సంపాదకీయం

గగన ప్రమత్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోదకుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, నిమగ్నతా రాహిత్యం వల్ల కావచ్చు, నిరంతరం పొంచివున్న బీభత్స పిశాచాల దాడుల వల్ల కావచ్చు. విధి వికటించడం వల్ల కావచ్చు...వాహనాలు కూలిపోతున్నాయి, వాహనాలు పేలిపోతున్నాయి, వాహనాలు కాలిపోతున్నాయి. ఢీకొట్టి ప్రాణాలు తీస్తున్నాయి. నదులలోపడి కొట్టుకుపోతున్నాయి. సముద్రాలలో మునిగిపోతున్నాయి. ఒక బోయింగ్ విమానం ఆగస్టు మూడవ తేదీన దుబాయి విమానాశ్రయంలో దిగబోయి భూమిని ఢీకొట్టడం అతికొత్త వైపరీత్యం. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం నుండి ఉదయం పదిగంటల పంతొమ్మిది నిముషాలకు గగనమెక్కిన ఈ విమానం దుబాయిలో దిగబోయి పడిపోయిందట. కుడివైపున ఇంజన్లు విడిపోయి పేలిపోయి కాలిపోవడం మూడు వందలమంది ప్రయాణికులను దిగ్భ్రాంతికి గురిచేసిన దుర్ఘటన. ప్రయాణికులలో 226 మంది భారతీయులు. భగవంతుడు ఈ ప్రయాణికులను నిరపాయకరంగా బయటకి చేరవేయడంతో నిర్వాహకులు ప్రభుత్వాలు వీక్షకులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ మంటలను ఆర్పేయత్నంలో ఒక ఉద్యోగి మాత్రం ఆహుతి అయిపోవడం విషాదాంతం. అక్కడ దుబాయిలో ఇది జరుగుతుండిన సమయంలోనే ఇక్కడ అస్సాం రాజధాని గువహతీ విమానాశ్రయ గగనంలో ఇండిగో సంస్థ వారి రెండు విమానాలు పెద్ద చప్పుడుతో ఢీకొనబోయాయట. వెంట్రుక వాసిలో ఢీకొనే ప్రమాదం తప్పిపోవడం మళ్లీ విధివిలాసం. అప్రమత్తతో చోదకులు ఢీకొనడాన్ని తప్పించి ఉండవచ్చు. లేదా దేనిపాటికది ఒకదానికొకటి అత్యంత సమీపంలో యథాలాపంగా పైకీ కిందికీ దూసుకొని వెళ్లి ఉండవచ్చు. రాకపోకల వ్యవస్థలో నిహితమైన ప్రమత్తత ఇందుకు కారణమన్నది నిరాకరించలేని నిజం. ముంబయి నుంచి వచ్చి గువహతిలో దిగబోతుండిన విమానానికి మిక్కిలి సమీపంలో విమానాశ్రయం నుండి మదరాసుకు బయలుదేరిన మరో విమానం దూసుకొని వెళ్లిందట. దిగిన విమానంలోని నూట పదముగ్గురు, ఎగిరిన గగనరథం లోని తొంబయి ఇద్దరు ప్రయాణికులు విస్మయచకితులు కావడం సంభవించిన విపరిణామం. ఇదంతా ఇండిగో సంస్థ వారి చోదకుల భయంకర నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ నిర్లక్ష్యం, ఈ ప్రమత్తత నిన్నమొన్నటిది కాదు. ఇండిగో విమానాలు ఇలాంటి వైపరీత్యాలకు గురికావడం నెలల తరబడి కొనసాగుతున్న వైపరీత్యం. ప్రమాదాలు జరగకుండా తప్పిపోవడం వల్ల చోదక సిబ్బంది నిర్వహణ వ్యవస్థలోని వారు దోషులు కాకుండా పోరు. ఇలాంటి వారిని కనీసం కొన్ని నెలలపాటు సస్పెండు చేసినప్పుడు మాత్రమే వారంతా ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. క్రూరమైన వీరి నిర్లక్ష్య ధోరణికి ఫలితం అనుభవించవలసింది ప్రయాణికులు..
