సంపాదకీయం

చందమామ ‘ఇంటి’కి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్మిన్ అంతరిక్షే మహార్ణవే- ఈ అంతరిక్ష మహాసముద్రంలో- ఇది మరో మథనం, మరో అద్భుతం, మరో చారిత్రక శుభ పరిణామం, మరో విజయం. మహార్ణవ మథనం నుండి చంద్రుడు ఉద్భవించడం సృష్టి నిహిత వాస్తవం, సనాతన-శాశ్వత- తత్త్వం! అంతరిక్ష ‘మథనం’ సాగిస్తూ ‘ద్వితీయ చంద్రయాన్ ఉపగ్రహం’ చంద్రుని వైపు దూసుకొని వెడుతుండడం వర్తమాన వాస్తవం. ఈ ప్రస్థాన క్రమానికి సోమవారం మధ్యాహ్నం రెండుగంటల నలబయి మూడు నిముషాలకు శ్రీకారం చుట్టిన అంతరిక్ష శాస్తవ్రేత్తలు వందనీయులు, అభినందనీయులు. భరతజాతి గరిమకు ప్రతీకలు వారు.. భరతమాత ఆకాంక్షల పతాకలు వారు... మాతృభూమి చరిత్రలో మరో ఉజ్వల ఘట్టాన్ని సృష్టించగలిగిన వజ్రాల బిడ్డలు! చంద్రుడు అనాదిగా భూమికి దగ్గరివాడు, మూడు లక్షల ఎనబయి నాలుగువేల కిలోమీటర్ల దూరం పయనించి ‘చంద్రయాన శకట త్రయం’ చంద్రుని చేరనుండడం ఈ దగ్గరితనానికి నిదర్శనం. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, అనాదిగా తిరుగుతున్నాడు, అనంతంగా తిరుగుతుంటాడు. అందువల్ల చంద్రుడు భూమికి ఉపగ్రహం. ఈ ‘ఉపగ్రహం’ చుట్టూ ‘రెండవ చంద్రయాన్’ వ్యవస్థలోని ‘పరిక్రమిక’- ఆర్బిటార్- తిరగనుండడం మానవుడు సృష్టిస్తున్న అద్భుతం. భూమి చుట్టూ పరిక్రమిస్తున్న చంద్రుని చుట్టూ ఈ ‘ఆర్బిటార్’ పరిక్రమించనుంది. చంద్రుడు కాలగమనానికి కొలమానం; సూర్యుడు మరో ‘కొలమానం’. కానీ సూర్యుడు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అందువల్ల సూర్యుని కంటె చంద్రుడు దగ్గరివాడు. ‘‘సూర్య ఆత్మా జగతః’’- సూర్యుడు జగత్తునకు ఆత్మ అన్న వాస్తవాన్ని భారతీయులు అనాదిగా గుర్తించారు. కానీ వ్యవహారంలో ‘ఆత్మ’కంటె ‘మనస్సు’ దగ్గరిది. చంద్రుడు జగత్తునకు మనస్సు. ‘‘చంద్రమా మనసోజాతః చక్షుః సూర్యో అజాయత’’అన్న వాస్తవాన్ని కూడ భారతీయులు అనాదిగా దర్శిస్తున్నారు. ‘జగత్తు’మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు, సూర్యుడు ‘సృష్టి’కన్నుల నుంచి పుట్టిన వెలుగు! అందుకే సూర్యుడు చూపిస్తున్నాడు, దర్శింప చేస్తున్నాడు. చంద్రుడు మనస్సుగా మారి నడిపిస్తున్నాడు! ఈ ‘దగ్గరితనం’ స్వభావానికి సంబంధించినది. అందువల్లనే ఆద్యంత రహితమైన అంతరిక్ష సముద్రంలోని ద్వీపాలు- తారలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఇతర దివ్యచరాలు- అన్నిటిలోను చంద్రుడు భూమికి దగ్గరివాడు. ‘చంద్రయానం’తో ఈ దగ్గరితనం మరింత సన్నిహితమైంది. ఈ సాన్నిహిత్యం సాధ్యం అయిన వేళ- చాంద్రమాన కలియుగం ఐదువేల నూట ఇరవయి ఒకటవ సంవత్సరం శుభ వికారి ఆషాఢ బహుళ పంచమి- కాలగమనపు మరో హేల! ఈ ‘కాల గనణం’ చంద్రునికీ భూమికీ మధ్య ఉన్న సంబంధం- అందుకే ఇది చాంద్రమానం! చంద్రునితో ముడిపడిన మాసం ‘చంద్రమాసం’. ‘మానం’కొలత, ‘మాసం’ నెల, ‘యానం’ ప్రయాణం! ‘చంద్రయానం’ చంద్రుని వైపుప్రయాణం. ‘సోముడు’ అంటే చంద్రుడు. సోమవారం ‘సోమయానం’ మొదలైంది..
