సంపాదకీయం

సౌదీ బీభత్సం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇన్ని ఘోరాలు జరిగిపోతున్నప్పటికీ, తెలుగునేల నుంచి మాత్రమే గాక దేశంలోని అనేక ప్రాంతాల నుంచి సౌదీ అరేబియాకు, పారశీక సింధుశాఖ దేశాలకు ఉద్యోగార్థులు వెడుతుండడమే విస్మయకరం. కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మండలం మక్తాపల్లి గ్రామానికి చెందిన వీరయ్య అనే ‘ఒంటెల కాపరి’ విషాదగాథ సౌదీ అరేబియాలోని సంపన్న యజమానుల పైశాచిక ప్రవృత్తికి సరికొత్త ఉదాహరణ. ఈ వీరయ్య గొప్ప ఉద్యోగం, గొప్ప ఆదాయం లభిస్తుందన్న ఆశతో సౌదీకి వెళ్లాడు. వీరయ్యను సౌదీకి చేర్చిన ‘దళారీ’ ఆచూకీ ఇప్పుడు తెలియడం లేదు. ఈ ‘దళారీ’ని సంప్రదించడానికై వీరయ్య కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వీరయ్యకు వేతనం లభించడం లేదట. తిండి కూడా పెట్టని యజమాని తనను చిత్రహింసలకు గురిచేసినట్టు వీరయ్య వాపోయిన దృశ్యాలు మాధ్యమాలలో ప్రసారమయ్యాయి. వీరయ్య సౌదీలో జోర్డాన్ దేశపు సరిహద్దుల సమీపంలో ఎడారిలో ఒంటెలను మేపుతున్నాడట. ఒంటెలను మేపవచ్చు. కానీ వంద ఒంటెలకు ఒకడే కాపలా కాయడం, వాటికి తిండి పెట్టడం, నీరు తాగించడం, పాలు పితకడం వంటి సర్వ కార్యాలను వీరయ్య ఒక్కడే చేస్తున్నాడట. ఇటీవల ఒక ఒంటె మరణించడంతో యజమాని వీరయ్యను చితకబాదాడట. అనేక రోజులు తిండి పెట్టకుండా మాడ్చాడట! సౌదీలోని సంపన్న యజమానులు ఇలా అమానుషంగా ప్రవర్తించడం, భారతీయ కార్మికులను పశువుల కంటె హీనమైన స్థితికి గురిచేయడం ఇది మొదటిసారి కాదు. ఇలాంటి రాక్షస చర్యల గురించి కథనాలు ఏళ్ల తరబడి ప్రచారమయ్యాయి. ఇంటి పైకప్పుల నుంచి కిందికి తోసివేయడం, వొంటిపై కాల్చిన ఇనుప కమీలతో వాతలు పెట్టడం, రోజుల తరబడి నిర్బంధించడం, తిండి-నీరు లేకుండా మలమల మాడ్చడం వంటి సౌదీ అరేబియా దుర్మార్గపు యజమానుల కిరాతకాలకు భారతీయ శ్రామికులు బలైపోయిన కథనాలు నిరంతరం వెలువడుతూనే ఉన్నాయి. పనిమానేసి పారిపోయిన శ్రామికులను, పని మానేయదలచిన కూలీలను యజమానులు హత్య చేయడం పరాకాష్ఠ. స్వదేశానికి తరలిరాని భారతీయ కార్మికుల వందలాది మృతదేహాలు అక్కడి వైద్యశాలల్లోని ‘గిడ్డంగుల’లో నెలల తరబడి పడి ఉండడం పైశాచిక సమాజ ప్రవృత్తికి, సౌదీ ప్రభుత్వ బీభత్స చిత్తవృత్తికి నిదర్శనం. సౌదీ పాలకులలో అత్యధికులు మానవులు కాదు, మానవ రూపంలోని తోడేళ్లు.. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. భారతీయులను చిత్రహింసల పాలు చేసిన, హత్య చేసిన సౌదీ సంపన్నులను ఆ ప్రభుత్వం శిక్షించిన చరిత్ర లేదు. మన ప్రభుత్వం కూడ సౌదీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయకపోవడం ఈ విషాదం కొనసాగుతుండడానికి కారణం. నిబంధనలను పాటించని దుర్మార్గపు ‘దళారీ’లు మన దేశంలోనే ఉన్నారు. వీరిని పట్టుకొని మన ప్రభుత్వాలు శిక్షించినప్పటికీ వీరయ్య లాంటి అభాగ్యులు వంచనకు గురి అయ్యే ప్రమాదం తప్పడం లేదు. 2017లో వీరయ్య సౌదీకి వెళ్లాడట. అంతకుముందు ఏళ్ల తరబడి ఆ దేశంలో భారతీయులకు జరిగిన ఘోరమైన అన్యాయాల గురించి వీరయ్య లాంటి వారికి తెలియదు, దళారీలు తెలియనివ్వరు..
