సంపాదకీయం

సంరక్షక శక్తి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరం కరం కలసి కలసి
కాంతి వ్యూహవౌతున్నది,
కణం కణం కలసి ‘విశ్వ
గణం’ విస్తరిస్తున్నది..
చినుకు చినుకు చేరి చేరి
సరిత పరుగుతీస్తున్నది,
చేయి చేయి చెలిమి చేసి
‘శక్తి’ అవతరిస్తున్నది!
శక్తి స్వభావం సంరక్షణం... సృష్టిగతమైన శక్తి సృష్టిని రక్షిస్తోంది, పెంపొందిస్తోంది! సమాజ స్థితమైనశక్తి సమాజాన్ని కాపాడుతోంది, నడిపిస్తోంది. తుది, మొదలు లేని విశ్వవ్యవస్థకిది సహజ లక్షణం! సహజత్వం వికృతికి గురికావడం కావడం ‘అపవాదం’ మాత్రమే! ‘వికృతి తొలగిపోయి’ ప్రకృతి యథా పూర్వకంగా ప్రస్ఫుటించడం సహజ పరిణామ క్రమం. ‘వికృతి’ తాత్కాలికం ‘ప్రకృతి’శాశ్వతం! వెలుగు శాశ్వతం, గ్రహణం- చీకటి- తాత్కాలికం! స్వచ్ఛత శాశ్వతం, కాలుష్యం తాత్కాలికం! స్వరూపం శాశ్వతం, ‘క్షతి’-గాయం- తాత్కాలికం! స్వరూప పరిరక్షణం స్వభావ వికాసం ‘ప్రకృతి’... ‘క్షతి’-గాయం- కలగడం, భావ సాంకర్యం ఏర్పడడం వికృతి!! వికృతిని, చీకటిని, కాలుష్యాన్ని, ‘క్షతి’ని తొలగించి ప్రకృతిని, వెలుగును, స్వచ్ఛతను, స్వరూప స్వభావాలను పునరుద్ధరించడానికి అనాదిగా అనంతంగా కొనసాగుతున్న కృషి సంస్కృతి! సృష్టి సహజమైన ఈ సంస్కృతి హైందవ జాతీయ జీవన స్థితం కావడం యుగయుగాల చరిత్ర! సృష్టిగతమైన స్వభావం సమాజంలో ప్రస్ఫుటించడం సహజ పరిణామక్రమం. ఈ వాస్తవాన్ని గుర్తించిన భారతీయులు అనాదిగా ‘శక్తి’ని పరిరక్షణకోసం పరిపుష్టికోసం సమన్వయంకోసం, వికాసంకోసం వినియోగించడం కూడ చరిత్ర! ఈ వాస్తవాన్ని గ్రహించలేని కొన్ని ప్రపంచ జన సముదాయాలవారు శక్తిని విధ్వంసంకోసం, దురాక్రమించడంకోసం, దోపిడీ చేయడం, అత్యాచారాలు జరపడంకోసం వినియోగించారు, సహస్రాబ్దుల చరిత్రను హత్యలతో, బీభత్సకృత్యాలతో రక్తసిక్తం చేశారు! శక్తిమంతుడు గెలుస్తున్నాడు, శక్తిహీనుడు ఓడిపోతూనే ఉన్నాడు. అందువల్ల వైయక్తిక శక్తులను సంఘటితం చేయడం ద్వారా ‘సమష్టికార్యశక్తి’ని నిర్మించడం మాత్రమే విజయానికి ప్రాతిపదిక-అన్నది లక్షల ఏళ్ల, యుగయుగాల చరిత్ర నేర్పుతున్న పాఠాలు. అయితే ఈ ‘సంఘటిత శక్తి’ ప్రకృతిని నిలబెట్టడానికి కృషిచేయగలదా? లేక ‘ప్రకృతి’ని ధ్వంసం చేసి ‘వికృతి’ని వ్యాప్తిచేస్తుందా?? అన్నది చరిత్ర తిలకించిన వాస్తవం! ‘ప్రకృతి’ని పరిరక్షించగల శక్తి ‘సజ్జన శక్తి’, సైనికుని ఆయుధం వంటిది! ‘ప్రకృతి’ని పరిమార్చడానికి వికృతిని ప్రతిష్ఠించడానికి విరుచుకుపడే శక్తి ‘దుర్జనశక్తి’, హంతకుని చేతి ఆయుధం వంటిది! భారత జాతీయశక్తి అనాదిగా ప్రకృతిని పరిరక్షించింది, మానవీయ సంస్కారాలను వికసింపచేసింది. వైవిధ్యాల మధ్య వైరుధ్యంలేదన్న వాస్తవాన్ని వెలిగించింది, సకల వైవిధ్యాలను పరిరక్షించింది, వైవిధ్యాల మధ్య ఉన్న సమన్వయాన్ని పెంపొందించింది, సర్వవైవిధ్య సంరక్షక వ్యవస్థగా భారతీయ సంస్కృతి విలసిల్లింది, హైందవ జాతి వికసించింది! విజయదశమి ఆద్యంత రహితమైన ఈ సహజ శక్తికి, సనాతన శక్తికి ప్రతీక... భారతీయుని జీవనప్రస్థాన పతాక...