పరిశోధనల లక్ష్యం, ప్రయోగాల గమ్యం, ఆవిష్కరణల అవధి ‘సమష్టిహితం’! ఈ ‘సమష్టి’లో కేవలం మానవులు మాత్రమే భాగస్వాములని భావించడం అనభిజ్ఞత-ఇగ్నోరెన్స్-! ఈ ‘సమష్టి’ అణువునుంచి ‘బ్రహ్మాండ’ సమూహం వరకు కల ‘‘తుది, మొదలు లేని’’ విశ్వవ్యవస్థ. విశ్వవ్యాప్త చైతన్యంలో భూమి, సమస్త జీవజాలం అసంఖ్యాక దివ్య- గగన- చరాలు- హెవెన్లీ బాడీస్- భాగం. ఇదీ విశ్వ చైతన్యం- కాస్మిక్ ఆర్డర్-! ఈ చైతన్యం అంతరిక్షం. ఈ చైతన్యం కాలం! కాలం గడుస్తున్నట్టు, కాలం నడుస్తున్నట్టు ధ్రువీకరిస్తున్న కొలమానాలు భూమి, చంద్రుడు, సూర్యుడు, అసంఖ్యాక సూర్యులు- నక్షత్రాలు-! ఈ ఖగోళ విజ్ఞానం మన దేశంలో అనాదిగా వికసించింది, విలసిల్లింది. ‘చంద్ర గ్రహణం’, ‘సూర్యగ్రహణం’ భారతీయులు యుగాలకు పూర్వం నుంచీ గుర్తించడం ఒక ఉదాహరణ మాత్రమే! ఖగోళ విజ్ఞాన పథంలో, అంతరిక్ష వీక్షణ ప్రస్థానంలో భారతీయులు- ప్రపంచంలోనే అగ్రగాములు. ఈ విజ్ఞాన చంద్రుడిని ‘విదేశీయ దురాక్రమణ’లు రాహుకేతువుల వలె కబళించడం వెయ్యేళ్ల చరిత్ర. వెయ్యేళ్లు వెనుకబడిన మనం మళ్లీ ‘తథాకథిత’- సోకాల్డ్- అగ్ర దేశాలతో పోటీపడి అంతరిక్షంలో దూసుకొనిపోగలుగుతున్నాము. సోమవారం ‘రెండవ చంద్రయానం’ మొదలుకావడం ఈ ‘దూసుకొనిపోతున్న’ చరిత్రలో సరికొత్త ఘట్టం....
