సంపాదకీయం

టమోటాకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్రవ్యోల్బణ వైచిత్రికి టమోటా పండ్ల ధరలు పెరుగుతుండడం విలక్షమైన ఉదాహరణ. ‘‘ఈరోజు పత్రిక చదివావా? పది రూపాయలకు మూడు కిలోల టమోటాలు ఇస్తున్నారట..’’ అని ‘‘గృహ సహాయిక’’ గృహిణిని పరీక్షించి మూడు నెలలు కాలేదు. నిన్న నేడు పది రూపాయలకు రెండు టమోటాలు రావడం లేదు. అరటి పండ్ల కంటె, మామిడి పండు కంటె ఎర్రని టమోటా ప్రాధాన్యం పెరిగిపోయింది. అందువల్లనే టమోటాను కూరగాయల జాబితాలోనుంచి తొలగించి పండ్ల జాబితాలో చేర్చి ‘పదోన్నతి’ కల్పించవలసి వస్తోంది. వంద రూపాయలకు కిలో చొప్పున టమోటాలను కొంటున్న మధ్యతరగతి జనం ఈ పదోన్నతి కల్పించారు. రైతు బజారులలోను కారుచౌక కాయగూరలను విక్రయిస్తున్న సంతలలో సైతం టమోటాల కిలోధర ఎనబయి రూపాయలకు తగ్గకపోవడం ద్రవ్యోల్బణాన్ని లెక్క గడుతున్న కేంద్ర ప్రభుత్వ గణాంక విభాగం వారికి బహుశా ధ్యాసలేని అంశం. టమోటాలు ఉల్లిపాయల ధరలు ఇలా నింగికెగరడం, పాతాళానికి కుంగడం పోటాపోటీగా జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న వాణిజ్య విన్యాసాలు. కుంగినపుడు రైతులు దివాలా తీస్తున్నారు. పొలంలోనే టమోటాలను తట్టలకొద్దీ, బుట్టలకొద్దీ లారీలకొద్దీ పారేస్తున్నారు. ధరలు పొంగినప్పుడు వినియోగదారులు టమోటా చారును సైతం పరిత్యాగం చేస్తున్నారు. రెండు రకాలుగాను దళారీలు మాత్రం దండుకుంటూనే ఉన్నారు. కందిపప్పును కొనడం మానుకున్న జనం టమోటా చారుతో భోంచేస్తున్నారు. టమోటా ధరలు పెరిగాయి కాబట్టి చింతపండు చారునకు ప్రాధాన్యం హెచ్చింది. అందువల్ల చింతపండు ధరలు నిమ్మకాయల ధరలు పెరుగుతున్నాయి. టమోటా ధరలు పెరిగినప్పుడు పెరిగిన చింతపండు ధరలు మళ్లీ తగ్గకపోవడం మార్కెట్ ఎకానమీ మాయ ...మార్కె ట్-విపణి ప్రాంగణం- ను నిర్వహించే వారు ప్రజల బతుకులను మాత్రమే కాక ప్రభుత్వ విధానాలను నిర్దేశించడం నియంత్రించడం మార్కెట్ ఎకానమీ. ఈ మార్కెట్ ఎకానమీ ప్రపంచీకరణకు స్వరూపం. అందువల్లనే ఏడాది క్రితం పెరిగిన కందిపప్పు ధరలు మళ్లీ తగ్గలేదు. తగ్గవు. తగ్గితే మధ్యతరగతి గృహిణులు విస్మయాశ్చర్య చకిత వదనాలతో ఇరుగుపొరుగు వారితో చర్చించుకొనడానికి సమాచారం ఉండదు.
మళ్లీ కందిపప్పును భారీగా దిగుమతి చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మళ్లీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం సరికొత్త నేపథ్యం. టోకు ద్రవ్యోల్బణం, చిల్లర ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం, సాధారణ ద్రవ్యోల్బణం వంటి పేర్లతో ద్రవ్యోల్బణాన్ని 2009లో విడగొట్టడం ఆరంభమైన తరువాత ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ వారికి గొప్ప వెసులుబాటు ఏర్పడింది. చిల్లర ద్రవ్యోల్బణం ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. కానీ రెండేళ్లకు పైగా టోకు ద్రవ్యోల్బణం పెరగలేదన్నది అధికారిక నిర్ధారణ. పైగా సున్నశాతానికి దిగిన టోకు ద్రవ్యోల్బణం ఇంకా తగ్గిపోయి మాంద్యంగా మారిందన్నది ప్రభుత్వం వారి ఆందోళన. టమోటాల ధరలు తగ్గినప్పుడూ పెరిగినప్పుడూ, కందిపప్పు ధర నిరంతరం పెరుగుతున్నప్పుడూ, టోకు మాంద్యం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎందుకన్న సామాన్యుల ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకన్న ప్రశ్న ప్రభుత్వ సంబంధిత ద్రవ్యోల్బణం నిర్ణాయకులకు కలుగనే కలుగదు. ఇలా సందేహమే కలుగని ‘ఆర్థిక వేదాంతం’ ప్రభుత్వాన్ని ఆవహించి ఉండడం మార్కెట్ ఎకానమీ-స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ- మాయాజాలంలోని అతి ప్రధాన అద్భుతం. అందువల్ల టోకు ద్రవ్యోల్బణం ఇంకా పెరగదేమోనన్న ఆందోళనకు ప్రభుత్వం రెండేళ్లుగా గురి అయింది. ఇలా పెరగకపోవడం ఆర్థిక మాంద్యానికి చిహ్నమట! అందువల్లనే కేంద్ర ప్రభుత్వం వారు పోరు పెట్టి, అరచి ఆర్భాటించి రిజర్వ్ బ్యాంక్ వారి మెడలు వంచగలిగారు. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరగడానికి వీలైన సంస్కరణలను రిజర్వ్ బ్యాంక్ అనేక నెలలుగా కొనసాగిస్తోంది. ఫలితంగా టోకు ద్రవ్యోల్బణం కొద్దికొద్దిగా పైపైకి కదులుతోంది. కానీ చిల్లర ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం మాత్రం బాగా ఊపందుకున్నాయి. టమోటా ధరలు మరీను... నిరుపేదలు తమ వైపు కనె్నత్తి చూడడానికి సైతం వీలులేని రీతిలో టమోటాలు రెక్కలు కట్టుకొని గగన విన్యాసాలు చేస్తుండడం రిజర్వ్ బ్యాంకువారి ఆర్థిక సంస్కరణలు ఆవిష్కరిస్తున్న నిరంతర దృశ్యం...
