సంపాదకీయం

‘యురేనియం’ చిచ్చు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమల అటవీ ప్రాంతంలో ‘యురేనియం’ ఖనిజం ‘తవ్వకాలకు’ వ్యతిరేకంగా స్థానికులు ప్రధానంగా ‘చెంచులు’ ఉద్యమిస్తుండడం ‘వాణి జ్య ప్రపంచీకరణ’ వ్యవస్థ పట్ల కొనసాగుతున్న నిరసనకు నిదర్శనం. ‘వాణిజ్య ప్రపంచీకరణ’ ఆకుపచ్చతనాన్ని, హరిత వనాలను వనవాసీ ప్రజల బతుకులను హత్యచేయడానికి దాపురించిన ‘రాక్షసి గొడ్డలి’.. నల్లమల ప్రాంతంలోను, కడప జిల్లాలోను ‘యురేనియం’ అనే్వషణ కోసం తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను కేంద్ర ప్రభుత్వం రద్దుచేయాలన్నది ఉద్యమకారుల అభిమతం! నల్లమలలో యురేనియం కోసం అనే్వషణ జరుపడానికి, ఆ ఖనిజాన్ని తవ్వడానికి ఇచ్చిన అనుమతులను కేంద్ర ప్రభుత్వం రద్దుచేయాలని కోరుతూ తెలంగాణ శాసనసభ సోమవారం తీర్మానాన్ని ఆమోదించడానికి గత కొన్ని రోజులుగా ఉద్ధృతవౌతున్న పచ్చదనం పరిరక్షణ ఉద్యమం నేపథ్యం! యురేనియం ‘ఖనిజాన్ని’ లేదా ‘యురేనియం ఇంధన ధాతువుల’ను తవ్వితీయడానికి చొఱబడే పారిశ్రామిక సంస్థలు పచ్చని అడవులను పనికిరాని ఎడారులుగా మార్చివేయడం ఖాయం! ‘ప్రగతి’ పేరుతో జరుగుతున్న ప్రతి కార్యక్రమం పచ్చదనాన్ని పరిమార్చుతుండడం ‘ప్రపంచీకరణ’! పచ్చదనాన్ని ప్రకృతి సమతుల్యాన్ని జీవవైవిధ్యాన్ని వనవాసీ ప్రజల బతుకులను వారి జీవన పద్ధతులను గ్రామీణ జీవన రీతులను పరిరక్షిస్తూనే పారిశ్రామిక ప్రగతిని సాధించడం తరతరాల భారతీయ ఆర్థిక నీతి. ఈ ‘ఆర్థిక నీతి’ని శతాబ్దుల విదేశీయుల దురాక్రమణ ప్రధానంగా బ్రిటన్ వాణిజ్య బీభత్సకారుల ‘పాలన’ ఘోరంగా గాయపరచింది. ప్రపంచీకరణ ఏకంగా భారతీయ ఆర్థిక నీతిని హత్య చేస్తోంది. బ్రిటన్ తస్కర ముష్కర మూకల దురాక్రమణకు విస్తృతి ప్రపంచీకరణ! ‘యురేనియం’ తవ్వకాలు వాణిజ్య బీభత్సకాండకు ఒక ప్రతీక. అసలు సమస్య ‘ప్రపంచీకరణ’... ‘ప్రపంచీకరణ’లో భాగంగా విదేశాల నుంచి ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’- మల్టీ నేషనల్ కంపెనీలు- మన దేశంలోకి చొరబడుతున్నాయి. ఈ ‘చొఱబాటు’ను మన్‌మోహన్ సింగ్ మొదట ఆర్థికమంత్రిగా ఆ తరువాత ప్రధానమంత్రిగా అనుమతించాడు, ప్రోత్సహించాడు. ఈ ‘ఆర్థిక వారసత్వాన్ని’ నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లకు పైగా శిరసావహించి చిత్తశుద్ధితో కొనసాగిస్తుండడం నడుస్తున్న వైపరీత్యం! విదేశాల నుంచి పెట్టుబడులు, పెత్తందార్లు మన దేశంలోకి చొరబడిపోయి వాణిజ్య సామ్రాజ్యాలను ఏర్పాటుచేస్తూనే ఉన్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల రాజకీయ నిర్వాహకులూ పోటీపడి విదేశీయ సంస్థల ‘చొఱబాటు’ను ప్రోత్సహిస్తున్నారు. ద్వారాలకు తలుపులు తొలగించి పారేసి ‘నిర్నిరోధ మార్గం’గుండా అంటే ‘‘ఆటోమాటిక్ రూట్’’గుండా అన్ని రంగాలలోకి విదేశీయ సంస్థలు చొఱబడిపోవడానికి మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం కల్పించిన వీలును ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత వెడల్పు చేస్తున్నాయి.
