సంపాదకీయం

భూటాన్‌కు స్నేహయాత్ర..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శని, ఆదివారాలలో భూటాన్‌లో పర్యటించడం ఉభయ దేశాల మధ్య మైత్రి మరింత పెంపొందడానికి దోహదకరం. చిన్న దేశమైన భూటాన్ మన దేశానికి అతి పెద్ద మిత్ర దేశం. భౌగోళిక సమీపత్యం, దౌత్య సాన్నిహిత్యం, భద్రతా సమానత్వం, సాంస్కృతిక ఏకత్వం భారత-్భటాన్ చారిత్రక మైత్రీ ప్రస్థాన రథ చక్రాలు. నరేంద్ర మోదీ పర్యటన ఈ మైత్రీ ప్రస్థాన ప్రగతి వేగవంతం అవుతోందనడానికి వర్తమాన నిదర్శనం. 2014 మే 26న ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన తరువాత నరేంద్ర మోదీ సందర్శించిన తొలి విదేశం భూటాన్. 2014 జూన్ 15న ఆయన భూటాన్‌కు వెళ్లివచ్చాడు. ‘ఇరుగు పొరుగు దేశాలకు’ ప్రాధాన్యం, ప్రాథమ్యం ఇవ్వాలన్న ఈయన ప్రభుత్వం విధానం గత ఐదేళ్లకు పైగా కొనసాగుతోంది. ఈ విధానానికి విస్తృతి రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన మోదీ రెండున్నర నెలలకే భూటాన్‌కు వెళ్లిరావడం. నరేంద్ర మోదీ ప్రధానిగా పదవీ బాధ్యతలను స్వీకరించే నాటికి పూర్వం ఐదారు సంవత్సరాలుగా భారత-్భటాన్ మైత్రీ సంబంధాలలో కొన్ని అపశ్రుతులు వినిపించడం చరిత్ర. ఈ అపశ్రుతి చైనా ప్రభుత్వం! మన దేశాన్ని బ్రిటన్ దురాక్రమించిన సమయంలో సైతం భూటాన్ స్వతంత్ర దేశంగా మనుగడ సాగించింది. అలా బ్రిటన్ దురాక్రమణకు గురికాని ‘అఖండ భారత’ ప్రాంతాలు నేపాల్, భూటాన్. బ్రిటన్ దురాక్రమణ ముగిసిన తరువాత నేపాల్, భూటాన్ దేశాలు సహజంగానే మన దేశంతో సమీకృతిని పొంది ఉండాలి. అలా జరుగకపోవడానికి కారణం బ్రిటన్ నిష్క్రమణ తరువాత మన దేశానికి ఆధ్వర్యవం వహించిన పాలకులకు భౌగోళిక సమగ్రత గురించి ధ్యాస లేకపోవడం. బ్రిటన్‌వారు నిర్ధారించిన- మన దేశాన్ని రెండున్నర శతాబ్దులకు పైగా కొల్లగొట్టిన దోపిడీ దొంగల వంటి బ్రిటన్ ముష్కరులు నిర్ధారించిన- సరిహద్దులను మన పాలకులు యథాతథంగా గుర్తించి అంగీకరించి కొనసాగించారు. భారత జాతీయ చారిత్రక దృష్టితోకాక, బ్రిటన్‌వారి బుద్ధితో మన పాలకులు ఆలోచించారు. బ్రిటన్ నిష్క్రమణ తరువాత నేపాల్, భూటాన్‌లు భారత్ ‘సరిహద్దుల’కు ఆవల మిగిలిపోవడానికి ఇదీ కారణం. మన పొరుగున ఉన్న చైనా తరతరాలుగా తనదికాని టిబెట్‌ను దురాక్రమించి దిగమింగింది. కానీ బ్రిటన్ దురాక్రమణ విముక్త భారతదేశం తరతరాలుగా తనవైన నేపాల్‌ను, భూటాన్‌ను విలీనం చేసుకోలేకపోయింది. అయినప్పటికీ నేపాల్, భూటాన్‌లు స్వతంత్ర దేశాలుగా అవతరించి ఉన్నప్పటికీ ఈ దేశాలతో మన దేశానికున్న యుగయుగాల సాంస్కృతిక సమానత్వం చెఱగిపోలేదు. ఈ సాంస్కృతిక సమానత్వం భూటాన్‌తో మన మైత్రికి ప్రాతిపదిక! అయినప్పటికీ 2012వ, 2013వ సంవత్సరాలలో భారత- భూటాన్ సంబంధాలలో అపశ్రుతులు ధ్వనించాయి. ఈ అపశ్రుతులు సమసిపోవడం, మళ్లీ స్నేహగీతం స్పష్టంగా వినిపిస్తుండడం గత ఐదేళ్ల చరిత్ర.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలో 2014లో కొలువుతీరిన భారతీయ జనతాపార్టీ ప్రభుత్వ అధికార స్వీకార సమావేశానికి ఇరుగుపొరుగు దేశాలతోపాటు భూటాన్ ప్రభుత్వ అధినేత హాజరుకావడం ఈ ‘కొత్త’ చరిత్రకు స్వీకారం. షెరింగ్ టాబ్‌గే అప్పటి భూటాన్ ప్రధానమంత్రి. పదవీ స్వీకారం తరువాత ఇరవై రోజులకే నరేంద్ర మోదీ అప్పుడు భూటాన్‌కు వెళ్లివచ్చాడు. భూటాన్ రాజు జిగ్మేకేసర్- నామ్‌ధర్ వాంగ్‌చుక్ తదితరులతో మోదీ జరిపిన చర్చలు అంతవరకూ ఐదేళ్లపాటు నెలకొన్న అపోహలను దూరం చేయగలిగాయి. భూటాన్‌పై చైనా విసరిన ‘వల’ తెగిపోయింది. ‘్భటాన్ కోసం భారత్, భారత్ కోసం భూటాన్’- ‘బి ఫర్ బి’- అన్న నూతన నినాదం యుగాలుగా కొనసాగుతున్న పరస్పర మమకార బంధానికి అనుగుణం. క్రీస్తుశకం 1914 నాటి సిమ్లా ఒప్పందం ప్రాతిపదికగా భారత్‌కూ, స్వతంత్ర టిబెట్ దేశానికీ మధ్య ఏర్పడిన సరిహద్దు రేఖ భూటాన్ ఈశాన్య సరిహద్దుతో మొదలయి మన ‘అరుణాచల్’ చివరి వరకూ తూర్పుగా కొనసాగుతోంది. ఈ సరిహద్దు రేఖనే ‘మెక్‌మాహన్’ రేఖ అని అంటున్నాము. అప్పటికే భూటాన్‌కు పశ్చిమంగాను, భూటాన్‌కూ టిబెట్‌కూ మధ్యలోను స్పష్టమైన సరిహద్దులు ఏర్పడి ఉన్నాయి. అందువల్లనే ‘సిమ్లా’ ఒప్పందంలో ఈ పడమటి సరిహద్దు విభాగం గురించి ప్రస్తావన లేదు. కానీ ఈ స్పష్టమైన సరిహద్దును అతిక్రమించి చైనా 2017 జూన్‌లో ‘డోక్ లా’- డోక్ లామ్-లోకి చొరబడింది. ‘డోక్‌లామ్’ మన సిక్కింలోను భూటాన్‌లోను విస్తరించి ఉన్న పచ్చిక మైదానం, పీఠభూమి.. డోక్‌లామ్ నుంచి చైనీయ దళాలను గెంటివేయడంలో మన సైనిక దళాలవారు కృతకృత్యులు కాగలిగారు. ఈ పరిణామంతో భూటాన్ ప్రభుత్వానికి చైనావారి దురాక్రమణ లక్ష్యాలు మరింత స్పష్టం అయ్యాయి. భారత-్భటాన్ ద్వైపాక్షిక సంబంధాలకు ‘డోక్‌లామ్’ విజయం సరికొత్త బలం.. భారత భూటాన్ ఉమ్మడి భద్రత పెంపొందడం ఈ సరికొత్త బలం..
