సంపాదకీయం

‘పౌష్టిక’ మీమాంస..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంగడి తిండిని అదే పనిగా తినడంవల్ల చిత్ర విచిత్ర వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందన్నది ధ్రువపడిన వాస్తవం. చాక్లెట్లు, పిజ్జాలు, ఐస్‌క్రీమ్‌లు, చిప్పులు, సుగర్ కాండీలు, హోమ్ బర్గర్‌లు, పింజల్‌లు, సాస్‌లు, విష రసాయన పరిమళాల- ఆర్ట్ఫిసియల్ ఫ్లేవర్‌లు- శీతల పానీయాలు, వంటలు మెరిసిపోయేందుకు వాడుతున్న రంగులు వంటివి ‘అంగడి తిండి’-జంక్‌ఫుడ్-లో కొన్ని మాత్రమే! పదేళ్లపాటు ఇలా అదే పనిగా ‘అంగడి తిండి’ని ఆరగించిన ఒక యువకుడు ‘అంధుడు’గా మారిపోయాడట. అతని చెవులు వినడం లేదట. ఇటీవల లండన్‌లో వెల్లడైన ఈ దారుణ పరిణామం బజారు తిండి తింటున్నవారికి గొప్ప కనువిప్పు! కొన్ని కోట్ల మంది ఇలా విపరీతంగా మెక్కుతున్నారు, ఆకలి తీర్చుకొనడంకోసం కాదు, కృత్రిమ రుచులను ఆస్వాదించడంకోసం, పొద్దుపోవడంకోసం... మరికొన్ని కోట్ల మంది ఒక పూట భోజనం దొరకక ఆకలితో అల్లాడుతున్నారు. మన దేశంలో మాత్రమేకాదు, అన్ని దేశాలలోను ఇదే రీతి. గత ఏడాది ఆరంభం నాటికి మన దేశం జనాభా నూట ఇరవై ఎనిమిది కోట్ల ఎనబయి అయిదు లక్షలట. వీరిలో దాదాపు ఇరవై కోట్ల మంది ‘పౌష్టికాహారం’ లభించక బలహీనమైపోతున్నారట. ప్రపంచంలో పౌష్టిక ఆహారం లభించని వారి సంఖ్య దాదాపు 82 కోట్లు. ఇందులో 24శాతం మన దేశంలోనే నివసిస్తున్నారని గత ఏడాది వెల్లడైంది. పౌష్టికాహార లోపంతో క్రమంగా బలహీనపడి మరణిస్తున్నవారి వివరాలు భిన్నాభిప్రాయాలకు గురిఅవుతున్నాయి. కానీ అసలు తిండి దొరకక అలమటించి అసువులుబాస్తున్న వారి వివరాలు, అకాల మృత్యువు పాలవుతున్న అభాగ్యుల వివరాలు దొరకడం లేదట! అందరికీ ఆహారం లభించడానికి వీలుగా ప్రభుత్వం దేశమంతటా ‘సార్వజన భోజనశాల’లను ఏర్పాటుచేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయ యాచిక దాఖలయిందన్న సమాచారానికి ఇదంతా నేపథ్యం. ‘జాతీయ స్థూల ఉత్పత్తి,పెట్టుబడుల ప్రవాహం గురించి, ఆహార శుద్ధి ప్రాంగణాల గురించి, అంతర్జాలం ద్వారా ఇంటికి అంగడి వంటలు అరుదెంచడం గురించి, స్టార్ హోటళ్ల గురించి జరిగిపోతున్న ఆర్భాటపు హోరులో అన్నార్తుల ఆక్రందనలు బహుశా వినబడడం లేదు. ఆహార శుద్ధి ప్రక్రియ పేరుతో తయారవుతున్న డబ్బాల తిండిలోను శీతల పానీయాలలోను భారీగా విష రసాయనాలు చేరిపోతున్నాయన్నది తింటున్నవారు పట్టించుకోని వాస్తవం. పౌష్టికాహారం ఏదీ?? ‘ఆహారశుద్ధి’ పేరుతో తయారవుతున్నది పౌష్టికాహారం కాదు..అది శరీర పరిపుష్టికి, ఆరోగ్యవృద్ధికి దోహదం చేయడం. ఆహార శుద్ధి పేరుతో ‘అంగడి తిండి’ తయారవుతోంది. శిశువులకు బాల బాలికలకు గర్భస్థ శిశువులకు గర్భవతులకు, బాలెంతలకు పౌష్టిక ఆహారం అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు జరుపుతున్నాయి..‘అంగన్‌వాడి’వంటి వ్యవస్థలను ఏర్పాటుచేశాయి. ఇదంతా పౌష్టికాహారం కొనుగోలు చేయలేని వారికోసం, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికోసం...!! కానీ పౌష్టిక ఆహారం కొనుగోలు చేయగల ఆర్థికశక్తి ఉన్నవారు డబ్బుపెట్టి చాక్లెట్లు, పిజ్జాలు, శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు కొని తిని జబ్బులు తెచ్చుకొంటున్నారు. ‘‘కొనగలవారికి’’ పౌష్టిక ఆహార ధ్యాస సైతం లేదు...
