మెయన్ ఫీచర్

పర్యావరణ పరిరక్షణలో భూటాన్ ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రీన్‌హౌజ్ శాతం జనహననం
వాయువుల వివరాలు
ఉత్పత్తి రంగం (సంవత్సరానికి)
........................................................................
కట్టడాలు, 6.4 4.3 మిలియన్లు
నిర్మాణాలు
రవాణా 14 1.0 మిలియన్లు
విద్యుత్తు 25 3.7 మిలియన్లు
వ్యవసాయం 24 2.8 మిలియన్లు
పరిశ్రమలు 21 1.0 మిలియన్లు

పర్యావరణ పరిరక్షణ, అంతరి బాధ్యత. అభివృద్ధి పేర పర్యావరణ సమతుల్యం దెబ్బతింటున్నది. ధరిత్రీ సదస్సుల్లో చేసిన తీర్మానాలకు కట్టుబడి ఉండేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలి. గత ఏడాది ప్యారిస్‌లో జరిగిన సదస్సులో 200 దేశాలు భారత్ చొరవతో ఏకతాటిపైకి వచ్చాయి. అంతా కలిసి భూతాపాన్ని రెండు డిగ్రీలు తగ్గిద్దామని నిర్ణయించారు. గత శతాబ్దంలో అన్ని దేశాలు పరస్పరం సహకరించుకునే విధం గా ఓ అడుగు ముందుకేశాయి. ముఖ్యంగా ప్రైవేటీకరణ నేపథ్యం ఇందుకు దారులను ఏర్పరచింది. ఆర్థికపరమైన, మానవ వనరుల పరంగా, వ్యాపారం,వాణిజ్యం ఆలంబనగా ప్రకృతి వనరులు, మేధో సంపద పరస్పరం ఇచ్చిపుచ్చుకున్న కారణంగా చాలా దేశాల్లో జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. కాని ఇందుకు పర్యావరణ పరంగా దేశాలన్నీ తగిన మూల్యం చెల్లించాయి. ముఖ్యంగా భారత్‌లాంటి దేశాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించేందుకు బహుళ జాతి సంస్థలను ఆహ్వానించడం వల్ల కాలుష్యంతో భారతదేశంలో పారిశ్రామిక వాడలు నిండిపోయాయి. సహజంగానే ఇవి సమాజంమీద, పరిసరాలమీద దుష్ప్రభావం చూపాయి. ఇందులో వా యు, జల, ధ్వని కాలుష్యం కాక విద్యుచ్ఛక్తి అపార వినియోగం వల్ల కూడా ఓరకం కాలుష్యం కలుగుతున్నది. తమిళనాడు ప్రభుత్వం ఈ తరహా కాలుష్యాన్ని కూడా గణనలోకి తీసుకుంటున్నది. సహజవనరుల స్వభావం కోల్పోకుండా చూడడం వాటిని సమర్థవంతంగా వినియోగించడం, అనే రెండు రకాల పద్ధతులతో పర్యావరణాన్ని రక్షించుకోవాల్సి ఉంది. గాలి, నీరు, బొగ్గు, ఇంథన శిలాజాలు, ఖనిజ సంపద వీటన్నింటినీ భావితరాలకు సైతం అందిం చి ఉన్నతమైన లక్ష్యంతో నిలుపుకోగల్గిన అభివృద్ధిని సాధించడం ఓ పెద్ద సవాలుగా మారింది. వీటిలో ఆక్సిజన్ శాతం తగ్గడం వల్ల వచ్చే నీటికాలుష్యం వల్ల రకరకాల వ్యాధులొస్తాయి. ఏటా పదిలక్షలమంది కలుషిత నీటివల్ల మరణిస్తున్నారు. 2025 వరకు, 8 దేశాల మధ్య నీటియుద్ధాలు జరుగుతాయని, పర్యావరణ నిపుణులంటున్నారు. మన త్రాగునీరు మురుగు నీటితో కలుషితం కావడం జల కాలుష్యానికి సమీప ఉదాహరణ. ఇక పారిశ్రామిక వ్యర్థ జలాలతో ముప్పు ఎలాగూ ఉంది. గాలిలో ఆక్సిజన్ తగ్గడం వల్ల వచ్చే వాయుకాలుష్యం వల్ల గుండెపోటు, పొడిదగ్గు, ఆస్తమా, క్షయ, క్యాన్సర్, మెదడు సంబంధిత వ్యాధులు, నిద్రలేమి వంటి రోగాలు వస్తాయి. భూమికి 18-23 కిలోమీటర్ల మధ్యలో ఉన్న ఓజోన్ పొర దెబ్బతింటుంది. వాహన కాలుష్యం మనకు రోజూ కనబడే దృశ్యం. ప్రపంచంలో జరిగే యుద్ధాలవల్ల కాలుష్య మేఘాలు, రుతుపవనాలను అడ్డుకొని కరువుల కారణంగా