పౌర విమానాలు మాత్రమే కాదు, అత్యంత జాగరూకతతో నిర్వహించవలసిన రక్షణ విమానాలు సైతం తరచు ప్రమాదాలకు గురి అయిపోతున్నాయి. జూలై ఇరవై రెండవ తేదీ మన వైమానిక దళం విమానం బంగాళాఖాతం గగనంలో అదృశ్యమైపోవడం సరికొత్త వైపరీత్యం. గతంలో కూడ ఇలా వైమానిక దళం విమానాలు అదృశ్యమైపోయాయి. కూలిపోయి కాలిపోయాయి. నౌకాదళానికి చెందిన నౌకలు, జలాంతర్గాములు, పడవలు, గస్తీ వాహనాలు కూడ ప్రమాదాలకు గురి అవుతూనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన తరువాత ఎందుకు ప్రమాదం జరిగిందన్న హడావుడి దర్యాప్తులు మొదలవుతున్నాయి. కానీ ప్రమా దాలను నిరోధించడానికి లోప రహితమైన వ్యవస్థలు మాత్రం రూపొందడంలేదు. ఇటీవలి కాలంలో మలేసియానుంచి బయలుదేరిన విమానాలు, ఇండోనేసియానుంచి బయలుదేరిన విమానాలు అంతరిక్షంలో అదృశ్యమైపోయాయి. ఉక్రెయిన్‌లో, ఈజిప్టులో, టర్కీలో ఇంకా అనేక చోట్ల పౌర విమానాలు కూలిపోయాయి! అవన్నీ సుదూర గమ్యాలకు వెడుతూ కూలిపోయా యి, కాలిపోయాయి, అదృశ్యమయ్యాయి. హిందూ మహాసాగరం, ప్రశాంత మహాసాగరం వంటి విస్తృత జలరాశిలో శోధించడం, గాలించడం మిక్కిలి కష్టం. కానీ 22వ తేదీన మద్రాసునుండి బయలుదేరిన వైమానిక దళ విమానం చేరవలసిన గమ్యం మన దేశంలోని పోర్ట్‌బ్లయర్. ఈ విమానం అదృశ్యమైంది బంగాళాఖాతంమీద వ్యాపించిన ఆకాశంలో. కేవలం దాదాపు పదమూడు వందల కిలోమీటర్ల దూరం మాత్రమే పయనించవలసిన ఈ రక్షణ దళాల విమానం అదృశ్యమైంది. విస్తృత అంతర్జాతీయ జలాలలోకాని, గగనంలో కాని కాదు. చిన్నదైన బంగాళాఖాతంలో మన ఆర్థిక జలమండలం, ప్రాదేశిక సార్వభౌమ జలాలు విస్తరించిన ప్రాంతంలోనే విమానం కనపడకుండా పోయింది. మన దేశంలోని రెండు నగరాల మధ్య పయనించే విమానాలు అదృశ్యమయినప్పుడు సైతం వాటి ఉనికిని కనిపెట్టలేని స్థితిలో మన పరిశోధక పటిమ కూలబడి ఉందన్నది నిగ్గుతేలిన నిజం!
అదృశ్యమైన తరువాత రెండువారాల సమయం గడిచిపోయింది. ఇరవై తొమ్మిది మంది రక్షణ సిబ్బంది ఈ ఎఎస్-32 విమానంలో పయనిస్తూ ఉండినారు. వారి కుటుంబాల వారి హృదయాలలో జరుగుతున్న విషాద మథనం గురించి వివరించదగిన అక్షరాలు లేవు! 1980వ దశకంలో మన కనిష్క పౌర విమానం అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయినప్పటినుంచి ఈ మథనం కొనసాగుతోంది. ప్రమాదంలో ప్రయాణికులు మరణించారా? బతికి బయటపడినారా? అన్నది దుర్ఘటన తరువాత స్పష్టమైపోతే సందేహాలు సృష్టించే వివాదానికి చోటుండదు. కాని విమానమెక్కి వెళ్లిన తరువాత తమ కుటుంబ సభ్యు లు బతికి ఉన్నారా లేదా అన్న సందిగ్ధస్థితి హృదయాలను మరింతగా కలచివేస్తుంది. ఎఎన్-32 విమానంలోని రక్షణ సిబ్బందికి చెందిన కుటుంబాలవారు బంధువులు ఇలాంటి సందిగ్ధ స్థితికి రెండు రకాలుగా గురి అయి ఉన్నారు. రక్షణ విమానాలు అనేకం గతంలో కూడా అదృశ్యమైపోయాయి, కూలిపోయాయి. పంజాబ్ రాజధాని చండీగఢ్‌నుంచి 1968 ఫిబ్రవరిలో లడక్‌లోని లే పట్టణానికి బయలుదేరిన వైమానిక దళం విమానం అదృశ్యమైంది. 102 మంది రక్షణ సిబ్బంది ఆ విమానంలో ప్రయాణించారు. ముప్పయి ఏళ్ల తరువాత హిమాచల్ ప్రదేశ్‌లో విమాన అవశేషాలు గుర్తించారు! సిబ్బంది ప్రాణాలు కాలగర్భంలో కలిసిపోయాయన్నది ధ్రువపడని వైపరీత్యం. 1986 మార్చిలో ఏడుగురు రక్షక సిబ్బంది పయనిస్తుండిన ఈ ఎఎన్-32 రకం మరో విమానం గుజరాత్‌లోని జామ్‌నగరం సమీపంలో అదృశ్యమైంది. 1990లో గుజరాత్ తీరంలోనే మిగ్ యుద్ధ విమానం ఒకటి కనిపించకుండాపోయింది. 2002 మరో మిగ్ యుద్ధ విమానం అస్సాంలోని తేజ్‌పూర్ ప్రాంతంలో గాలిలో కలిసిపోయింది. వీటి ఆచూకీ ఇంతవరకూ తెలియరాలేదట! పేలిపోయి కూలిపోయినట్టు లేదా కూలిపోయి పేలిపోయినట్టు ధ్రువపడిన యుద్ధ విమానాల జాబితా వేరేవుంది. కానీ అదృశ్యమైపోవడం మాత్రం సంబంధితులను వివిధ రకాల వ్యథలకు గురి చేస్తోంది.. ఊహించని చోట గోడ దూకడం ఉగ్ర మృగాల స్వభావం. ఊహించని రీతిలో వ్యూహాలను విష పన్నాగాలను అమలు జరపడం కూడ బీభత్సకారుల స్వభావం కావచ్చు! గతంలో అదృశ్యమైన గగనశకటాల మాట ఎలా ఉన్నప్పటికీ జులై ఇరవై రెండున ఈ ఎఎన్-32 యుద్ధ విమానం పోర్ట్‌బ్లయర్ చేరకపోవడానికి ఉగ్రవ్యూహం కారణమా? అన్న అనుమానం అంకురించడం అందువల్ల అతార్కికం కాజాలదు! పరిశోధన, అనే్వషణ ఈ దిశగా కూడ జరగడం భవిష్యత్ భద్రతకు దోహదం చేయలగదు...