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్- ఇస్రో- అవతరించే నాటికి అమెరికా, రష్యా దేశాల వారు అంతరిక్షంలో గొప్ప పరిశోధక ప్రగతి సాధించారు. అయినప్పటికీ ఇప్పుడు ఈ దేశాల సంస్థలతోను, చైనా సంస్థతోను దీటుగా విజ్ఞానపథ ప్రస్థానం సాగిస్తుండడానికి కారణం యుగాల నాటి మన ఖగోళ విజ్ఞాన నేపథ్యం. మన ‘సూర్య సిద్ధాంతం’ అన్న ఖగోళ విజ్ఞాన గ్రంథం ప్రపంచంలోని ‘అంతరిక్ష’ పరిశోధక విజ్ఞాన చరిత్రలో మొదటి ఆవిష్కరణ. కలియుగం నాలుగవ శతాబ్ది- క్రీస్తునకు పూర్వం ఇరవై ఎనిమిదవ శతాబ్ది-నాటి ఆర్యభటుడు, క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దినాటి వరాహ మిహిరుడు అంతరిక్ష విజ్ఞాన పథంలో అగ్రగాములు. ఈ చారిత్రక వాస్తవాలను పాశ్చాత్యులు పరిగణించకపోవడం వారి దురహంకారం. ‘జూలియన్’ కాలెండర్, గ్రెగేరియన్ కాలండర్, క్రీస్తుశకం వంటివి రెండువేల రెండు వందల ఏళ్లకు పూర్వం లేవు. పాశ్చాత్యుల అంతరిక్ష పరిశోధన చరిత్రకు వెయ్యేళ్లు కూడ లేవు. అయినప్పటికీ, ఇప్పటికీ ఆర్యభటుడు ఈ ‘యుగం’లో మొదటి ఖగోళ విజ్ఞానవేత్త అన్న వాస్తవాన్ని పాశ్చాత్యులు అంగీకరించలేదు. ఆర్యభటుడు కలియుగం ముప్పయి ఏడవ శతాబ్ది- క్రీస్తుశకం ఐదవ శతాబ్ది- నాటి వాడన్న పాశ్చాత్యుల ప్రచారం ‘చరిత్ర చంద్రుని’కి మరో గ్రహణం. వరాహ మిహిరుడు క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్ది నాటి ‘విక్రమ సమ్రాట్’ ఆస్థానంలోని వాడన్న సత్యాన్ని, మహాకవి కాళిదాసుకు సమకాలీనుడన్న వాస్తవాన్ని కూడ పాశ్చాత్య భావదాస్య గ్రహణం దిగమింగింది. వరాహ మిహిరుడు కలియుగం ముప్పయి ఎనిమిదవ శతాబ్ది- క్రీస్తుశకం ఆరవ శతాబ్ది- నాటివాడని ఇప్పటికీ జరుగుతున్న ప్రచారం ఖగోళ విజ్ఞాన చంద్రునికి తొలగని గ్రహణం. ‘ఇస్రో’ సాధిస్తున్న విజయాలతోపాటు, మన ఖగోళ విజ్ఞాన చరిత్ర కూడ విస్తృత ప్రచారం పొందినప్పుడు విస్మృత వాస్తవాలు గ్రహణ విముక్తం కాగలవు.
చంద్రునిపై అవతరించనున్న ‘లాండర్’-అవతారిక-కు ‘విక్రమ’అని పేరు పెట్టడం వరాహ మిహిరుని స్మృతిని స్ఫురింపచేస్తోంది.‘ఆర్బిటార్’- పరిక్రమిక- సెప్టెంబర్ ఆరవ తేదీ నుంచి చంద్రుని చుట్టూతిరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ‘పరిక్రమిక’ నుంచి విడివడే ‘అవతారిక’- విక్రమ- చంద్రుని దక్షిణధ్రువంపై దిగుతుంది. ‘విక్రమ’నుంచి మెల్లగా వెలువడే ‘పరిశోధిక’-రోవర్- పేరు ‘ప్రజ్ఞ’.. ఈ భారతీయ ‘ప్రజ్ఞ’ పదునాలుగురోజులు చంద్రుని తలంపై విహరించి వినూతన ‘విషయాల’ను ఆవిష్కరించనుంది. అందులో ‘నీరు’, ‘మంచు’ ప్రధానమైన పదార్థాలు. చంద్రునిలో ‘నీరు’ఉన్నట్టు ‘మొదటి చంద్రయాన్’ ఇదివరకే ప్రపంచానికి చాటించింది. ఈ చాటింపునకు మరో ధ్రువీకరణను ఈ రెండవ చంద్రయాన్ ఆవిష్కరించనుంది. చంద్రునికీ నీటికీ ‘అవినాభావం’.. అన్నది భారతీయులకు అనాది జీవన స్వభావం.... హిమకరుడు, తుహినకరుడు.. చంద్రుడు!