మెయన్ ఫీచర్

‘ఆవు’ నమ్ముతోంది.. ‘తోడేలు’ దూకుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ ప్రభుత్వం వారి మాటలను విశ్వసించకుండా పోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని దేశ వ్యవహారాల శాఖామాత్యులు రాజనాథ్‌సింగ్ జనవరి పనె్నండవ తేదీన ప్రకటించడం చారిత్రక పునరావృత్తి! జనవరి రెండవ తేదీన పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక దళం స్థావరంపై దాడి చేయించినవారు పాకిస్తాన్‌లో నక్కి ఉన్నారు. ఈ నక్కి ఉన్న జిహాదీ బీభత్సకారులను పసికట్టి పట్టుకొని పాకిస్తాన్ ప్రభుత్వం వారిని శిక్షించగలదట! ఈ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం మాటలను విశ్వసించి తీరాలన్నది రాజ్‌నాథ్‌సింగ్ నోట వెంట ఆవిష్కృతమైన మన ప్రభుత్వ విధానం!! అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వం వారి ‘‘మంచితనం’’ పట్ల మన ప్రభుత్వంవారి విశ్వాసం మరోసారి వ్యక్తమైంది!! ఈ ‘పునరావృత్తి’ క్రీస్తుశకం 2014 జూలై 27న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా ‘దీనానగర్’ పోలీస్‌స్టేషన్‌పై పాకిస్తానీ జిహాదీలు దాడిచేసిన తరువాత కూడ మన ప్రభుత్వ విధానంలో ప్రస్ఫుటించింది!! అందువల్ల ‘పాకిస్తాన్ మంచితనం’పట్ల ఇప్పుడు మన ప్రభుత్వం ప్రకటించిన ‘విశ్వాసం’ జిహాదీల బీభత్స చరిత్రలో ఎన్నవ ‘ఆవృత్తి’అన్నది సహజంగా ఉత్పన్నమయ్యే ప్రశ్న!! ‘‘విశ్వసించడం’’ మన ప్రభుత్వ విధాన ‘పునరావృత్తి’, వంచించడం పాకిస్తాన్ ప్రభుత్వ విధాన ‘పునరావృత్తి’.... అంతకు పూర్వంనాటి పునరావృత్తుల- రిపిటీషన్స్- జ్ఞాపకాలు మరుగుపడినప్పటికీ, క్రీస్తుశకం 1993లో పాకిస్తానీ తొత్తులైన దావూద్ ఇబ్ర హీం వంటివారు ముంబయిలో భయంకర రక్తపాతం సృష్టించిన నాటినుండి జరిగిపోతున్న ‘పునరావృత్తులు’ మాత్రం వికృతంగా మన దేశ ప్రజలను వెక్కిరిస్తున్నాయి. మన ప్రభుత్వ నిర్వాహకులు ఎన్నిసార్లు విశ్వసించారు?! పాకిస్తాన్ ప్రభుత్వ నిర్వాహకులుగా చెలామణి అవుతున్న ‘జిహాదీ’లు ఎన్నిసార్లు వంచించారు!! ఇప్పుడు మళ్లీ విశ్వసించిన రాజ్‌నాథ్‌సింగ్ చెప్పగలరా?? ప్రధాని నరేంద్రమోదీ వివరించగలరా?? విశ్వసించే వారికి ‘ఎగ్గు’లేనప్పుడు మోసగించేవారికి ‘సిగ్గు’ఎందుకుండాలి?? ఆవులు అమాయకంగా నమ్ముతున్నాయి, తోడేళ్లు ఆవుల గొంతుకలను కొరికి నమిలి మింగుతున్నాయి! ఇదీ పునరావృత్తి- పదే పదే జరుగుతున్నది!!
