సంపాదకీయం

ఊహించని చొరబాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోడ దూకడం తోడేలునకు నిరంతర కృత్యం..చైనా మళ్లీ గోడ దూకింది! ఈసారి ఉత్తరఖండ్‌లోకి చొరబడింది! ఒకచోట దూకుతున్న తోడేలును కాపరులు కనిపెట్టనంతవరకు ఆ వికృత మృగం దూకుతూనే ఉంటుంది! కనిపెట్టిన కాపరులు తోలడానికి తరమడానికి బద్ధకించినట్టయితే ఆ కోరల వృకానికి మరింత ధైర్యం వస్తుంది. తరమడానికి వెళ్లినట్టయితే ఆ హింసమృగం తమను కూడ కరిచి గాయపరస్తుందన్న భయం కాపరులకు కలిగితే మరీ ప్రమాదం. యథేచ్ఛగా తోడేలు చీకటి పడగానే గోశాలల గోడలను దూకుతూనే ఉంటుంది..ఆవుల గొంతులను కొరుకుతునే ఉంటుంది..అలా గొంతులను కొరికి గాయపరచడం తోడేలు సహజ స్వభావం. 2014 మే 26వ తేదీ వరకు పదేళ్లు మన ఉత్తర సరిహద్దులకు సంరక్షకులు ఇలాంటి పరాజయ భావానికి గురి అయ్యారు. ఇలా గురి కావడానికి ఆ పదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించిన రాజకీయ వేత్తలకు చైనా ముష్కరులను తోలాలన్న తరమాలన్న బుద్ధి పుట్టలేదు. అందువల్ల చైనా దళాలు ఆ పదేళ్లలోను సగటున సాలీనా మూడు వందల సార్లు వాస్తవ అధీన రేఖ-లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్-ఎల్‌ఏసి-వద్ద గోడను దాటాయి, లడక్‌లోని అరుణాచల్‌లోకి చొచ్చుకు వచ్చాయి! కొన్ని సంవత్సరాలలో దాదాపు నాలుగు వందల యాబయిసార్లు కూడ చైనా దళాలు లడక్‌లోని అరుణాచల్ లోనికి చొరబడ్డాయి. లడక్‌లో వాస్తవ అధీన రేఖకు ఆవలి వైపున ముప్పయి తొమ్మిది వేల చదరపు కిలోమీటర్ల మన భూభాగం చైనా వారి అక్రమ అధీనంలో ఉంది! దాన్ని మళ్లీ మనం స్వాధీనం చేసుకోలేకపోవడం దశాబ్దుల వైపరీత్యం. రేఖకు ఆవైపున ఉన్న మన భూభాగంలో తిష్ఠ వేసి ఉన్న చైనా ప్రభుత్వ దళాలు రేఖ దాటి ఈవైపునకు వస్తుండడం నిరంతరం జరిగిన చొరబాట్లు! ఎల్‌ఏసిని దాటి వచ్చిన ఈ చైనా ఎఱ్ఱదళాలు గుడారాలు వేసుకుని వంటలు చేసుకుని విం దులు చేసుకోవడం చొరబాటు స్వభావం! వారాల తరబడి విశ్రాంతి తీసుకుని తాపీగా నిరపాయకరంగా చైనీయులు రేఖ ఆవలకు తిరిగి వెళ్లడం చరిత్ర...2014 మే 26 తరువాత ఈ చరిత్ర మారింది!
గత రెండేళ్లుగా రేఖ దాటి లడక్‌లోకి చొరబడిన చైనీయ సైనికులతో మన భారత టిబెట్ సరిహద్దు రక్షకులు-ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు-ఐటిబిపి- చొరబడిన ప్రతిచోట, చొరబడిన ప్రతిసారి తలపడడం మొదలైంది. చొరబడిన చైనా సైనికులను మన రక్షకులు మెడలు పట్టుకుని నెట్టుకుంటూ పోయి రేఖ ఆవలకు నెట్టివేసారు. ఇలా నాలుగైదుసార్లు జరిగిన తరువాత చైనా దళాలు లడక్‌లో రేఖ దాటడం తగ్గిపోయింది, ఆగిపోయింది. గత కొన్ని నెలలుగా లడక్‌లో చొరబాట్లు జరిగిన దాఖలా లేదన్నది జరుగుతున్న ప్రచారం. చైనా చొరబాట్లను నిరోధించడానికి యత్నించినట్టయితే మెడపట్టి చొరబాటుదారులను రేఖ ఆవలకు గెంటివేసినట్టయితే గొప్ప రక్తపాతం జరిగిపోతుందని మన ప్రభుత్వం 2014 మే 26 వరకు భ్రాంతికి గురి అయింది. పెనుగులాటతో సమస్య తీరిపోదని చైనా చొరబాటుదారులు కాల్పులు జరుపుతారని మన రక్షకులు ఎదురు కాల్పులు జరిపినట్టయితే అది మరో యుద్ధానికి దారి తీస్తుందని మన ప్రభు త్వం భయపడింది. చైనాతో యుద్ధం చేస్తే 1962లోవలె ఓడిపోతామన్నది మరో భ్రాంతి. కానీ మన రక్షణ పటిమ పెరిగిన సంగతి చైనాకు తెలుసు, మనం చైనాను ఓడించలేకపోవచ్చు... చైనా సైతం మన దేశాన్ని ఓడించలేదన్నది వర్తమాన వాస్తవం. అందువల్ల లడక్‌లో మన భారత టిబెట్ సరిహద్దు రక్షకులు ప్రతిఘటించడం మొదలు కాగానే చైనా తోడేలు లడక్‌లో తోక ముడిచింది, రేఖకు ఆవైపున కూర్చుని కోరలు నూరుతోంది. అంతేకాని కాల్పులకు తెగబడలేదు!
