సబ్ ఫీచర్

రాజ్యాంగంలో మార్పులు తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూట ముప్పై సంవత్సరాలనుండి నిరంతరంగా కొనసాగుతున్న జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి ఈనాటివరకు కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు దాదాపు పదహారు వందల పైచిలుకు ఉన్నట్లు సమాచారం. ఆయా పార్టీలు ఆవిర్భావం నాటినుండి ఈనాటివరకు ఒకే కుటుంబీకులు పార్టీ అధినేతలుగా అవుతున్నారు. అంటే ముత్తాత నుండి ముని మనుమడి వరకు కొనసాగడానికే మన ప్రజాస్వామ్యం బాటలు వేసింది. అంతే కాకుండా ముత్తాత నుండి మునిమనుమడివరకు ఒకే నియోజకవర్గానికి పదే పదే ప్రాతినిధ్యం వహించుట వారి పరిపాలనా దక్షతకు గీటురాయన్నట్లు మనం చెప్పుకునే ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యంగా మారినది.
భిక్షాటన చేసే పౌరుడి నుండి మిలియనీర్ వరకు ఎదిగిన పౌరుడివరకు ఎన్నికలలో పోటీ చేయవచ్చును. ఎన్నికలలో ఓటు వేయవచ్చును. పద్దెనిమిది సంవత్సరాల వయసునుండి జీవితాంతం అక్షరాస్యతతో సంబంధము లేకుండా, స్ర్తిపురుషులు అనే తేడా లేకుండా మన దేశ ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించిన రెండవ రకం స్వర్గతుల్యమైన ప్రజాస్వా మ్యం. ఈ ప్రజాస్వామ్యమే ఆదర్శవంతమైనదిగా భావించే భ్రమల నుండి మన ప్రజలు బయటపడడానికెంత సమయం పట్టవచ్చునో రాజకీయ శాస్త్రంలో రాటుతేలిన తేలుతున్న బుద్ధిజీవులు చెప్పవలసిన విషయం. ఒక పర్యాయం ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినవారు ప్రజాసేవలోనే కొనసాగాలనుకున్నవారు ప్రతిసారి నూతన నియోజకవర్గంనుండి పోటీచేయాలనే నిబంధన రాజ్యాంగంలో పొందుపర్చాలని చట్టసభలలో తీర్మానం చేయగలిగినప్పుడు అది అసలు సిసలైన ప్రజాస్వామ్యం కాగలదని సామాన్య ప్రజల అభిప్రాయము.
ఆర్థిక వనరులు లేని సజ్జనులు, విద్యావంతులైన సమర్థవంతులు పార్టీలకు అతీతంగా చట్టసభలకు ఎన్నుకోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటుచేయగలిగినప్పుడే మన దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రము వచ్చినట్లు అనేది మేధావుల అభిప్రాయము. ఇది ఎంతవరకు సాధ్యవౌతదనేది దేశ ప్రజల బాధ్యత. కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పురుడు పోసుకున్న నాటినుండి ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల కాలంలో ఎంతమంది పార్టీ అధ్యక్షులుగా కొనసాగారు? వారు ఏఏ సామాజిక వర్గాలకు చెందినవారో ఆయా పార్టీల అధినేతలు ప్రకటించగలిగితేనే వారు ఆధిపత్యం వహిస్తున్న పార్టీలు నిజమైన ప్రజాస్వామిక పార్టీలుగా ప్రజలు గుర్తిస్తారు.
అనేక మతాలు, కులాలు, భాషలు కలిగి వేల సంవత్సరాలుగా సనాతన ధర్మం పరిఢవిల్లిన భారతదేశం యొక్క రాజ్యాంగంలో ‘సామ్యవాదాన్ని’ చొప్పించడం విడ్డూరం. ఏ దేశంలో పుట్టిపెరిగిందో అక్కడే అంత్యక్రియలు చేయబడ్డ సామ్యవాదానికి భారతదేశంలో దింపుడుకళ్ల మెందుకని ప్రపంచీకరణలో ఎదుగుతున్న యువకిశోరాలు వేస్తున్న ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు? యూరోపియన్ దేశాలలో మతాధిపతులు, రాజ్యాధికారుల మధ్య నిరంతరం ఆధిపత్య పోరాటాలు జరుగుతుండేవి. ఆ పోరాటాలను నిరోధించడం కోసం మతాధిపతులు, రాజ్యాధికారుల మధ్య జరిగిన ఒప్పందమే ‘సెక్యులరిజం’. అట్టి సెక్యులరిజాన్ని మన దేశ రాజ్యాంగంలో పొందుపరిచినారు. కాని అట్టి సెక్యులరిజం భావానికి అతీతంగా మన దేశ ప్రజలను మైనారిటీ, మెజారిటీలుగా విడదీయడం, ఉమ్మడి పౌరసత్వాన్ని అమలుచేయకపోవడం, కులాల పరంగా ప్రత్యేక చట్టాలను (అట్రాసిటి) అమలు చేయడం, రిజర్వేషన్స్ పేరుతో విద్యావంతులైన అగ్ర కులాలలోని వారికి ప్రాధాన్యత లేకుండా చేయడం, రిజర్వేషన్స్ సౌకర్యం పొందుతున్నవారి గొంతెమ్మ కోర్కెలతో నిరంతర ఉద్యమాలు చేయడం వల్ల కులాల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయ. దీనివల్ల దేశ సమగ్రతకు, అభివృద్ధికి సెక్యులరిజం అడ్డుగోడలుగా మారినది. ఏది ఏమైనప్పటికి భారతదేశ రాజ్యాంగాన్ని పునఃసమీక్ష జరిపి రాజ్యాంగంలో పొందుపర్చిన ‘‘సామ్యవాదం, లౌకిక వాదం’’ అనే పదాలను తొలగిస్తూ ప్రస్తుత సమాజానికి అనుగుణంగా భారత రాజ్యాంగంలో అనూహ్యమైన మార్పులు తేవాలన్నదే భారత ప్రజల ఆకాంక్ష. ఇందుకు ప్రధాన పాత్ర పోషించవలసిన బాధ్యత బుద్ధిజీవులపై ఉన్నది.

- బలుసా జగతయ్య