మణిపూర్‌లో, గత జూన్ నెలలో దేశ విద్రోహ బీభత్సకారులు మన సైనికులపై దాడి చేసి ఇరవై మందిని హత్యచేశారు. ఈ హత్యాకాండ జరిపిన దేశ ద్రోహుల స్థావరాలు మన ఈశాన్య ప్రాంతానికి ఆనుకొని ఉన్న బర్మా- మ్యాన్‌మార్ సరిహద్దులలో నెలకొని ఉన్నాయి. మన సైనిక దళాలు, ‘అస్సాం రైఫిల్స్’వంటి అనుబంధ సైనిక దళాలు ‘వెన్నంటి తరిమే’ భద్రతాచర్యను నిర్వహించాయి. బర్మాలోకి చొచ్చుకొనిపోయి దాదాపు యాభయిమంది సాయుధ విచ్ఛిన్నకారులను, చైనా తొత్తులను పట్టిపరిమార్చాయి. ఇలా ‘చొచ్చుకొనిపోయే’- హాట్‌పర్స్యూట్- విధానం మొదలుకావడం చరిత్రలో అది మొదటిసారి! బీభత్సకారుల నడుం విరిగింది! మన సైనికులపై జరిగిన దాడికి తమ దళాలవారు బాధ్యులు కాదని చైనా ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. మన సైనికుల వల్ల అంతర్జాతీయంగా మన ‘రక్షణ’ప్రతిష్ఠ పెరిగింది! పాకిస్తాన్ ప్రభుత్వానికి కలవరం కలిగింది. ఇజ్రాయిల్ ప్రభుత్వం దశాబ్దుల తరబడి ఇలా ‘హాట్‌పర్స్యూట్’ విధానాన్ని అనుసరించడంవల్ల మాత్రమే జిహాదీ బీభత్సకారులు అణగిమణగి ఉన్నారు. లేనట్టయితే క్రీస్తుశకం 1948లో పుట్టీపుట్టకముందే చిట్టి దేశమైన ఇజ్రాయిల్ విధ్వంసమైపోయి ఉండేది!! అందువల్ల గత జూన్‌లో మన ప్రభుత్వం ఇలా ‘హాట్ పర్స్యూట్’ను నిర్వహించి బీభత్సకారులను మట్టుపెట్టినప్పుడు దేశ ప్రజలు సంతోషించారు. బీభత్సకారుల ముందు మోకరిల్లిన విధానం ముగిసిపోయిందన్న భావం కలిగింది!! ఈ ‘హాట్‌పర్స్యూట్’ విధానం అన్ని పొరుగుదేశాలలో నక్కి ఉన్న ‘టెర్రరిస్టు’లకూ వర్తిస్తుందని మన ప్రభుత్వం గత జూన్‌లో స్పష్టంచేసింది కూడ!! పాకిస్తాన్ ప్రభుత్వం ‘‘్భజాలను తడుముకొని’’ నిరసనను కూడ వ్యక్తం చేయడం ఇప్పటికీ చెరగని స్మృతి- ఆరునెలలు మాత్రమే గడిచాయి కాబట్టి!! కానీ ఈ ‘హాట్ పర్స్యూట్’ జరిగిన నెలరోజులలోనే పంజాబ్‌లోని దీనానగర్ పోలీస్‌పై పాకిస్తానీలు దాడి చేశారు. దాడి చేసిన వారిలో ముగ్గురు, మన భద్రతాదళాల కాల్పులలో హతులయ్యారు. కానీ ఈ ముగ్గురు ఉగ్రవాదులూ ఒక సూపరింటెండెంట్‌తో సహా ఏడు పోలీసులను హత్య చేయగలిగారు. మణిపూర్ ఉదంతం తరువాత ‘హాట్ పర్స్యూట్’ జరిపిన మన ప్రభుత్వం ‘గురుదాస్’ ఘటన తరువాత ఎందుకని ‘హాట్ పర్స్యూట్’ జరపలేదు?? ఇప్పుడు పఠాన్‌కోట బీభత్సకాండ తరువాత కూడ ‘హాట్‌పర్స్యూట్’ గురించి ఎవ్వరికీ ధ్యాసలేదు!! అంటే వచ్చిందనుకున్న మంచి మార్పు తాత్కాలికమన్నమాట...