బలం ఉపాస్వ- శక్తిని ఆరాధించు- అన్నది భారతీయ జీవన వేదం. భౌతిక శక్తి, బౌద్ధిక శక్తి, ఆర్థిక శక్తి, సాంస్కృతిక శక్తి సమాంతరంగా వికసించడం భారత జాతీయ చరిత్ర. భౌతిక ఆర్థికశక్తి సముత్కర్ష- సర్వశ్రేష్ఠమైన ‘ప్రగతి’. బౌద్ధిక మానసిక సాంస్కృతికశక్తి ‘సుగతి...’ ప్రగతి, సుగతి రెండు చక్రాలు కావడం హైందవ జాతీయ జీవన రథ ప్రస్థాన క్రమం! భౌతిక ప్రగతిని విశ్వశ్రేయస్సునకు వినియోగించడం సుగతి! భౌతిక ప్రగతిని కేవలం తమ హితానికి మాత్రమే వినియోగించడం జంతు లక్షణం. భౌతిక ప్రగతిని ఇతర జాతులను, దేశాలను దోచుకొనడానికి దోపిడీ చేయడానికి వినియోగించడం పైశాచిక బీభత్సం, దుర్గతి!! భారతీయ సమాజం ఈ సుగతి... అందువల్లనే భరతమాత విశ్వగురువైంది! భారతదేశం వెలుపల విజృంభించిన కొన్ని జాతులు ఇతర దేశాలకు, జాతులకు వ్యతిరేకంగా పైశాచిక బీభత్సకాండను కొనసాగించాయి, ‘‘విశ్వవిజేతలు’’కావడానికి విఫలయత్నం చేశాయి. క్రీస్తునకు పూర్వం ‘రోము నాగరికతాశక్తి’ గ్రీసు నాగరికతను, యూదు నాగరికతను ధ్వంసంచేయడం ఐరోపా చరిత్ర, పశ్చిమ ఆసియా చరిత్ర. క్రీస్తుశకం మూడవ నాలుగవ శతాబ్దులలో ఈ ‘రోము నాగరికత శక్తి’ని క్రైస్తవ మతం ధ్వంసం చేసింది. క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్దినుంచి, అరేబియాలో పుట్టలు పగిలిన ‘జిహాదీ’ బీభత్సకారులు వివిధ ఖండాలలో ఇస్లాం మతేతరులను ఊచకోత కోయడం చరిత్ర. పదహారవ శతాబ్దిలో అమెరికాను ముంచెత్తిన ఐరోపా జాతులు అమెరికాలోని అనాది జాతి- రెడ్ ఇండియన్‌ని ధ్వంసంచేశారు. ఈ విధ్వంస భూమికపై ఐరోపా జాతులు కలసిన ఒక కొత్త సంకర జాతి ఏర్పడింది. ఆస్ట్రేలియాలో సైతం బ్రిటన్‌వారే ఇదే బీభత్స చరిత్రను పునరావృత్తం చేశారు... అందువల్ల ‘శక్తి’వికసించడంతోపాటు ‘శక్తి’స్వభావం ఏమిటన్నది కూడ గ్రహించదగిన పాఠం.
