మెయన్ ఫీచర్

మరింత నలుపెక్కుతున్న నల్లధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా మూడో ఏడాది కూడా విద్యాభివృద్ధికై విరాళాన్ని ఇవ్వడంలో అజీమ్ ప్రేమ్‌జీ మూడో స్థానంలో నిలిచాడు. ఈయన ఇచ్చిన విరాళం రూ.27,514 కోట్లు. ఈయన తర్వాత నందన్ నీలేఖని, నారాయణమూర్తి, కె.దినేష్, శివనాడార్‌లు వరుసగా వున్నారు. ఆసుపత్రులకు విరాళాన్ని ఇచ్చే వర్గాల్లో దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబాని పదో స్థానంలో వున్నాడు. గతంలో బైరెడ్డి ఫౌండేషన్ పశ్చిమ గోదావరిలో విద్యాభివృద్ధికై ఈ విధంగానే తోడ్పడింది.
పైనగల దానకర్ణుల వార్త ప్రచురితమైనప్పుడే, కేరళలోని కోలం జిల్లాలో ప్రధాన దేవాలయ ప్రాంతాల్లో స్వంత పిల్లల్ని అవిటివాళ్ళుగా (హ్యాండికాప్డ్) చేసి భిక్షమెత్తుకునే వైనం కూడా వార్తగా రావడం జరిగింది. మరి కొందరైతే చంటి పిల్లలకు పొగాకు లాంటి మత్తును ఇచ్చి దీర్ఘ నిద్రలోకి పంపించి, ఆ సానుభూతిలో డబ్బులు రాబడతారని కూడా ఆ కథనంలో వుంది. ఈ రెండు వార్తలు సామాన్యులకు అర్థం కాకపోవచ్చు గాని, బుద్ధిజీవులకు, రాజకీయ అర్థశాస్త్రం తెలిసినవారికి మాత్రం ఆందోళన కలిగిస్తాయి.
ఓ వైపు సంపదలు పోగుపడడం, మరోవైపు దారిద్య్రం సమాంతరంగా కొనసాగడం గమనార్హం! దేశంలోగల వందమంది బిలియనీర్స్ (కుబేరులు)లలో 23.6 బిలియన్ డాలర్లతో ముఖేష్ అంబాని మొదటగా వున్నట్లు ఫోర్బ్స్ సంస్థ తెలిపింది. ఇలా దేశంలో ఒక శాతం అతి ధనవంతులు దాదాపు 90 శాతానికి పైగా దేశ సంపదలో భాగస్వామ్యులైతే మిగతా వారి సంపద కేవలం పది శాతమే! ఏటా వీరి ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ వుంటే, దరిద్రులు దరిద్రులుగానే వుండిపోతున్నారు. 2011 లెక్కల ప్రకారమే వివిధ పట్టణాల్లోని మురికివాడల్లో నివశిస్తున్నవారి సంఖ్య 6.5 కోట్లు. ఇదేకాలంలో మానవ సంపద సూచిక (్హఖ్ఘౄశ ష్ఘఔజఆ్ఘ నిశజూళన)లో భారత్ వందో (100) స్థానంలో వుంది. విద్యా, నైపుణ్యత, ఉపాధి, ఉద్యోగం లాంటి అంశాలలో 46 కారకాలను ఉపయోగిస్తున్న విధానాన్ని 124 దేశాలలో పరిశీలిస్తే తేలిన విషయం ఇది. చిన్న దేశమైన ఫిన్‌లాండ్ మొదటి స్థానంలో వుంటే, ప్రపంచ ధనవంతుల్లో మాత్రం మనది నాలుగో స్థానమే!
అయినా మనకు మంచి రోజులు వస్తాయట. కాకపోతే, అమిత్ షా ప్రకారం ఓ 25 సంవత్సరాలు ఆగాలి. 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా, అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే విదేశాల్లో అనధికారికంగా దొరికిన నల్లడబ్బును వెనక్కి తెప్పిస్తామని ఎన్నికల నిబంధనావళిలో బిజెపి రాసుకుంది. ఎన్నికల ప్రచారంలో మోదీ పదే పదే ఈ ప్రస్తావన చేసారు కూడా! మోదీ పదవిని చేపట్టి 600 రోజులు కావస్తున్నది. గత బడ్జెట్ సమావేశాల్లో నల్లధనాన్ని కలిగి వుండడం చట్టవిరుద్ధమనే బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రతీ పౌరునికి ఇస్తానన్న రూ.15 లక్షలు ఏవి? అంటూ మోదీని ప్రతిపక్షాలు అవకాశం వచ్చినపుడల్లా ఎత్తిపొడుస్తున్నాయి. ఈ బిల్లు ప్రకారం, అనధికార డబ్బుకు 120 శాతం జరిమానాతో పాటు 10- సంవత్సరాల జైలుశిక్ష అని వుంది. ఇది చట్టంగా రూపొంది 200 రోజులు దాటినా, ఏ ఒక్క ధనవంతుడి డబ్బులు తెప్పించడంగాని, వారికి సంబంధించిన ఆస్తులు జప్తు చేయడంగాని, జైలు శిక్ష విధించడం గాని చేయని స్థితి. ఇలాంటి వాటినుంచి దారిమళ్లించడానికే గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలనే నినాదాల్ని ఇస్తున్నారు.
ఈ నల్లడబ్బు కథ ఈనాటిది కాదు. ఓవైపు దేశం కోసం ఉద్యమాలు జరుగుతుంటే, బ్రిటీషు వారి హయాంలోనే నల్ల డబ్బు పోగుపడడం మొదలైంది. స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలు పాల్గొంటే, పెట్టుబడి దారి వర్గం వారి వ్యాపారాల్ని దినదినాభివృద్ధి చేసుకున్నది. 1955లో నికోలాస్ కాల్డొర్ జరిపిన పరిశీలనలో రూ. 600 కోట్ల నల్లధనం వున్నట్లు తేలింది. ఇది నాటి దేశ స్థూల జాతీయోత్పత్తిలో 4.5 శాతంకాగా, 1969లో జస్టిస్ వాంఛూ కమిటీ పన్నుల విధానంపై సూచనలు చేస్తూ, పోగుపడిన నల్ల ధనం రూ. 7,000 కోట్లుగా తేల్చింది. అలాగే 1980-81లో రాజా చల్లయ్య నేతృత్వంలోని పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ప్రకారం పోగైన నల్లధనం రూ.15 లక్షల కోట్లు అని, ఇది జిడిపిలో 20 శాతం అని తేల్చింది. కాని, 1992లో ఎస్.బి.గుప్తా పరిశీలన ప్రకారం ఇది 42 శాతం అని, 1987-88లో 51 శాతం అని తేల్చింది. జవహర్‌లాల్ విశ్వవిద్యాలయం ఆర్థిక శాఖ ప్రొఫెసర్ అరుణ్ కుమార్ 2005-06లో రాసిన ‘బ్లాక్ ఎకానమి ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో, జిడిపిలో 50 శాతంగా వున్న నల్లధనం రూ.39 లక్షల కోట్లుగా తేల్చారు. ఈ విధంగా 1948 నుంచి 2008 దాకా దేశాన్ని దాటిన నల్ల డబ్బు 213 బిలియన్ డాలర్లని వాషింగ్‌టన్ కేంద్రంగా గల గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ గ్రూప్ అనే సంస్థ తేల్చింది. ప్రస్తుతం దీని విలువ 640 బిలియన్ డాలర్లకుపైననే! కేవలం 2012లో 95 బిలియన్ డాలర్ల (6 లక్షల కోట్లు) ధనం దేశాన్ని దాటింది. చైనా, రష్యా తర్వాత భారత్ మూడో స్థానంలో నిలవగా, గత 2004-2013 మధ్యకాలంలో సరాసరి 52 బిలియన్ డాలర్లతో చైనా, రష్యా, మెక్సికో తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది. ఈ నల్లధనాన్ని జమచేయడానికి దాదాపు 80 వేలమంది ధనవంతులు ప్రతి సంవత్సరం స్విట్జర్‌లాండ్ వెళ్లి వస్తుంటారని, ఇందులో 25 వేల మంది అనేకసార్లు వెళ్లి వస్తుంటారని పరిశీలకుల అంచనా. ఇలా దేశంలో పోగౌతున్న నల్లధనంలో 62 శాతం విదేశాల్లో, బినామీ పేర్లతో జమ చేస్తున్నారు.