ప్రభుత్వం అనుమతి లేకుండానే ‘ఆటోమాటిక్ రూట్’ ద్వారా విదేశీయ సంస్థలు అనేక ప్రధాన రంగాలలో పెట్టుబడులను పెట్టవచ్చు! జాతీయ వాణిజ్య ప్రాంగణం ద్వారాల వద్ద కాపలాదారులను తొలగించడం ఈ ‘నిర్నిరోధ మార్గం’. ‘తలుపుల’ను కూడ కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఊడబెరికి పారేశాయి. ‘గవాక్షాల’- కిటికీల గుండా కూడ పెట్టుబడుల మూటలను మోసుకొని వస్తున్న విదేశీయ సంస్థలు చొఱబడి పోతున్నాయి. మన శత్రుదేశమైన చైనా నుంచి కూడ ‘వాణిజ్య సంస్థలు’ చొరబడిపోతుండడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ‘బధిరాంధక’ విధానాలకు నిదర్శనం. ఒక రూపాయి విదేశాల నుంచి వస్తోంది... లాభాల రూపంలో మూడు రూపాయలను విదేశీయ సంస్థలు మన దేశం నుంచి తమ దేశాలకు తరలించుకొనిపోతున్నాయి. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రంగంలో పెట్టుబడి పెట్టినప్పుడల్లా ‘ఇన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయి..’ అన్నది ప్రభుత్వాల ప్రచారం. కానీ ఈ ఒక్కొక్క విదేశీయ సంస్థ చొఱబడినప్పుడల్లా ఎన్ని లక్షల మంది తమ చిట్టిపొట్టి వాణిజ్య పారిశ్రామిక సంస్థలను మూసివేసి నిరుద్యోగులుగా మారుతున్నారు? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ఎందుకని లేదు?? వాల్‌మార్ట్, అమెజాన్ వంటి విదేశీయ సంస్థలు ‘చిల్లర వ్యాపారం’లోను గృహప్రేషణ- హోమ్ డెలివరీ- రంగంలోను చొఱబడడంతో లక్షలాది చిల్లర వ్యాపారుల చిల్లర దుకాణాలు మూతపడతాయన్నది 2012-2013లో భారతీయ జనతాపార్టీ వారు చేసిన ప్రచారం. కానీ ఆ తరువాత 2014 నుంచి ‘్భజపా’ ప్రభుత్వం నడుస్తోంది. ‘వాల్‌మార్ట్’ను, ‘అమెజాన్’ను వెళ్లగొట్టలేదు. ఆ రెండు సంస్థలు అక్రమంగా స్వదేశీయ సంస్థలను దిగమింగుతున్నాయి. చైనా సంస్థల గాలిపటాల - పతంగ్‌లు- చొఱబాటు వల్ల దేశమంతటా తరతరాలుగా ‘గాలిపటాల’ను తయారుచేసిన కుటీర, గృహ పరిశ్రమలు మూతపడ్డాయి. ‘యురేనియం’ తవ్వకాలు ప్రతీక మాత్రమే. అసలు భూతం ప్రపంచీకరణ!