నరేంద్రమోదీ ప్రభుత్వం కూడ మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వపు ‘‘మోకరిల్లే విధానాల’’ను కొనసాగిస్తున్నదని రాజ్‌నాథ్‌సింగ్ చేసిన ‘‘విశ్వాస’’ ప్రకటనవల్ల మరోసారి ధ్రువపడింది. మణిపూర్ ఘటన తరువాత జూన్‌లో మన దళాలు జరిపిన ‘హాట్‌పర్స్యూట్’ ఈ విధాన వైపరీత్యానికి కేవలం ‘అపవాదం’- ఎక్సెప్షన్- అని స్పష్టమైపోయింది!! 2008 నవంబర్‌లో పాకిస్తానీ జిహాదీలు ముంబయిలో జరిపిన హత్యాకాండ పాకిస్తాన్‌లోనే ‘రచన’ జరిగిందన్న దానిని మన ప్రభుత్వం బోలెడన్ని సాక్ష్యాధారాలను చూపించింది!! ‘‘జిహాదీలు 2008 నవంబర్‌లో ముంబయిలో దాడులు జరిపిన సమయంలో పాకిస్తాన్‌లోని కరాచీ నుండి ‘సూత్రధారి’ ఆయా జిహాదీలు ఇచ్చిన ఆదేశాల వివరాలు కూడ వెల్లడయ్యాయి!! మొత్తం జిహాదీకాండకు మూలకారకుడు ‘హఫీజ్‌సరుూద్’అనే ‘జమాత్ ఉద్‌దావా’ ముష్కరుడని కూడ ఐక్యరాజ్యసమితి స్వయంగా నిర్ధారించింది!! అయినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ‘జిహాదీ’లను నిర్బంధించి విచారించలేదు. 2008 నవంబర్ ఘటనకు ముందూ, తరువాత కూడ పాకిస్తాన్ మాటలను మన ప్రభుత్వం అనేకసార్లు విశ్వసించింది. విశ్వసిస్తూనే ఉంది!! ఇప్పుడు పఠాన్‌కోట వైమానిక కేంద్రం ముట్టడికి నిర్దేశించిన పాకిస్తానీ హంతకుని ‘్ఫన్’నంబర్లు కూడ మాధ్యమాలలో ప్రచారం అయ్యాయి. ఆ ‘నంబర్’కలవాడు ఎవడో ఎక్కడ ఉన్నాడో కూడ పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించలేదు!! ‘విశ్వాసం’అని అంటే ఏమిటి?? ‘‘సాక్ష్యాధారాలను చూపితే చర్యతీసుకుంటాం’’ అని పాకిస్తాన్ ప్రభుత్వ నిర్వాహకులు ప్రతి బీభత్స ఘటన జరిగినప్పుడల్లా చెబుతూనే ఉన్నారు. మన ప్రభుత్వం పంపించిన ‘‘సాక్ష్యాధారాలు’’ నిందితులను నేరస్థులుగా నిరూపించలేక పోయాయని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పడం తరువాతి దశ!! ఇలా ఎన్నిసార్లు జరుగలేదు?? అయినప్పటికీ మన ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విశ్వసిస్తుందట!! దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ప్రపంచానికి తెలుసు! పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలుసునని మన ప్రభుత్వానికి తెలుసు! వాడిని నిర్బంధించి మన దేశానికి తరలించని పాకిస్తాన్ ప్రభుత్వం మాటలు విశ్వసనీయమా??
‘జమాత్ ఉద్‌దావా’అనే జిహాదీ ముఠాను నిషేధించాలని దాని వ్యవస్థాపకుడైన హఫీజ్ సరుూద్‌ను నిర్బంధించి విచారించాలని దోషిగా ధ్రువపడితే శిక్షించాలని 2008 డిసెంబర్‌లో ఐక్యరాజ్య తీర్మానాన్ని ఆమోదించిన సంగతి బహుశా ఇప్పుడు ప్రభుత్వానికి గుర్తులేదు... ఈ తీర్మానాన్ని పాటించి ‘జమాత్ ఉద్‌దావా’ను నిషేధించినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించింది! మన ప్రభుత్వం విశ్వసించింది!! కానీ ‘జమాత్ ఉద్‌దావా’అన్న బీభత్సపు ముఠాను పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించినట్టు ఎలాంటి ఆధికారిక పత్రం కాని వెలువడలేదని లాహోర్ హైకోర్టు జూలైలో నిర్ధారించింది!! పాకిస్తాన్ ‘ఐక్యరాజ్యసమితి’ తీర్మానాన్ని వమ్ముచేయడమేకాక, ప్రపంచ దేశాలను అలా వంచించింది! పాకిస్తాన్ మాటలను విశ్వసించరాదనడానికి ఇది ఒక ప్రాతిపదిక మాత్రమే!! పాకిస్తాన్ విశ్వాసఘాతక విధానాలు 1993 నుంచీ అనేకసార్లు బట్టబయలు అయ్యా యి!! 2009లో ఈ వంచన బయటపడిన తరువాత మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం పాకిస్తాన్‌ను నిలదీయలేదు!! గురుదాస్‌పూర్ ఘటనకు బాధ్యులైన వారిని పాకిస్తాన్ ప్రభుత్వం ఎందుకని ఆరునెలలకుపైగా ఎందుకని ‘‘పసికట్టలేదు?’’ నరేంద్రమోదీ ప్రభుత్వం నిలదీయలేదు! పాకిస్తాన్ విషయంలో మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వంవారి విధానాలను- మోకరిల్లే విధానాలను- నరేంద్రమోదీ ప్రభుత్వం కూడ అనుసరిస్తోందని పఠాన్‌కోట ముట్టడి తరువాత ఇప్పుడు మళ్లీ స్పష్టంకాలేదా?? పాకిస్తాన్ ప్రభుత్వం మాటలను మళ్లీ విశ్వసిస్తారట!!
