వీరాజీయం

బ్రాండ్ అంబాసిడర్‌లుగా ‘తార’లే ఉండాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బ్రాండ్ అంబాసిడర్’ అంటే అదేదో రాయబారి పదవి అనుకోకూడదు. మన టూరిజం డిపార్ట్‌మెంట్‌కి- మన దేశానికి- విదేశీ మారక ద్రవ్యం తేడానికి యింకా ఎక్కువ మంది టూరిస్టులను ఆకర్షించడానికి - పర్యాటక శాఖకూ గ్లామర్, పలుకుబడి వున్న ప్రజల నోళ్లలో నిత్యం నానే పర్సనాలిటీని ఎంచుకుంటారు.
అమీర్‌ఖాన్ మియాఁ నిన్నటిదాకా -‘మహోజ్జ్వల భారత్’: ‘ఇన్‌క్రిడిబుల్ భారత్’అంటూ వెలిగాడు. మన తాజ్‌మహల్ లాంటి టూరిస్ట్ అట్రాక్షన్‌గల పాపులర్ అంశాలకి ‘బాకా’ పట్టాలి. వచ్చే టూరిస్టులు మాకు అతిధి దేవుళ్లు అంటూ- ‘అతిధి దేవోభవ’ అంటూ టూరిజం శాఖకి ఒక ప్రచార బయస్కోపుని కూడా తీసి అందించిన ఘనత వహించిన బాలీవుడ్ చలనచిత్ర నవాబు అమీర్‌ఖాన్- పదేళ్లనుంచీ మన భారత్- ‘దటీజ్ ఇండియా’కి బాకాపట్టే గౌరవప్రదమయిన- అనేక సదుపాయాలున్న బ్రాండ్ అంబాసిడర్‌గా వుంటున్నాడు రుూ ‘‘అమీర్’’ ఖాన్.
మనకి ముగ్గురు ఖాన్‌లున్నారు. సల్మాన్, షారూఖ్, అమీర్‌లు. ఎవరి మట్టుకి వాళ్లే- ‘‘బాద్‌షాలం’’అనుకుంటూ విర్రవీగుతూ వుంటారు. ముగ్గురూ ముగ్గురే అంటూ- బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపిస్తూ వున్నారు- ఇండియన్ ఆడియన్స్- క్షమించాలి- అమీర్‌మియా తీసిన- ముగ్గురు ఇడియట్స్ అన్న సినిమా టైటిల్ మీకు రుూ సందర్భంలో స్ఫురించినా నాదికాదు బాధ్యత.
సందర్భం ఏమిటీ అంటే కోట్లాది ప్రజల హృదయాలను- వాళ్ల జేబులనూ దోచుకుంటున్నట్లుగా పేర్గాంచిన ‘పి.కే.’చిత్రం- జ్ఞాపకం వుందా? దాని వాల్‌పోస్టర్ సంచలనం సృష్టించింది. దానికి మొట్టమొదటిసారి- ఇండియన్ ఆడియన్స్ వంద కోట్ల రూపాయల కలెక్షన్ సమర్పించి ‘మేము సహనానికి మారుపేరుగాళ్లం’- అన్న సర్ట్ఫికెట్ కూడా సంపాదించుకున్నారు.
ఐతే, పోయిన నవంబర్‌లో అర్జెంట్‌గా ఒక ప్రముఖ మీడియా అవార్డు ప్రదానోత్సవంలో అమీర్‌ఖాన్- ‘‘బ్రాండ్ అంబాసిడర్‌గా నేను దేనికీ రాజీపడను’’అన్న పోజుపెట్టి- ఇండియాలో ‘సహనం’లాంటి పదార్థమేదీ లేదంటూ- స్టేట్‌మెంట్ స్టేజీ అదిరేలాగా యిచ్చేశాడు. ‘‘పైగా’’ ఆ సంగతి- మా యింటావిడ చెప్పింద’’ని కూడా- ఉద్వేగానికి లోనుఅయ్యాడు. పెళ్లాం చెబితే వినాలి కదండీ!