సౌదీ అరేబియాలో నడమంత్రపుసిరి దాపురించడం వల్ల సంపన్నులైపోయిన వారికి ‘బానిసలు’ కావాలి, వెట్టిచాకిరీ చేయగల అమాయకులు కావాలి. చౌకగా లభించే సేవకులు కావాలి. వీరయ్య ఒక్కడే వంద ఒంటెలను కాయడం ఈ ‘కారుచౌక సేవ’కు ఒక నిదర్శనం మాత్రమే. సౌదీకి చెందినవారు ఇందుకు సిద్ధపడడం లేదు. అందువల్లనే అక్కడి యజమానులు ఇతర దేశాల్లోని దళారీలను ఉసిగొలిపి అమాయకులను బానిసలుగా కొనుగోలు చేస్తున్నారు. ఇలా ‘బానిసలు’గా మానవులను మార్చే జిహాదీ ప్రవృత్తి సౌదీ చరిత్రలో భాగం. క్రీస్తుశకం 712లో మహమ్మద్ బిన్ కాసిమ్ అనే అరబ్బీ బీభత్సకారుడు మన దేశంలోకి చొరబడడం ఈ అమానుష చరిత్రలో భాగం. ఈ భయంకర ప్రవృత్తి అంతకు పూర్వం నుంచి కూడ సౌదీని ఆవహించి ఉంది. అఖండ భారత్‌లోని సింధు ప్రాంతంలోకి చొరబడడానికి అనేకసార్లు విఫల యత్నం చేసిన బిన్ కాసిమ్ చివరికి వంచన మార్గం ద్వారా సింధులోని దేవల పట్టణంలోకి రాత్రిపూట చొరబడగలిగాడు. దేవలలోని రాజప్రతినిధిని చంపి, అతని ఇద్దరు కుమార్తెలను, తారాదేవి, పరిమళదేవి అనే కన్యలను తమ ఖలీఫాకు బానిసలుగా పంపించిన ‘దళారీ’ ఈ బిన్ కాసిమ్. దేవల పట్టణంలోని తొంబయివేల మంది భారతీయులను అనేక రోజుల పాటు హత్య చేయించిన బిన్ కాసిమ్ రెండువేల మంది యువతులను బానిసలుగా పట్టుకొని పశ్చిమాసియా ప్రాంతాల్లో విక్రయించాడు. ఇలా మానవులను పశువులుగా భావించి సంతలలో అమ్మిన చరిత్ర జిహాదీలది, సౌదీ అరేబియాది. ఈ చరిత్ర ఇప్పటికీ కొనసాగుతోంది. నడమంత్రపుసిరిని పొందగలిగిన సౌదీ సంపన్నులు విచక్షణ రహితంగా ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోగలుగుతున్నారు. అనేకమందిని కారుచౌక జీతాలకు సేవకులుగా కదుర్చుకోగలుగుతున్నారు.
