సంపాదకీయం

బలిగొన్న ప్రమత్తత...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం-ఐఎస్‌ఐఎస్- జిహాదీ ముఠాకు చెందిన ఉగ్రవాది అమెరికాలోని ఫ్లోరిడాలో ఆదివారం జరిపిన భయంకర హత్యాకాండ అంతర్జాతీయ బీభత్సకాండలో భాగం. గతంలో అల్‌ఖాయిదా, తాలిబన్ తండాలు ఇటీవల బొకోహరామ్ వంటి ముఠాలు చెలరేగాయి. ఐఎస్‌ఐఎస్ తన కలాపాలను మొదలుపెట్టిన తరువాత ఈ ముఠా అంతర్జాతీయ బీభత్సకాండకు కేంద్ర బిందువైంది. సిరియాలోను ఇరాక్‌లోను ఈ ముఠా జరుపుతున్న పోరాటం ముసుగు మాత్రమే. దీని వికృత పైశాచిక ముఖం ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలోను తొంగిచూస్తుండడడం అసలు సమస్య. బంగ్లాదేశ్‌లో హిందువులను హత్య చేస్తున్నవారు, ఐరోపాలో పేలుళ్లను జరుపుతున్నవారు అమెరికాలో పొంచివున్నవారు, తూర్పు ఆసియా దేశాలకు సైతం విస్తరించిపోయారు. అమెరికాలో బీభత్సకాండ జరుపుతున్న సమయంలోనే మనదేశాన్ని బెదిరిస్తూ ఐఎస్‌ఐఎస్ వారు ఒక లఘుచిత్రాన్ని విడుదల చేశారు. జిహాదీ ఉగ్రవాదం నిరంతరం విస్తరించిపోతున్న భయంకర వాస్తవానికి ఇది మరో దారుణమైన ఉదాహరణ. అమెరికాలోని ఫ్లోరిడాలోని ఒక నైట్ క్లబ్‌లో కాల్పులు జరిపిన ఒమర్ మీర్ సిద్దికీ మతీన్ అనే దుర్మార్గుడు యాబయి మందిని హత్య చేయడం భద్రతా వ్యవస్థ భగ్నవౌతున్న తీరుకు సైతం మరో ఉదాహరణ. ఒకే వ్యక్తి యాబయిమందిని చంపి మరో యాబయి మందిని తీవ్రంగా గాయపరిచేవరకు భద్రతా దళాలు నిరోధించలేకపోవడమే విస్మయకరమైన వ్యవహారం...సహస్రాక్షునికి సైతం అంధత్వం అలముకొంటుందన్నది భారతీయ సూక్తి. ఈ సూక్తి అమెరికా వంటి ఆర్భాటపు భద్రతా వ్యవస్థకు అన్వయం కావడం విచిత్రం.. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ అఫ్ఘానీ సంతతి జిహాదీ ప్రభుత్వేతర పారిశ్రామిక భద్రతా దళాలలో పనిచేశాడట. అందువల్ల ఇతగాడు జిహాదీ కాడన్న అనుమానం భద్రతాదళాలకు కలిగివుండకపోవచ్చు..అందువల్ల ఫ్లోరిడా రాష్ట్రంలోనే పుట్టి పెరిగిన ఈ హంతకుడు అదే రాష్ట్రంలోని ఓర్లాండో పట్టణ శివారులోని ఈ విలాస వాటికలోకి చొరబడి ఉండవచ్చు. కానీ కాల్పులు మొదలైన తరువాత వందమందిపై గుండ్ల వర్షం కురిసే వరకు రేడియో కార్లలో గస్తీ తిరిగే పోలీసులుకాని, ప్రత్యేక దళాలు కాని దుండగుడిని నిరోధించలేకపోవడమే దిగ్భ్రాంతికరం.. కాల్పులు జరపడానికి ముందుగా ఇతగాడు అమెరికాలోని అధికార సహాయ వ్యవస్థకు సంబంధించిన అత్యవసర సేవా విభాగపు టెలిఫోన్ నంబరుకు ఫోన్ చేసి తాను ఎవ్వరో వివరించాడట. తాను ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం-ఐఎస్‌ఐఎస్-అధిపతి అబూబకర్ అల్ బగ్దాదీకి విధేయుడనని అమెరికా ప్రభుత్వ సంస్థకే ఇతగాడు చెప్పగలిగాడు. అలా హంతకుడే పోలీసులకు బీభత్సకాండ అరంభంలో తెలియజేయడం ఐఎస్‌ఐఎస్ చొరబాటునకు విశృంఖల విస్తృతికి నిదర్శనం. యాబయిమంది ప్రాణాలు బీభత్సపు తోడేలు పాలు కావడం చరిత్ర గుండెలను గునపాలతో గుచ్చిన ఘటన...
