సంపాదకీయం

‘నిర్మల’ నీతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వాసం వికసిస్తుండడం మరోసారి ఆవిష్కృతమైన దృశ్యం. ‘జాతీయ వికాస ప్రక్రియ’ వేగవంతం అవుతోందన్న విశ్వాసం వికసిస్తోంది. ఇలా వికాసం-ప్రగతి-పట్ల విశ్వాసం వికసించడం- పెంపొందుతుండడం జాతీయ ఇతివృత్తం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన నూతన ‘వార్షిక ఆదాయ వ్యయ ప్రణాళిక’- బడ్జెట్-లోని ప్రధాన అంశం ఈ జాతీయ ఇతివృత్తం. మూడు కోట్ల యాబయి లక్షల కోట్ల రూపాయల ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ని సాధించడమన్న లక్ష్యం ఈ ‘బడ్జెట్’ ప్రసంగంలో పునరుద్ఘాటితమైంది. ఈ లక్ష్యసాధనలో ప్రజలందరి క్రియశీల భాగస్వామ్యం అనివార్యమన్నది సనాతన భారత జాతీయ ‘కర్మయోగ’ పునరుద్ఘాటన. ‘‘ఉద్యమేన హి సిద్ధ్యంతే...’’- ఉద్యమించడం వల్ల, శ్రమించడం వల్ల మాత్రమే- సంకల్పం వాస్తవంగా సాకారమవుతుంది! లక్ష్యసిద్ధి కోసం దేశ ప్రజలందరూ కృషిచేయాలన్నది ఆర్థికమంత్రి అభిభాషణలోని ‘్ధ్వని...’ పురుష ప్రయత్నం వల్లనే ‘‘లక్ష్యం సిద్ధిస్తుంది’’- ‘‘లక్ష్యం సంపదయతే’’- అన్న చాణక్యుని ఆర్థిక నీతిని నిర్మలా సీతారామన్ ఉటంకించడం జాతీయ ఆర్థిక రీతికి అనుగుణం. క్రీస్తునకు పూర్వం పదహైదవ శతాబ్ది- కలియుగం పదహారవ శతాబ్ది-నాటి చాణక్యుడు ఆర్థికవేత్త, రాజ్యాంగ నిపుణుడు, సామాజిక తత్త్వజ్ఞుడు, జాతీయ ధర్మాచార్యుడు! అందువల్ల ఆయనను ఉటంకించడం స్వదేశీయ స్ఫూర్తికి నిదర్శనం! నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రతిపాదించిన ‘ప్రత్యామ్నాయ ఆర్థిక వికాసరీతి’- ఆల్టర్నేటివ్ మెథడ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్- ఈ చాణక్య ఆర్థిక నీతిని స్ఫురింపచేయడం సహజం! ‘ప్రపంచీకరణ’ విస్తరింపచేస్తున్న ‘స్వేచ్ఛా విపణి’- మార్కెట్ ఎకానమీ- అంతర్జాతీయ ప్రగతికి ప్రాతిపదిక కావడం ఇరవై ఆరేళ్ల ‘ఆర్థిక వికాసరీతి’! ప్రజల సమష్టిహితం ప్రాతిపదికగా కాక, ‘‘వస్తువులకు గిరాకీ- వస్తువుల లభ్యత’’ప్రాతిపదికగా ఆర్థిక వికాసం విస్తరించిపోవడం ‘మార్కెట్ ఎకానమీ’.. ప్రజల సమష్టి భాగస్వామ్యంతో జరిగే ఆర్థిక వికాసం ప్రజల సమష్టి హితాన్ని సాధించగలదన్నది నిర్మలమ్మ చెప్పిన మాట! ఈ మాట తరతరాల భారత జాతీయ వాణికి ప్రతిధ్వని! అందువల్ల ‘ప్రత్యామ్నాయ ఆర్థిక వికాస రీతి’ ‘ప్రపంచీకరణ’ వైపరీత్యానికి ప్రత్యామ్నాయం అవుతుందా? అన్నది ప్రశ్న.. ఈ ప్రశ్నకు మాత్రం ‘బడ్జెట్’ప్రసంగంలో సమాధానం లభించలేదు. ‘స్వదేశీయ స్ఫూర్తి’ వెనుక నుంచి ‘వాణిజ్య ప్రపంచీకరణ’ భూతం వికృతంగా తొంగిచూస్తూ ఉండడం శుక్రవారం నాడు పార్లమెంటులో ఆవిష్కృతమైన 2019-2020వ ఆర్థిక సంవత్సర ‘ఆదాయ వ్యయ ప్రణాళిక’లో నిహితమై ఉన్న కఠోర వాస్తవం...