అందుకే, ఇన్‌క్రిడిబుల్ అన్నారు క్రిటిక్స్. అవును. ‘మన దేశం మహోజ్జ్వలమైంది’అని గవర్నమెంట్ తరఫున డబ్బాకొడుతున్న లేదా డబ్బాకొట్టడానికి నియమితుడయిన వ్యక్తి అంత మాటన్నాడంటే- సామాన్యమైన విషయమా, అది? వలువలు (విలువలు కూడా) అన్నీ వదిలేసి- ‘నంగా’గా ఒక చిన్న ట్రాన్సిస్టర్‌ని, ‘్ఫగ్‌లీఫ్’గా ముందుపెట్టుకుని- సినిమా పోస్టర్‌లు రిలీజ్‌చేసుకుని- ఆ సిగ్గుమాలిన తనానికి కోర్టులో కూడా ముద్రవేయించుకున్న అమీర్‌ఖాన్‌కి యిప్పుడు- బ్రాండ్ అంబాసిడర్ అన్న బిరుదు- ‘పి.కే’శారు.
‘దొంగలుపడ్డ ఆర్నెల్లకి’అంటూ ఏదో సామెత చెబుతారే అలాగు వుందీ మాట. కాని ‘‘అదేం లేదు’’అన్నాడు టూరిజం శాఖామాత్యుడు. అమీర్‌ఖాన్ని మేము నియమించలేదు. మేం పీకేయలేదు. ఒక అడ్వర్‌టైజ్‌మెంట్ ఏజెన్సీ ‘‘మక్కాన్ వరల్డ్‌గ్రూపు’’కి కాంట్రాక్టు యిచ్చాం. వాళ్లు అమీర్‌భాయ్‌ని తెచ్చుకున్నారు’’-అంటూ అపాలజిటిక్‌గా చెప్పుకుపోయాడు. ‘‘కాకపోతే కొంతమంది గిట్టనివాళ్లు- ‘అమీర్‌ఖాన్‌ని పీకేశారు- అమితాబ్‌ని అందలం ఎక్కించారు’- అంటూ పళ్లికిలిస్తూ ఆనందిస్తున్నారు తప్ప- గవర్నమెంటు ఎప్పుడూ ‘‘ఖాన్‌త్రయాన్ని’’ తప్పుపట్టలేదు. కాకపోతే అమీర్‌ఖాన్‌కి ‘యాడ్’లిచ్చిన ‘‘స్నాప్‌డీల్’’లాంటి బడా కంపెనీలు అమీర్‌ఖాన్ పలికిన సత్యవచనములు మేం ఎండార్స్‌చెయ్యం. అవి అతని సొంత వాక్యములు’’ - అన్నారు అర్జంటుగా భుజాలు తడుముకొని అంటే అమీర్‌ఖాన్ కాంట్రాక్టు అయిపోయేవరకూ అంబాసిడర్‌గా కొనసాగేడని యావన్మంది ఇండియన్స్ యిందుమూలంగా గ్రహించాలనే మనవి- బైది బై గవర్నమెంటు- ఇన్‌డైరెక్ట్‌గానే అనుకోండి- అక్షయ్‌కుమార్, అమితాభ్‌బచ్చన్, దీపికాపడుకొనే- ప్రియాంకాఛోప్రాల పేర్లు పరిశీలిస్తున్నామనీ- భోగట్టా వెల్లడిచేశారు. భారతదేశ సంస్కృతీ-ప్రాచీన వైభవం మొదలు అందరికీ యోగా, ‘‘స్వచ్ఛ్భారత్’’ ఉద్యమాలదాకా అన్నింటికీ ప్రచారం కల్పించే రుూ సోకాల్డ్ అంబాసిడర్ పదవికి- సినిమా తారలే గానీ- ఇతర రంగాల హేమాహేమీలు పనికిరారా? ‘వీల్‌ఛైర్’లో కూర్చున్నప్పటికీ- స్టార్- సినిమా గ్లామర్‌తోనే మన టూరిజానికి ఊతంయిస్తుందా? పైగా రుూ స్టార్స్ అందరికీ పోలీసు కావాలిట! ‘కౌపీన సంరక్షణార్థం ఇయం పటాటోపం’ అంటారు దీనే్న.
బై ది బై అమీర్‌ఖాన్- షారూఖ్‌ఖాన్‌తోపాటు మరో 37 మందికి పోలీసు బలగ రక్షణని చాలావరకూ కట్ చేశారుట!
దిసీజ్ గ్రాస్ ఇన్‌టోలరెన్స్!