సిరియాలోను, ఇరాక్‌లోను ఐఎస్‌ఐఎస్‌తో తలపడిన అన్ని దేశాలలోను దారుణ మారణకాండను జరుపడానికి ఈ ముఠా యత్నిస్తోంది. రష్యా, ఐరోపా దేశాలలో జరిపిన దాడులు ఇందుకు నిదర్శనం. ఈ ఘటనల తరువాత నైనా అమెరికా భద్రతా యంత్రాంగం మరింత జాగ్రత్త పడి ఉండాలి. అనుకోని చోట గోదూకడం తోడేలు ఎత్తుగడ. ఊహించని చోట దాడిచేయడం ఉగ్రవాదుల వ్యూహం... అందువల్ల ఐఎస్‌ఐఎస్ హంతకులు తమదేశంలో బీభత్స కలాపాలకు పూనుకునే ప్రమాదం ఉందని స్పష్టమైపోయిన తరువాతనైనా అమెరికా ప్రభుత్వపు నిఘా విభాగాలు మరింత జాగ్రత్తపడి ఉండాలి. నిర్లక్ష్యం, అలసత్వం, ప్రమత్తత, నిర్లిప్తత, మొదలైన బలహీనతలు అన్ని దేశాలలోని పోలీసు వ్యవస్థలకు వలెనే అమెరికా పోలీసులకు కూడా సమాన లక్షణమన్నది ఇలా అనేకసార్లు రుజువైంది. అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో శే్వతజాతీయ దురహంకారులకు, నీగ్రోలకు మధ్య నిరంతరం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. విదేశీయులను పనికట్టుకొని హత్యలు చేసే ముఠాలు కూడ అమెరికాలో విస్తరించిపోతున్నాయి. అంతర్జాతీయ జిహాదీ ఉగ్రవాదులను మాత్రమే కాదు, తమ దేశంలోని జాతి దురహంకార బీభత్సకారులను సైతం నిరోధించలేకపోవడం అత్యాధునిక ఆర్భాటపు పద్ధతులను వ్యూహాలను వంట పట్టించుకున్న అమెరికా భద్రతా దళాల చరిత్ర... అందువల్ల న్యూయార్క్ తరహా పోలీసు వ్యవస్థను, లండన్ స్కాట్‌లాండ్ యార్డ్ వంటి భద్రతా వ్యవస్థను మనదేశంలో నెలకొల్పాలని ఉవ్విళ్లూరుతున్న వారు గ్రహించవలసిన పాఠం ఇది. హైదరాబాద్‌లో కావచ్చు, అమరావతిలో కావచ్చు, భద్రతావ్యవస్థ మన అవసరాలకు అనుగుణంగా మాత్రమే రూపొందాలి. ‘ఐఎస్‌ఐఎస్’ ఉగ్రవాదులు మన దేశమంతటా విస్తరించి పోతున్నారన్నది ఆందోళన కలిగిస్తున్న పరిణామం.
