సంపాదకీయం

‘ ఫిరాయింపు’పై ‘పిడుగు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్టీ ఫిరాయింపులకు పాలుపడుతున్న ‘చట్టసభల’ ప్రతినిధుల ‘అనర్హత’ గురించి నిర్ధారించడానికై ‘శాశ్వత న్యాయ మండలి’- పర్మినెంట్ ట్రిబ్యునల్-ని ఏర్పాటుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించడం హర్షణీయ రాజ్యాంగ పరిణామం! ఈ పరిణామం చట్టసభల అధ్యక్షుల ‘ముసుగు’లోని రాజకీయవేత్తలకు అభిశంసనం... నిష్పక్షపాతం వ్యవహరించడం చట్టసభల అధ్యక్షులు- స్పీకర్‌లు- నిర్వర్తించవలసిన రాజ్యాంగ విధి. ‘స్పీకర్’లు ఈ విధిని సక్రమంగా నిర్వహించడం లేదన్నది సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం చేసిన నిర్ధారణ! ప్రధానంగా చట్టసభలకు తాము ఎన్నికయిన తరువాత స్వపక్షం నుంచి ఇతర పక్షాలలోకి ఫిరాయిస్తున్న వారి ‘అనర్హత’ను నిర్ధారించడంలో ‘స్పీకర్’లు విపరీతమైన జాప్యం చేస్తుండడం సర్వోన్నత న్యాయస్థానం అభిశంసనకు గురిఅయిన ప్రక్రియ! ‘స్పీకర్’లు తమ విధిని సకాలంలో నిర్వహించి ఉండినట్టయితే ‘సర్వోన్నత న్యాయస్థానం’వారు ఇప్పుడు ఈ తీర్పు చెప్పవలసిన అవసరమే ఉండేది కాదు. చట్టసభలకు అధ్యక్షత వహిస్తున్న వారిలో అతి కొద్దిమంది మాత్రమే ‘సభ్యుల ఫిరాయింపుల’ వ్యవహారంలో నిష్పక్షపాతంగా వ్యవహరించడం చరిత్ర! మిగిలిన ‘స్పీకర్’లు ‘స్వపక్ష’ పాతంతో వ్యవహరిస్తుండడం బహిరంగ రహస్యం. పదవిని చేపట్టక పూర్వం ‘స్పీకర్’లు ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందినవారు. కానీ పదవీ బాధ్యతలను స్వీకరించిన తరువాత ‘స్పీకర్’లు ఏ పార్టీకి కూడ చెందిన వారు కాదు. ఈ రాజ్యాంగ వాస్తవానికి అనుగుణంగా ‘స్పీకర్’లు ప్రవర్తించ గలిగితే పార్టీలను ఫిరాయించే ‘ప్రతినిధులు’ చట్టసభలలో కూర్చుండజాలరు. కానీ ‘్ఫరాయింపుల’పై నిర్ణయించే ప్రక్రియ ఏళ్ల తరబడి కొనసాగుతోందన్నది సర్వోన్నత న్యాయస్థానం చేసిన నిర్ధారణ! ఈ చట్టసభల కాలవ్యవధి ఐదేళ్లు కాబట్టి ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక రాజ్యాంగ’ స్ఫూర్తి నీరుకారిపోతోందని సర్వోన్నత న్యాయమూర్తులు ఆర్‌ఎఫ్ నారిమన్, అనిరుద్ధ వసు, వి.రామసుబ్రహ్మణ్యన్ మంగళవారం చేసిన వ్యాఖ్య. అందువల్ల ‘స్పీకర్’ల విచారణ, నిర్ణయాలతో నిమిత్తం లేకుండా ‘పార్టీ ఫిరాయింపుల’ వివాదాలను పరిష్కరించడానికి ‘శాశ్వత న్యాయ మండలి’ని ఏర్పాటుచేయాలన్నది సర్వోన్నత న్యాయస్థానం చేసిన నిర్ధారణ. ఇందుకు వీలుగా పార్లమెంటులో ‘రాజ్యాంగ సవరణ ప్రతిపాదన’ను ప్రవేశపెట్టి ఆమోదించేయాలన్నది సర్వోన్నత న్యాయాదేశం. ఈ ‘ట్రిబ్యునల్’ అధ్యక్షుడుగా విశ్రాంత సర్వోన్నత న్యాయమూర్తి- రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్-కానీ, విశ్రాంత ప్రధాన ఉన్నత న్యాయమూర్తి- రిటైర్డ్ ఛీఫ్ జస్టిస్ ఆఫ్ ఏ హైకోర్ట్- కానీ నియుక్తులు కావాలన్నది మంగళవారం ‘సుప్రీంకోర్టు’ చెప్పిన మాట!
