సంపాదకీయం

తిందాం తిందాం.. ఏమేమి??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంసం తినడం క్రమంగా తగ్గించి వేయాలన్నది ‘ఐక్యరాజ్యసమితి’ అనుబంధ అధ్యయన మండలి వారు ప్రపంచ మానవులకు ఇస్తున్న సలహా.. మాంసాహారం భుజించడం తగ్గించడం భూమండల పరిరక్షణకు దోహదం చేయగలదన్నది ఇటీవల వెల్లడించిన తమ నివేదికలో ఈ ‘పర్యావరణ పరివర్తన వ్యవహారాల అంతర్జాతీయ అధ్యయన మండలి’- ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్- ఐపిసిసి- వారు రూపొందించిన ప్రత్యేక నివేదికలో పేర్కొన్నారు. ఆకుపచ్చని సీమలు ఎడారులుగా మారిపోకుండా, భూసారం నష్టమైపోకుండా నిరోధించే ప్రక్రియ గురించి సెప్టెంబరు నెలలో జరుగనున్న అంతర్జాతీయ సదస్సునకు పూర్వరంగంగా ఐపిసిసి ఈ ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. ‘ఐపిసిసి’ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ప్రపంచంలోని వ్యవసాయ భూమి నిరంతరం నిస్సారమై, నిర్జీవమైపోతోందన్నది నివేదికలో వ్యక్తమైన ఆందోళన. ఇరవై మూడు శాతం ధరాతల విస్తీర్ణం నిర్జీవమైపోయి ఉందని, భారతదేశంలో ఈ నిర్జీవ నిస్సార భూమి వైశాల్యం ముప్పయి శాతానికి పైబడిందని కూడ నివేదికలో పేర్కొన్నారు. ఆహారపు అలవాట్లకు ఆరోగ్యానికి సంబంధం ఉందన్నది అనాది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఐక్యరాజ్యసమితి అధ్యయన మండలి వారు మరోసారి ధ్రువీకరించారు. మాంసాహారం విచక్షణ రహితంగా తినడం వల్ల అవిరళంగా- ప్రతిరోజు- ఆరగించడం వల్ల తింటున్న వారి ఆరోగ్యం క్రమంగా క్షీణించిపోతుందన్నది అందరికీ తెలిసిన సత్యం. మన దేశంలో కాని ప్రపంచంలో కాని కేవలం శాకాహారం భుజించేవారి సంఖ్య చాలా తక్కువ. మాంసాహారం తింటున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. తరతరాలుగా ఇదే జీవన విధానం. అయితే తరతరాలు మాంసాహార సేవనంలో విచక్షణ నిహితమై ఉండేది. నెలకు రెండుసార్లు మాత్రమే మాంసం వండి భుజించడం కొన్ని కుటుంబాలలోని సంప్రదాయం. నెలకోసారి మాంసం తినడం లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాలలోను, పండుగల సమయంలో మాంసాహారం తినడం మన దేశంలో సాధారణ సంప్రదాయంగా కొనసాగింది. కానీ ఈ తరతరాల సంప్రదాయం ఈ తరంలో భంగపడింది. వారానికోసారి మాంసం తినడం మొదలైంది. క్రమంగా ఈ మాంస భక్షణ నిత్యకృత్యమైపోయింది. ఇదీ వైపరీత్యం. మాంసాహారం తినడం ఒక భోగం. మిఠాయిలు, పిండివంటలు తినడం కూడ భోగం. ‘్భగం’ తరచూ అనుభవించి అనుభూతి పొందగల సుఖం మాత్రమే. ప్రతిరోజూ దాన్ని అనుభవించినట్టయితే అది ‘్భగం’ కాదు, ‘రోగం’ అవుతుంది. విచక్షణ రహితంగా పిండివంటలను, మిఠాయిలను, అంగడి తిండిని ప్రతిరోజూ తింటున్న శాకాహారులు, రోజూ మాంసం తింటున్న మాంసాహారులు ఇలా రోగగ్రస్తులవుతున్నారు. పులిహోర, పాయసం, గారెలు, బూరెలు వంటివి, మాంసాహారం ప్రతిరోజూ తినరాదన్నది భారతీయ జీవన సత్యం. సంవత్సరంలో కొన్నిసార్లు మాత్రమే వీటిని ఆరగించాలన్నది జీవన రీతి. ఈ రీతి చెడిపోయి ఉండడం వర్తమాన సమాజ రుగ్మతకు కారణం... మధుమేహం, హృదయ భారం వంటివి విచక్షణ రహితమైన భోజన ప్రవృత్తివల్ల దాపురించిన కొన్ని జబ్బులు మాత్రమే...
