మెయన్ ఫీచర్

ప్రాణం తీసిన చైనా వాణిజ్య ‘సూత్రం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివరికి గాలి పటాలను ఎగురవేయడానికి అవసరమైన ‘దారం’కూడ చైనా నుండి దిగుమతి కావడం ద్వైపాక్షిక వాణిజ్య ‘‘మైత్రి’’కి పరాకాష్ఠ! చైనానుండి గణేశుని విగ్రహాలు పదేళ్ల క్రితమే దిగుమతి అయిపోయాయి. ఫలితంగా మన దేశంలోని ఈ బొమ్మల తయారీ ‘పరిశ్రమ’ కొనే్నళ్లు మూలపడింది. భాగ్యనగరంలోని విశాల బహిరంగ ప్రాంగణాలలో వేలాది ‘స్వదేశీయ’ గణేశ విగ్రహాలు- అమ్ముడుపోని ప్రతిమలు- దర్శనమివ్వడం క్రీస్తుశకం 2006వ 2007వ సంవత్సరాలలో ఆవిష్కృతం అయిన దృశ్యాలు! ‘టెంకాయల పండుగ’- గణేశ చతుర్థికీ నిమజ్జన చతుర్దశికీ మధ్య కాలం- ముగిసిపోయిన తరువాత మళ్లీ ‘పండుగ’ వచ్చేవరకు వేలాది మంది స్వదేశీయ ‘గణపతులు’ వానకు నాని ఎండకు ఎండి సంవత్సరంపాటు ‘చెఱ’ను అనుభవించారు. వినాయకుడిని, ఉత్సవం పూర్తయిన తరువాత, ఊరేగింపుగా తీసుకొనివెళ్లి బావులలో చెరువులలో నీటివాగులలో నదులలో నిమజ్జనం చేయ డం ‘్భద్రపద’మాసంలో ప్రస్ఫుటించే సనాతన సంప్రదాయం!
భాద్రపదం వర్షఋతువులోని రెండవ నెల. అందువల్ల వర్షాలు కురిసి ‘జలాశయాలు’ కొత్త నీటితో పొంగిపొర్లుతూ ఉంటాయి. ‘మోదకముల’ ను మెక్కిన బుజ్జిగణపతి ఆనందంగా ఈ కొత్త నీటిలో ఈతకొట్టుకుంటూ కైలాసం వైపు కదలి వెళ్లడం భారతీయుల మన్ఫఃలకంపై చెరగని యుగాల దృశ్యం! భాద్రపద మాసంవరకూ వానలు కురవకపోతే ‘గణపతి’ని ‘నిమజ్జనం’ చేయకుండా ‘చెఱ’ వేయడం కొన్ని ప్రాంతాలలో పరిపాటి! వానలు కురవకపోతే నిమజ్జనం చేయడానికి నీళ్లుండవు మరి.... అందువల్ల ‘‘వానలను కురిపించు, వానలు కురిసేవరకు ‘చెఱ’లో ఉండు!’’అని బొజ్జగణపతిని బెదిరించడమన్న మాట! గణపతికి భాద్రపదంలో ఆ ‘చెఱ’మొదలైన తరువాత వారానికో రెండువారాలకో ఫెళఫెళమని వానలు కురిసేవట! ఆయా ప్రాంతాలలోని ‘నాయనమ్మలు’ నిన్నమొన్నటి వరకు చెప్పిన కథ ఇది! ఈ భారతీయ కథను చైనా వాణిజ్య సామ్రాజ్యవాదులు ఏడాది పొడుగునా పొడిగించడం 2007లో నడిచిన వ్యథ! ‘చౌక’గా వచ్చిన చైనా ప్రతిమల పోటీకి తట్టుకోలేని స్వదేశీయ వరసిద్ధి వినాయకులు శాపగ్రస్తులవలె ఏడాది పొడవునా నానుతూ ఎండుతూ బహిరంగ ప్రదేశాలలో ‘చెఱ’పడి వనె్నలు మాసిపోయారు! ఆ తరువాత చైనా బొమ్మలను మన ప్రభుత్వాలు నిషేధించినట్టు ప్రచారమైంది- కానీ అనేకానేక రూపాల బొమ్మలు ఇప్పటికీ చైనానుండి వస్తూనే ఉన్నాయి. గణేశ ప్రతిమలు వస్తున్నాయా లేదా అన్నది తేలదు. అన్ని నిషిద్ధ వస్తువులూ చైనానుండి దొంగగా మన దేశంలోకి తరలివస్తూనే ఉన్నాయట! గణేశుని నుండి గాలిపటాల వైపు చైనా దృష్టిమళ్లడం ఇటీవలి మకర సంక్రాంతి కానుక... సంక్రాంతి ‘పతంగుల’ పండుగ!