భూటాన్‌లో ఉమ్మడిగా నిర్మించిన మాంగ్‌దేసూ జల విద్యుత్ ఉత్పాదక కేంద్రానికి శనివారం ప్రారంభోత్సవం జరగడం నరేంద్ర మోదీ ప్రస్తుత పర్యటనలోని ప్రధాన అంశం. భూటాన్ ప్రధాని లోతయ్ షెరింగ్‌తో ఆయన జరిపిన చర్చల ఫలితంగా ఉభయ దేశాల మధ్య పది ఒప్పందాలు కుదిరాయట! ఉభయ దేశాల మధ్య ఐదు దశాబ్దులుగా కొనసాగుతున్న ‘జల విద్యుత్’ సహకారానికి శాశ్వత ప్రతీక ఈ జల విద్యుత్ కేంద్రం. భూటాన్ రాజధాని ‘తింపూ’లో ఉపగ్రహ భూతల నియంత్రణ కేంద్రాన్ని ప్రారంభించడం స్నేహపథంలో మరో ముందడుగు. 2017 నుంచి కూడ మనం ఇరుగు పొరుగు దేశాలకు బహుమతిగా ఇచ్చిన ‘సమాచార ఉపగ్రహం’ భూటాన్‌లో కూడ సేవలనందిస్తోంది. ముప్పయి ఎనిమిదిన్నర వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన భూటాన్ మన సిక్కింకూ తూర్పుగాను అరుణాచల్‌కు పడమరగాను నెలకొని ఉంది. పది లక్షల లోపు జనాభా కలిగిన భూటాన్ ప్రజాస్వామ్యంగా వికసించడానికి కారణం 2007లో భూటాన్ రాజవంశం వారు సంస్కరణల పట్ల చూపించిన స్వచ్ఛంద అనురక్తి. రాజు కేవలం రాజ్యాంగ లాంఛనప్రాయమైన అధినేతగా నూతన ప్రజాస్వామ్య వ్యవస్థ 2008లో ఏర్పడింది. జాతీయ శాసనసభకు మూడుసార్లు నియతంగా ఎన్నికలు జరగడం భూటాన్‌లో ప్రజాస్వామ్య విజయానికి ప్రతీక! క్రీస్తుశకం 1910వరకూ భూటాన్ బ్రిటన్ దురాక్రమణను ప్రతిఘటించింది. అనాది అఖండ భారత్‌లో ‘ భూటాన్’ ఒక రాజ్యాం. క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్దివరకూ భూటాన్‌కూ, టిబెట్‌కూ మధ్య అనేకసార్లు యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలలో ‘లడక్’ పాలకులు భూటాన్‌కు అండగా నిలబడి ఉండేవారు. 1914 తరువాత బ్రిటన్ ‘దొరలు’ టిబెట్‌లో కలిసిన ‘కైలాస మానస’ సరోవర ప్రాంతాలు లడక్‌కూ, భూటాన్‌కూ మధ్య సరిహద్దులుగా ఉండేవి. 1629-1639 సంవత్సరాల మధ్య టిబెట్ పాలకులు భూటాన్‌పై నాలుగుసార్లు దండెత్తారు. నాలుగుసార్లు కూడ భూటాన్ దండయాత్రలను తిప్పికొట్టింది- లడక్ సహాయంతో-! భారత భూటాన్‌ల ఉమ్మడి భద్రతకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే! ఇప్పుడు ఉమ్మడి భద్రతకు ‘డోక్‌లామ్’ప్రతీక!!
టిబెట్‌ను ప్రతిఘటించడానికి వీలుగా 1910లో స్వతంత్ర భూటాన్ ప్రభుత్వం భారత్‌తో- బ్రిటన్ దురాక్రమణలోని భారత్‌తో- ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భూటాన్‌ను విదేశీయ దురాక్రమణను రక్షించే బాధ్యత మన దేశానికి సంక్రమించింది. అయితే 2012లో అప్పటి భూటాన్ ప్రభుత్వం ఈ ఒప్పందం స్ఫూర్తికి విరుద్ధంగా చైనాతో మంతనాలను జరుపడానికి యత్నించింది. అయితే ఆ తరువాత జరిగిన ఎన్నికలలో ఈ చైనా అనుకూల రాజకీయవాదులు ఘోర పరాజయం పాలయ్యారు. భూటాన్ ప్రజలు భారత్‌తో మైత్రిని కోరుతున్నారు. కానీ నేపాల్‌లోకి వలె భూటాన్‌లోకి కూడ చైనా వ్యూహాత్మకంగా చొరబడే యత్నం చేస్తోంది! ఈ పన్నాగం వమ్ముకావడం భారత్ భూటాన్‌ల మైత్రీప్రగతికి సాక్ష్యం...