సంపాదకీయం

‘రెండేళ్ల’ మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచగలగడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ‘్భరతీయ జనతా పార్టీ’ ప్రభుత్వం రెండేళ్ల కార్యాచరణలో ప్రస్ఫుటించిన ప్రధాన అంశం. విలక్షణ సైద్ధాంతిక భూమికపై వికసించిన ‘్భజపా’ ప్రభుత్వ నిర్వహణలో కూడ ‘విశిష్ట ప్రత్యామ్నాయం’గా అవతరించడం 2014 మే 26వ తేదీ నుంచి నడుస్తోన్న ‘వర్తమానం’... ‘జాతీయతానిబద్ధత’ ఈ విలక్షణ సైద్ధాంతిక భూమిక, ‘అవినీతి అంటని పనితీరు’ ఈ విశిష్టమైన ప్రత్యామ్నాయం. మాతృభూమి పట్ల మమకారం కలిగిన స్వజాతీయ జీవన స్వభావం ఇది...లక్ష్యం కూడ! ఈ స్వభావం ఈ జాతీయుల అంతరంగం, ఈ ‘లక్షణం’ ఈ దేశ ప్రజల నిరంతర ప్రస్థానానికి ప్రేరకమైన వౌలిక తత్వం. జాతీయతానిష్ఠకల ప్రభుత్వం భద్రతను కల్పిస్తుంది... ఈ భద్రత భౌతికమైనది. సరిహద్దుల వెలుపలనుంచి, సరిహద్దుల లోపలినుంచి ఈ ‘మట్టి’కి, ఈ ‘మట్టి’ని మాతృభూమిగా ఆరాధించే వారికి ఎలాంటి ప్రమాదం దాపురించకుండా నిరోధించడం ఈ భౌతిక భద్రత! ఈ భద్రత సాంస్కృతికమైనది... భారతీయుడు నిరంతరం భారతీయుడుగానే జీవించగలగడానికి అనివార్యమైన సనాతన-శాశ్వత-సంస్కారాల సమాహారాన్ని సంరక్షించడం సాంస్కృతిక భద్రత’. ‘్భజపా’ ప్రభుత్వం ఈ రెండు రకాల భద్రతలను పెంపొందిస్తోందన్న విశ్వాసం ఈ రెండేళ్ల పాలనకు దర్పణం... పాలకుల అవినీతి అంటని పనితీరువల్ల ప్రజలందరికీ సమాన న్యాయం సాధించడం పాలకుల వౌలికమైన కర్తవ్యం. దేశవాసులందరి సుఖసంతోషాలకు, ప్రగతికి, సంక్షేమానికి సమాన న్యాయం ఆధార భూమిక! ‘్భజపా’ రెండేళ్ల పాలనలో ‘రాజకీయ అవినీతి’ అంకురించలేదు. ఒక్క నీటిబొట్టు కూడ వృథా కారాదనేది ప్రధానమంత్రి సరికొత్తగా ఆవిష్కరించిన మనసులోని మాట. మన్‌కీబాత్! ప్రతి ఒక్క బిందువు సింధువులో భాగం. అందువల్ల ప్రతి బిందువునకూ సముద్రంలో సమానభాగం ఉంది. సామాజిక సజీవసోపానస్రోతస్వినిలో జనం ఇలా బిందువులు. ‘జన బిందువులు’ కలసికలసి సమాజ ప్రవాహం పరుగులు తీస్తోంది. అందువల్ల ప్రజల ప్రత్యక్ష పరోక్ష క్రియాశీలత్వం ప్రభుత్వ కార్యకలాపాలను నడిపించడమే ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థకు సాఫల్యం... జలబిందువుల సమూహం నది. జనబిందువుల సమూహం జాతి. స్వచ్ఛ్భారత్ వంటి పథకాల ద్వారా ప్రజలు ఇలా ప్రత్యక్షంగా ప్రభుత్వ కలాపాలలో భాగస్వాములయ్యారు. వంట ‘ఇంధనం’పై ప్రభుత్వం ఇస్తున్న ‘రాయితీ’ని సంపన్నులు వదలుకోవాలన్న ప్రభుత్వం పిలుపుమేరకు లక్షలమంది తమకు సబ్సిడీ వద్దంటున్నారు. ఇలా వద్దన్నవారు కోట్లాది రూపాయలను బడుగువర్గాల సంక్షేమం కోసం సమకూర్చడం ప్రభుత్వ విజయం. ఉన్నవారు లేనివారికి చేయూతనివ్వాలన్న సామాజిక న్యాయ సూత్రం ఇలా సాకారమైంది. ప్రజల భాగస్వామ్యం ద్వారా సామాజిక సామరస్యం వికసిస్తోంది. సామరస్యం జాతీయ సమైక్య పరిరక్షణ మాధ్యమం! రెండేళ్ల విలక్షణ పాలనకు ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే...
