సబ్ ఫీచర్

విద్యార్థులను సానబట్టే ప్రక్రియే హోంవర్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గదిలో అన్నింటిలో జరిగేది రెండు ఆత్మల సంయోగం. ఒక కార్యక్రమం మాత్రం ఇద్దర్ని విడచేసి సంధించే హోంవర్క్ చాలామందికి విద్యార్థిపైన భారం వేస్తున్నారని కొందరంటే మరికొందరు మరికొంత హోంవర్క్ ఇవ్వండని ప్రాధేయపడతారు. ఇది పిల్లల అల్లరిని నియంత్రించేందుకు వేసిన ఎత్తుగడ కాదు. దీనికి కూడా కొంత ఫిలాసఫి ఉన్నది. తరగతి గది సామూహిక ప్రక్రియ. అదే హోంవర్క్ వ్యక్తిగత ప్రక్రియ కావాలని ఉపాధ్యాయుడు ఆశిస్తాడు. లెర్నింగ్‌లో వ్యక్తిగతమైన అధ్యయనం మనిషిలోనున్న జిజ్ఞాసను కదిలించాలి. అందుకు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే మనిషి ఆలోచనాశక్తి సున్నితవౌతుంది. అంతేగాకుండా ఉపాధ్యాయుడు పరోక్షంగా కుటుంబంతో సంబంధం కలిగి ఉండే ఒక సాధనం. తరగతి గదిలో ఏం చెబుతున్నాడో తల్లిదండ్రులకు తెలవాలని చెప్పకుండా చేసే ప్రక్రియ.
కొన్ని దేశాల్లోనైతే హోంవర్క్‌ను ఈ-మెయిల్ ద్వారా పంపిస్తారు. మన దేశంలో ఆ అవకాశం లేదు కాబట్టి విద్యార్థే ఇంటికి తీసుకువస్తాడు. తల్లిదండ్రుల్ని చూసి తరగతి గదితో పరిచయం చేసుకోవచ్చు. అవసరమైతే విద్యార్థికి అవగాహనా లోపాన్నైనా తొలగించవచ్చు. కానీ మన దేశంలో వెనుకబడిన వర్గాలనుంచి వచ్చిన పిల్లలు మొదటితరం యొక్క ఫస్ట్‌లెర్నర్స్ కాబట్టి ఆ అవకాశం లేకపోవచ్చును. ఇలాంటి ఇబ్బందిని తొలగించడం కోసం క్యూబా, పోలెండ్ ప్రభుత్వాలు కొందరు విద్యావలెంటీర్లను నియమించాయ. వారినే షాడో టీచర్లు అంటారు. ఒక్కొక్క తరగతిలో నలుగురైదుగురు షాడో టీచర్లు ఉంటారు. వారికి కొంతమంది విద్యార్థులను అప్పగిస్తారు. తరగతిలో కూర్చుంటారు కాబట్టి సబ్జెక్టుతో కూడా పరిచయం జరుగుతుంది. ఇంటిలోపల విద్యార్థికి అనుకూలమైన వసతులు లేకపోవటంవలన పాఠశాలలోనే చిన్నచిన్న గదులు ఏర్పాటుచేస్తారు. ఈ ఉపాధ్యాయుల కనుసన్నలలో మాత్రమే వారు హోంవర్క్ చేసుకుంటారు. షాడో టీచర్లు విద్యార్థిని గైడ్ చేయకూడదు. ఆలోచింపచేయాలి. ఆలోచన విద్యార్థియొక్క మానసిక స్థితిపైన ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయులు ఓపికతో విద్యార్థి యొక్క మేధస్సును ప్రేరేపిస్తూ తరగతి గదిలో ఉన్న అంతరాలను తన సూచనల ద్వారా తొలగిస్తుంటే వెనుకబడిన పిల్లలను అందరిలో కలిసినట్లవుతుంది. దీనినే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు. దీనే్న వెనుకబడిన పిల్లలను కలుపుకుని ముందుకుసాగే విద్యా పద్ధతి అంటారు.
విద్యాహక్కు అంటే బడికి తీసుకురావటం కాదు. చెప్పిన చదువుపై అవగాహన కలిగిస్తేనే ఆ హక్కు అనుభవించే స్థాయికి ఎదుగుతారు. అనుభవిస్తేనే హక్కు లక్ష్యం పూర్తయినట్లుగా భావించాలి. ఇలాంటి ఏర్పాటుచేయటంవలన ఇతర దేశాల్లో డ్రాప్‌అవుట్‌ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. నామ్‌కేవాస్తేగా పిల్లలను బడికి తీసుకురావటం విద్యాహక్కు లక్ష్యంకాదు. ప్రభావయుతంగా బోధన జరగడానికి హోంవర్క్ అత్యంత కీలకమైన ప్రక్రియ. కొన్నిసార్లు ఉపాధ్యాయుడు విద్యార్థులపై హోంవర్క్ పేర మోయలేని భారంవేయవచ్చును. భారం పడినప్పుడు విద్యార్థి భరించాలన్న శక్తినికూడా వారిలో కలిగించాలి. దానివల్ల ఎంత వొత్తిడి భరించగలుగుతాడో తెలుస్తుంది. ఇది సున్నితమైన ప్రక్రియ. ఈ ప్రక్రియను జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎంత హోంవర్క్ ఇవ్వాలి? ఎలాంటి ప్రశ్నలు ఇవ్వాలి? ఇదొక ఫిలాసఫి. ఉపాధ్యాయుడు తను కనపడకుండా చేసే బోధనా కార్యక్రమం. హోంవర్కు ద్వారా చేయిస్తాడు. హోంవర్క్ ఒక లోతైన అవగాహనకు దారిచూపుతుంది. తరగతి గదిలో ఇదొక కీలకమైన డైమన్షన్. హోంవర్క్ తరగతి గది విస్తరింపచేస్తుంది. హోంవర్క్ అనేది పిల్లలపై భారం వేసేది కాదు. పలుగురాళ్లను సానపట్టటం లాంటి ప్రక్రియ.

- చుక్కా రామయ్య