సంపాదకీయం

అక్రమ ఆధిపత్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి అగ్రరాజ్యాల ఆధిపత్యపు ఆటస్థలంగా మారి ఉండ డం ఏడున్నర దశాబ్దుల సామ్రాజ్యవాద వారసత్వం! ఈ సామ్రాజ్యవాదం రాజకీయ, వాణిజ్య, వ్యూహాత్మక దురాక్రమణం, దౌత్య దౌర్జ న్యం. మన అంతర్గత వ్యవహారమైన ‘జమ్మూ కశ్మీర్’ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వారు ఇటీవల ‘అనధికారికంగా’ను, ‘జనాంతికంగా’ను చర్చించడం చైనా ప్రభుత్వ దౌత్య దౌర్జన్యానికి వ్యూహాత్మక దురాక్రమణకు ఒక ఉదాహరణ మాత్రమే! అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశానికి ‘మండలి’లో శాశ్వత సభ్యత్వం లేకపోవడం, ‘నిర్ణాయక నిరోధ’- వీటో- అధికారం లేకపోవడం ఈ చైనా దౌత్య బీభత్సకాండకు కారణం. అతి పెద్ద నియంతృత్వ వ్యవస్థ అయిన చైనాకు శాశ్వత సభ్యత్వం, నిర్ణాయక నిరోధ అధికారం ఉండడం ‘సమితి’ స్వభావంలోని అతిపెద్ద వైపరీత్యం. చైనా తన ‘నిర్ణాయక నిరోధ’ అధికారాన్ని, శాశ్వత సభ్యత్వ ప్రాబల్యాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి వ్యతిరేకంగా నాలుగున్నర దశాబ్దులకు పైగా దుర్వినియోగం చేస్తోంది. 1949 నుంచి అప్పటి మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ కమ్యూనిస్టు నియంతృత్వ కమ్యూనిస్టు చైనాకు ‘మండలి’లో ‘నిర్ణాయక నిరోధ’ అధికారం కల ఈ శాశ్వత సభ్యత్వాన్ని ఇప్పించడానికి ఆజీవన అవిరళ కృషిచేశాడు. ఫలితంగా 1972నుంచి చైనా ద్వైపాక్షిక అంతర్జాతీయ వ్యవహారాలలో ‘మండలి’లోను, సమితిలోను మనకు వ్యతిరేకంగా విద్వేషపు విషం వెళ్లగక్కుతోంది. 1962వరకు అంతర్జాతీయ వేదికలపైన జవహర్‌లాల్ నెహ్రూ నిర్వహించిన అతి ప్రధాన కార్యక్రమం ఈ నియంతృత్వ చైనాకు ‘మండలి’లోను, ‘సమితి’లోను శాశ్వత సభ్యత్వం ఇప్పించడం. ‘పెంపుడు’ తోడేలు పెంచినవారి ఆవుల మెడలను, గొంతులను కొరికి వేయదని భ్రమించడం ఆత్మవంచన, స్వయం వంచన! 1972నుంచి ‘సమితి’లో కొనసాగిస్తున్న దౌత్య దౌర్జనానికి ప్రధాన లక్ష్యం భారత వ్యితిరేకత! జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వ దమనకాండ జరగడం లేదు, జరుగుతున్నట్టు పాకిస్తాన్, చైనాలు ప్రచారం చేశాయి. మండలిలో ఆధికారికంగా ‘జమ్మూ కశ్మీర్’పై చర్చించడానికి అధికాధిక సభ్య దేశాలు అంగీకరించలేదు. కానీ ఈనెల 16న అనధికారికంగా, అనౌపచారికంగా, జనాంతికంగా మండలిలో జమ్మూకశ్మీర్‌పై చర్చ జరగడానికి కారణం చైనా దౌత్య దౌర్జన్యం, ‘మండలి’లో మన దేశానికి ‘శాశ్వత సభ్యత్వం’, నిర్ణయాత్మక నిరోధ అధికారం లేకపోవడం.. ఈ ‘రహస్య’ చర్చలో సభ్య దేశాల ప్రతినిధులు చైనాకు, పాకిస్తాన్‌కు చీవాట్లు పెట్టారట! మన దేశాన్ని, అభిశంసనకు గురిచేయపోయిన ‘చైనా పాకిస్తాన్’ దుర్జన ద్వయం తామే అభిశంసనకు గురి అయ్యింది. కానీ అనధికారికంగానైనా మన అంతర్గత వ్యవహారం ఇలా ‘అంతర్జాతీయ వేదిక’పై నలుగురి నోళ్లలో నానడం చైనా దుస్తత్రం.. మన దేశానికి ‘మండలి’లో నిర్ణయాత్మక నిరోధ అధికారం కల శాశ్వత సభ్యత్వం లభించాలన్న వాదానికి ఇదంతా నేపథ్యం.. కానీ ఈ మన ‘సభ్యత్వానికి’ అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ రష్యా వంటి ఇతర శాశ్వత సభ్య దేశాలు సైతం నిర్ద్వంద్వంగా మద్దతు పలుకకపోవడం దశాబ్దుల వంచన క్రీడ...
