సబ్ ఫీచర్

మతంపేరిట రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణా ముఖ్యమంత్రిగారు ముస్లింలకు ప్రభుతోద్యోగాల్లో, ఇతర సంస్థల్లో 12 శాతం రిజర్వేషన్ కల్పించ నిర్ణయించామంటున్నారు. ఇది సహేతుకం కాదు. తెలంగాణాను ముస్లింలు 600 ఏళ్లకు పైగా, 1948 సెప్టెంబర్ వరకు పాలించారు, అన్ని భోగాలూ, విశేషాధికారాలూ, సంపదలూ అనుభవించారు. భాష, ఉద్యోగాధిపత్యాలు వారివే. అప్పటివరకు అణగత్రొక్కబడ్డ హిందువులతో పోలిస్తే ఎలా వెనుకబడ్డారు?
మహమ్మద్ ఘజనీ మన దేశంపై దాడిచేసి, దేవాలయాలను దోచుకుని, కూల్చిపోయాడు. మహమ్మద్ ఘోరీ దండయాత్ర చేసి.. దేశద్రోహి జయచంద్ సహాయంతో పృథ్వీరాజ్‌ను ఓడించి, చివరకు జయచంద్‌ను చంపి విదేశీయులైన ముస్లిం పాలనను ఢిల్లీ సుల్తాన్‌గాప్రారంభించాడు. తరువాత వారిని ఓడించి మంగోల్ జాతీయుడైన బాబర్, మొగల్ పాలన ప్రారంభించాడు. ఈ విధంగా విదేశీ ముస్లింలు భారతదేశంలో చాలా భాగాన్ని 600 సంవత్సరాలుగా పాలించారు, ఓడిపోయిన హిందువులను బలవంతాన ముస్లిం మతంలోకి మార్చారు. మతం మార్చుకోని హిందువులపై ‘జిజియా’ పన్ను వేశారు. ముస్లింల సంక్షేమంకోసం పరాజిత హిందువుల భూములను కబ్జాచేసి ‘వక్ఫ్’ సంపదలను ఏర్పరిచారు. 30,000 దేవాలయాలను దోచుకుని, కూల్చి, కొన్నింటిపైనా, అక్కడనే మసీదులు కట్టారు. (అయోధ్య, మధుర, వారణాసి, ఉజ్జయిని, రాజమహేంద్రవరం). ఏ భారతీయ భాషనుగాక ‘పర్షియన్’ను రాజభాషగా వాడారు. 600 ఏళ్లు పాలించినా, బలవంతపు మార్పిడులుచేసినా ముస్లింల జనాభా 20 శాతానికి మించలా, అది కూడా వాయవ్య, తూర్పు భారతంలోనే. కాని 90 శాతం ప్రభుత్వోద్యోగాలు ముస్లింలకే. ఇన్ని వందల సంవత్సరాలు పాలించినవారు భారతదేశంలో ఇప్పుడు వెనుకబాటు తనానికి గురిచేయబడ్డాం అంటున్నారు. ఇది నమ్మశక్యమా?
నైజాం సంస్థానం చూడండి. 1340నుండి 1948 సెప్టెంబర్ 17వరకూ ముస్లిం పాలన, వారి జనాభా పది శాతం. కాని 90 శాతం ప్రభుత్వోద్యోగాలు వారివే. రాజభాష ఉర్దూ, విద్యాబోధనా మాధ్యమం విశ్వవిద్యాలయంలో కూడా ఉర్దూ. తెలుగు (మరాఠీ, కన్నడ) స్కూళ్లు లేవు. న్యాయస్థానాల్లో భాష ఉర్దూ. హిందువులు వెట్టికి, వెన్ను విరిగే పన్నులకు గురయ్యారు. ఇన్ని వందల సంవత్సరాలు, ఇంత నిర్దాక్షిణ్యంగా పాలించినవారిని, పాలితులు వెనుకబాటు తనానికి గురిచేయగలరా? రాజ్యాధికారం పోవడమంటే, అధిక సంఖ్యాకుల ప్రజాస్వామ్య పాలన అంటే, వారి దృష్టిలో వెనుకబాటుతనం అన్నమాట! ప్రజాస్వామ్యంలో, ప్రజల భాష ఉపయోగింపబడుతుంది. ప్రజలు ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఉద్యోగాలు అర్హతలను బట్టిగాని, మతాన్ని బట్టి ఉండవు.