అందువల్ల అంగడి తిండిని అతిగా తింటున్న సంపన్నులు, మధ్యతరగతివారు పౌష్టికాహార లోపానికి గురిఅవుతున్నారు! వీరు తిండి దొరకనివారు కారు..అతిగా అంగడి తిండి తింటున్నవారు. ఇలా అతిగా తినడం తరతరాల భారత జాతీయ సంప్రదాయానికి విరుద్ధం! ‘‘కఃఅరుక్?’’-ఎవరు ఆరోగ్యవంతుడు? ‘‘హితభుక్....’’- పౌష్టిక ఆహారం తినే వాడు! ‘‘కఃఅరుక్?’’- ఎవరు జబ్బుపడని వాడు? ‘‘మితభుక్...’’- మితంగా తినేవాడు? ‘‘కఃఅరుక్?’’- ఎవరు రోగగ్రస్తుడు కాడు?- ‘‘సమయభుక్....’’- సకాలంలో మాత్రమే తినేవాడు!- అన్నవి తిండికి సంబంధించిన మూడు భారతీయ జీవన సూత్రాలు! ‘‘హిత మిత సమయభుక్...’’- సకాలంలో పౌష్టిక ఆహారాన్ని మితంగా మాత్రమే ఆరగించాలన్నది నాలుగవ సూత్రం, వౌలిక సూత్రం! పద్దెనిమిది ఏళ్లకూ డెబ్బయి ఏళ్లకూ మధ్యఉన్న ఆరోగ్యవంతులు పాటించవలసిన ఆహార నియమం ఇది. శరీర శ్రమ చేయనివారు కేవలం బౌద్ధిక శ్రమ చేసేవారు, ఆధునిక పరిభాషలో సంపన్నులు, మధ్యతరగతివారు, ఉద్యోగులు అధికారులు వంటివారు రోజునకు రెండుసార్లు మాత్రమే తినాలన్నది ఈ వౌలిక ఆహార నియమం.... శరీర శ్రమను నిరంతరం చేసేవారు బాలబాలికలు, రోగులు, వృద్ధులు ఈ నియమాన్ని పాటించనక్కరలేదు. కానీ శరీర శ్రమ చేయని బుద్ధిజీవులు సంపన్నులు మధ్యతరగతివారు ప్రస్తుతం రోజుకు నాలుగుసార్లు తినడం ‘నాగరికం’గా చెలామణి అవుతోంది. ‘‘నాలుగుసార్లు తినని వారు నాగరికం తెలియనివారు... పాత చింతకాయల పచ్చడి ముద్దలు... ఈ యుగంలో ఉండతగని వారు, మాంధాత కాలంనాటి మనుష్యులు’’అన్నది నడుస్తున్న రీతి- స్టయిల్-, ఊపందుకుంటున్న ‘విలాసం’- ఫాషన్-! రోజుకు నాలుగుసార్లు తినే ‘‘నాగరికాన్ని’’మనకు మప్పిపోయిన వారు బ్రిటన్ దురాక్రమణకారులు. ఉదయాన బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం ‘లంచ్’, సాయంత్రం ‘స్నాక్స్’, రాత్రికి డిన్నర్! మన దేశాన్ని రెండున్నర దశాబ్దులకు పైగా దోచుకున్న బ్రిటన్ దొంగలు అధికారులుగా పాలకులుగా చెలామణి అయ్యారు. ‘తేర’గా వచ్చింది కనుక మన సొమ్మును బకాసురులవలె మెక్కారు, కామధేనువు వంటి మన దేశాన్ని వట్టిపోయిన ‘‘ఆవు’’గా మార్చిపోయారు. వారు నిష్క్రమించిన తరువాత ‘‘నాలుగుసార్లు తినే నాగరికం’’ మన దేశంలో మరీ ముదిరిపోయింది.