మన ప్రభుత్వాలు నిర్లజ్జగా చైనాకు అనుకూలమైన భారతీయులకు వ్యతిరేకమైన విధానాలను అవలంబిస్తున్నాయనడానికి ఈ గాలిపటాల ‘దారం’ మరో సాక్ష్యం! గాలిపటం- పతంగ్- పైకి ఎగరడానికి మన దేశంలో తయారైన స్వదేశీయ ‘తోరం’-దారం- కంటె చైనావారి ‘దోర్’ ఎక్కువగా దోహదం చేస్తోందన్నది జరిగిపోయిన ప్రచారం. చైనావారి వాణిజ్యపు దళాలు అంత వ్యూహాత్మకంగా పిల్లలను పెద్దలను నమ్మించగలగడం మన దౌర్భా గ్యం! యుగాలుగా భారతీయ ‘సూత్రం’తో ఎగిరిన ‘పతంగు’లకు ఇప్పుడు చైనానుండి దిగుమతి అయిన ‘మాంజా’ కావలసి రావడం ప్రపంచీకరణ ప్రచారయుగంలోని విష విన్యాసం! ఇలాంటి ప్రచారాలన్నీ విదేశాలకు అనుకూలంగా మన దేశంలో మాత్రమే జరుగుతున్నాయి. మన దేశానికి అనుకూలంగా విదేశాలలో జరగడం లేదు! ఎందుకంటె ‘బహుళ జాతీయ వాణిజ్యసంస్థలు’ భారత వ్యతిరేక ప్రచారంకోసం భారతదేశంలోనే వందల వేల కోట్లు రూపాయలను ఖర్చుపెడుతున్నట్టు విదేశాలలోనే వెల్లడయిపోయింది! ‘ప్రచార వ్యయం’ అన్నది అవినీతి దుర్గంధ భరితమైన ‘లంచాల’కు మరో పేరు! తమ దేశానికి చెందిన వాణిజ్య సంస్థలు భారతదేశంలోను ఇతర వర్ధమాన దేశాలలోను ఇలా ప్రచ్ఛన్న రూపంలో లంచాలనివ్వడానికి అమెరికా చైనా వంటి సంపన్న దేశాల ప్రభుత్వాలు అనుమతినిస్తున్నాయి.
చైనా అధ్యక్షుడు ప్రయాణంచేసిన విమానంలోనే ఆఫ్రికానుంచి అక్రమంగా ఏనుగు దంతాలు తరలిరావడం చైనా ‘నీతి’కి నిదర్శనం!! అందువల్ల ఈ ‘లంచాల’ ప్రభావం ఫలించి మన దేశంలో చైనా వస్తువుల పట్ల ‘మోజు’ పెరిగింది. మన వస్తువులు నాసిరకమైనవని చైనా వస్తువులు నాణ్యమైనవని నమ్మడమే దేశద్రోహం. ఈ నమ్మకం ప్రాతిపదికగా చైనా వారి ‘దోర్’ను మన దేశంలో వేలాది టన్నులు అమ్మేశారట- మకర సంక్రాంతికి ముందు!! భాగ్యనగరంలోని పాతబస్తీలోనే గాలిపటాలను సరఫరాచేసే ‘టోకు’దుకాణాలు దాదాపు వంద ఉన్నాయట! చిల్లర దుకాణాలు ఎన్నో... ఉభయ తెలుగు రాష్ట్రాలలోను దేశవ్యాప్తంగాను వేలాది చిల్లర దుకాణాలవారు ‘‘గొంతును కోసే’’ ఈ చైనా దారాన్ని అమ్మేశారు... చివరికి ‘నిషేధం’ వచ్చింది!!
ముంజ గడ్డితో తయారయిన దారం లేదా ‘తాడు’పేరు ‘వౌంజీ’..... ఈ ‘వౌం జీ’ని ఉపనయనం, వివాహం వంటి శుభకార్యాలలో నడుం చుట్టూ ధరించడం సంప్రదాయం. ఇప్పుడు ‘ముంజ’గడ్డి లేదు, సంప్రదాయమూ లేదు! అందువల్ల నైలాన్, ప్లాస్టిక్, గాజు పెంకులు, కంపుకొట్టే విష రసాయనాలతో తయారైన ‘మాంజా’ చైనానుండి దిగుమతి అవుతోంది! ప్రాకృతికమైన ‘వౌంజీ’, కృత్రిమమైన ‘మాంజా’గా మారడం భాషాపరమైన వికృతి కావచ్చు!! మన భావాలకు సంక్రమించిన వికృతి మాత్రం వేలాది పక్షుల గొంతుకోసింది! ఈ చైనావారి ‘దోర్’ మాంజాకు గాజు పూత ఉండడంవల్ల, విష రసాయనాల పూత ఉండవల్ల ఈ దారం తగిలినచోట గాయం కావడమే కాదు ప్రాణాంతకమైన ‘కుళ్లు’- సెప్టిక్ కూడ ఏర్పడి పోయింది.
తూనీగలు, పావురాలు వంటి అనేక జాతుల గగన చరాలు వేలాదిని ఈ దారం గాయపరచి హత్యచేసిందన్నది పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు చెప్పిన మాట!! ఈ దారంవల్ల పరిసరాలు కాలుష్యవంతం అవుతున్నాయట, భూమి సారంకూడ కలుషితమైపోతోందట!! ఈ ప్రమాదాల గురించి దేశవ్యాప్తంగా అనేక నెలలపాటు పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు ప్రచారం చేసినప్పటికీ, అవగాహన సదస్సులను నిర్వహించినప్పటికీ ‘‘అధికార బధిరాంధులైన’’ రాజకీయవేత్తలు పట్టించుకోలేదు!! ఈ ‘దారం’ తగిలినచోట పిల్లలకు పెద్దలకు సైతం గాయాలు ఏర్పడి అవి వారాల తరబడి మానలేదని కూడ గత డిసెంబర్‌లో ప్రచారమైంది!!
చివరికి తాపీగా నిద్రలేచి ఆవలించిన కేంద్ర ప్రభుత్వ అటవీ, పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వశాఖవారు ఈ చైనా ‘మృత్యుసూత్రం’ గురించి దాని భయంకర ప్రమాదాల గురించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తరాలను వ్రాసిందట!! తెలంగాణ ప్రభుత్వం భోగి పండుగ ముందురోజున ఈ చైనా దారాన్ని నిషేధించింది! ఈ దారాన్ని నిషేధించడంవల్ల పశుపక్ష్యాదులకు మానవులకు వనసీమలకు జరుగుబోయే మేలు అంతా ఇంతాకాదు! ఈ ‘అంతాఇంతా కాని’ వాస్తవం గురించి నిషేధం తరువాత తెలంగాణ ప్రభుత్వ అధికారులు ప్రశంసలను ప్రచారం చేసుకుంటున్నారు! కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ దారాన్ని నిషేధించడంలో ఇన్నాళ్లపాటు ఎందుకని నిర్లక్ష్యం వహించినట్టు! ఈ దారం కాటుకు మనుషుల గొంతులు చీరుకొనిపోయిన దృశ్యా లు, ముఖాలపై పుండ్లు ఏర్పడిన దృశ్యాలు మాధ్యమాలలో ఆవిష్కరణ అయిన తరవాత డిసెంబర్‌లోనైనా తెలంగాణ ప్రభుత్వం ఈ దారాన్ని ఎందుకని నిషేధించలేదో?? చైనానుండి దిగుమతి అయిన ఈ ‘నైలాన్ దారం’లో దాదాపు తొంబయి శాతం అమ్ముడయిపోయిన తరువాత, జరుగవలసిన వైపరీత్యాలు జరిగిపోయిన తరువాత మాత్రమే తెలంగాణ ప్రభుత్వం దారాన్ని నిషేధించింది! అందువల్ల చైనావారికి చైనావారి దళారీలకు దక్కవలసిన లాభాలు దక్కపోయాయి! తెలంగాణ ప్రభుత్వం కనీసం ఆలస్యంగానైనా ఈ దారాన్ని నిషేధించింది. కానీ ఇతర రాష్ట్రాలలో నిషేధం విధించిన సమాచారం లేదు! అందువల్ల వ్యాపారులు బహిరంగంగా కొన్ని రాష్ట్రాలలోను దొంగచాటుగా మరికొన్ని రాష్ట్రాలలోను ఈ దారాన్ని విక్రయిస్తూనే ఉంటారు. నిషేధం విధించిన తరువాత దుకాణాలలో దారం ఏమయింది?? ప్రభుత్వం స్వాధీనం చేసుకుందా?? ఈ ప్రశ్నకు సమాధానం లేదు!!