పేదరికం పోవాలంటే పనికివచ్చే భాషలో విద్యనేర్చుకోవాలి. ఉద్యోగార్హతలు కల్పించే విద్య కావాలి. పరిమిత సంతానం ఉండాలి. స్ర్తిలు కూడా విద్య గడించాలి. ఈ అన్ని విషయాల్లో ముస్లింలు శ్రద్ధతీసుకోకుండా ‘సంతానోత్పత్తి మా హక్కు. వారిని పోషించే బాధ్యత మీది’, మేం మదరసాలకు వెళ్తాం, ఆధునిక విద్య అప్రధానం, అయినా మాకు ఉద్యోగాలివ్వాలి, మా (అమితంగా పెరుగుతున్న) జనాభా ప్రకారం మాకు సర్వత్రా ప్రాతినిధ్యం కావాలి అంటున్నారు. రాజ్యాంగంలోని 30వ అధికరణం క్రింద పరిమితి రాహిత్య మైనారిటీ కాలేజీలు స్థాపించుకున్నా, ఇతర కాలేజీల్లో మాకు రిజర్వేషన్ కావాలి, తమ జనాభా 10శాతం నుండి 18 శాతానికి (బంగ్లా, పాకిస్తాన్ చొరబాటు వాళ్లను కలుపుకుంటే 20 శాతం) పెరిగింది. అందువల్ల ఆ దామాషాలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు, ఉద్యోగాలు ఇవ్వాలి. మా తీర్థయాత్రలకు (హజ్) మీరు డబ్బులివ్వాలి. 1956లో మరుసటి సంవత్సరంలో జరుగబోయే ఎన్నికల దృష్ట్యా, జవహర్‌లాల్ ముస్లిం ఓట్లకోసం హజ్ సబ్సిడీ బిల్లును స్వయంగా ప్రతిపాదించారు. గత సంవత్సరంలో రూ.900 కోట్ల హజ్ సబ్సిడీ ఇచ్చారు. తిరుపతి దేవుణ్ణి చూడటానికి మాత్రం హిందువులు టిక్కెట్టు కొనుక్కోవాలి. హిందువులు తమ పండుగలకు స్వగామం వెళ్లాలంటే ప్రభుత్వపు ఆర్టీసీ 50 శాతం ఎక్కువ ధర వసూలు చేస్తుంది.
పాకిస్తాన్, బంగ్లాల్లో ముస్లింలు, ఇక్కడివారికన్నా అభివృద్ధి చెందారా? ఎప్పుడూ పరాయి వారిచేత పాలింపబడని ముస్లిం టర్కీ దేశం, యూరప్‌కన్నా ముందుందా? నిరర్థక చదువులు, అమిత సంతానం, యోగ్యతలనిస్తాయా? బహుభార్యత్వం సంపదనిస్తుందా? భారత్‌లో ముస్లింలు రాష్టప్రతులయ్యారు, సుప్రీం, హైకోర్టుల ముఖ్య న్యాయధీశులయ్యారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో హోం మంత్రులయ్యారు. ముస్లిం లు అల్పసంఖ్యాకులైన అస్సాం, బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, పుదుచ్చేరీల్లో ముఖ్యమంత్రులయ్యారు, గవర్నర్లవుతున్నారు. వాయుసేనకు అధిపతులయ్యారు. విశ్వవిద్యాలయాల ఉప కులపతులవుతున్నారు. విదేశాంగ మంత్రి అయ్యా రు. పోలీస్‌శాఖకు, ఇంటెలిజెన్స్ సంస్థలకధిపతులవుతున్నారు. ఇది వివక్షా? 35 శాతం హిందువులున్న జమ్మూ కశ్మీర్‌లో ముస్లిం తప్పితే ఏ హిందువైనా ముఖ్యమంత్రి అయ్యారా?
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం మన సెక్యులర్ రాజ్యాంగానికి విరుద్ధం. సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం, రిజర్వేషన్లన్నీ కలిపి 50 శాతానికి మించకూడదు. వీటి దృష్ట్యా ముస్లింలకై 12శాతం రిజర్వేషన్ చట్టబద్ధం కానేరదు. చట్టం చేసిన కోర్టులు కొట్టివేస్తాయి. ఈ పరిస్థితినుండి తప్పించుకుంటానికి, ముస్లింలను బి.సి కోటాలో చేర్చి రిజర్వేషన్ కల్పిస్తే, అది హిందూ బి.సిలకు ద్రోహం, వంచన అవుతుంది. వంచిత హిందూ బి.సి.లు ఉద్యమించక తప్పరు. ప్రత్యేక ప్రయోజనాలకోసం ‘వెనుకబాటు’తనాన్ని గురించి ఓటు అస్త్రంగా వాడుకోవడం అనుచితం. 600 సంవత్సరాలు పాలించి, దేశ ప్రజలను అణగత్రొక్కి, దోచుకున్నవారు (వక్ఫ్ సంపద దోపిడీ సంచితమే) వెనుకబడ్డామని చెప్పుకోవడం ఒక వింత, వారికి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకం; చారిత్రక అవహేళన; హిందువులకు అన్యాయం.

- డా. త్రిపురనేని హనుమాన్‌చౌదరి