వీరాజీయం

ఆపద మొక్కులు- సంపద ముడుపులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెసి.ఆర్. చెప్పింది వేదం. తాను పట్టింది బంగారం. కాదన్న వాళ్లది ఖేదం’’- అంటూ, టెన్త్‌క్లాస్ అమ్మాయి పొయిట్రీ చెప్పింది. చాలామంది ముక్కుకి సూటిగా మాట్లాడుతాం’ అంటారు గానీ శ్రీ చంద్రశేఖరరావుగారు అందరికన్నా ఎక్కువగా- ముక్కుకి సూటిగా, బియాండ్ అందరికన్నా ఎక్కువగా చూడగలడు. ఎందుకంటే అతని ముక్కు ఒన్ అండ్ ఓన్లీ నోస్ యిన్ ది వరల్డ్!
శంకర్స్ వీక్లీ శంకర్‌గానీ- ఆర్.కె.లక్ష్మణ్‌గానీ యివాళ వుంటే మన కె.సి.ఆర్.గారి ముక్కు- కార్టూనిస్టుల కొలువులో- వుండేది. ఏడాది తిరిగేసరికే దర్జాగా చైనా పర్యటన కూడా చేసిన ఏకైక ముఖ్యమంత్రి సంకల్పిస్తే చెయ్యలేనిది ఏమీ వుండదు. ఇప్పుడు ఆయన వరంగల్ మహా విజయం తర్వాత ఆయన తన మహాచండీయాగం క్రతువుని కన్‌ఫర్మ్ చేశాడు.
డిసెంబర్ నెలాఖరున మన రాష్ట్రాలు రెండింటికీ మాత్రమేగాదు- దేశానికి, ఆమాటకొస్తే లోకం యావత్తుకీ కళ్యాణ ఘంటికలు మ్రోగుతూంటాయి. నిజంగా వరంగల్‌లో నిలబెట్టింది ఎవర్ని? నిలబడ్డది ఎవరు? అనికాదు- అక్కడ పడ్డ ఓట్లన్నీ కె.సి.ఆర్. పార్టీకే పడటంతో డిపాజిట్ అయినా దక్కింది కాదు. కేంద్రానికీ, జాతీయ పార్టీ కేండిడేట్‌ని ఎన్నుకున్నారేమిటి? అంటూ, నాన్ కాంగ్రెస్ పార్టీలన్నీ గాలి తీసిన బెలూన్లు లాగా ముడుచుకుపోయాయి.
స్పీడ్ విషయంలో కె.సి.ఆర్.ది వేరే రూటు. దేశంలో జనాలను మాంత్రికుడి లాగా ఆకర్షించే సీనియర్ ముఖ్యమంత్రులు (క్రిటక్స్ ఎలా ఛస్తేనేం లెండి!) లల్లూప్రసాద్‌యాదవ్, వోల్డెస్ట్ కుమారి జయలలితజీ- మాయావతిజీ వగైరాలున్నారు. సీనియారిటీ విషయంలో పదవిలో పదేళ్లు- అది లేకుండా పదేళ్లు గడిపిన అమరావతీ బ్రహ్మ నారా చంద్రబాబుగారిని ఎందుకు వదిలిపెట్టామంటే- ఆయన జనం వెంట పడటమే కనబడుతోంది తప్ప- కె.సి.ఆర్. పరిపాలనా విధానాలకు యిది కొలతబద్దకాదు’’- అంటూ కొంతమంది తెలంగాణా సమితి వర్యులు- ముందరకాళ్లకి బంధంగా అన్నారూ అంటే, జనాల నాడి చెప్పగల రామలింగడెవ్వడూ లేడన్నమాట.
నిజానికి పైన చెప్పిన జాబితాలో వున్న ‘గ్రేట్స్’ఎవరికీ కూడా కె.సి.ఆర్.కి గల అడ్వాంటేజ్ లేదు. అతని రాజ్యం- ‘డామ్‌న్యూ.’ అతని ఫండ్స్ ‘‘డామ్‌న్యూ’’-
‘‘డామిట్! కథ అడ్డం తిరిగిందీ’’- అనగల ఛాన్స్ లేదు ఆయనకి యిప్పట్లో.
అయినా దేవతలను ప్రసన్నం చేసుకుని థాంక్యూలు చెప్పాలిగా? అందుకని, మెదక్ జిల్లాలోని - ఎర్రవల్లి గ్రామంలోని తన సొంత ‘్ఫమ్‌హవుస్’ ప్రాంగణంలో ఆయన చండీమహాయాగాన్ని- భూనభోంతరాళాలు- యాగ ధూమం చూరేలాగ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి రాష్టప్రతి- ప్రధానమంత్రి మొదలు- ఆంధ్రా చీఫ్ మినిస్టర్ నాయుడుగారిని కూడా తప్పక పిలుస్తున్నట్లు చెప్పాడు.