విదేశాంగ, రక్షణ విధానాలను ఆవహించి ఉండిన ‘అలసత్వం’ తొలగిపోతుండడం ‘్భజపా’ ప్రభుత్వం విలక్షణ కార్యసరళికి మరో నిదర్శనం. అంతర్జాతీయ సమాజంలో మనకు గుర్తింపును తెస్తున్న పరిణామం ఇది. అతర్జాతీయ యోగ దినోత్సవం జరపాలని ఐక్యరాజ్య సమితి అధికారికంగానే నిర్ణయించడం భారతీయ సాంస్కృతిక విజయం. ఈ విజయసారథి ‘్భజపా’ ప్రభుత్వం. భారతదేశం అమెరికావలె, పాశ్చాత్య దేశాలవలె, అరబ్-తురుష్క జిహాదీల వలె, రష్యావలె, చైనావలె దురంహకారంతో ఇతర దేశాలను దురాక్రమించలేదు. ఇది సహస్రాబ్దుల చరిత్ర. భారతదేశం యుగాలుగా ప్రపంచానికి మానవీయ సంస్కారాలను ప్రసాదించింది. ‘యోగం’ ఇలాంటి మానవీయ సంస్కారం. యోగవిద్యను యోగాభ్యాసాన్ని ఇలా పెంపొందించడం ద్వారా ‘్భజపా’ ప్రభుత్వం భారతదేశానికి సాంస్కృతిక ప్రతినిధి కూడ అయింది! మనదేశానికి ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదన అనేక దశాబ్దాలుగా ప్రచారవౌతోంది. ఈ రెండేళ్లలో మూడు ఐరోపా అగ్రరాజ్యాల ప్రభుత్వాలు-బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు-మన అభ్యర్థిత్వాన్ని స్పష్టంగా సమర్థించడం అంతర్జాతీయ సమాజంలో పెరిగిన మన ‘గరిమ’కు సాక్ష్యం! పాకిస్తాన్ ప్రభుత్వం, చైనా ప్రభుత్వం దశాబ్దుల తరబడి ఉగ్రదాడులను మనదేశంలోకి ఉసిగొల్పుతున్నాయి. పాకిస్తాన్‌ను పేరుపెట్టి అభిశంసించగలిగిన మన ప్రభుత్వం చైనాను మాత్రం అలా ప్రత్యక్షంగా విమర్శించలేదు. నంగినంగిగా చైనాకు నిరసనలును తెలపడం దశాబ్దుల మన విధాన వైపరీత్యం. ‘్భజపా’ ప్రభుత్వం చైనాను బహిరంగంగా నిలదీయగలగడం మన రక్షణ విధానంలో సంభవించిన ‘విప్లవం’. ఈశాన్యంలోని మనదేశ వ్యతిరేక ఉగ్రవాదులను చైనా ప్రభుత్వం ఉసిగొల్పిందని గత ఇరవై రెండవ తేదీన మన ప్రభుత్వం ప్రకటించింది...
చౌబహార్ ఓడరేవును ఆధునీకరించడానికి ఇరాన్‌తో మనకు కుదిరిన ఒప్పందం చైనాపై మన ప్రభుత్వం సాధించిన వ్యూహాత్మక విజయం. మన సరిహద్దుల భద్రతకు ప్రధానమైన శత్రువైన చైనా, పాకిస్తాన్‌ను ఉసిగొల్పుతోంది! అందువల్ల ఇరాన్ మనతో జట్టుకట్టడం ‘పాకిస్తాన్ చైనా’ల కూటమికి నచ్చని పరిణామం! మయన్మార్ లో స్థావరాలను ఏర్పరచుకుని ఈశాన్యంలోని చొరబడి బీభత్సకాండను సృష్టిస్తున్న చైనా‘తొత్తుల’ను గత జూన్ నెలలో మన ప్రభుత్వం పట్టి పరిమార్చింది. మయన్మార్ లోకి చొచ్చుకొనిపోయిన దళాలు చైనా‘తొత్తుల’ స్థావరాలను ధ్వంసం చేయగలిగాయి. ఇలా బీభత్సకారులను పట్టి పరిమార్చడానికి, ఇతర దేశాలలోకి చొచ్చుకొనిపోయే-హాట్ పర్సూట్-విధానాన్ని మొదటిసారిగా మన ప్రభుత్వం అమలు జరిపింది...ఇదీ ‘విలక్షణ’ పాలన. అయితే ఈ ‘విలక్షణ తత్వం’ వెనుకనుంచి ‘వైఫల్యాలు’ కూడ తొంగి చూస్తున్నాయి. ‘ప్రపంచీకరణ’ పేరుతో విదేశీయ ఆర్థిక వాణిజ్య సామ్రాజ్యవాద దురాక్రమణ మనదేశంలో నానాటికీ విస్తరించిపోతోంది. ఈ ‘విస్తరణ’ 2014 మే 26వ తేదీకి ముందు పాలించిన ప్రభుత్వం ప్రసాదించిన వాణిజ్య వారసత్వం. ‘ప్రత్యేక ఆర్థిక మండులుల’ పేర వ్యవసాయ విధ్వంసం జరిగింది. అటవీహరితశోభల హననం జరిగింది. ‘బాస్కిలస్ తురంజిన్సిస్’ విషరసాయనం నిండిన ‘మహాసంకరజాతి’ విత్తనాలవల్ల భూమి, పర్యావరణం పాడవుతున్నాయి. ఇదంతా ‘వాణిజ్య ప్రపంచీకరణ’ ప్రభావం! ఈ ప్రభావం నుంచి దేశాన్ని విముక్తం చేయకపోవడం రెండేళ్ల ‘్భజపా’ ప్రభుత్వం వైఫల్యం.
ఇలా ‘్భజపా’ ఆలపిస్తున్న ప్రగతి ప్రస్థాన గీతంలో ‘అపశ్రుతులు’ కొన్ని ధ్వనిస్తుండడం ‘రెండేళ్ల కథ...అపశ్రుతులను తొలగించుకోవాలన్నది ‘్ధ్వనిస్తున్న’ జనాపదేశం. 2014 నాటి లోక్‌సభ ఎన్నికల తరువాత మహారాష్ట్ర, హర్యానా, జమ్ముకశ్మీర్, అసోం రాష్ట్రాల ప్రజల తీర్పులు ‘్భజపా’ పాలనకు ప్రశంసాపత్రాలు!. ఈ ప్రశంసలను నిలబెట్టుకోవాలంటే ‘అపశ్రుతుల’ను తొలగించుకోవాలి!.