సంపాదకీయం

చైనా ‘గతి తర్కం..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామ్యవాద నియంతృత్వం- కమ్యూనిస్ట్ డిక్టేటర్‌షిప్- పెట్టుబడి నియంతృత్వం- కాపిటలిస్ట్ డిక్టేటర్‌షిప్-గా విపరిణామగతిని పొందడం డెబ్బయి ఏళ్ల చైనా చరిత్ర. ఫ్యూడలిజమ్, బూర్జువాల పెత్తనం వంటి పదజాలం ‘కాపిటలిజమ్’ను నిందించడానికి శతాబ్దికి పైగా కమ్యూనిజమ్ సమర్థకులు,ప్రచారకులు వాడిన పదజాలం. ‘కాపిటలిజమ్’ ప్రజల - ప్రొలిటేరియట్ -కు శత్రువన్నది కమ్యూనిస్టులు జరిపిన ప్రచారం. అందువల్ల పెట్టుబడిదారుల- హావ్స్-కు, పెట్టుబడిదారులు కాని వారి - హావ్ నాట్స్-కు మధ్య కాలక్రమంలో ‘వర్గ సమరం’- క్లాస్‌వార్- జరుగక తప్పదన్నది కమ్యూనిస్టులు చేసిన నిర్ధారణ. ‘ఈ సమరం ఫలితంగా ‘పెట్టుబడి పెత్తందారుల’ వ్యవస్థ నశించిపోతుంది, నిర్మూలనకు గురిఅవుతుంది. పెట్టుబడి పెత్తందారుల వ్యవస్థ- కాపిటలిస్ట్ సొసైటీ- అంతరించిపోయి ప్రపంచమంతటా ‘సామ్యవాద వ్యవస్థ’- కమ్యూనిస్ట్ సొసైటీ- ఏర్పడడం అనివార్య పరిణామ క్రమమన్నది క్రీస్తుశకం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరానికి పూర్వం దశాబ్దులపాటు కమ్యూనిస్టులు చేసిన ప్రచారం. ‘కమ్యూనిజమ్’, ‘కాపిటలిజమ్’ ఇలా ఒకదానికొకటి వ్యతిరేకమని ఈ రెండూ పరస్పరం బద్ధశత్రువులని కమ్యూనిస్టులు నిర్ధారించడం చరిత్ర. కానీ ‘కమ్యూనిజమ్’ ‘కాపిటలిజమ్’ రెండూ ఒకటేనన్నది డెబ్బయి ఏళ్ల చైనా అంతర్గత విపరిణామక్రమానికి ఆధ్వర్యవం వహించిన ‘కమ్యూనిస్టుపార్టీ’వారు నిరూపించిన చారిత్రక వాస్తవం. చైనా ప్రస్తుతం అతిపెద్ద ‘పెట్టుబడుల’ దేశం, పెట్టుబడిదారీ- కాపిటలిస్ట్- సమాజం! ఇదంతా ‘కమ్యూనిజమ్’ అన్నది డెబ్బయి ఏళ్ల ఉత్సవాల సందర్భంగా చైనా అధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీ అధినేత ఝీజింగ్ చెపుతున్న మాట, పదహైదు ఏళ్లకు పైగా చైనా కమ్యూనిస్టుపార్టీ చెబుతున్నమాట! ‘ప్రపంచీకరణ’ మొదలైన తరువాత ‘కాపిటలిజమ్’ తన పేరును ‘మార్కెట్ ఎకానమీ’- స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ-గా మార్చుకొంది. అందువల్ల ‘కాపిటలిజమ్’అని అంటే ‘మార్కెట్ ఎకానమీ’! చైనా అతి పెద్ద ‘మార్కెట్ ఎకానమీ’- కాపిటలిస్ట్ సొసైటీ-గా ఏర్పడి ఉండడం ఇరవై ఆరేళ్ల ‘వాణిజ్య ప్రపంచీకరణ’ ఫలితం! 1949లో చైనా ‘కమ్యూనిస్ట్’దేశంగా అవతరించింది. 2019లో ఈ చైనా ఇలా ‘కాపిటలిస్ట్’-పెట్టుబడుల పెత్తందార్ల- దేశంగా ప్రపంచంలోని అన్ని దేశాలనూ హడలెత్తిస్తోంది, వాణిజ్య దురాక్రమణను కొనసాగిస్తోంది!!