ఇలా ‘‘విశ్వసిస్తున్న’’వారికి చరిత్ర తెలు సు, జిహాదీల చరిత్ర తెలుసు, స్వభావం తెలుసు, జిహాదీల లక్ష్యం తెలుసు. అనాదిగా ‘సర్వమత సమభావ వ్యవస్థ’ మన దేశం స్వభావం! విదేశాలనుంచి కొన్ని శతాబ్దుల క్రితం వ్యాపించిన ఇస్లాం, క్రైస్తవ, పారశీక, యూదు మతాల వారితో సహా అన్ని మతాలవారు సమానంగా జీవించాలన్నది ఈ ‘సర్వమత సమభావం’ స్వభావం!! అందువల్ల ఇక్కడ పుట్టి పరిఢవిల్లిన అనేక వైదిక, వైదికేతర మతాల వారితోపాటు విదేశాలనుంచి వ్యాపించిన మతాలవారు కూడ ఈ దేశంలో సమాన ప్రతిపత్తితో జీవిస్తున్నారు. ‘సర్వమత సమభావం’ ఇలా హైందవ జాతీయ జీవన స్వభావం! ఈ స్వభావానికి అనుగుణంగానే ఆధునిక భారత రాజ్యాంగం ఏర్పడి ఉంది! కానీ ఈ ‘సర్వమత సమభావ’ వ్యవస్థను విధ్వంసంచేసి ఇస్లాంను ఏకైక మతంగా స్థాపించాలని, మిగిలిన మతాల వారిని నిర్మూలించాలని ‘జిహాదీ’ హంతకులు భావిస్తున్నారు! మన దేశానికి వ్యతిరేకంగా ఈ ‘జిహాద్’ను క్రీస్తుశకం 712లో మహమ్మద్ బిన్ కాసిమ్ అనే అరబ్బీ బీభత్సకారుడు మొదలుపెట్టాడు!! పాకిస్తాన్ ప్రధాని నవాజ్‌షరీఫ్ ఆనాటి మహమ్మద్ బిన్ కాసిమ్‌కు ఆధునిక రూపం.....
కాలం మారింది, జిహాదీల రూపం మారింది. కానీ జిహాదీల స్వభావం మారలేదు, జిహాదీల లక్ష్యం మారలేదు!! ‘‘సర్వమత సమభావ వ్యవస్థ’ను ధ్వంసం చేయడానికి, ‘ఏకమత ఉన్మాదులు’చేస్తున్న ప్రయత్నానికి రూపం పాకిస్తాన్ ప్రభు త్వం!! జిహాదీలను విశ్వసించిన భారతీయ పాలకులు భంగపడడం చరిత్ర, విశ్వసించని భారతీయ పాలకులు విజయం సాధించడం కూడ చరిత్ర!! క్రీస్తుశకం పదునాలుగవ శతాబ్దిలో మేవాడ్ పాలకుడు, రతన్‌సింగ్- భీమ్‌సింగ్- ‘అల్లాఉద్దీన్ ఖిల్జీ’ని విశ్వసించాడు, వంచనకు గురై హతమయ్యాడు, వేలమంది రాజపుత్ర మహిళలు అల్లాఉద్దీన్ ఖిల్జీని తప్పించుకొనడానికై అగ్నిజ్వాలలకు ఆహుతి అయ్యారు. క్రీస్తుశకం పదిహేడవ శతాబ్దిలో ఛత్రపతి శివాజీ మహారాజు అఫ్జల్‌ఖాన్ అనే ‘జిహాదీ’ని విశ్వసించలేదు. అందువల్లనే శివాజీ ఆ ‘అఫ్జల్‌ఖాన్’ను అంతం చేయగలిగాడు..... సర్వమత సమభావం జయించింది!!
- హెబ్బార్ నాగేశ్వరరావు