సంపాదకీయం

వలస వచ్చిన తిండి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఆహారం ఉత్పత్తులలో యాబయి ఐదుశాతం మాత్రమే అనాదిగా మనదేశానికి చెందినవని శాస్తవ్రేత్తలు ‘కనిపెట్టారు’...మిగిలిన నలబయి ఐదు శాతం ఆహార ఉత్పత్తులు వివిధ కాలాలలో విదేశాలనుంచి మనదేశంలోకి ‘వలస వచ్చినట్టు’ నూటడెబ్బయి ఏడు దేశాలకు చెందిన శాస్తవ్రేత్తలు పరిశోధించి నిగ్గుతేల్చారు. ఈ పరిశోధనకు ఉపకరించిన వ్యవసాయ విజ్ఞాన వివరాలు, వారు తవ్వితీసిన భూగర్భస్థిత పురావస్తు నిక్షేపాలు ఏమిటన్నది మాత్రం ప్రచారం కావడంలేదు. సామాన్య ప్రజలకు మాత్రమే కాక మేధావులుగా పేరుమోసిన కుతూహల గ్రస్తులకు కూడ విచిత్రమైన ఆవిష్కరణ పట్ల అసక్తి మెండుగా ఉండడం విదేశీయ భావదాస్య ప్రభావం. అందువల్ల మన వ్యవసాయ ఉత్పత్తులు అనాదిగా మనదేశంలోనే పండుతున్నాయని, సాగవుతున్నాయని శాస్తవ్రేత్తలు కనిపెట్టినట్టయితే అది మనకు కుతూహల ప్రేరకం కాజాలదు. అనూచాన విశ్వాసాలకు సంప్రదాయాలకు సంస్కారాలకు, అలవాట్లకు విరుద్ధమైన విపరీతాలను పరిశోధకులు తవ్విపోసినట్టయితే వాటిని తట్టలలో, బుట్టలలో నింపుకొని తలకెత్తుకోవడం బ్రిటన్ దురాక్రమణ దారులు మనలను పాలించిన నాటి వారసత్వం. ప్రపంచంలో తొలి మానవులు భారతదేశంలోనే జన్మించారని, తొలి మానవీయ సంస్కారాలు ఈ కర్మ భూమిలోనే వికసించాయని, శ్రుతిస్మృతి పురాణ ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి. వీటిలో ఐదువేల వంద సంవత్సరాల క్రితం రూపొందిన మహాభారత ఇతిహాసం ఆధునిక మైన ది. ఈ ఇతిహాసం కంటె పూర్వం లక్షల ఏళ్లుగా భారతీయులు పరిశోధనలు చేశారు. వివిధ విజ్ఞాన గ్రంథాలను ఆవిష్కరించారు. విదేశీయులు దురాక్రమించిన కాలంలో ఈ చరిత్రను విశ్వసించని మేధావులు రూపొందడానికి వీలైన విద్యాబోధన జరిగింది. ఫలితంగా వౌలిక చారిత్రక వాస్తవాలు తలకిందులైపోయాయి. తొలి మానవులు భారతదేశంలో పుట్టలేదని, ఇంకెక్కడో నీళ్లు లేనిచోట, మంచుగడ్డలున్న చోట, సంస్కారాలు లేని చోట పుట్టుకొచ్చారని బ్రిటిష్ వారు మనకు కొత్తగా చరిత్ర నేర్పి పోయారు. బ్రిటిష్ విద్యలు నెత్తికెక్కినవారు 1947 ఆగస్టు 15 తరువాత కూడ బ్రిటన్ తత్వా న్ని ప్రచారం చేస్తున్నారు. సంస్కారవంతులు-ఆర్యులు-అయిన మానవులు విదేశాలనుంచి మనదేశానికి వచ్చిపడ్డారన్న బ్రిటన్ సామ్రాజ్య వాదుల కట్టుకథను మనం ఇప్పటికీ చరిత్ర పేరుతో నేర్చుకుంటున్నాము, నేర్పుతున్నాము. అందువల్ల ఈ అబద్ధాల బాట వ్యవసాయ ఉత్పత్తుల శాస్తజ్ఞ్రులు మరికొంత ముందుకు తీసికెళ్లారు. భారతీయులు మాత్రమే కాదు, వారు భోంచేస్తున్న కూరగాయలు, గోధుమలు వంటివి వాటిలో అత్యధికం వందల వేల ఏళ్ల క్రితం విదేశాలనుంచి ఈ దేశానికి వలస వచ్చాయని నూట డెబ్బయి ఏడు దేశాల శాస్తవ్రేత్తలు ఇప్పుడు నిగ్గు తేల్చిపారేశారు. ఈ పరిశోధనకు గొప్ప ప్రచారం జరగడం సహజం..