భారతీయులు అత్యంత శక్తిమంతులై ఉండిన సమయంలోను, ఉన్న సమయంలోను కూడ విదేశాలపై దాడి చేయలేదు, విధ్వంసం సృష్టించలేదు. హైందవ జాతి తన శక్తిని అన్నం పెట్టడానికి, శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి, ప్రపంచ ప్రజలకు మానవీయ సంస్కారాలను నేర్పించడానికి వినియోగించింది, హత్యలు చేయలేదు. విదేశీయ హంతకులను సహస్రాబ్దులపాటు నిరోధించింది, ప్రతిఘటించింది, భారత జాతీయశక్తి ఇలా స్వీయరక్షణకు విశ్వశ్రేయస్సు సాధనకు కృషిచేసింది, దురాక్రమించిన శక్తి కాలేదు! క్రీస్తునకు పూర్వం ఐదవ శతాబ్దిలో ఈజిప్టు- మిశ్రీ- జాతీయులు మన దేశంపై దురాక్రమణకు పూనుకున్నారు. మన పడమటి సరిహద్దుల సమీపంలోని ‘తక్షశిల’ మహా విద్యాలయంలోకి చొరబడినారు, కానీ వారు విధ్వంసకాండకు పూనుకొనడం వారిపై ‘పిడుగుల జడి’ కురవడం సమాంతర పరిణామాలు. వేల మంది దురాక్రమణకారులు ‘మిడతల’వలె మాడిపోయారు. మిగిలిన వేల మంది పారిపోయారు! దండెత్తి వచ్చిన ఈజిప్టు దుండగులను ఇలా తిప్పికొట్టినవారు తక్షశిల మహావిద్యాలయ ప్రాంగణంలోని అధ్యాపకులు, విద్యార్థులు! ఇదీ భారతీయ శక్తి! కానీ పారిపోతుండిన ఈజిప్టు సైనికులను భారతీయులు హత్యచేయలేదు... ఇదీ భారతీయ శక్తి! ఈ చరిత్రను ఈజిప్టువారు వ్రాసుకున్నారు... గ్రీసు దేశీయులు ఈ చరిత్రను చదివారు. అందువల్లనే క్రీస్తునకు పూర్వం మన దేశంలోకి చొరబడడానికి విఫలయత్నం చేసిన ‘అలెగ్జాండర్’అన్న గ్రీసు బీభత్సకారుడు తక్షశిల వైపు వెళ్లడానికి సాహసించలేదు, ‘‘ఓడిపోతానన్న’’ భయంతో వెనుదిరిగిపోయాడు!!
ఇలా దురాక్రమించడానికికాక, దురాక్రమించిన దుర్జనులను నిరోధించడానికి మాత్రమే అనాదిగా హైందవ జాతి తన శక్తిని ఉపయోగిస్తోంది! కృతయుగంలో పైశాచిక జరిపిన ‘‘మహిష’’ దానవ మూకలను భారతీయ మాతృశక్తి నిర్మూలించగలిగింది. త్రేతాయుగంలో దిలీపుడు, వసిష్ఠుడు, భృగురాముడు, రఘురాముడు వంటి జాతీయ మహాపురుషులు, ‘ద్వాపరం’లో యదుకుల కృష్ణుడు, పాండవులు వంటివారు చెలరేగిన దుర్జన శక్తులను నిరోధించగలగడం భారతీయ చరిత్ర. కలియుగంలో పుష్యమిత్రుడు, విక్రముడు, ఛత్రపతి శివాజీ, నేతాజీ సుభాస్ చంద్రబోస్ వంటి వారు స్వజాతీయ శక్తికి జీవన రూపాలు... ఈ భారత జాతీయశక్తి సంస్కారం ఒక అస్త్రం, ఒక శస్త్రం...
పాలు తాగు పసిపాపకు
పలుకు నేర్పె సంస్కారం,
పురుషుని పురుషోత్తమునిగ
తీర్చిదిద్దె సంస్కారం...
తరతరాల ‘విశ్వగురువు’
ప్రసరించిన సంస్కారం
ధరణికి నడవడిదిద్దిన
హైందవ శక్తికి లక్ష్యం...