రాష్ట్రాలు ఈ ‘దారం’అమ్మకాలపై నిషే ధం విధించినప్పటికీ చైనానుండి దిగుమతులు ఆగవు! దిగుమతులపై నిషేధాన్ని విధించవలసింది కేంద్ర ప్రభుత్వం!! కేంద్ర ప్రభుత్వం అలా దిగుమతిని నిషేధించిన జాడ లేదు!! ఈ ‘దారం’ ప్రమాదకరమైనదన్న నిర్ధారణ జరిగిన తరువాత కేంద్ర ప్రభుత్వం ‘దిగుమతి’ని, వాడకాన్ని నిషేధించి ఉన్నట్టయితే దేశవ్యాప్తంగా నిషేధం అమలుజరిగేది!! ఆ పని చేయని కేంద్ర ప్రభుత్వం ఈ ‘దారం’వల్ల సంభవించే ప్రమాదాలను ఉటంకిస్తూ రాష్ట్రాలకు ‘‘ఉచిత’’ సలహాలు మాత్రమే ఇచ్చింది!! మరి దిగుమతి అయిన దారాన్ని ఏమిచేస్తారు??
శత్రు దేశమైన చైనాపై మన దేశంలోని ప్రముఖులు పదే పదే ప్రశంసల జల్లులు కురిపిస్తుండడం నడచిపోతున్న వైపరీత్యం. అవశేషాంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ నిర్మాణంలో చైనా ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలకు గొప్ప భాగస్వామ్యం కల్పించాలన్న నిర్ణయం మాతృదేశాన్ని శత్రువులకు తాకట్టుపెట్టే దానికి దేశవ్యాప్తంగా అమలు జరుపుతున్న వాణిజ్య వ్యూహంలో ఒక అంశం మాత్రమే!! క్రీస్తుశకం 1962లోను అంతకు పూర్వమూ మన భూమిని దురాక్రమించిన చైనా ప్రభుత్వం మనకు శత్రుదేశం! మన భూమిని చైనా తిరిగి మనకు అప్పగించిన తరువాత మాత్రమే ఆ దేశంలో మనం ‘వాణిజ్య మైత్రి’ని పెంపొందించుకోవచ్చు!! కానీ 1988లో అప్పటి మన ప్రధాని రాజీవ్‌గాంధీ చైనాకువెళ్లి వచ్చిన తరువాత మన విధానం మారిపోయింది! ఆ దేశంతో వాణిజ్య సంబంధాలను, దౌత్య సంబంధాలను, ఇతర మైత్రిని పెంపొందించుకోవాలన్నది కొత్తగా రూ పొందిన విధానం! ఈ ‘పథభగ్న’- పాత్ బ్రేకింగ్-విధానంవల్ల మన ‘జుట్టు’ క్రమం గా చైనా కబంధంలో ఇరుక్కొనిపోయి ఉంది!! చైనావారి సంప్రదాయ వైద్య చికిత్సకు అవసరమైన ఔషధాల తయారీకి ‘పులిగోళ్లు’, ‘పులి చర్మాలు’, ‘పులి దంతాలు’ అవసరమట!! అందువల్ల పులి ‘్భగాల’దొంగ రవాణాను చైనా ప్రభుత్వం ప్రోత్సహించడం బహిరంగ రహస్యం! చైనా పెట్టుబడిదారీ వ్యవస్థగా రూపాంతరం చెందిన తరువాత, ఆ దేశంలోని ‘సంపన్నుల’కోసం మన దేశంలోని ‘ఎఱ్ఱ చందనం’ దొంగచాటుగా తరలిపోతోంది!! ‘ఎఱ్ఱ చందన’ వృక్షాలను నరికేస్తున్న ముఠాలలో చైనావారు చేరిపోయి ఉన్నారు!!
ఇజ్రాయిల్‌లో ప్రజలు ‘ఆరబ్’ తిండికోసం, ‘ఇరానీ చాయ్’కోసం ఎగబడడం లేదు! ఇజ్రాయిల్ విధ్వంసం ఆరబ్ దేశాల ఇరాన్ జిహాదీల లక్ష్యం కాబట్టి!! చైనా ప్రజలు జపాన్ తిండికోసం ఎగబడడం లేదు! చైనావారు రెండవ ప్రపంచ యుద్ధంనాటి కాలదోషం పట్టిన వైరాన్ని ఇప్పటికీ జపాన్‌తో కొనసాగిస్తున్నారు కాబట్టి!! మన దేశంలో మాత్రం ‘చైనా తిండికోసం’ ఎగబాకడం జీవన వాస్తవమై కూచుంది! చరిత్ర జ్ఞానం లేదు, సిగ్గులేదు....

- హెబ్బార్ నాగేశ్వరరావు