పెట్టుబడిదారుల వ్యవస్థను ‘కూల్చిన’ బోల్షవిక్కులు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో రష్యాలో సామ్యవాద- కమ్యూనిస్టు- నియంతృత్వ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఆ తరువాత మరో పదునాలుగు ఇరుగుపొరుగు దేశాలను ‘‘కలుపుకొని’’ సోవియట్ సోషలిస్టు యునైటెడ్ రిపబ్లిక్కుల’’- యుఎస్‌ఎస్‌ఆర్-ను ఏర్పాటుచేశారు. ఈ ‘సోవియట్’ రష్యా ప్రభావంతో తూర్పు ఐరోపాలోని అనేక దేశాలలో ‘కమ్యూనిస్టు ఏకపక్ష’ నియంతృత్వ వ్యవస్థలు ఏర్పడినాయి. పెట్టుబడిదారీ- కాపిటలిస్ట్- దేశాలలో ప్రజల మధ్య సమానత్వం లేదు. కొందరు పెట్టుబడిదారులు మిగిలిన అందరినీ దోచుకుంటారు. ‘ఈ దోపిడీని తుదముట్టించి, సర్వజన సమానత్వాన్ని, సర్వజన సౌఖ్యాన్ని సాధించడం కమ్యూనిజమ్ లక్ష్యం..’ అన్నది జరిగిన ప్రచారం. కానీ ప్రభుత్వ నిర్వాహకులు కొత్త పెట్టుబడిదారులుగా, దోపిడీదారులుగా అవతరించడం కమ్యూనిస్టు దేశాలన్నింటిలోను జరిగిన విపరిణామక్రమం. ఫలితంగా నాలుగు దశాబ్దుల కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థలపై తూర్పు ఐరోపా దేశాల ప్రజలు 1989లో ప్రజలు తిరుగుబాటుచేసి కమ్యూనిస్టు దోపిడీ వ్యవస్థలను తుదముట్టించారు. 1991లో సోవియట్ రష్యాలో కూడ జనం ఉద్యమించి ‘కమ్యూనిస్టు’వ్యవస్థను తొలగించారు. సోవియట్ యూనియన్ యథాపూర్వకంగా పదిహేను దేశాలుగా విడిపోయింది...
ఇలా ఆయా దేశాలలో జనం తిరగబడి ‘కమ్యూనిస్టు’నియంతృత్వ రాజ్యాంగ వ్యవస్థలను నిర్మూలించారు. దీనినుండి గుణపాఠం గ్రహించవలసిన చైనా కమ్యూనిస్టులు గ్రహించలేదు. 1980లో కమ్యూనిస్టు వ్యవస్థకు వ్యతిరేకంగా చెలరేగిన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని కమ్యూనిస్టు ‘పాలకులు’ రాక్షసంగా అణచివేశారు. ఈ ఉద్యమం సందర్భంగా చైనా రాజధాని బీజింగ్‌లోని ‘తియానన్‌మన్ కూడలి’లో కమ్యూనిస్టు ప్రభుత్వం జరిపించిన మారణకాండ దశాబ్దుల రక్తసిక్త చరిత్రలో మరో ఘోరమైన పైశాచిక ఘట్టం. సైనిక వాహనాల చక్ర ఘట్టనం కింద పడి వందలాది విద్యార్థులు నలిగిపోయారు. అంతకు పూర్వం, ఆ తరువాత కూడ ‘కమ్యూనిస్టుపార్టీ’ వారు లక్షల మందిని హత్యచేయడం ప్రపంచ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన చరిత్ర. కమ్యూనిజాన్ని వ్యతిరేకించిన వారిని మాత్రమేకాక ‘కమ్యూనిస్టు పార్టీ’లోని అసంతుష్ట కార్యకర్తలను, అధికార స్పర్థకు సంబంధించిన ప్రత్యర్థులను కమ్యూనిస్టు నియంతలు హత్యచేయించారన్నది చరిత్ర తిలకించిన వాస్తవం. ఈ కమ్యూనిస్టు ప్రభుత్వ బీభత్సకాండకు దశాబ్దుల తరబడి రష్యాలో కోటిన్నర మంది, చైనాలో రెండు కోట్ల మంది బలైపోయారన్నది జరిగిన ప్రచారం. ఇంత జరిగిన తరువాత చైనా కమ్యూనిస్టుపార్టీవారు స్వయంగా కమ్యూనిస్టు