వడ్డీని తగ్గించడం రిజర్వ్‌బ్యాంకు వారు గత ఏడాదిగా పదేపదే నిర్వహించిన సంస్కరణ. దీనివల్ల పెట్టుబడులు పెరగడం ఖాయమన్నది ప్రభుత్వం వారి ధ్రువీకరణ. వడ్డీ తగ్గించింది కాబట్టి పారిశ్రామిక వేత్తలు ఉత్సాహంగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని పెట్టుబడులు పెట్టి ఉత్పత్తులను పెంచడం సంస్కరణల ఫలితం. వడ్డీ తగ్గినందువల్ల నిరుత్సాహం చెందిన వినియోగదారులు చిన్న మొత్తాలను పెద్ద మొత్తాలను బ్యాంకులలో జమ చేయడం మానేస్తారట. ఈ మొత్తాలు కూడ పెట్టుబడుల రూపంలో పరిశ్రమకెక్కి ఉత్పత్తులు ఘనంగా పెరుగుతాయట. కానీ చిన్న మొత్తాలకు పెట్టుబడిస్థాయి, గౌరవం లభించడం లేదు అందువల్ల బ్యాంకులలో ఈ చిన్న మొత్తాలను జమ చేయనివారు వాటితో ఐస్‌క్రీమ్‌లను కొని చప్పరించేస్తున్నారు. అనవసర సామగ్రిని, తినుబండారాలను కొనేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగడానికి ఇదీ కారణం. అనవసరంగా కొనడానికి పురికొల్పుతున్న ఈ చిన్న మొత్తాలు వస్తువులకు గిరాకీని పెంచి ధరలను పెంచుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోతుండడానికి ఇలా జనం అక్కర లేని తినుబండారాలను కొనడం ప్రధాన కార ణం. నిరుపేదలకు నిరంతరం అక్కర ఉన్న టమోటా ఉల్లి ధరలు పెరగడానికి ఇది పరోక్ష ప్రేరకం. రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా టోకు ద్రవ్యోల్బణం మే నెలలో పెరిగిందట. అయినప్పటికీ టోకు ద్రవ్యోల్బణం పెరుగుదల ఒకశాతం కంటె తక్కువే. కానీ అదే మేనెలలో చిల్లర ద్రవ్యోల్బణం ఆరుశాతం, ఆహార ద్రవ్యోల్బణం ఏడుశాతం పెరిగాయి. టోకు ధరల ద్రవ్యోల్బణం ఒక్కశాతం ఉన్నప్పుడు చిల్లర ద్రవ్యోల్బణం ఆరుశాతం ఎలా అయింది? అంటే టోకు విపణి నుంచి వినియోగదారుని చేరేలోగా దళారీలు ధరలను భయంకరంగా పెంచుతున్నారన్నమాట. ఆహారం ధర పెరుగుదలను పరిగణించకుండా ద్రవ్యోల్బణాన్ని నిర్ధారిస్తున్నారు. అందువల్లనే సాధారణ ద్రవ్యోల్బణం-హెడ్‌లైన్ ఇన్‌ఫ్లేషన్-అతి తక్కువగా ఉందన్న భ్రాంతి వ్యాపిస్తోంది.
ఆహార ద్రవ్యోల్బణాన్ని అక్టోబర్,2009 నుంచి మాత్రమే లెక్కకడుతున్నారు. అంతకు ముందు సున్నశాతం ద్రవ్యోల్బణం అధికారికంగా నమోదయినప్పుడు కూడ కందిపప్పు బియ్యం ధరలు యాబయి నుండి వందశాతం పెరిగాయి. ఇప్పుడు కందిపప్పు ద్రవ్యోల్బణాన్ని ప్రత్యేకంగా లెక్క కడితే పెరుగుదల యాబయి శాతం ఉంటుంది. ఎందుకంటె గత ఏడాది ఆరంభంలో డెబ్బయి రూపాయల కంటె తక్కువగా ఉండిన కిలో కందిపప్పు ధర రెండు వందల రూపాయలకు పెరిగింది. గత ఏడాది అక్టోబర్‌లో విదేశాల నుంచి భారీగా కందిపప్పు దిగుమతి అయినప్పటికీ కందిపప్పు ధరలు యథాపూర్వ స్థితికి చేరలేదు. ప్రస్తుతం రెండువందల నలబయి నుంచి రెండువందల రూపాయల వరకు వివిధ ప్రాంతాలలో కిలో కందిపప్పును అమ్ముతున్నారు. ఇప్పుడు మళ్లీ బర్మా నుంచి భారీగా కందిపప్పును తెప్పిస్తారట..