మనదేశానికి కొన్ని ఆహారపు మొక్కలు, విత్తనాలు, ఓషధులు విదేశాలనుంచి వచ్చి ఉండవచ్చు. మిరపకాయ వాటిలో ఒకటి. కానీ లవంగం పరిమాణంలో ఉండే మిరపకాయలు మనదేశంలో అనాదిగా ఉన్నాయి. మనదేశం నుండి ఓడల నిండుగా మిరియాలు ఐరోపాకు ఎగుమతి కావడం వందల ఏళ్ల క్రితంనాటి మాట. మిరియాలు వంటి రుచి కలవి కాబట్టి విదేశాలనుంచి వచ్చిన కాయలను మిరియపు కాయలు అని అన్నారు. తరువాత మిరియపు కాయలు మిరపకాయలుగా మారి ఉండవచ్చు! కానీ మిరియాలు కూడా విదేశాలనుంచి వలస వచ్చాయని పరిశోధకులు కనిపెడితే ఎలా ఉంటుంది? అలానే ఉల్లి విదేశాలనుంచి వచ్చిందట...కానీ అనాదిగా ఈ దేశంలో పండుతున్న వెల్లుల్లి, ఆవాలు-షర్షపములు-సాసువులు, గోధుమలు కూడ విదేశాలనుంచి వచ్చాయని ఇప్పుడు పరిశోధకులు కనిపెట్టారట! వేప చెట్టునకు తులసి మొక్కకు అమెరికా బహుళ జాతీయ వాణిజ్య సంస్థలవారు గతంలో జీవ ఉత్పాదక ముద్ర-పేటెంట్-ను పొందడానికి యత్నించిన సంగతి బహుశా మనకు గుర్తులేదు...ఇలా నలబయి ఐదు శాతం ఆహారపు మొక్కలు విత్తనాలు విదేశాలనుంచి వచ్చి పడినట్టు కనిపెట్టిన నూట డెబ్బయి ఏడు దేశాల శాస్తవ్రేత్తలు మన దేశంలో అనాదిగా ఉన్న ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, ఓషధులు, అటవీ ఉత్పత్తులకు ప్రాధాన్యం పెద్దగా ఇవ్వడంలేదు. మన దేశంలోని ముప్పయి ఐదు శాతం రకాల పంటలలో ఎన్ని విదేశాలకు కాలక్రమంలో వలస పోయాయన్న వివరాలు సైతం వెల్లడి కాలేదు. భారత దేశానికి చెందిన నకారాత్మక-నెగెటివ్- వివరాలకున్నంత ప్రచారం భారతీయుల సకారాత్మక-పాజిటివ్-వివరాలకు ఏర్పడడం లేదు మరి...అరటి కొబ్బరి మామిడి లవంగాలు బియ్యం వంటి కొన్ని ఉత్పత్తులు మన దేశంనుండి బయటి దేశాలకు వెళ్లాయట-కానీ ఈ వివరాలు సమగ్రం కాదు!