మన ప్రభుత్వం పూనుకొని సౌదీకి, సింధుశాఖ దేశాలకు ఉద్యోగం కోసం వెళ్లడాన్ని నిషేధించాలి. అలా కొన్నాళ్లు జరిగినట్టయితే చౌకగా బానిసలు దొరకని సౌదీ సంపన్నులు ‘నీటిలో నుంచి బయటపడిన చేపలు’ కాగలరు. అపుడు మన ప్రభుత్వం దౌత్య కార్యాలయాల ద్వారా ఈ ‘ఉపాధి’ని నియంత్రించవచ్చు. గౌరవప్రదమైన వేతనం, మానవీయ ఉద్యోగ నిబంధనల ప్రాతిపదికగా మాత్రమే మన దేశస్థులను సౌదీకి పంపించవచ్చు. ఇలా వెడుతున్న వారి భద్రత గురించి, మాన మర్యాదల రక్షణ గురించి ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాతనే మనవారు సౌదీకి కాని, ఇతర పశ్చిమాసియా దేశాలకు కాని వెళ్లడానికి అనుమతించే వ్యవస్థ ఏర్పడాలి. ఇలాంటి వ్యవస్థ ఏర్పడాలంటే కొనే్నళ్లపాటు మన దేశం వారు ఈ సింధుశాఖ దేశాలకు ఉపాధి కోసం వెళ్లరాదు. అప్పుడు కార్మికుల, శ్రామికుల కొరత ఏర్పడిన సౌదీ సంపన్న ముష్కరులు తమంత తాముగా కాళ్లబేరానికి వస్తారు. కానీ అలాంటి స్థితి ఏర్పడడానికి మన ప్రభుత్వం పూనుకోవాలి. ఇప్పుడు సౌదీలోని ఎడారిలో ‘బందీ’ అయిన కరీంనగర్ వీరయ్య తల్లి గత మార్చి 30వ తేదీన మరణించిదట! కానీ తన తల్లికి అంతిమ సంస్కారం చేయడానికి వీలుగా మన దేశానికి రావడానికై వీరయ్యకు అనుమతి లభించలేదు, విడుదల లభించలేదు. యజమాని దయతలచ లేదు. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఆర్థికశక్తిగా, సైనికశక్తిగా, సాంస్కృతికశక్తిగా ఎదిగిన దేశం! కానీ మన పౌరులను నిలా నిర్భయంగా నిర్లజ్జగా చిత్రహింసల పాలు చేస్తున్న సౌదీ, సింధుశాఖ దేశాల ముష్కరులు మన దేశాన్ని అవమానిస్తున్నారు. మన ప్రభుత్వమంటే సౌదీ ప్రభుత్వానికి లెక్కలేదు. స్నేహం పేరుతో సౌదీ మన దేశాన్ని వెక్కిరిస్తోంది. మన ప్రభుత్వం ఈ పరాభవాన్ని చూడనట్టు, తెలియనట్టు అభినయిస్తోంది. ఇది దశాబ్దుల అభినయం. వర్ణ వివక్షను పాటించిన జాత్యహంకార దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం అనేక దశాబ్దుల పాటు వెలివేసింది. అదే సూత్రం మతోన్మాద, అమానవీయ, నిరంకుశ, అప్రజాస్వామ్య సౌదీ ప్రభుత్వానికి ఎందుకని వర్తింపచేయడం లేదు?
సౌదీ ప్రభుత్వమే బీభత్సకాండను నిర్వహిస్తోంది. గత అక్టోబర్‌లో జమాల్ ఖషోగీ అనే పత్రికా రచయిత- జర్నలిస్ట్-ను సౌదీ ప్రభుత్వం హత్య చేసింది. ఈ పత్రికా రచయిత సౌదీ ప్రభుత్వ స్వరూప స్వభావాలను విమర్శించాడు, ప్రజాస్వామ్య సంస్కరణలను వాంఛించాడు. ఈ ఉద్యమకారుడు సౌదీని వదలి పారిపోవలసి వచ్చింది. అమెరికాలో నివసిస్తుండిన ఖషోగీని ‘చర్చల’ కోసం సౌదీ ప్రభుత్వం పిలిపించింది. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయానికి ఆయన వెళ్లాడు. సౌదీ ప్రభుత్వ బీభత్సకారులు ఖషోగీని తమ దౌత్య కార్యాలయంలోనే ముక్కలుగా నరికి హత్య చేశారు. ఈ మృతదేహపు కొన్ని అవయవాలను ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్యాధికారి ఇంటినుంచి టర్కీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ సౌదీ రాజరిక ప్రభుత్వపు స్వభావం. జిహాదీ బీభత్సం పాకిస్తాన్ ప్రభుత్వ మాధ్యమంగా వికృతంగా ఆవిష్కృతవౌతోంది. కానీ ఈ బీభత్సానికి జన్మస్థలం, స్ఫూర్తి కేంద్రం సౌదీ అరేబియా.