ఆర్థికనీతిని నిర్మూలించారు. రష్యాలోవలె, తూర్పు ఐరోపాలోవలె ప్రజలకు వారు ఈ అవకాశం ఇవ్వదలచుకోలేదు. సంపద మొత్తం సమష్టి సమాజానికి చెందినదన్నది కమ్యూనిస్టులు చేసిన ప్రచారం. ఆచరణలో అది రూపాంతరం చెందింది. సంపద మొత్తం ప్రభుత్వానికి చెందడం ఈ ఆచరణ వైపరీత్యం. అందువల్ల ప్రతి ‘కమ్యూనిస్టు దేశం’లోను ప్రభుత్వం ‘ఏకైక యజమాని’గా అవతరించడం చరిత్ర. ఒక శాతం పెట్టుబడిదారులు తొంబయి తొమ్మిది శాతం ఇతరులను దోచుకోవడం ‘కాపిటలిస్ట్’సమాజం స్వభావమన్నది ‘కమ్యూనిస్టులు’ప్రచారం చేసిన ‘సిద్ధాంతం’! ఒకే ఒక పెట్టుబడిదారుడు అంటే నియంతృత్వ ప్రభుత్వం దేశ ప్రజలందరినీ దోపిడీ చేయడం 1991వరకూ కమ్యూనిస్టు ఏకపక్ష వ్యవస్థలలో నడచిన జీవన వాస్తవం. అందువల్ల ‘కాపిటలిజమ్’, ‘కమ్యూనిజమ్’ ఒకే బొమ్మకున్న రెండు రూపాలన్నది చరిత్ర ధ్రువపరచిన వాస్తవం. ఏ రూపమైతే ఏమి? అని భావించిన చైనా ‘కమ్యూనిస్టులు’ సామ్యవాద ఆర్థికనీతిని తొలగించి పెట్టుబడిదారీ రీతిని ప్రవేశపెట్టారు! ఆస్తిపై, సంపదపై వ్యక్తిగతమైన హక్కులు ఉండరాదన్నది ‘కమ్యూనిస్టులు’ ప్రచారం చేసిన సిద్ధాంతం. వ్యక్తిగతమైన ఆస్తిహక్కును కల్పిస్తూ చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం 2003 మార్చిలో చట్టం చేసింది! అనేక మంది పెట్టుబడిదారులున్న ‘‘పెట్టుబడిదారీ వ్యవస్థ’’ను ధ్వంసం చేసి ఒకేఒక పెట్టుబడిదారుడు - ప్రభుత్వం- సర్వం నిర్వహించే ‘సామ్యవాద వ్యవస్థ’ 1949లో ఏర్పడడం మొదటి దశ.. అనేక మంది పెట్టుబడిదారులు ఉండే ‘పెట్టుబడిదారీ వ్యవస్థ’ 2003లో పునరుద్ధరణ పొందడం మలి దశ! ఇదీ ఏడు దశాబ్దుల చైనా చరిత్ర... ప్రస్థాన పరిక్రమలో ఇదీ ‘‘గతి తర్కం...’’, సైద్ధాంతిక దుర్గతి తర్కం!
‘కమ్యూనిస్టు’వ్యవస్థకు చెందిన ఇదంతా ఆర్థికం... రాజకీయం కూడ ఉంది. ఈ ‘‘ఆర్థిక సమానత్వ’’ సాధనకు కృషిచేసే ‘‘ప్రజల ప్రభుత్వం’’ కమ్యూనిస్టుపార్టీ నియంతృత్వం కావడం ఈ రాజకీయం. ‘కమ్యూనిస్టు’ ఏకపక్ష నియంతృత్వ వ్యవస్థలలో ‘బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ’లలోవలె ఎన్నికలలో వివిధ రాజకీయ పక్షాలు పోటీచేసే ప్రసక్తిలేదు. ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా ‘కమ్యూనిస్టుపార్టీ’వారు నిరంతరం పరిపాలించడం ఈ రాజకీయం. కమ్యూనిస్టు పార్టీ తప్ప మరో ‘పార్టీ’ అధికారాన్ని పొందే అవకాశమే లేదు! ‘కమ్యూస్టు పార్టీ’ తప్ప మరో రాజకీయ పార్టీ ఏర్పాటయ్యే అవకాశమే లేకపోవడం మరింత వౌలికమైన రాజ్యాంగ వైపరీత్యం! కమ్యూనిస్టు ఆర్థిక నీతిని విడనాడిన చైనా కమ్యూనిస్టు పార్టీవారు ‘కమ్యూనిస్టు’రాజకీయ రీతిని మాత్రం యథాతతంగా కొనసాగిస్తున్నారు. కమ్యూనిస్టు నియంతృత్వం, కాపిటలిస్టు నియంతృత్వంగా ‘రూప పరిణామం’ చెందిన తీరు ఇదీ..