‘మొదటి ప్రపంచ యుద్ధం’ ముగిసిన తరువాత ఏర్పడిన ‘ప్రపంచ దేశాల కూటమి’ లేదా ‘నానాజాతి సమితి’- లీగ్ ఆఫ్ నేషన్స్- ద్వైపాక్షిక అంతర్జాతీయ వివాదాలను ‘శాంతియుతం’గా పరిష్కరించడానికి ఏర్పడిన వ్యవస్థ! ఈ ‘వ్యవస్థ’ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కుప్పకూలిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అవతరించిన ‘ఐక్యరాజ్యసమితి’- యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్- యుఎన్‌ఓ- నిజానికి ‘నానాజాతి సమితి’కి పునర్‌జన్మ. రెండు సంస్థల స్వభావంలోను ‘అప్రజాస్వామ్యం’, ‘అగ్రరాజ్యాల ఆధిపత్యం’ నిహితమై ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ఏర్పడిన నాటికి మన దేశం బ్రిటన్ దురాక్రమణలో ఉంది. అందువల్ల బానిస దేశమైన మనకు ప్రపంచంలో గుర్తింపులేదు, ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వమూ లేదు. ‘సమితి’ ఏర్పడిన రెండేళ్లకు కాని స్వతంత్ర భారత్‌కు సభ్యత్వం లభించలేదు. అది కూడ సాధారణ సభ్యత్వం మాత్రం లభించింది. సమితి ఏర్పడిన నాటికి ప్రధాన దేశాలైన, రెండవ ప్రపంచ యుద్ధంలో ఉమ్మడి విజేతలైన ఐదు దేశాలకు ‘సమితి’ భద్రతా మండలి- సెక్యూరిటీ కౌన్సిల్-లో శాశ్వత సభ్యత్వం లభించింది. ఈ శాశ్వత సభ్య దేశాలకు మండలిలో ‘నిర్ణాయక నిరోధ అధికారం’తో కూడిన ఆధిపత్యం లభించడం చారిత్రక దురాగతం. ‘మండలి’లో సభ్య దేశాల సంఖ్య పదహైదు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, చైనాలకు మాత్రం శాశ్వత సభ్యత్వం.. ‘పదిహేను దేశాలలో ఎనిమిది ఒప్పుకుంటే నిర్ణయం జరగాలి, నిరాకరిస్తే తీర్మానం వీగిపోవాలి’. ఇదీ సహజ న్యాయం. లేదా మూడింట రెండువంతుల సంఖ్యాధిక్యం- మెజారిటీ- ప్రాతిపదికగా నిర్ణయాలు జరగాలి. కానీ ఈ శాశ్వత సభ్యత్వం కారణంగా అలా జరగడం లేదు. ఈ ఐదు శాశ్వత దేశాలలో ఏ ఒక్కటి అంగీకరించక పోయినప్పటికీ మండలిలో ఏ నిర్ణయం కూడ జరగదు. ఐదు దేశాలవారూ అంగీకరించినప్పుడు మాత్రమే ‘తీర్మానం’నెగ్గుతుంది. ఇదీ ‘వీటో’ అధికారం.. అగ్రరాజ్యాల ఆధిపత్యం!