మన ప్రగతిని, ఆర్థిక గణాంకాలను రూపాయలలో కాక ‘డాలర్ల’లో చెప్పుతుండడం ‘మహాత్ముని నూట యాబయ్యవ- సార్థశత- జయంతి సంవత్సర ‘స్వదేశీయ’ స్ఫూర్తికి విఘాతకరం. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ మూడు ట్రిలియన్ల అమెరికా డాలర్ల స్థాయికి చేరుతుందట. ఒక ‘ట్రిలియన్ డాలర్లు’ డెబ్బయి లక్షల కోట్ల రూపాయలకు సమానం. అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’- గ్రాస్ డొమొస్టిక్ ప్రాడక్ట్- జీడీపీ- రెండు కోట్ల పది లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరగలదు. మరో ఐదేళ్లలో ‘ఐదు ట్రిలియన్ల డాలర్ల’స్థాయికి అంటే మూడు కోట్ల యాబయి లక్షల కోట్ల రూపాయల స్థాయికి మన ఆర్థిక వ్యవస్థ ఎదగనుంది. ఒక ‘డాలర్’ విలువ డెబ్బయి రూపాయలన్నది వర్తమాన ఆర్థిక వైచిత్రి. ఈ వివరణను సామాన్య భారతీయులకు ఎవరు ఇవ్వాలి?? ‘ప్రత్యామ్నాయ ఆర్థిక వికాసరీతి’ని నిర్మలా సీతారామన్ ప్రస్తావించినప్పుడు ఒక జాతీయ వాస్తవం స్ఫురించడం సహజం. ‘ప్రత్యామ్నాయం’ అన్నది నిజానికి కొత్త ప్రత్యామ్నాయం కాదు, అనాదిగా కొనసాగుతున్న ‘వౌలిక’ జాతీయ ప్రాతిపదిక ఇది. మాజీ కేంద్రమంత్రి మురళీమనోహర జోషి దాదాపు ఇరవై ఏళ్లక్రితం ఈ సంగతి ప్రస్తావించాడు. అంతకుముందు, ఆ తరువాత అనేకమంది ప్రస్తావించారు. కానీ ప్రచారం లేదు. భారతదేశంలో అనాదిగా ‘ఆర్థిక వికాస రీతి’ మాత్రమే కాదు, అనేకానేక రంగాలలో ‘ప్రగతి రీతి’ వికసించింది. చాణక్యుడు, పతంజలి, వివేకానందుడు, గాంధీ మహాత్ముడు వంటివారు వివిధ సమయాలలో పునరుద్ఘాటించారు, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, దత్తోపంత్ రేంగ్డీ వంటి ఆధునికులు ఉటంకించారు. ఈ వౌలిక వికాస పద్ధతిని ధ్వంసం చేసిన బ్రిటన్ దురాక్రమణదారులు పాశ్చాత్య ప్రత్యామ్నాయ పద్ధతిని ప్రవేశపెట్టిపోయారు. ఈ పాశ్చాత్యీకరణకు విస్తరణ ప్రపంచీకరణ-గ్లోబలైజేన్-! అందువల్ల ‘స్వదేశీయ’ వికాస రీతి వౌలికమైనది, ‘ప్రపంచీకరణ’ నీతి ప్రత్యామ్నాయ రీతి! అందువల్ల స్వదేశీయ స్ఫూర్తిని పెంపొందించదలచిన ప్రభుత్వం ‘‘వౌలిక భారతీయ వికాస రీతి’’ని పునరుద్ధరిస్తే చాలు, ‘‘ప్రత్యామ్నాయం’’కనిపెట్టనక్కరలేదు!!