అందువల్లనే ‘‘న మాంస భక్షణే దోషః’’- మాంసం తినడం తప్పుకాదు- అని చెప్పిన ధర్మశాస్త్రాలు ‘‘ప్రవృత్తిరేవ భూతాని’’- ఇది మానవ ప్రవృత్తి- అన్న వాస్తవాన్ని కూడ అంగీకరించాయి. కానీ ‘‘నివృత్త్యస్తు మహాఫలాః’’ - తినడం మానుకోవడం వల్ల గొప్ప ఫలితాలు లభిస్తాయి’’ అని కూడ ధర్మశాస్త్రాలు జీవన ధర్మాన్ని బోధిస్తున్నాయి. ఈ బోధనకు పునరావృత్తి ఐక్యరాజ్యసమితి అధ్యయన బృందం వారి నిర్ధారణ.. ‘‘మాంసం తినడం తగ్గించడం భూపరిరక్షణకు దోహదకరం’’అన్నది ఈ నిర్ధారణ. మాంసం తినడం కోసం పాడి పశువులను, ఇతర జంతువులను, పక్షులను, జలచరాలను చంపడం వేఱు! కానీ మాంసాన్ని డబ్బాలలో భద్రపరచి విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల దశాబ్దులుగా మన దేశంలో ఆవుల వధ, ఇతర పాడి పశువుల వధ విచక్షణ రహితంగా కొనసాగింది. ఒంటెల పాలు తాగడం ఆరోగ్యకరమట. అందువల్ల ఒంటె పాలకు గిరాకీ పెరిగింది, కానీ ఒంటెలను చంపి మాంసం మెక్కడం వల్ల ఒంటెలు అంతరించిపోతున్నాయి. ఒంటె ఎడారి ‘ఓడ’, ఇసుక మేటల మధ్య దారిచూపే చుక్కాని ఒంటె! కడప జిల్లాలోని రాయచోటి పట్టణం సమీపంలో గత ‘బక్రీద్’ సందర్భంగా హత్యకు గురికానుండిన ముప్పయి ఒంటెలను ‘గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్’- జిహెచ్‌ఎస్‌పిసిఏ- జంతువుల పట్ల క్రూరత్వాన్ని నిరోధించడానికి ఏర్పడిన విస్తృత హైదరాబాద్ సంస్థ- వారు రక్షించగలగడం హర్షణీయ పరిణామం. మరో రెండు స్వచ్ఛంద సంస్థలు ‘్భరతీయ ప్రాణిమిత్ర సంఘం’ ‘‘గోజ్ఞాన ఫౌండేషన్’’ ఈ రక్షణకు సహకరించాయట. ప్రభుత్వం సహకరించడం వల్ల ఈ ఒంటెలను ఈ సంస్థల వారు కాపాడగలిగారు. ఈ ఒంటెలను కర్నాటకలోని ఒక జంతు ఆశ్రయశాలకు తరలించారట. అక్కడి నుంచి వీటిని రాజస్థాన్‌కు పంపిస్తున్నారట. కానీ నూట యాబయి ఒంటెలను వధించడం కోసం రాజస్థాన్ నుంచి తరలించుకొని వచ్చారన్నది ధ్రువపడని సమాచారం. మిగిలిన నూట ఇరవై ఒంటెలు ఏమయ్యాయో?
గ్రామాలలో పట్టణాలలో నిత్యం దర్శనమిచ్చిన గాడిదలు ఇప్పుడు కన్పించడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్లతరబడి గాడిదలను విచక్షణ రహితంగా వధించి మాంసం వ్యాపారం చేసిన ముఠాల గురించి ప్రచారమైంది. నెమళ్లను, జింకలను చంపి భోంచేసిన ‘‘పెద్ద మనుషుల’’ను న్యాయస్థానాలు శిక్షించకపోలేదు. కానీ బయటపడని జంతుహత్యలు ఎనె్నన్నది ఎప్పటికీ తేలదు. ఏమయినప్పటికీ మాంసాహారం తగ్గించడం వల్ల, మానుకోవడం వల్ల భూమికి మేలన్న ‘ఐక్యరాజ్యసమితి’ మాటను మనం ఇప్పటికైనా ఆచరించాలి. భూమి ప్రధానంగా- వ్యవసాయ భూమి నిస్సారమై నిర్జీవమైపోతుండడానికి కారణం విరివిగా, విచక్షణ రహితంగా కృత్రిమ విష రసాయనపు ఎఱువులను వాడడం! నిస్సారం అవుతున్న భూమిని సారవంతం చేయడానికి ఇబ్బడిముబ్బడిగా రసాయన విషాలను వాడేశారు. ఫలితంగా భూమి మరింత నిర్జీవమైపోతోంది. ఈ వైపరీత్యం మొదలుకావడానికి కారణం భూమికి అనాదిగా లభించిన సహజమైన ఎఱువులు గత ముప్పయి ఏళ్లుగా లభించకపోవడం... ఇలాంటి సహజమైన ఎఱువులు అడవి ఆకులు, ఆవుపేడ, పశువుల పేడ... ఆవులు, పశువులు, అడవి, జంతువులు, పక్షులు నశించిపోవడానికి ప్రధాన కారణం విచక్షణ రహితంగా వాటిని దశాబ్దుల తరబడి చంపివేయడం.. తినడం కోసం కొందరు చంపారు, అమ్మడం కోసం అనేక మంది చంపారు! ఫలితంగా సహజమైన ‘గవ్యాలు’- ఆవుపేడ, మూత్రం, పాలు పెరుగు నెయ్యి-, ఇతర పశువుల వ్యర్థాలు, ఆకులు లభించడం లేదు! భూసారం నష్టమైపోవడానికి ఇదంతా నేపథ్యం...
మాంసాహారం కోసం ఆవులను, పశువులను, వన్య మృగాలను, పక్షులను, జలచరాలను బహిరంగంగా వధించడం వల్ల ప్రకృతి, పరిసరాలలోని నీరు, గాలి కలుషితం అవుతుండడం మరో వైపరీత్యం. జంతు కళేబర వ్యర్థాలను ప్రకృతి జీర్ణించుకోలేక పోతోంది. అంత పెద్ద పరిమాణంలో ఈ జంతు కళేబర వ్యర్థాలు విస్తరించిపోతున్నాయి. మానవులు మాంసభక్షణను క్రమంగా తగ్గించుకున్నట్టయితే వారి శరీర ఆరోగ్యంతోపాటు పరిసరాల ఆరోగ్యం, వ్యవసాయ భూముల ఆరోగ్యం పెంపొందగలవన్నది ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యవంలో అధ్యయనం చేసిన వివిధ దేశాలకు చెందిన శాస్తవ్రేత్తల నిర్ధారణ.. విజ్ఞత వికసించు గాక!!