‘మండలి’లో ఈ దురన్యాయ వ్యవస్థ ఎందుకని కొనసాగుతోంది? అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ ప్రశ్నను మన దేశం కూడ అడగడం లేదు. పది సాధారణ సభ్య దేశాల సభ్యత్వ కాలవ్యవధి రెండేళ్లతో ముగిసిపోతుంది. ఈ ఐదు దేశాలు మాత్రం ‘‘కల్పాంతం’’వరకు పీట పెట్టుకొని మండలిలోనే కూర్చుని ఉంటాయట! కూర్చుని ఉండాలట! ఈ ‘పీటల’ శాశ్వతత్వానికి ఎలాంటి న్యాయమైన తార్కికమైన ప్రాతిపదిక లేదు. ‘ఖండాల’వారీగా సాధారణ సభ్యత్వాలను కేటాయిస్తున్నారు. శాశ్వత సభ్యత్వానికి అలాంటి ప్రాతిపదిక కూడ లేదు. మూడు శాశ్వత సభ్యదేశాలు బ్రిటన్ ఫ్రాన్స్ రష్యాలు ఒకే ఖండానికి- ఐరోపాకు చెందినవి. అతిపెద్ద ఖండమైన ఆసియాకు చైనా మాత్రమే శాశ్వత ప్రతినిధి. ఆఫ్రికా ఖండానికి కాని, దక్షిణ అమెరికా ఖండానికి కాని శాశ్వత ప్రతినిధులు లేరు. జనాభా లేదా భూభాగం పరిమాణం కూడ శాశ్వత సభ్యత్వానికి ప్రాతిపదిక కాలేదు. అలా అయి ఉండినట్టయితే రెండవ అతిపెద్ద జనసంఖ్యగల మన దేశానికి- బ్రిటన్ విముక్తి తరువాత- మండలిలో శాశ్వత సభ్యత్వం లభించి ఉండేది. లభించకపోవడం ‘సమితి’ స్వభావ నిహితమైన అప్రజాస్వామ్యం.. ‘సమితి’ ఏర్పడిన నాటికి, 1945వ సంవత్సరం నాటికి చైనా- అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్‌లకు మిత్రదేశం. ఈ ‘మిత్ర రాజ్యాలు’ జపాన్, జర్మనీల నాయకత్వంలోని ‘అక్ష’రాజ్యాల కూటమిని రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడించడం ‘సమితి’ అవతరణకు నేపథ్యం. అందువల్ల చైనాకు శాశ్వత సభ్యత్వం లభించింది. కానీ 1949లో చైనా రెండుగా విడిపోయింది. దాదాపు ముప్పయి ఆరు వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యం మాత్రమేకల ‘తైవాన్’ ద్వీపం ‘జాతీయ చైనా’గా అవతరించింది. ఎనబయి రెండులక్షల చదరపు కిలోమీటర్ల- మన దేశం కంటె దాదాపు రెండున్నర రెట్లు- ప్రధాన భూభాగం ‘నవ చైనా’గా ఏర్పడింది. కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థ ఉన్న ఈ పెద్ద ‘నవ చైనా’ను 1972వరకు ‘సమితి’ గుర్తించలేదు. అందువల్ల అప్పటివరకు అతి చిన్న దేశమైన ‘జాతీయ చైనా’ ‘మండలి’లో శాశ్వత సభ్య దేశంగా కొనసాగింది. ఈ సమయంలోనే 1962వరకు మన ప్రధాని నెహ్రూ ఈ పెద్ద కమ్యూనిస్టు చైనాను భుజాన ఎత్తుకున్నాడు. ‘సమితి’నుంచి జాతీయ చైనాను వెళ్లగొట్టి ఈ పెద్ద చైనాకు 1972 సమితి సభ్యత్వాన్ని కల్పించారు, ‘మండలి’లో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించారు.
అప్పటినుంచి ఇప్పటివరకూ ‘మండలి’లో చైనా ఆధిపత్యం మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో ‘సమితి’ అక్రమ ప్రమేయం ఇందుకు సరికొత్త నిదర్శనం, జనాంతికంగానైనా ‘మండలి’లో జమ్మూ కశ్మీర్‌పై చర్చ జరగడం ఈ అక్రమ ప్రమేయం.. ‘మాకు కూడ ‘నిర్ణాయక నిరోధక’ అధికారం కల శాశ్వత సభ్యత్వం కల్పించండి.. లేదంటే ఈ ఐదు దేశాలకు కూడ ఈ ప్రత్యేకతను రద్దుచేయండి!’’అని మన ప్రభుత్వం గట్టిగా అడగవలసిన సమయం ఇది...