ఉత్తరాయణం

పౌరసత్వ చట్టంపై ఆందోళనలు వద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌరసత్వ చట్టంపై ఆందోళనలు ఇంకా కొనసాగటం మంచిది కాదు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమేకాక ఢిల్లీ జుమామసీదు ఇమామ్ శ్రీ బుఖారీ, అజ్మీర్ దర్గా వంటి ఎందరో ముస్లిం మత పెద్దలు మన దేశ ముస్లింలకు నష్టంలేదని స్పష్టం చేశారు. అత్యధిక ప్రజానీకం కూడ సమర్ధిస్తుంది. అయితే కొన్ని విపక్షాలు అదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లు భవిష్యత్తులో ప్రమాదం అని భయపెడుతుంటే, వేల కోట్ల రూపాయల కుంభకోణాల్తో అధికారం కోల్పోయి ఒడ్డున బడ్డ చేపల్లా గిలగిలలాడే కొన్ని కుల, ప్రాంతీయ కుటుంబ పార్టీ పెద్దలు అగ్నికి ఆజ్యంపోస్తున్నారు. అక్రమ వలసలు పెరిగితే ఎంత ప్రమాదమో బెంగాల్ విధ్వంస సంఘటనలు తెల్పుతున్నాయి. అసలు ఈ సమస్య కేంద్రానిది. శరణార్థులు, చొరబాటుదార్ల సమస్యను మన దేశం పొరుగు దేశాలతో చర్చించి పరిష్కరించుకోవాలి. ఇప్పటికే బంగ్లాదేశ్ తమ పౌరులను స్వీకరించటానికి వారి వివరాలు కోరింది. మన దేశంలో రెండు కోట్ల మందిపైగా శరణార్థులు అక్రమ చొరబాటుదార్లున్నారట. మన దేశం ఇంతవరకు ఎవరినీ బలవంతంగా తరిమివేయలేదు, శిక్షించలేదు. మన పౌరులపై చర్యలు తీసుకుంటే చట్టసభలు, కోర్టులు, సోషల్ మీడియా రక్షణగా వుంటాయి. చివరిగా మన పౌర సమాజం వుంది. అసలు ఈ చట్టం బీజేపీ హడావుడిగా పెట్టలేదు. 2014 ఎన్నికల ముందు నుండే మత వేధింపులు, హింసలకు గురై పాక్, బంగ్లా, ఆప్ఘన్ దేశాల నుండి వచ్చే కొద్దిమంది శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తామని చెపుతూనే వుంది. (పాకిస్తాన్‌లో కనేరియా వంటి ప్రముఖ క్రీడాకారుడినే తోటి ఆటగాళ్ళు అంటరానివాడిగా వేధించారని సాటి ముస్లిం క్రీడాకారులే తాజాగా వెల్లడించారు). ఐరాస ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయం అంటూ మమత వింత అభిప్రాయం వెలిబుచ్చారు. అక్రమ చొరబాట్లు తక్కువ జనాభాగల ధనిక దేశాలే అంగీకరించవు.
వివాదాస్పద విషయంలో కూడ కొన్ని రాజకీయ పార్టీలు, ఏటా బ్లాక్‌డే నిర్వహిస్తుంటాయి. అవి ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలనుకుంటాయి గాని, అవి పరస్పర అప నమ్మకాలు, అభద్రతా భావం పెంచుతాయి. వామపక్షాలు హిందూత్వంపై పోరాటం అంటారు గాని ఆ క్రమంలో హిందూ వ్యతిరేక పార్టీలుగా ముద్రబడుతున్నాయి. కార్మికుల పక్షపాతమే గాని, సామాన్యుల కంటే ఎన్నో రెట్లు సౌకర్యాలు, ఆదాయం వున్న ప్రభుత్వోద్యోగులకోసం పోరాడతాయి గాని బాధ్యతలపై వారిని చైతన్యపరచరనే అపవాదు. అందుకే ఆర్థిక అసమానతలు, పేదరికం పెరిగి పోతున్నా వారి ఓటు బ్యాంకు తరిగిపోతుంది. కనుక నిజాయితీగల నేతలున్న పార్టీలుగా పేరొందిన వామపక్షాలు ఆర్థిక అసమానతలు, పేదరికంపై పోరాడాలి గాని, కేవలం మోడీ వ్యతిరేక పోరాటం కారాదు.
మన ప్రభుత్వాలు ఐటీ, ఆటో రంగాలకు అధిక ప్రోత్సాహం ఇస్తున్నా నిరుద్యోగం, పేదరికం పెరగటానికి కారణం ఇంకా పేదలు ఒకరిద్దరితో కుటుంబ నియంత్రణ పాటించకపోవటం, యాంత్రీకరణ, రిటైర్మెంటు వయసుపెంచుకుంటూ పోవటం, అక్రమవలసలు కూడ కారణమే. కనుక ప్రభుత్వాలు ఆ సమస్యలపై తక్షణమే దృష్టిసారించాలి. పారిశ్రామిక మాంద్యాలు ప్రతి దేశానికి తప్పదు కనుక గ్రామీణ ప్రాంతానికి కూడ అధిక నిధులు కేటాయించి వ్యవసాయ, పాడి పరిశ్రమ, గ్రామీణ పరిశ్రమలను కూడ ప్రోత్సహిస్తే అక్కడ ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆహారోత్పత్తుల దిగుబడులు పెరిగి పప్పు ధాన్యాలు, వంట నూనెల వంటి విదేశీ దిగుమతులు తగ్గించుకోవచ్చు.

- తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట