ఉత్తరాయణం

కొనసాగుతున్న విద్యుత్ కోతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తామన్న విద్యుత్‌శాఖ అధికారుల వాగ్దానాలు నీటి మీద రాతలుగా మిగిలిపోతున్నాయి. తెనాలి, రేపల్లె మండలాలలో నిత్యం విద్యుత్ సమస్యలు తలెత్తుతునే వున్నా యి. ప్రమాద భరితంగా మారిన ట్రాన్స్‌ఫార్మర్లు, విరిగిన విద్యుత్ స్తంభాలు, తక్కువ ఎత్తులో వున్న తీగలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. లోడ్ తట్టుకోలేక తరచుగా ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మత్తులకు గురవుతున్న సందర్భాలలో సిబ్బంది కొరత, పరికరాల లభ్యత లేని కారణంగా మరమ్మత్తులకు ఎక్కువ సమయం పడ్తోంది. వర్షం కురిసినా, చిన్నపాటి ఈదురు గాలులు వీచినా ఎప్పుడు ప్రమాదాలు ముంచుకొస్తాయోనని ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. విద్యుత్‌శాఖ అధికారులు తక్షణం స్పందిం చి విద్యుత్ వెతలను తీర్చాలని విజ్ఞప్తి.
- ఎం.కనకదుర్గ, తెనాలి
తెలుగంటే చిన్నచూపేల?
తెలుగు భాషలందు తెలుగు లెస్స, తేనె కన్న తీయనిది తెలుగు భాష అని ఎందరో మహనీయులు తెలుగు భాష యొక్క ప్రాశస్త్యాన్ని కీర్తించారు. తెలుగువారు ప్రపంచమంతా అనేక రంగాలలో ప్రావీణ్యాన్ని గడించి, తెలుగు ఖ్యాతిని విస్తరించారు. ఒక పక్క ప్రవాసాంధ్రులు తెలుగువ్యాప్తికోసం విశ్వప్రయత్నం చేస్తుంటే, మన రాష్ట్రంలో వున్న తెలుగువారికి మాత్రం తెలుగంటే మహా చిన్నచూపు. తెలుగు మీడియంలో చేర్పించే వారిని ఆదిమానవులుగా చూస్తున్నారు. ఇద్దరు తెలుగువాళ్లు కలిస్తే తెలుగేతర భాషలోనే మాట్లాడుతారు. దేశంలో ప్రాంతీయ భాషలలో అంతర్జాల వినియోగంలో తెలుగుది అయిదవ స్థానం మాత్రమే! ఇంగ్లీషువాళ్లు మన నరనరాలలోకి ఎక్కించిన ఇంగ్లీషు మత్తు, ఇంగ్లీషు వ్యామోహం ఇంకా తగ్గలేదు. 2010లో తెలుగు మహాసభల తర్వాత పాలనలు తెలుగులోనే చేస్తాం, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే విడుదల చేస్తాం, న్యాయవ్యవస్థ అంతా తెలుగులోనే వుంటుందని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. అధికార భాషా సంఘం అసలు వుందో లేదో, వుంటే ఏం చేస్తోందో ఎవ్వరికీ తెలీదు. కానీ క్షేత్ర స్థాయలో తెలుగు మాత్రం తీవ్ర అన్యాయానికి గురవుతోంది. కానె్వంట్ చదువులు చదివిన వారికి ఇంగ్లీషు, తెలుగు..ఏ భాషా రావడం లేదు. ఇది మరీ ఘోరం. దీనికి పరిష్కారం కనుగొనాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
తెలుగులోనూ సివిల్స్ పరీక్షలు
క్రీ.శ. 2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించినా ఇప్పటివరకు తెలుగును విరివిగా ఉపయోగించకపోవడం ఒక చారిత్రిక తప్పిదం. మన తెలుగు భాషకు 3665 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ మన తెలుగు భాష ఆదరణ లేకపోవడం మన తెలుగువారి దురదృష్టం. ఈ విషయంపై అందరూ అప్పుడప్పుడు మాట్లాడటం తప్ప ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి రాకపోవటం ఒక విషాదం. ఐఎఎస్ లాంటి పరీక్షలు కేవలం ఆంగ్లం, హిందీ వాడకం జరుగుతుంది. ఒక భాషను పోషించి ఇంకొక భాషను ప్రక్కకు నెట్టించడం చాలా తప్పిదం. మన తెలుగు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రతిపక్ష నాయకులు, ఉద్యమ సంఘాలు పట్టించుకోవాలి.
- ముత్తన్నగారి రాజేందర్‌రెడ్డి