సబ్ ఫీచర్

ఇంత ‘‘అసహనం’’ అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మేము సహించబోము...ఏమిటి? మనం సహించబోము అని జ్ఞానులు ఎవరైనా నాకు జ్ఞానోదయం కలిగిస్తారా దయచేసి? సహనాన్నా? అసహనాన్నా? సహనం, అసహనం రెండూ కూడా మన వైవిధ్యభరితమైన భారతదేశం యొక్క విడదీయలేని రెండు పార్శ్వాలు అని నమ్మే బహుసంఖ్యాక అల్పజ్ఞానులలో నేను ఒక దాన్ని.
అకస్మాత్తుగా దేశంలో అందరూ అన్నిటి గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఎవరూ కూడా విషయాలపై నా అభిప్రాయం అడగడం లేదు, విషయాలపై నా పంథా అడుగుతున్నారు. గోమాంస భక్షణపై మీ పంథా ఏమిటి? మత అసహనంపై మీ పంథా ఏమిటి? అశ్లీల చిత్రాలపై మీ పంథా ఏమిటి? భారతదేశ అల్పసంఖ్యాత స్వయం ప్రకటిత జ్ఞానుల పంథాతో నా పంథా ఏకీభవించకపోతే నేను దేశద్రోహిని. నన్ను బంగాళాఖాతంలో తోసెయ్యాలి లేదా సిరియాకి పంపేయాలి.
పెహలాజ్ నిహోలని, సి.బి.యఫ్.సి. చైర్మన్ ‘యాంగ్రీ ఇండియన్ గాడెసెస్’ అనే చలనచిత్రం పేరు పట్ల అసహనాన్ని వ్యక్తంచేసారు. ఇంతకీ ఆయన్ను అసహనానికి గురిచేసిన విషయం ఏంటనేది నాకు అర్థంకాని విషయం? భారతీయ స్ర్తిమూర్తులు లేదా దేవతలకు కోపం రాకూడదనా లేదా భారతీయ స్ర్తిలను దేవతలతో పోల్చకూడదనా? భారతీయ స్ర్తిలను సంబోధించేటప్పుడు ‘‘దేవియోం’’అని సంబోధిస్తారు మన గౌరవనీయులైన మంత్రులు. వారు భారతీయ స్ర్తిలను దేవతలతో పోల్చవద్దని నిషేధం తెచ్చే ఆలోచన చేయవచ్చేమో. పెహలాజ్ సర్‌కి నూతన జేమ్స్‌బాండ్ చిత్రంలోని దీర్ఘ చుంబన దృశ్యాలపై కూడా అభ్యంతరాలు ఉన్నాయి. దీర్ఘ చుంబనాలు భారతీయ సంస్కృతిలోని భాగాలు కావు అని ఉద్ఘాటించారు పెహలాజ్‌గారు. భారతీయ మనోభావాల ప్రకారం ప్రామాణిక చుంబన వ్యవధిని తెలుపగలరా సర్ జి? దీర్ఘచుంబనాలు మన సంస్కృతిలోని భాగాలు కానప్పుడు మీరు అభ్యంతరాలు తెలపని హేట్‌స్టోరి-3లోని దీర్ఘ రసభరితమైన దృశ్యాలు మాత్రం భారతీయ సంస్కృతిలోని భాగాలు ఎలా అవుతాయి సర్‌జీ? ఆస్ట్రేలియాలో నివాసముంటున్న ఒక స్నేహితురాలితో నిన్న సరదాగా మాట్లాడుతుండగా అడిగాను, ‘‘బీఫ్ తిన్నావా ఎప్పుడన్నా ఎలా ఉంటుంది?’’ అని.
తను మెల్లగా ఫోన్‌లో గుసగుసలాడింది. తిన్నాను, అస్సలు బాగోలేదు.
‘‘ఎందుకు?’’ మెల్లగా మాట్లాడుతున్నావు అని అడిగా.
‘‘రాజాభయ్యా మనోభావాలు దెబ్బతినవచ్చేమోనని...’’
గోమాత కోసం తన జీవితాన్ని అర్పించేందుకైనా సిద్ధమేనన్న రాజా భయ్యా, గోషామహల్ యం.యల్.ఏ.
‘‘్భయ్యాజీ! గోమాంసం తిన్నందుకు, పైగా అది నచ్చనందుకునా స్నేహితురాలిని క్షమించండి. పాపం పిచ్చిది, పరదేశంలో ఉండడం చేత, ఏ విషయాలు భారతీయుల మనోభావాలను దెబ్బతీయగలవో, ఏ విషయాలు దెబ్బతీయలేవో అనే సంశయంలో కొట్టుమిట్టాడుతున్నది.