ఇలా తింటున్నవారికి ‘‘అంగడి తిండి’’అందిస్తున్నది బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు!! ఇలా నాలుగుసార్లు తిని జబ్బులు పెరిగి గుండె జబ్బుల పాలవుతున్న వారికి, పొట్ట్భారం మోయలేక ఏడుస్తున్న ‘‘మోకాళ్ల’’వారికి వాణిజ్య కార్పొరేట్- వైద్యం లభిస్తోంది. ఈ కార్పొరేట్ వైద్యులు, వైద్యశాలలు ప్రభుత్వ ధనాన్ని అంటే ప్రజల సొమ్మును దోచిపారేస్తున్నారు, మందులను ఉత్పత్తివ్యయంకంటె పది రెట్ల ధరలకు దోచుకుంటున్నాయి. ‘‘జంక్ ఫుడ్’’ను తినిపించడం ద్వారా బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు జనాన్ని రోగగ్రస్తులను చేయడం, మళ్లీ ఈ సంస్థలే రోగాలకు చికిత్సలు చేసే పరికరాలను, మందులను, ఈ మందులను సిఫార్సుచేసే దళారీ వైద్యులను సమకూర్చడం...ఇదంతా విష వలయం! ఈ వలయంలో బందీలైనవారు మొదటి ‘అంగడి తిండి’ని ఆ తరువాత రోగాలను మరింత పెంచుతున్న ఔషధాలను ఆరగిస్తున్నారు!! అందువల్ల ‘పౌష్టికాహార లోపం’అన్నది ఆర్థిక సమస్య కాదు, సామాజిక సమస్య, జాతీయ సంస్కృతికి దూరమై ‘విదేశీయ నాగరికం’ మత్తెక్కిన వారి సమస్య! మట్టి తట్టెలు మోస్తున్నవారు, రాళ్లను పిండి చేసినవారు, మడక- నాగలి- దున్ని మాతృభూమిని ‘అన్నపూర్ణ’గా మలచిన వారు, భవనాలను దేశాన్ని నిర్మించినవారు - ఇలాంటి శరీర శ్రమజీవులు రోజునకు మూడుసార్లు తినడం అరిగించుకొని ఆరోగ్యంగా ఉండడం మన దేశపు యుగయుగాల చరిత్ర. విదేశీయ దురాక్రమణ ఈ చరిత్రను చెఱచింది. ‘ప్రపంచీకరణ’, స్వేచ్ఛావాణిజ్యం ‘ఎమ్‌ఎన్‌సి’ల చొఱబాటు ఈ ‘చెడుబాటుకు పరాకాష్ఠ. రోజునకు మూడుసార్లు తిన్నప్పటికీ అరగించుకోగల శరీర శ్రమజీవులకు ‘పౌష్టిక ఆహారం’కొనగల శక్తిలేదు. రోజునకు రెండుసార్లు మాత్రమే తినవలసిన ‘బుద్ధిజీవులు’ నాలుగుసార్లు తిని ‘పౌష్టికాహారాని’కి దూరమైపోతున్నారు, వెరసి కలసి దేశ జనాభాలో అధిక శాతం ‘‘రోగ దోహదకరమైన’’తిండిని తిండున్నారు! ఇదీ విదేశీయ నాగరికత ప్రసాదించిన జీవన వారసత్వం. ఆహారశుద్ధి ప్రక్రియ ద్వారా పౌష్టిక ఆహారం ఉత్పత్తికావడం లేదు. రసాయన విష భోజనం తయారవుతోంది... సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు, ఊదరులు, ఉలవలు వంటి పౌష్టిక ఆహారం తినాలన్నది ప్రధానమంత్రి ఇటీవల చెప్పిన హితవు! కానీ విష శీతల పానీయాలను తాగడం మాని చెరకు రసం, కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు తాగడానికి ఎందరు సిద్ధం? మద్యపానం మానడం ఎందరికి సాధ్యం?