అటవీ ప్రాంతంలోకి ఈ ‘విదేశీయ’ అసుర శక్తులు చొఱబడడం యురేనియంతో మొదలుకాలేదు. నల్లమలలో ‘వజ్రాల’ను అనే్వషించే పేరుతో ‘డీబీర్స్’ అన్న విదేశీయ సంస్థ చొఱబడడానికి యత్నించడం చరిత్ర. తెలుగు నేలలోని అన్ని జిల్లాల్లోను ఇలాంటి ‘చొఱబాటు’ యత్నాలను జనం ప్రతిఘటించారు, ప్రతిఘటిస్తున్నారు. ‘తిరుమల’ పాదాల ప్రాంగణంలోనే ‘ఎఱ్ఱచందనం’ వంటి అమూల్య వృక్ష సంతతి పెరిగే అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసి అక్కడ క్రీడా మైదానాలను నిర్మించే ప్రయత్నానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యవం వహించడం చరిత్ర. ప్రజలు విజయవంతంగా ప్రతిఘటించారు. ఒడిశాలో ‘పోస్కో’ సంస్థవారి ‘ఉక్కు పథకం’ కోసం వేల ఎకరాలలోని వరి పొలాలను, తమలపాకుల తోటలను ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఆ తరువాత ఆ పథకం ఆగిపోయింది. ఒడిశాలోని ‘నియాంగిరి’ మహేంద్రగిరి ప్రాంగణంలో ‘విదేశీయులు’ జరిపిన తవ్వకాల వల్ల వేల కుటుంబాల వనవాసులు నిర్వాసితులయ్యారు. భూగర్భం శుష్కించి కొండవాగులు నీటి మడుగులు ఎండిపోయాయి. ఇదే వ్యథను పడమటి కనుమల ప్రాంతంలో ‘లావాసా’ అన్న విదేశీయ సంస్థ పునరావృత్తం చేసింది. నల్లమలలో ‘యురేనియం’ తవ్వకాలను ఆపించడం విస్తృత ‘ప్రపంచీకరణ’ వైపరీత్యాన్ని నిర్మూలించడంలో ఒక అంశం మాత్రమే! విదేశీయ వాణిజ్య సంస్థలను దేశం నుండి వెళ్లగొట్టాలని కోరుతూ శాసనసభలు తీర్మానాలు చేయగలవా? ప్రగతి అంటే పరిశ్రమలు మాత్రమే కాదు పాడిపంటలు కూడ! పాడి పంటలు నిజమైన ప్రగతి! పారిశ్రామిక ఉత్పత్తులు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. అటవీ ఉత్పత్తులు ప్రాణాలు పోషిస్తున్నాయి, జీవ వైవిధ్య పరిపుష్టిని కలిగిస్తున్నాయి. ‘డెవలప్‌మెంట్’- అభివృద్ధి- అని అంటే చెట్లను నరికి భూమిని ఎడారిగా మార్చి సిమెంటు కట్టడాలను నిలబెట్టడం మాత్రమే కారాదు. పుట్టలూ, తేనెపట్టులూ, చెట్లతో నిండిన కొండ గుట్టలూ, చెఱువు గట్టులూ కూడ! నల్లమల అడవి కృష్ణానదికి ఇరువైపులా విస్తరించి ఉన్న సతతహరిత ప్రాంగణం, ప్రకృతి మాత స్వరూపం, లక్షల కుటుంబాల చెంచులకు ఇతర వనవాసీ ప్రజలకు స్వగృహం, ఓషధీ సమూహాల అమృతభాండం.. స్వచ్ఛతకు ఆలవాలం! ‘కట్టెలు కొడుతుండిన ఒక గిరిజనుడు పొరపాటున గొడ్డలి తగిలి గాయపడినాడు, కాలిపాదం సగం తెగింది. రక్తం.. భరించలేని బాధ.. సూర్యుడు అస్తమిస్తున్నాడు. క్షతగాత్రుడు డొంకలలో, పొదలలో కాళ్లు ఈడ్చుకుంటూ చీకటిలో ఇల్లు చేరాడు. భార్యను దీపం తెమ్మన్నాడు. తెగిన పాదానికి కట్టుకట్టుకోవాలి.. కానీ దీపం వెలుగులో కనిపించిన దృశ్యం ఆ వనజనుణ్ని సంభ్రమాశ్చర్య చకితుడిని చేసిందట. గొడ్డలి తెంపిన గాయం పూర్తిగా మానిపోయింది, నొప్పి కూడ తగ్గిపోయింది. పాదం యథావిధిగా అతుక్కొని ఉంది. రక్తపు మరకలు మాత్రమే కనిపించాయి. ఈ వాస్తవ ఘటన వంద ఏళ్ల పూర్వం జరిగింది. అదీ నల్లమల ఔషధం...
‘యురేనియం’ను పచ్చని అడవులలో కాదు అనే్వషించవలసింది... ఎడారులలోను గడ్డిమొలవని రాతి గుట్టలలోను తవ్వుకోవచ్చు! రామసేతువు ప్రాంతంలో ‘్థరియం’ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. థోరియంను తవ్వితీసి విద్యుత్ ఉత్పాదన కేంద్రాలకు వాడవచ్చు. బొగ్గును ఉపయోగించడం ద్వారా సౌరశక్తిని వినియోగించడం ద్వారా మొత్తం ప్రపంచానికి మన దేశం విద్యుచ్ఛక్తిని సరఫరా చేయవచ్చు. ‘సౌరశక్తి దేశాల కూటమి’- సోలార్ అలియన్సీ-కి నాయకత్వం వహిస్తున్న మన దేశం యురేనియం వాడకాన్ని క్రమంగా తగ్గించి వేయవచ్చు.. అటవీ హరిత శోభలను పెంపొందించుకోవచ్చు...