ఆవాలు, గుమ్మడికాయ, ద్రాక్ష, బత్తాయి వంటి విదేశాలనుంచి వచ్చాయట, మనం నమ్మాలి! బత్తాయి నిమ్మ వంటివి ఒకే జాతికి చెందిన ఉప జాతులు. నిమ్మ భారత్‌లో అనాదిగా ఉన్నప్పుడు బత్తాయి మాత్రం విదేశాలలో ఎలా పుట్టింది? ప్రపంచ దేశాలకు ప్రధానంగా ఆహారం నిలువ చేసుకునేందుకై ప్రేరకంగా ఐరోపాకు మిరియాలు ఉపయోగపడినాయి. భారత్‌నుండి ఓడ నిండుగా మిరియాలను తీసుకుని వెళ్లిన వర్తకులు బంగారాన్ని మోసుకుని తిరిగి వచ్చేవారట. మిరియాల గురించి మాత్రం ఈ నూట డెబ్బయి ఏడు దేశాల శాస్తజ్ఞ్రులు ఏమి కనిపెట్టారన్నది తెలియడంలేదు. ఈ శాస్తవ్రేత్తలు అంతర్జాతీయ ఉష్ట మండల వ్యవసాయ కేం ద్రం-ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్- సియాట్-ఆధ్వర్యవంలో పరిశోధనలు జరిపారట! ఇదంతా ఈ కనిపెట్టడమంతా భారతదేశంలో విదేశీయ ఆహారంపట్ల పెరుగుతున్న మోజునకు సమాంతర పరిణామం. మనకు ఇడ్లీ, దోశ రొట్టె చక్కిలం నిప్పట్టు అతిరసం బొబ్బట్టు వంటివి రుచించడం తగ్గిపోతోంది. జామ్, పిజ్జా, వేఫర్, బర్గర్, ఐస్‌క్రీమ్, చాక్లెట్, కేకు వంటివి మన నాలుకలను ముక్కులను ఊరిస్తున్నాయి. పులిహోర పాయసం అన్న పేర్లు మాయమవుతున్నాయి...ఫ్రయిడ్ రైస్, పెప్సీకోలా సీసాలను పార్సిళ్లుగా తెచ్చుకుని ఆరగించడం ఆరంభమైంది! ఈ విదేశీయ రుచులే కాదు విదేశీయ నామావళి సైతం మనకు మత్తును కలిగిస్తున్నాయి. చైనీస్ ఫుడ్ పేరుతో చెలామణి అవుతున్న పదార్థాలు ఇక్కడనే మనవాళ్లు ఫాస్ట్‌గా వండుతున్నారు. కానీ చైనా అన్న పేరు పట్ల మనకు మోజు! ఉడిపి భోజన శాలలో సైతం చైనీస్ ఫుడ్ కార్నర్లు వెలసిపోతున్నాయి.
ఇలాంటి విదేశీయ రుచుల పట్ల మోజును నిరసించేవారు దేశంలో ఎందరో ఉన్నారు. వాళ్లనోళ్లు కూడ మూయించడానికి ఇప్పుడు సియాట్ వారి వినూత్న విచిత్ర ఆవిష్కరణలు దోహదం చేయగలవు! విదేశీయ భోజనాలు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు...వీరు స్వదేశీయ సంప్రదాయపు పంటలని భావిస్తున్నవి నిజానికి శతాబ్దుల క్రితమే ఈ దేశానికి వచ్చి చేరినాయి. అందువల్ల విదేశీయ స్వదేశీయ ఆహారం అన్న తేడాలను పాటించరాదు! అన్నది ఈ సియాట్ ఆవిష్కరణ మనకు చెబుతున్న గుణపాఠం. భూగర్భ జలాలను చుక్కలేకుండా పీల్చి భూసారాన్ని ఎండగట్టగల మొక్కలెన్నో మన దేశానికి బ్రిటన్ దురాక్రమణ సమయంలో తరలివచ్చాయి. స్వదేశీయ వృక్షాలను సస్యాంకురాలను ఓషధులను నిర్మూలించగల ఈ విదేశీయ వృక్షజాలం పర్యావరణానికి ప్రబల శత్రువు...బిటి ఆవాలు విదేశాలనుంచి రానున్నాయట. పూర్వరంగంగా సంప్రదాయపు ఆవాలు సైతం విదేశాలనుంచే వచ్చాయన్న పాఠాన్ని సియాట్ మనకు మప్పుతోంది...