ప్రభుత్వాలు సైతం కూలిపోయిన చరిత్ర మనం చూశాం. ఆమ్ల వర్షాలు, గ్రీన్‌హౌజ్ వాయువులు, అంటార్కిటికాపై ఓజోన్‌ను విచ్ఛిత్తి చేశాయి. ఒక బ్యాటరీని రీఛార్జి చేయవచ్చు. కాని భూమిని రీఛార్జి చేయలేము. భారత్‌లో 250 పైచిలుకు పర్యావరణ చట్టాలున్నాయి. కాని వాటి అమలులో ఎవరికీ చిత్తశుద్ధి లేదు. విషవాయు లీక్ అయన ఘటనలో 3000 మంది చనిపోయిన తరువాతనే భారత్‌లో పర్యావరణ చట్టాలు పదునెక్కాయి. ప్రకృతితో మనకు గల సహజమైన సమన్వయం విషయపై ప్రజలలో అవగాహన పెంచాల్సి ఉంది. నాలుగు లక్షల ఆకులున్న పెద్ద చెట్టు గాలిని బాగా శుభ్రపరుస్తుంది. ఎకరం విస్తీర్ణంలో దట్టంగా ఉన్న చెట్లు ఏటా 13 టన్నుల దుమ్ము, ధూళిని తొలగిస్తాయి. ఒక చెట్టు తన ఆకుల ద్వారా రోజుకు 100 గ్యాలన్ల నీటిని గాలిలోకి తేమ రూపంలో వదులుతుంది. అందుకే చెట్లనీడ చల్లగా ఉం టుంది. ఏబై ఏళ్లలో ఒక చెట్టు 3700 డాలర్ల విలువైన ఆక్సిజన్ అందిస్తుంది. చెట్లవేళ్లు భూగర్భ జలాలనుండి ప్రమాదకరమైన కాలుష్యాలను తొలగించి శుద్ధి చేస్తాయి.
గ్రీన్‌హౌజ్ వాయువులైన క్లోరోఫ్లోరో కార్బన్ల స్థానే, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్లను వాడేందుకు ‘టాటా’ వంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. వీటివల్ల ఓజోన్ పొరను దెబ్బతినకుండా నిరోధించవచ్చు. ఏమైనప్పటికీ గ్రీన్‌హౌజ్ వాయువుల వల్ల ఇప్పటికే చాలా నష్టం జరిగింది. మానవుల మనుగడే ప్రశ్నార్థకమైంది. ఈ విషయంలో భూటాన్ ప్రపంచ పటం ముందు చక్కని ఆదర్శం ప్రదర్శిస్తున్నది.
చైనా భారత్‌ల మధ్య హిమాలయాల్లో ఉన్న చిన్న దేశం భూటాన్, వారి జాతీయ దుస్తులు ప్రపంచలోనే ఒక కొత్త ఒరవడి కలిగివుంటాయి. బౌద్ధమతం బాగా ప్రచారంలోకి వచ్చిన దేశం. ఎక్కడ చూసినా బౌద్ధారామాలు, బౌద్ధ సన్యాసులు కనబడతారు. కాని అది కేవలం ఒక బౌద్ధారామం కాదు. జనాభా కేవలం ఏడు లక్షలు మాత్రమే. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఈ దేశం అక్కడి రాజులు దూరదృష్టి, కృషివల్ల, సుపరిపాలన వల్ల, నిబద్ధత కలిగిన రాజ్యాంగం వల్ల వారి స్థిరమైన అభివృద్ధిని, సాంఘిక భద్రతను, పర్యావరణాన్ని, పండుగలను, అహార విహారాల్ని, సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నది. దీనే్న వారు ‘స్థూల జాతీయ సంతోషం’ అంటారు. వారి దృష్టిలో స్థూల జాతీయ ఉత్పత్తి కంటె స్థూల జాతీయ సంతోషం గొప్పది. నిజమే! ఉత్పత్తుల పేర, ఉత్పాదన మేర, జన జీవన అస్తిత్వమే ప్రమాదంలో పడినప్పుడు అభివృద్ధికి అర్థమేముంటుంది? వారి మొత్తం స్థూల జాతీయాదాయం కేవలం రెండు బిలియన్ డాలర్లు. ఇంత చిన్న దేశం ప్రజల సంతోషం పరమార్థంగా మనుగడ సాగించడం చాలా కష్టతరమైంది. కాని వారు దాన్ని సాధించేశారు. అయితే అక్కడ అందరికీ విద్య ఉచితం. ఆరోగ్యసేవలు ఉచితం, మందులు ఉచితం. వారికున్న పరిమిత వనరుల్ని అతి జాగ్రత్తగా ఉపయోగిస్తారు. కారణం వారి నినాదమైన, విధానమైన స్థూల జాతీయ సంతోషం-దీనికి అంతా కట్టుబడి ఉంటారు. అభివృద్ధి పేర వారి సంస్కృతిని, పర్యావరణపు పచ్చదనాన్ని కోల్పోయేందుకు వారు సిద్ధంగా లేరు. భూటాన్‌లో 72 శాతం భూభాగం అటవీ ప్రాంతమే. వారి రాజ్యాంగం ప్రకారం కనీసం 60% అటవీ ప్రాంతంగా ఉండాలి. రాజ్యాంగం వారిని ప్రజాస్వామ్యం కట్టబెట్టింది. ప్రజలకు విశేషాధికారాలను ఇచ్చా రు. రాజు ఇతర పాలనాధికారులు 65 ఏళ్ల కు విధిగా ఉద్యోగ విరమణ చేయాల్సిందే. 