అయితే ఈ నల్లధనాన్ని వెనక్కి తెప్పించే ప్రయత్నం నాటి (నెహ్రూ) కాలంలోనే జరిగింది. స్వచ్ఛందంగా నల్లడబ్బును ప్రకటించే వారికి రాయితీలను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే 1961లో గుర్తించిన 20,912 కేసులకుగాను ప్రకటించిన డబ్బు 70 కోట్ల 20 లక్షలు కాగా, ప్రభుత్వానికి పన్ను రూపం గా వచ్చిన ఆదాయం కేవలం 10 కోట్ల 89 లక్షలే! 1975లో దీనికి చట్టబద్ధతనీయగా ప్రభుత్వానికి ఆదాయపు పన్ను ద్వారా 249 కోట్లు, సంపద పన్ను ద్వారా 7 కోట్ల 7 లక్షలు మాత్రం వచ్చింది. ఇలా 1981, 85, 87, 91, 97 దాకా చట్టాల సవరణతో గుర్తించిన కేసులు 3,75,133 కాగా, ప్రకటించిన నల్ల ధనం, ఆస్తి విలువ 33,289 వేల కోట్లు. పన్నుగా వచ్చిన రాబడి రూ.9,745 కోట్లు మాత్రమే! ఈ విధంగా నల్లధనం పోగుపడడానికి దోపిడీ వ్యవస్థ కారణమని గుర్తించడానికి చాలామందికి మనసొప్పదు. కాని పైన ప్రస్తావించిన పుస్తకంలో, నల్లడబ్బు పోగుపడడానికి రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాల పేరున (బినామి) వచ్చే ఆదాయం, ఆసుపత్రుల ద్వారా, మరి ఇన్ని సేవా రంగాలు కారణమని తేల్చింది. చట్టవ్యతిరేకంగా జరిగే హవాలా లాంటి ఆర్థిక లావాదేవీలు, కుంభకోణాలని కూడా తేల్చింది. ఇలా 1996-97లో జరిగిన కుంభకోణాలు 26 కాగా, 2005-2008 మధ్యన 150గా నమోదు అయ్యాయి. గత యుపిఎ హయాంలో జరిగిన కామన్‌వెల్త్ ఆటలు, 2జి స్పెక్ట్రంల, బొగ్గు గనుల వేలం పాటలో జరిగిన కుంభకోణాలు తెలిసినవే! అలాగే బినామీ పేర్లపైన గల ఆస్తుల, దొంగ ఆదాయాల ఆస్తిపన్ను, ఆదాయపు పన్నులను ఎగగొట్టడం ఈ దేశంలో పరిపాటే! ఇందులో రాజకీయ నాయకుల, వీరి అనుంగులది పైచేయి కాగా, తర్వాతి స్థానం ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్లది!
నిజంగానే ఈ నల్లధనం వెనక్కి తెప్పించడం వల్ల, దేశ దారిద్య్రం పోతుందని ఎవరైనా చెబితే నమ్మే అమాయకులెవరూ లేరు. రాజ్యాంగాన్ని అమలు చేయడం ద్వారా, చట్టాల్ని నిజాయితీతో ఆచరించడం ద్వారా మాత్రమే సాధ్యవౌతుంది. దీనికితోడు భూమిపై పరిమితి చట్టాలు, ఆస్తుల పరిమితి చట్టాలు ఆచరణలోకి రావాలి. ప్రతి వ్యక్తి బాధ్యతతో, జవాబుదారీతనంతో వ్యవహరించాలి. దేశం తనకు అని కాకుండా, దేశం కోసం నేను అనే నానుడి బలోపేతం కావాలి. ఈ రకంగా మార్చాల్సిన బాధ్యతను స్వీకరించాల్సింది పౌరులే! ఓ బలమైన పౌర ఉద్యమం ద్వారా మాత్రమే ఇది సాధ్యవౌతుంది. బహుశా మరో స్వాతంత్య్ర పోరాటంలా ఇది కొనసాగుతే తప్ప, ఏ సంస్కరణలు వీటిని సాధించలేవు. దోచుకునే అవకాశాలున్నప్పుడు, దోచుకోవడమే పరిపాటుగా, వ్యవస్థ స్వరూపంగా మారుతుంది. గత ఏడు దశాబ్దాల కాలంలో జరిగింది ఇదే! జరుగుతున్నది కూడా ఇదే! నాయకులిచ్చిన హామీలు అవినీతి రహిత సమాజాన్ని నిర్మించలేదని గత అనుభవాలు తెలుపుతూనే ఉన్నాయి. ఇంకా వీటి చుట్టే మన ఆలోచనలు తిరుగితే, మరో మోదీ కూడా ఏమీ చేయలేరు. దీన్ని గుర్తించడంలో మన నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనపడుతూనే వున్నది. మాటల్లో నిజాయితీ, చేతల్లో అవకాశవాదం సమాజాన్ని ఎదగనీయదు. దేశంలో ఈ రుగ్మత వందకు వందశాతం వుంది. దీనే్నమైనా తగ్గించగలిగితే, తగ్గించాలనే ఆలోచన చేస్తే ఈ పుణ్యభూమిలో మన పాత్రను నిర్వర్తించినట్లే!

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162