ఇది లోక కళ్యాణంకోసం. బాగుంది. కె.సి.ఆర్.గారు ఇంద్ర పట్ట్భాషేకానికి కారణం అని- స్థానిక దేవుళ్లనీ, దేవతల్నీ- మరిచిపోయినట్లుగా వుంది. యాగానికి దేవతలు అందర్నీ ఆవాహన చేస్తారనుకోండి అది వేరు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే- యిప్పుడు తాను మరోసారి విజయపతాకం ఎగురవేస్తున్న వరంగల్‌లోని భద్రకాళీ అమ్మవారికి రెండు కిలోల బంగారు కిరీటం (టోపీ కాదు) పెడతానన్నాడు కానీ యింకా అటు పోలా... శ్రీ కె.సి.ఆర్. ఐడియాలు నిత్యనూతనాలు!... తనకి సరిరారు ఎవ్వరూ కాని-
దీనే్న అంటారు- ‘ఆపద మొక్కులు- సంపద ముడుపులు’అనీ, ‘మార్కుకో టెంకాయ’ అంటాడు పరీక్షార్థి. కానీ పాసయినాక, ఆ గుడిదారి మరిచిపోతాడు. అంతేనా? శ్రీ కె.సి.ఆర్. బెజవాడ కనకదుర్గమ్మకి ప్రీతికరమైన ముక్కుపుడక సమర్పించుకుంటానన్నాడు. మొన్న అమరావతి వెళ్లినప్పుడు పనిలోపనిగా దుర్గమ్మకి నజరానా యిస్తాడనుకున్నాం. తెలంగాణా రావడం- ఎన్నికల్లో అందరూ పోవడం- కె.సి.ఆర్. గద్దెనలంకరించడం- పైగా 2015, జనవరి 30నాడు- తెలంగాణా క్యాబినెట్ ముఖ్యమంత్రి మ్రొక్కులు తీర్చేటందుకు- ఖజానానుంచి ఐదు కోట్ల యాభై తొమ్మిది లక్షల- ‘టి’రూపాయలు మాత్రమే మంజూరు చెయ్యడం కూడా చకచకా జరిగిపోయాయి. కానీ ముఖ్యమంత్రిగారు తిరుపతి వెంకన్నకు ప్రామిస్ చేసిన - ఐదు కోట్ల రూపాయలు ఖరీదుచేసే బంగారు సాలగ్రామ హారం యింకా ఆర్డర్ చేసినట్లు లేదు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారికి పదిహేను గ్రాముల ముక్కుపుడకలు యిస్తానన్నాడు. కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు- ‘ప్రామిస్డ్’. కానీ రుూ మొక్కులు అన్నీ తీర్చాలిగదా- పోనీ వడ్డికాసుల వెంకన్నకి వడ్డీకూడా ముడుపులో వేస్తున్నట్లు లేదు. కె.సి.ఆర్. కనుక సరిపోయింది బిజీగా వుంటాడు. వెళ్లాలంటే ముహూర్తం కుదరదు కనుక సర్దుకుపోతున్నారు దేవుఁళ్లు.
‘‘ఈ నగలన్నీ ఆలయ నియమ నిబంధనలకు అనుగుణంగా చేయించాలి. చాలా తంతు, తతంగం వుంది’’ అంటున్నారు ప్రభుత్వోద్యోగులు. ‘‘పరీక్షల్లో ఉత్తీర్ణతకి మ్రొక్కిన విద్యార్థి ఉద్యోగం వచ్చేకనైనా మ్రొక్కులు తీర్చాలా? వద్దా? లేదా ఆ నగదు బ్యాంకులో వేసి సదరు వడ్డీని కూడా నగల నగిషీలకు మెరుగులకోసం వాడవచ్చును కదన్నా?’’ అంటూ అడిగిందో యిల్లాలు.
చండీయాగం మొదలయ్యేలోగా రుూ విషయంలో చంద్రశేఖరరావుగారు మరోసారి ప్రామిస్ చేస్తే తప్ప ‘బాగోదు’-అన్నాడో అర్చకుడు- ఏమనాలో తెలియక- తెలిసినా అనగల నోరులేక. ఇంతకీ కోట్లాది రూపాయలు జన ఖజానానుంచి హవిస్సయిపోతాయో అంటున్న విమర్శకాగ్రేసులందర్నీ కె.సి.ఆర్. మొన్న మాట్లాడకుండా చేశాడు. ఈ మహాచండీయాగం అంతా నా పైసలతోనే చేస్తున్నాను. కొందరు దాతల యొక్క విరాళం ఉంది గానీ- బొక్కసం నుంచి పైస పెట్టబోము- అని కూడా ప్రకటించిన కె.సి.ఆర్. మరో నాలుగు వారాలు ఎర్రవిల్లి ఫామ్‌హవుస్‌లో బిజీ!
బెటర్ గాడ్స్ గోదేర్ టు డిమాండ్