72 శాతం అటవీ ప్రాంతం కావడం వల్ల ప్రపంచంలోని అతికొద్ది జీవవైవిధ్య ప్రాముఖ్యత కలిగిన దేశాల్లో భూటాన్ ఒకటి. అందుకే దేశంలో కర్బన ఉద్గారాలనేవి ఉండవు. ప్రపంచంలో కర్బన ఉద్గారాలు లేని దేశం ఇది ఒక్కటే. మొత్తం భూటాన్ దేశంలో వెలువడే ఏడాది మొత్తం కర్బన ఉద్గారాల పరిమాణం రెండు మిలియన్ టన్నులు. కాని వారి అడవులవల్ల అందుకు మూడింతలుగా ఆక్సిజన్ లభ్యమై ఉద్గార ప్రభావం సున్న అయిపోతుంది. వేగంగా ప్రవహించే ఆదేశంలోని నదుల వల్ల శుద్ధమైన విద్యుత్తును వారు ఉత్పత్తి చేయగలుగుతున్నారు. ఈ విద్యుత్తును ఇతర దేశాలకు వారు సరఫరా చేస్తున్నారు. ఇది పరిసరాల్లో 50 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తుంది. ప్రపంచంలో భూమి ఉష్ణోగ్రత పెరిగిన కారణంగా జరుగుతున్న అనర్థం వల్ల భూటాన్‌లోనూ నష్టం జరుగుతున్నది. నిజానికి భూటాన్ చేసిన పాపమేమీ లేదు. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి పేర పెరిగిన భూతాపం భూటాన్‌లో మంచు చరియలు కరిగేందుకు, విరిగిపడేందుకు, జల ప్రళయాలను సృష్టించేందుకు కారణమవుతున్నది. భూటాన్‌లో సుమారు 2700 పైచిలుకు మంచుకొండలున్నాయి. అలాగని వారు చూస్తూ కూర్చోలేదు. తమ వ్యవసాయ దారులందరికీ ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నారు. విద్యుత్తుతో నడిచే కార్లను, రవాణాను ప్రోత్సహిస్తున్నారు. విద్యుత్తు లభ్యతవల్ల వారు వంటచెరుకును వాడనక్కరలేదు. దేశమంతా చెట్లు నాటుతున్నారు. ‘క్లీన్ భూటాన్’ పేర దేశమంతా శుభ్రతను పాటిస్తున్నారు. కాగితం వాడని కార్యాలయాలను రూపొందిస్తున్నారు. జాతీయ పార్కులు, జీవవైవిధ్య పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. వాటిని దేశవ్యాప్తంగా అనుసంధానిస్తున్నారు. క్రూర మృగాలు సైతం స్వేచ్ఛగా తిరిగేలా చేస్తున్నారు. అందుకోసం వనరులు కావాలి. అందుకోసం ‘జీవితం కోసం భూటాన్’ పేర నిధి సేకరణ చేపట్టారు. 15 ఏళ్ల పాటు దీన్ని కొనసాగించనున్నారు. ఆ తరువాత స్వ యం సమృద్ధితో ప్రకృతిని రక్షించుకునేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఒక చిన్న దేశం భూటాన్ పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న ఈ పవిత్ర ప్రయత్నం గురించి చాలా మందికి తెలియదు. వాతావరణ మార్పులపై పనిచేస్తున్న ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అంచనా ప్రకారం 1980-2100 మధ్య 1.4 నుంచి 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగుతుంది. ఈ పెరుగుదల ఆపాలంటే భూటాన్ దేశాన్ని ప్రపంచ దేశాలు ప్రమాణంగా తీసుకొని పనిచేయాలి. అప్పుడే ప్రకృతి మాత పులకిస్తుంది.

చిత్రం... ప్రకృతి సోయగాలతో కళకళలాడే భూటాన్

- తాడేపల్లి హనుమత్ ప్రసాద్ సెల్: 9676190888