గోమాంసం తినడంవల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి గోమాంస భక్షణాన్ని నిషేధించమని కోరుకుంటున్నారు. మరి ఈశాన్య భారతదేశంలో శునక మాంసం విరివిగా తింటారు. దానివల్ల నా మతపరమైన మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. కాలభైరవుడు, నీ ఇష్టదైవం శివుని యొక్క అంశానుభూతుడు ఎవరన్నా నీ మనోభావాలయందు దయుంచి శునక మాంస భక్షణాన్ని నిషేధించగలరు. ఇలాంటి విషయాలు మునుముందట ఇంకా ఎన్నిరకాల నిషేధాలకు దారితీస్తాయో మరి! ఇతరుల ఆహారపు అలవాట్లపట్ల కూడా విపరీతమైన అసహనానికి గురయ్యే మనస్తత్వం అకస్మాత్తుగా ఇంత పెరిగిపోయిందేమిటో?
నిన్న ఒక మిత్ర ప్రబుద్ధులు ముఖ పుస్తకంలో సెలవిచ్చారు. భారతీయ స్ర్తిలకు ఉమ్మడి ఏకరూప వస్తధ్రారణ అమలుచేయాలి అని. సర్‌జీ, మీరు దానికి బదులు కృశించుకుపోతున్న భారతీయ పురుష మనస్తత్వాల ఉమ్మడి మానసిక పరిణామాన్ని ప్రతిపాదించవచ్చు కదా. రాజస్థాన్ యం.యల్.ఏ. శ్రీ భన్వర్‌లాల్ సింగల్, స్కూళ్ళలో విద్యార్థినులు ధరించే స్కర్ట్‌లను నిషేధించమని సలహా ఇచ్చారు. ఆ విధంగా ఆడపిల్లలు వారిని వారు కాపాడుకోవచ్చునని ఆయన అభిప్రాయమంట. గౌరవనీయులైన యం.యల్.ఏ.గారికి సవినయంగా తెలియచేసుకుంటున్నది ఏమిటంటే, ప్రపంచంలో ఆప్ఘనిస్థాన్ స్ర్తిలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా పరిగణించబడింది. మరి అక్కడ ఒక్క ఆడపిల్లకూడా స్కర్ట్ ధరించదే! ఆడపిల్లలు స్కర్ట్‌లు వేసుకోవాలా లేదా అనేది వారికి వదిలేసి స్ర్తిలంతా ఉమ్మడిగా సురక్షితంగా గాలి పీల్చేటట్టు చట్టసభల్లో సవరణలు తేవచ్చు కదా సర్‌జీ!
చాలామంది స్వయం ప్రకటిత హిందు సంరక్షకులు దేశంలో ఉమ్మడి మత స్మృతి తేవాలని కోరుకుంటున్నారు. ఘర్‌వాపసీ లాంటి సిద్ధాంతం హిందూమతంలో లేదు. వారివారి భిన్న వ్యక్తిత్వాలకు అనువుగా ఉండేటట్టు వారికి నచ్చిన తత్వసారాన్ని ఎన్నుకునే స్వాతంత్య్రం హిందూ మతం ప్రతి ఒక్కరికి ఇచ్చింది. ‘‘ఏకం సత్యం; విప్ర బహుధా వదంతి’’అనే హిందూమత బోధన. సత్యం, ఎప్పటికీ ఒక్కటే. కాని దాన్ని చేరుకునే దారులు అనేకం ఉండచ్చు. వైవిధ్యత అనేది మన వేదాల మూలస్తంభం. వేదాలలోని విడదీయలేని భాగాలు సాంఖ్య, యోగ మరియు మీమాంసలు వేదకాలంనాటి నుండి కూడా మానవుల్లో శాస్ర్తియ ఆలోచనలను ప్రోత్సహించాయి. మూడు కోట్ల దేవతలలో ఇష్టదైవాన్ని ఎన్నుకునే స్వాతంత్య్రం హిందూమతం మనకిచ్చింది. ఇంత వైవిధ్య భరితమైన అద్భుతమైన మతాన్ని సంకుచిత భావాజాలంతో బంధించి చూడటం ఎంతవరకు సమంజసం?
పంజాబీలు అంటే మనకు స్మరణకు వచ్చేది. జీవితం పట్ల వారి ప్రసన్నవైఖరి మరియు వారి అద్భుతమైన హాస్యప్రవృత్తి. వారి హాస్యప్రవృత్తి ఎంత విశాలమయినది అంటే వారు తమమీద తాము చలోక్తులు వేసుకుని నవ్వడానికి, నవ్వించడానికి కూడా ఏరోజు వెనకంజ వెయ్యలేదు.

- సంజీవని కుసుమ్ సెల్ - 8500707056