ఒక రాజకీయ పక్షం సభ్యుడిగా ఎన్నికలలో పోటీచేసి చట్టసభలకు ఎన్నికైన తరువాత స్వపక్షాన్ని వంచించి, స్వపక్షాన్ని వదిలిపెట్టి మరో రాజకీయ పక్షంలోకి చేరిపోవడం అనైతికం... ఇలా చేయడం అనైతికం అన్నది అన్ని రాజకీయ పక్షాలవారు అంగీకరించిన నైతిక సూత్రం! కానీ దాదాపు అన్ని రాజకీయ పక్షాలవారు ఎప్పుడో అప్పుడు ఈ ‘నైతిక సూత్రాన్ని’ భగ్నం చేయడం ఏడు దశాబ్దుల రాజకీయ వైపరీత్యం! ఇలా శాసనసభ్యులు, లోక్‌సభ్యులు పార్టీలను ఫిరాయించినప్పుడు వారు తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలలో పోటీచేయాలి! ఒక పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు నచ్చనట్టయితే ఆ పార్టీలోని ‘సభ్యులు’ ఆ పార్టీనుంచి వైదొలగవచ్చు. పార్టీ పరిత్యాగానికి నిజంగా ఈ ఆదర్శం ప్రాతిపదిక అయినట్టయితే ఫిరాయిస్తున్న ‘చట్టసభల సభ్యులు’ తమ పదవిని కూడ పరిత్యజించాలి! కానీ అధికార పదవులను పొందడంకోసం ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వ నిర్వాహక పక్షాలలోకి చట్టసభల సభ్యులు కుప్పలుతెప్పలుగా ‘్ఫరాయించడం’ ఏడు దశాబ్దులుగా రాజ్యాంగ ‘ప్రజాస్వామ్య ప్రక్రియ’కు దాపురించిన జాడ్యం! 1985వరకు ‘అప్రతిహతం’గా నడిచిన ఈ ‘అవకాశవాద అవినీతి’ ఆటను కట్టించడానికై రాజ్యాంగంలో ‘పదవ అనుబంధం’- టెన్త్ షెడ్యూల్-ఏర్పడింది! రాజ్యాంగపు పంతొమ్మిదవ, నూట రెండవ అధికరణములను సవరించడం ద్వారా ఈ ‘పదవ అనుబంధం’ ఏర్పడింది! ఈ అధికరణ సవరణ జరిగేవరకు, పదవ అనుబంధం ఏర్పడేవరకు ‘్ఫరాయింపుల’ నేరానికి ఎలాంటి శిక్ష ఉండేది కాదు. తమ స్వీయ రాజకీయ పక్షంనుంచి స్వచ్ఛందంగా వైదొలిగేవారు తమ ‘చట్టసభల సభ్యత్వాన్ని’ కోల్పోతారన్నది ‘పదవ అనుబంధం’ నిర్దేశిస్తున్న ‘శిక్ష’! స్వచ్ఛందంగా, సొంత పార్టీని వదలిపెట్టేవారు, తమ పక్షం అధిష్ఠానం ఆదేశాన్ని ధిక్కరించి ‘సభల’లో వివిధ ప్రతిపాదన-బిల్లు-లను సమర్ధించేవారు, లేదా వ్యతిరేకించేవారు, లేదా ‘మత ప్రదాన’- వోటింగ్-లో పాల్గొనకుండా ఉండేవారు తమ ‘చట్టసభల’ సభ్యత్వాన్ని కోల్పోతారన్నది ‘పదవ అనుబంధం’లోని రెండవ నిబంధన...
