనిసరిగా ఈ శిఖర సదస్సునకు వెళ్లడం ఖాయమన్నది ఈ నిర్ధారణ. ఇమ్రాన్‌ఖాన్ ఎలాగూ ఈ ‘షాంఘయి కూటమి’ సదస్సుకు తప్పనిసరిగా విచ్చేస్తాడు కనుక మన ప్రధాని అతగాడిని కలుసుకోక తప్పదన్నది ‘నిర్ధారణ’. చైనా ఆర్భాటంగా అమలు జరుపుతున్న ‘ఒక త్రాసు, ఒక దారి’- ఒన్ బెల్ట్ ఒన్ రోడ్- ఓబీఓఆర్-లో చేరరాదని మన ప్రభుత్వం ఏళ్లక్రితమే నిర్ణయించి ఉంది. ఈ ‘ఓబీఓఆర్’అన్నది చైనా వ్యూహాత్మక దురాక్రమణలో భాగం. ప్రాచీనమైన ‘పట్టు’బాటను పునరుద్ధరించడం పేరుతో మొత్తం ప్రపంచాన్ని ఒకే ‘వాణిజ్యపు’ త్రాసు కింద తేవడానికి యత్నిస్తున్నట్టు చైనా ప్రకటించి ఉంది. ఈ ‘వాణిజ్య అనుసంధానం’ నిజానికి చైనా వివిధ దేశాలలోకి చొరబడి పోవడానికి సిద్ధమవుతున్న దురాక్రమణ పథం. గతంలో ఐరోపాకు చెందిన దొంగల ముఠాలు, సముద్రపు దొంగల తండాలు ‘వాణిజ్య సంస్థల’ ముసుగులు వేసుకొని వివిధ దేశాలలోకి చొరబడినాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేవరకు వివిధ దేశాలలో కొనసాగిన అక్రమ ఆధిపత్యానికి ఆ చొరబాటు కారణం. దాదాపు రెండున్నర శతాబ్దులపాటు ఈ అక్రమ రాజకీయ ఆర్థిక ఆధిపత్యం నడిచింది. ఈ దురాక్రమణ చరిత్రను పునరావృత్తం చేయడానికి చైనా ప్రభుత్వం ఇప్పుడు పూనుకొంది. రహదారితోను సముద్ర మార్గంతోను తమ దేశాన్ని అన్ని ఖండాలతో వాణిజ్య అనుసంధానం చేయడం ఈ ‘ఒన్ బెల్ట్ ఒన్ రోడ్’ కార్యక్రమం. ఈ వాణిజ్య పథాన్ని ‘పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూ కశ్మీర్’లోను, తన దురాక్రమణలోని లడక్ ప్రాంతాలలోను చైనా నిర్మిస్తోంది. అందువల్ల ఈ వాణిజ్య పథంలో చైనాతో కలసి పయనించడానికి, ఈ పథకంలో చేరడానికి మన ప్రభుత్వం నిరాకరించింది. ఈ ‘వాణిజ్య పథ పథకం’- బెల్ట్‌రోడ్ ఇనీషియేటివ్’- బీఆర్‌ఐ- గురించి చర్చించే పేరుతో 2017లో చైనా ‘చర్చల ప్రక్రియ’ను ఆరంభించింది. ఆ మొదటి చర్చల ప్రక్రియను మన దేశం బహిష్కరించింది. ఇప్పుడు మొదలవుతున్న రెండవ ‘చర్చల ప్రక్రియ’ను కూడ బహిష్కరిస్తున్నట్టు మన ప్రభుత్వం ప్రకటించింది. ఈ బహిష్కరణకు పెద్ద ప్రాధాన్యం లేదన్నది ప్రస్తుతం చైనా చేస్తున్న ప్రచారం. మన ప్రధానమంత్రి ‘బిష్‌కెక్’లో జరిగే ‘షాంఘయి సమాఖ్య’ సభకు వెళ్లితీరనున్నట్టు జరుగుతున్న ప్రచారానికి ‘వాణిజ్య పథ పథకం’ విషయంలో చైనా మనకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం నేపథ్య వైపరీత్యం..
ఈ నేపథ్యంలో మన ప్రధాని కాని ఇతర మంత్రులు కాని పాకిస్తానీ, చైనా అధినాయకులతో సమీప భవిష్యత్తులో సమావేశాలు జరుపరాదన్నది దేశ ప్రజల ఆకాంక్ష! మసూద్ అఝార్ అనే జిహాదీ బీభత్సకారుడు పాకిస్తాన్‌లో సురక్షితంగా నక్కి ఉండడానికి చైనా ప్రభుత్వం దోహదం చేస్తున్నంతవరకు చైనా నాయకులను మన ప్రభుత్వ అధినేత కాని, ప్రభుత్వ ప్రతినిధులు కానీ కలుసుకోవడం వల్ల, కౌగిలించుకోవడం వల్ల ఒనగూడే ప్రయోజనం శూన్యం. జాయిష్ ఏ మొహమ్మద్ ముఠాలోని మొదటి హంతకుడైన అఝార్ మసూద్‌ను అంతర్జాతీయ బీభత్సకారుడిగా ప్రకటించే ‘ఐక్యరాజ్యసమితి’యత్నాలను చైనా అడుగడుగునా అడ్డుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో అవన్తీపురా వద్ద మన నలబయిమంది రక్షకులను పాకిస్తానీ బీభత్సకారులు దొంగచాటుగా దాడిచేసి హత్యచేసిన తరువాత కూడ చైనా విధానంలో మార్పు రాలేదు. ఈ బీభత్సకాండ తరువాత మన సైనికులు వైమానిక దళానికి చెందిన యోధులు ‘అధీన రేఖ’దాటి వెళ్లి పాకిస్తాన్‌లోకి చొచ్చుకొని వెళ్లి ‘సాయుధ చికిత్స’- సర్జికల్ స్ట్రయిక్-ను జరిపి వచ్చారు. జిహాదీ బీభత్సకారుల పెద్ద స్థావరాన్ని ధ్వంసం చేశారు. పాకిస్తాన్‌లో బీభత్సకారుల స్థావరాలు నెలకొని ఉన్నాయన్న దానికి ఇది తిరుగులేని ధ్రువీకరణ. అయినప్పటికీ మసూద్ అఝార్ వ్యవహారంలో చైనా వైఖరి మారలేదు. పుల్వామా బీభత్సకాండ నేపథ్యంలో అఝార్‌ను ‘బీభత్సకారుడు’గా ప్రకటించాలన్న పట్టుదల మరింత పెరిగింది. మసూద్‌ను అంతర్జాతీయ బీభత్సకారుడుగా ప్రకటించాలన్న మరో తీర్మానం ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి ‘్భద్రతా మండలి’ పరిశీలనలో ఉంది. చైనా తప్ప ‘మండలి’లోని మిగిలిన సభ్య దేశాలు- నాలుగు శాశ్వత సభ్య దేశాలు, పది సాధారణ సభ్య దేశాలు- తీర్మానాన్ని బలపరుస్తున్నాయి.
తీర్మానాన్ని చైనా కూడ సమర్థించేవరకు ఆ దేశపు నాయకులతో, ప్రతినిధులతో మన ప్రభుత్వం ఎలాంటి చర్చలనూ జరుపరాదు. అందువల్ల ‘వాణిజ్య పథ పథకం’- బెల్ట్‌రోడ్ ఇనీషియేటివ్- బీఆర్‌ఐ- చర్చల ప్రక్రియను బహిష్కరించినట్టుగానే మన ప్రభుత్వం ‘షాంఘయి సమాఖ్య’ సదస్సును కూడ బహిష్కరించాలి. మన దేశానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష బీభత్సకాండను జరుపుతున్న పాకిస్తాన్‌తో కాని, ప్రచ్ఛన్న- పరోక్ష- బీభత్సకాండను జరుపుతున్న చైనాతో కాని మనకు చర్చలు ఏమిటి? ‘సహకారం’ ఏమిటి?? ‘షాంఘయి కూటమి’ పేరుతో ‘బిష్‌కెక్’లో జూన్‌లో జరిగే సదస్సును సైతం మనం బహిష్కరించినట్టయితే చైనా దుశ్చర్యను అంతర్జాతీయ సమాజం మరింతగా నిరసించగలదు. కానీ మసూద్‌ను ‘టెర్రరిస్టు’గా ప్రకటించడానికి చైనా అంగీకరించకముందే మన ప్రభుత్వం చైనాతో కలసి సమావేశాలలో పాల్గొన్నట్టయితే మన పట్టుదల పట్ల ఇతర దేశాలకు విశ్వాసం సడలిపోతుంది. మసూద్‌ను ‘అంతర్జాతీయ బీభత్సకారుడు’గా ప్రకటించే ‘్భద్రతామండలి’ తీర్మానం పట్ల ఏప్రిల్ ఇరవై మూడవ తేదీలోగా వ్యతిరేకతను విడనాడాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలు చైనాకు హెచ్చరికను జారీచేశాయి. అందువల్ల ‘బిష్‌కెక్’ సమావేశానికి మన ప్రధాని వెళ్లాలా? వద్దా? అన్నది ఏప్రిల్ 23వ తేదీ తరువాత చైనా విధానం ప్రాతిపదికగా నిర్ధారణ కావాలి.
‘బిష్‌కెక్’కు జూన్‌లో మన ప్రధాని వెడతాడని, అక్కడ ఇమ్రాన్‌ఖాన్‌తో ఇష్టాగోష్ఠి జరుపుతాడని ఇప్పుడు ప్రచారం చేయడం తగని పని. జమ్మూ కశ్మీర్‌లోని ‘అధీన రేఖ’- లైన్ ఆఫ్ కంట్రోల్- ఎల్‌ఓసీ- గుండా జరుగుతున్న సీమాంతర వాణిజ్యం- క్రాస్ బార్డర్ ట్రేడ్- సీమాంతర బీభత్సకాండ- క్రాస్ బార్డర్ టెర్రర్-ను మరింత ప్రోత్సహిస్తోంది. పాకిస్తాన్‌తో ఈ సీమాంతర వాణిజ్యాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మన ప్రభుత్వం గురువారం నిర్ణయించడం శుభ పరిణామం. పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకాండ భయంకర తీవ్రతకు ఇది మరో ధ్రువీకరణ. శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో గురువారం జరిగిన ‘మత ప్రదానం’- పోలింగ్- బీభత్స ప్రమాద తీవ్రతకు మరో ధ్రువీకరణ. కేవలం పదునాలుగు శాతం ‘వోటరు’లు మత ప్రదానం చేశారు..!