సబ్ ఫీచర్

ఆదర్శ పాఠశాలలు పటిష్ఠం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడచిన కొనే్నళ్ళుగా చాలా జిల్లాల్లో మొత్తం ఐదు తరగతులకూ ఒకరిద్దరు ఉపాధ్యాయులతోనే విద్య కొనసాగించే పరిస్థితి. ఇందువల్ల ఏ తరగతికీ పూర్తి స్థాయి న్యాయం చేయలేని దుస్థితి ఏఒక్కరు సెలవుపెట్టినా ఆరోజుకి కొన్ని తరగతులు బోధన పూర్తిగా నిలిచిపోయే స్థితి. ఇలా మొత్తంమీద ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన, ప్రమాణాలు దయనీయ స్థితుల్లో ఉండేవి. విద్యాశాఖతోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే సర్వేల్లో తేలిన వాస్తవం ఇది. అందుకే అట్టడుగున ఉన్న ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంకోసం ప్రభుత్వ ఆదర్శపాఠశాలల విధానాన్ని తెరపైకి తేవడం శుభపరిణామం.
ఈ విషయమై శ్రీకాకుళం జిల్లాలో 214 ఆదర్శ పాఠశాలలు సర్దుబాటు ప్రక్రియలతో తెచ్చారు. తక్కువ విద్యార్థులతో కొనసాగుతున్న వీటిలో సమీప పాఠశాలలను విలీనం చేసి వీటిని ఆదర్శ పాఠశాలలుగా పేరుపెడ్తూ ఏర్పాటుచేయడం సరైన విద్యావ్యవస్థతో విద్యాకుసుమాలు కళకళలాడుతున్నారనటం అతిశయోక్తికాదు. దానివల్ల పిల్లల విద్యాప్రమాణాలు, సామర్థ్యం పెరిగి ప్రతి విద్యార్థికి బలమైన పునాది ఏర్పడుతుంది. దీనికి చక్కని ఉదాహరణ శ్రీకాకుళం బూర్జమండలంలోని గుత్తావిల్లి ప్రాథమిక పాఠశాల. గతంలో ఇక్కడ ఐదు తరగతి గదులకు ఒక్కరే ఉపాధ్యాయుడుండేవారు. ప్రస్తుతం దీన్ని సమీప పాఠశాలలో విలీనం చేశారు. దీంతో ప్రస్తుతం ఇక్కడ 87 మంది విద్యార్థులు ఉపాధ్యాయులు మాత్రం ఆరుగురు. ప్రతి తరగతికి ఓ ఉపాధ్యాయుడు. అన్ని పీరియడ్స్ పాఠాలు చెప్పేందుకు అవకాశం కలిగింది. ఇలా కొన్ని మండలాల్లో ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయడం ద్వారా ఏర్పడిన ఆదర్శ పాఠశాలల కారణంగా విద్యార్థులకు ప్రయోజనం కల్గుతోంది.
ప్రాథమిక విద్య బలోపేతం అయినప్పటికీ ఆదర్శ పాఠశాలల్లో ఎక్కువ ఉపాధ్యాయులను నియమించడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టంతో కూడుకున్న పని. ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ప్రాథమిక విద్య బలోపేతం కావడం ఖాయమైనప్పటికీ కొన్ని కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ప్రాథమిక స్థాయిలో వున్నవారికి పూర్తిగా ఆంగ్ల బోధన చేయడం ఉపాధ్యాయులకు సాధ్యంకాదు. ఎందుకంటే ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమం నుంచి వచ్చిన వారు కాదు. అలాగే ఐదో తరగతి ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు ఒకే సంవత్సరంలో పూర్తిగా ఆంగ్ల బోధన చేసినప్పటికీ ఆ విద్యార్థి విద్యను అందుకోలేని పరిస్థితి. దీనివల్ల విద్యావిధానపు పునాదులు బలహీనపడే అవకాశం ఉన్నా కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడినట్లు అవుతుందేమో!
‘‘ప్రయివేటు స్కూళ్ళలో విద్యార్థుల వద్ద ఫీజులు గుంజితే పాఠాలు చక్కగా చెబుతారు. అందుకే ఫీజులు కడుతున్నాం అదే ప్రభుత్వ పాఠశాలలో అయితే అస్సలు విద్యాబోధన వుండదు’’ అనే అపోహలో తల్లిదం డ్రులు వున్నారు. ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల్లో విద్యాబోధనలో సరైన పర్యవేక్షణ లేకపోతే అసలుకే మోసం జరిగి ఆదర్శ పాఠశాలలనుంచి వెళ్ళి ప్రైవేటు స్కూళ్ళలో వలసపోయే విద్యార్థుల్ని తిరిగి ఆదర్శ పాఠశాలలకు తీసుకురావడంకోసం తలప్రాణం తోకకొస్తుందేమో! అనే రీతిలో కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మన నవ్యాంధ్రప్రదేశ్‌లో తల్లి ఒడి నుంచి బిడ్డ నేరుగా ప్రాథమిక పాఠశాలలకు వస్తారు. అలాంటివారి భవిష్యత్ దృష్టిలో వుంచుకొని వారి విద్య బలోపేతం కావడంకోసం పటిష్టమైన నిర్దేశికాలతో సరైన అధికారుల పర్యవేక్షణ ఉండాలి. దీంతో పాటు పాటుగా ఆంగ్ల మాధ్యమంలో అనుభవంగల ఉపాధ్యాయులను నియమించి ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంపై అవగాహన కల్పించాలి. ప్రాథమిక పాఠశాలలను నిర్మించి పటిష్టమైన ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయేతర సిబ్బందిని నియమిస్తూ సరైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆశిద్దాం!

- ఈవేమన