రాజ్యాంగానికి జరిగిన యాబయి రెండవ సవరణ ప్రకారం పదవ అనుబంధం అవతరించి ముప్పయి ఐదేళ్లు అవుతున్నప్పటికీ ‘పార్టీ ఫిరాయింపులు’ యథాపూర్వంగా కొనసాగిపోతుండడం, సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన మంగళవారంనాటి తీర్పునకు నేపథ్యం! ఫిరాయించినవారి ‘అనర్హత’ను నిర్ధారించడంలో చట్టసభల అధ్యక్షుల- ఛైర్మన్‌లు, స్పీకర్‌లు-,దే తుది నిర్ణయమని ‘పదవ అనుబంధం’లోని ఆరవ ‘నిబంధన’నిర్దేశిస్తోంది. కానీ ఈ నిర్దేశాన్ని ‘రాజకీయ ప్రభావితులైన’ చట్టసభల అధ్యక్షులు నీరుకార్చడం ముప్పయి ఐదేళ్ల వ్యథ! ఈ ‘అనర్హత’ల నిర్ధారణలో న్యాయవ్యవస్థ ప్రమేయం క్రమంగా పెరగడానికి ఇదీ నేపథ్యం. మంగళవారంనాటి సర్వోన్నత న్యాయ నిర్ణయం పరాకాష్ఠ... ‘్ఫరాయింపు’ వివాదాలపై ఫిరాయింపు జరిగిన నాటినుంచి మూడు నెలల లోగా తమ అభిప్రాయాలను, నిర్ణయాలను ‘స్పీకర్లు’ మూడు నెలల లోగా ప్రకటించవలసి ఉంటుంది. ఈ ప్రక్రియపై తుది తీర్పును చెప్పవలసింది రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటుకానున్న ‘శాశ్వత న్యాయ మండలి’! ‘స్పీకర్ల’నిర్ణయంలో జరిగిన అవకతవకలవల్ల, నిర్ణయ ప్రక్రియలో జరిగిన జాప్యంవల్ల వివిధ రాష్ట్రాలలో ‘శాసనసభ’లో సంఖ్యాధిక్యం- మెజారిటీ- కోల్పోయిన ప్రభుత్వాలు ‘సంఖ్యాధిక్యం’కల ప్రభుత్వాలుగా చెలామణి కావడం చరిత్ర! ‘అనిశ్చిత’ రాజకీయ పరిస్థితి నెలకొనడంవల్ల రాజ్యంగ సంక్షోభాలు కూడ తలెత్తడం చరిత్ర. కర్నాటకలో గత ఏడాది కుమారస్వామి నాయకత్వంలోని ‘కూటమి’ప్రభుత్వం కూలిపోయిన తరువాత యడియూరప్ప నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఏర్పడింది! ఈ సందర్భంగా ‘్ఫరాయించిన’వారు తమ శాసన సభ్యత్వాలకు రాజీనామాచేశారు. కానీ ఇందుకు భిన్నంగా తమిళనాడులో ఫిరాయించినవారు పదవులకు రాజీనామా చేయలేదు. వారి అనర్హత గురించి సుదీర్ఘంగా జరిగిన ప్రక్రియ పళనిస్వామి ముఖ్యమంత్రిత్వంలోని అన్నాద్రవిడ మునే్నత్ర కజగం ప్రభుత్వాన్ని దాదాపు రెండేళ్లపాటు అనిశ్చిత స్థితికి గురిచేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోను 2014వ 2019వ సంవత్సరాల మధ్య పార్టీలు మారినవారిలో అత్యధికులు ‘అనర్హత’ వేటునుంచి తప్పించుకొనడానికి కారణం ‘స్పీకర్’లు నిర్వహించిన ప్రక్రియలో జరిగిన జాప్యం...
సర్వోన్నత న్యాయస్థానంవారి మంగళవారంనాటి తీర్పునకు ఇదంతా నేపథ్యం! కేంద్ర ప్రభుత్వం వెంటనే ‘ప్రతిపాదన’ను రూపొందించి రాజ్యాంగ సవరణ ప్రక్రియను చేపట్టాలి! జాప్యం జరుగకుండా సర్వోన్నత న్యాయాదేశాన్ని అమలుజరపాలి...శాశ్వత న్యాయ మండలిని ఏర్పాటుచేయాలి.