ఇలా అద్భుతమైన ప్రగతి అన్ని రంగాలలోను ప్రస్ఫుటిస్తూ ఉండడం కొత్త ‘బడ్జెట్’లోని ఇతివృత్తం. ప్రభుత్వం వారి సర్వజన భాగస్వామ్య నిష్ఠ మరో ప్రధాన అంశం. ‘‘పక్షి ఒక రెక్కతో పైకి ఎగరలేదు..’’ అన్న వివేకానందస్వామి అభిభాషణ నిర్మలమ్మ నోట ప్రతిధ్వనించడం సర్వజన భాగస్వామ్య ప్రగతి గతికి సముత్కర్ష సంకల్పం. ఒక రెక్క మహిళ, మరో రెక్క పురుషుడు. ‘నారీ-మహిళ- నారాయణి - ఆదిశక్తి’- అన్న భారతీయ జాతీయ జీవన విధానం ‘వౌలిక’ వికాస ప్రక్రియ. అందువల్ల ‘బడ్జెట్’ ప్రసంగంలోని ‘ప్రత్యామ్నాయ’ అనే్వషణ ప్రతిపాదన నిజానికి ‘వౌలిక రీతి’ పునరుద్ధరణ. ఇదీ నిజమైన అనుసంధానం. నిర్మలా సీతారామన్ ‘్భతిక’ అనుసంధాన ప్రగతిని విస్తృతంగా ఉల్లేఖించింది. జాతీయ మహాపథాలు, గ్రామీణ పథాలు, హరిత మార్గాలు, అంతర్గత నదీ జలమార్గాలు, ఇనుప దారుల- రైలు పట్టాల- విస్తరణ. చిన్నచిన్న నగరాలకు ‘ఉడాన్’ విమాన సేవలు ఈ అనుసంధానంలో ఒక ‘్భంగిమ’ మాత్రమే. ఇది భౌతికమైన అనుసంధానం. విద్యుత్తును, మంచినీటిని, వంట ఇంధనాన్ని పల్లెపల్లెకూ ఇల్లు ఇల్లుకూ సమకూర్చాలన్న లక్ష్యం, ఆర్థిక అనుసంధానం! మహాత్ముని సార్ధశత జయంతి నాటికి- అక్టోబర్ రెండు నాటికి- ‘బహిరంగ మలమూత్ర విసర్జన’ గతం కావడం ఆరోగ్య అనుసంధానం. ఈ ‘స్వచ్ఛత’ కాలుష్య రహిత పర్యావరణంతో మొత్తం దేశాన్ని అనుసంధానం చేయనుంది. ‘‘నమామి గంగే..’’ జలశక్తి స్వచ్ఛతకు ప్రతీక! సౌరశక్తి ఉత్పత్తిపెరగడం సహజ కాంతుల ‘స్వచ్ఛ భారత’ అనుసంధానం. కానీ ఈ జాతీయ మహా అనుసంధానం అనాదిగా ఉన్నది. విదేశీయ బీభత్స ‘‘పాలకులు’’ ధ్వంసం చేసిపోయినది. అందువల్ల స్వచ్ఛ్భారత భౌతిక అనుసంధానం ‘పునరుద్ధరణ’ మాత్రమే, ప్రత్యామ్నాయం కాదు! ఇదంతా భౌతిక స్వచ్ఛత, ప్రాదేశిక అనుసంధానం.. కానీ బౌద్ధిక మానసిక స్వచ్ఛత సర్వ సమగ్రంగా వికసించనిదే సాంస్కృతిక అనుసంధాన పునరుద్ధరణ జరగదు. భౌతిక ప్రగతి సాంస్కృతిక సుగతి పరస్పర పరిపోషకాలు. ఆదాయం పన్ను చెల్లింపుదారులు చిత్తశుద్ధితో తమ విధులను నిర్వహిస్తున్నారన్నది నిర్మలమ్మ చెప్పిన మాట. మానసిక స్వచ్ఛత మళ్లీ అంకురించింది, పల్లవిస్తోంది. ఇది ప్రతీక మాత్రమే! ఈ మానసిక స్వచ్ఛత జాతీయ సౌశీల్యంగా వికసించి పరిమళించి ధరించాలంటే అన్ని రంగాలలోను మానసిక ‘నిర్మలత్వం’ నెలకొనాలి! గాంధీ మహాత్ముని నూట యాబయి జయంతి నాటికి దేశమంతటా మద్యపానాన్ని, మద్యం ఉత్పత్తిని నిషేధించగలరా? నిషేధిస్తే అదే ‘స్వదేశీయ’ ‘గ్రామస్వరాజ్య’ స్ఫూర్తిప్రదాతకు నివాళి...
వెదురు, తేనె, ఖద్దరు పరిశ్రమలను గ్రామస్థాయిలో భారీఎత్తున నెలకొల్పుతున్నట్టు సీతారామన్ చెప్పడం ‘వికేంద్రీకృత’ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సరికొత్త శ్రీకారం! ‘‘మధు వాతాఋతాయతే...’’ అన్నది వేదద్రష్టల ఆకాంక్ష- గాలి తేనెల మయం కావాలి-! ఇదీ తరతరాల స్వచ్ఛ్భారత స్ఫూర్తి. యుగయుగాల ఆర్తి! కానీ మరోవైపు భారీగా విదేశాల పెట్టుబడులు తరలివస్తున్నాయి! గత ఏడాది ప్రపంచంలోని సగటు ‘విదేశీయ ప్రత్యక్ష నిధులు’ తగ్గినప్పటికీ మన దేశాన్ని మాత్రం ‘విదేశీయ నిధుల వరదలు ముంచెత్తాయట! గ్రామీణ పరిశ్రమల విస్తరణ స్వదేశీయ స్వాభిమానం.. విదేశాల పెట్టుబడులు ఆర్థిక దాస్యం! ఈ అంతర్గత వైరుధ్యాన్ని తొలగించడం ఎలా?