మారిన మన వ్యూహంతో చైనా కూడ ఎత్తుగడలను మార్చింది. తోడేలును దూకుతున్న చోటును పసికట్టి కాపలాదారులు డబడబా డబ్బాలను మోగించినట్టయితే, దివిటీలను కాగడాలను వెలిగించి జ్వాలలతో బెదిరించినట్టయితే తోడేలు పారిపోతుంది. మరుసటిరోజున వస్తుంది, ఆ మరుసటి రోజు కూడా వస్తుంది. కొన్ని రోజులు ఇలా శబ్ద ప్రకంపనాలను, మంటల చిటపటలను సృష్టించినట్టయితే తోడేళ్లు ఆ ప్రదేశానికి ఆ తరువాత రావు, అక్కడ గోడ దూకవు. మరోచోటికి తన బీభత్స కలాపాలను తరలిస్తుంది. ఊహించని చోట గోడ దూకడం తోడేలు స్వభావం. ఆ ఊహించని చోటు ఉత్తరఖండ్! అక్కడ తరిమితే ఇక్కడికి, ఇక్కడ తరిమితే ఇక్కడికి మాటు మార్చడం తోడేలు స్వభావం. రెండు చోట్ల తరిమినట్టయితే ఊహించని మూడవ ప్రదేశంలో తోడేలు చొరబడిపోతుంది. ఉత్తరఖండ్‌లోను అరుణాచల్ ప్రదేశ్‌లోను మన సరిహద్దు రక్షకులు అప్రమత్తం అయ్యేసరికి, చొరబాట్లను ప్రతిఘటించడం మొదలుపెట్టేసరికి చైనా దళాలు మూడవ ప్రదేశాన్ని అనే్వషించాయి. అలా మన దళాలు ఊహించని మూడవ చోటు ఉత్తరఖండ్..అందుకే చైనా దళాలు టిబెట్‌నుండి మన ఉత్తరఖండ్‌లోకి చొరబడిపోయాయి. చమోలీ జిల్లాలోని బారాహోట్ ప్రాంతంలో ఎనబయి చదరపు కిలోమీటర్ల మన భూభాగంలో చైనా దళాలు చొరబడినట్టు జులై పంతొమ్మిదవ తేదీన ఉత్తరఖండ్ ప్రభుత్వ అధికారులు గుర్తించారట! భూమి యజమానులు వివరాలను సేకరించడానికై బారాహోట్‌కి వెళ్లిన చమోలీ జిల్లా అధికారులను అక్కడ తిష్ఠ వేసి ఉన్న చైనా సైనికులు బెదిరించారట. అది తమ వూఝే ప్రాంతమని భారతీయులు అక్కడికి రాకూడదని చైనా సైనికులు చెప్పారట! తక్షణం అక్కడినుండి వెళ్లిపోవాలని చైనా సైనికులు మన అధికారులను హెచ్చరించారట! ఈ మన అధికారులు ఉత్తరఖండ్ రాష్ట్ర అధికారులకు, ఉత్తరఖండ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ సంగతిని తెలియడంతో ఈ చొరబాటు సంగతి బయటపడింది! పంతొమ్మిదవ తేదీన చొరబాటును ఉత్తరఖండ్ అధికారులు గుర్తించినప్పటికీ ఈ సమాచారం ప్రజలకు తెలియడానికి తొమ్మిది రోజులు పట్టడం అంతుపట్టని విడ్డూరం. పంతొమ్మిదవ తేదీననే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ చొరబాటు గురించి తెలిసి ఉండాలి. చైనాకు మనకు మధ్య దాదాపు నాలుగువేల రెండు వందల యాబయి కిలోమీటర్ల సరిహద్దు జమ్ము కశ్మీర్‌నుండి అరుణాచల్ వరకు విస్తరించి ఉంది. ఉత్తరఖండ్‌లో మూడు వందల యాబయి కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ సరిహద్దును చైనా దళాలు ఇంకా ఎన్నిచోట్ల ఉల్లంఘించాయో!
లడక్‌లోను అరుణాచల్‌లోను మన భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఉత్తరఖండ్ హిమాచల్ రాష్ట్రాలలో మన సరిహద్దు భద్రతను ప్రమత్తత ఆవహించి ఉందన్నది దీనివల్ల స్పష్టమైంది. 19వ తేదీన బయటపడిన ఈ చొరబాటు అంతకు పూర్వం ఎన్ని రోజుల క్రితం మొదలైంది? ఐటిబిపి వారు కాక ఉత్తరఖండ్ పౌర అధికారులు చొరబాటును ఎందుకు కనిపెట్టవలసి వచ్చింది? ఆలస్యంగా రంగంలోకి దిగిన ఐటిబిపి దళాలు హెచ్చరించిన తరువాత చైనీయులు తిరిగి వెళ్లారట! చైనీయుల ఈ చొరబాట్ల ప్రమాదాన్ని దురాక్రమణను మనం స్వయంగా తెచ్చిపెట్టుకోవడం చారిత్రక భౌగోళిక దౌత్య వైపరీత్యం! 1959 వరకు చైనాకు మధ్య సువిశాల స్వతంత్ర టిబెట్ దేశం నెలకొని ఉండేది. 1959లో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం టిబెట్‌ను కబళించింది. ఇలా కబళించడానికి అప్పటి మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సహకరించాడు! ఈమన ఆత్మహత్యా విధానం కారణంగా చైనాతో మనకు ఇంత పెద్ద సరిహద్దు ఏర్పడింది. ఏర్పడిన నాటినుంచీ చైనా దళాలు మన దేశంలోకి చొరబడుతునే ఉన్నాయి...