ఓర్లాండోలో బీభత్సకాండను జరిపి ఆత్మాహుతికి పాల్పడిన ఉమర్ మతీన్‌ను ఐఎస్‌ఐఎస్ హంతకులు హీరో అని అభివర్ణించారు. ఇలాంటి హీరోలు మనదేశంలో కూడ ఉన్నారని, విదేశాలకు యథేచ్ఛగా రాకపోకలు సాగించగలుగుతున్నారని, ఐఎస్‌ఐఎస్ విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్ వల్ల స్పష్టమైంది. ఓర్లాండోలో మతీన్ కాల్పులు జరిపిన సమయంలోనే ఈ వీడియో క్లిప్పింగ్‌ను ఐఎస్‌ఐఎస్ విడుదల చేయడం కాకతాళీయం కాజాలదు. ఈ వీడియో క్లిప్పింగ్ గురించి కొద్ది రోజుల క్రితమే ప్రచారమైనప్పటికీ, వీడియోలోని వివరాలు బయటపడడం ఇదే మొదటిసారి. అయోధ్య రామజన్మభూమిపై నిలిచి ఉండిన బాబరీ కట్టడాన్ని కూల్చివేసిన వారిపై పగ తీర్చుకొనడానికి వీలుగా తమ ‘ఖలీఫా’ సామ్రాజ్యానికి తరలి రావలసిందిగా భారతీయ ముస్లింలకు ఈ క్లిప్పింగ్‌లో పిలుపునిచ్చారు. ఇలా భారతీయ ముస్లింలను రెచ్చగొట్టి వారిని జిహాదీలుగా రూపొందించడం ఐఎస్‌ఐఎస్ లక్ష్యం. ఐరోపా, అమెరికా దేశాలు తమపై సిరియాలోను ఇరాక్‌లోను దాడులు జరిపినందుకు ప్రతీకార చర్యగా ఆయా దేశాలలో పేలుళ్లు, కాల్పులు జరిపి హత్యలు చేస్తున్నట్టు ఐఎస్‌ఐఎస్ ప్రకటించింది. మనదేశం దళాలు సిరియాలో కాని ఇరాక్‌లో కాని ఈ హంతక ముఠాలపై దాడులు జరపలేదు. అయినప్పటికీ దాదాపు రెండేళ్ల క్రితమే ముప్పయితొమ్మిది మంది భారతీయులను ఇరాక్, ఇరాన్ నుంచి ఐఎస్‌ఐఎస్ దుండగులు అపహరించుకొని పోయారు. ఈ శ్రామికుల ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఈ బందీలను ఐఎస్‌ఐఎస్ హత్య చేసినట్టు కూడ ప్రచారం జరిగింది. మన ప్రభుత్వం మాత్రం బందీలు సజీవంగానే ఉన్నట్టు చెబుతోంది. ఈ నేపథ్యంలో సిరియాలో చిత్రీకరించిన వీడియో క్లిప్పింగ్‌ను ఇస్లాం మతరాజ్యం ముఠాలు విడుదల చేశాయ...
పగ తీర్చుకోవడానికి వీలుగా ఐఎస్‌ఐఎస్‌లో చేరాలని భారతీయ ముస్లిలకు పిలుపునిచ్చిన ముష్కరులు మనదేశంలో పుట్టి పెరిగి పారిపోయిన దేశద్రోహులు..ఈ జిహాదీలలో ఇద్దరు పది నెలల క్రితం మరణించారట. మిగిలిన నలుగురితో కలసి వీరు దేశద్రోహకలాపాలను నిర్వహించారు. ఈ ఇద్దరూ బతికి ఉండిన సమయంలో పదినెలల క్రితం చిత్రీకరించిన ఈ దృశ్యఖండికను ఇప్పుడు మాత్రమే ఐఎస్‌ఐఎస్ ఎందుకని విడుదల చేసినట్టు? అన్న ప్రశ్నకు సమాధానం స్పష్టం. మన భద్రత మరింత అప్రమత్తం కావడం అని వ్యూహం..