సబ్ ఫీచర్

హైందవం సనాతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టికర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులు అంటారు. వీరిలోని మహేశ్వరుడు నిరాకారుడైన ఒక మహత్తరమైన, అద్భుతమైన శక్తిగా ఉద్భవించి సృష్టి నిర్మాణానికి బ్రహ్మ, విష్ణులను అవతరింపజేసి సృష్టికార్యాన్ని ప్రారంభించినాడు. సృష్టికి మూలకర్తలైన వీరికి మాతాపితల ఆవశ్యకత కలగలేదు. అందుకే వీరికి ‘్భగవంతుడు’ అనే నామకరణం వాడుకలోకి వచ్చింది. సృష్టికార్యంలో ఎనభైనాలుగు లక్షల రకాలైన ప్రాణులను ఉద్భవింపజేశారు. వీటికి నివాసాలను ఏర్పాటుచేసినారు. సృష్టికర్తలైన బ్రహ్మకు బ్రహ్మలోకము, మహావిష్ణువుకు వైకుంఠము, ఈశ్వరుడికి కైలాసము నివాస స్థానాలుగా ఏర్పరచుకొని వారిచేత ఉద్భవింపజేసిన ప్రాణులకు స్వర్గలోకము మత్స్యలోకము, పాతాళ లోకము, ఈ విధంగా సృష్టిలో అనేక లోకాలను, అలాగే సూర్య మండలం, నక్షత్ర మండలం, చంద్రమండలం, భూమండలం మొదలైన అనేక మండలాలను ఏర్పాటుచేశిరు. ప్రాణులు జీవించడానికి పంచభూతాలను (పృథ్వీ, ఆకాశము, వాయువు, నీరు, అగ్ని)ను, అష్టదిక్పాలకులను, నవగ్రహాలతోపాటు షట్‌చక్రవర్తులను, ఋషులను ఏర్పాటుచేశారు. లోక కళ్యాణం నిమిత్తం వేదాలు అందించబడ్డాయి. వీటిని అనుసరించి పురాణాలు, ఉప పురాణాలు, ఇతిహాసాలు ఏర్పడ్డాయి.
సృష్టికార్యంలో సృష్టికర్తలకు బాసటగా వుంటూ వారి ద్వారా సహాయ సహకారాలను స్వీకరించేందుకు శక్తి, సంపద, జ్ఞానాలకు ప్రతీకలుగా ఉంటూ ఈ మూడింటిని సృష్టికార్యంలో ప్రధాన అంగాలుగా చేసి వీటిని అందించేందుకు శక్తిస్వరూపుణిగా పార్వతీదేవిని, సకల సంపదలకు నిలయంగా లక్ష్మీదేవిని, జ్ఞాన ప్రదాయినిగా సరస్వతీదేవిని ఉద్భవింపజేసి సృష్టికార్యం నిరంతరంగా కొనసాగేందుకు పురుషుడు ప్రకృతి కలయిక ద్వారా ఎనభై నాలుగు లక్షల రకాల ప్రాణికోటి పునరుత్పత్తి నిరంతరం కొనసాగేందుకు ఏర్పాటుచేసిన ప్రణాళిక. ఈ ప్రణాళికలో జనన మరణాలను పొందుపరచడం జరిగింది.సృష్టి ప్రారంభంలో అందించిన కార్యపద్ధతే సనాతనధర్మంగా పిలువబడినది. ‘సనాతనము’అనగా శాశ్వతము. భగవంతుడు నిరాకారుడని తెలియజేసేందుకే మహాదేవుడు రూపంలేని లింగాకారంలో పూజలందుకుంటున్నాడు. సనాతనధర్మం వ్యక్తులు స్వేచ్ఛాయుత జీవనం గడపటానికి అనువైనది. అందుకే భగవంతుడిని స్ర్తిపురుషుభేదము లేకుండా ఎవరికి నచ్చినరూపంతో పేరుతో ఆరాధించుకోవడంవల్లనే సనాతన ధర్మం ముప్పైమూడు కోట్ల దేవతలకు నిలయమని ప్రతీక. ప్రకృతిని కాపాడేందుకు, జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ఒక్కొక్క పేరుతో పిలువబడే దేవుడికి ఒక్కోరకమైన పక్షిని, జంతువును వాహనాలుగాను, ఒక్కో రకమైన వృక్షభాగాన్ని ఆయుధంగాను వారికి ఆపాదించారు.
శివుడిని పూజించినవారు శైవులుగాను, విష్ణువుని పూజించినవారు వైష్ణవులుగాను, గణేశుడిని పూజించినవారు గాణాపత్యులుగాను, ఆదిపరాశక్తిని పూజించినవారు శాక్తులుగాను, కుమారస్వామిని పూజించినవారు స్కాందులుగాను, సూర్యుడిని పూజించినవారిని సౌరులుగాను పేర్కొనబడినారు. వేదాలను అనుసరిస్తూ వైదిక మతాలలోని బహుదేవతారాధన చేస్తూ పునర్జన్మను నమ్ముతూ ఈ మూడింటిని ప్రధాన భూమికగా స్వీకరిస్తూ తమ జీవితాలను కొనసాగిస్తున్నవారే హిందువులు- వైదికులు- సనాతనులు. కలియుగం ఆరంభంనాటికి జంబూద్వీపం తొమ్మిది వర్షాలుగా విభక్తమై ఉంది. ఇందులో భరతవర్షం ఒకటి. భరతవర్షం ఇప్పుడు పశ్చిమాసియాగా పిలుస్తున్న ప్రాంతంనుండి దక్షిణ ఆగ్నేయఆసియా దేశాలవరకు, తూర్పు ఆసియాలోని అనేక దేశాలవరకు విస్తరించి ఉండేది. భారత వర్షం సాంస్కృతికమైనది. అది సనాతన సంస్కృతి లేదా వేద సంస్కృతిగా భాసిల్లే ప్రాంతాలు. భారతవర్షంలో భారత ఖండం ఒక భాగం. భారత వర్షం కలియుగాదిలో ఇప్పటి ఇరాక్, మధ్య ఆసియానుండి ఇప్పటి ఇండోనేషియా వరకు విస్తరించి ఉండేది. అలాగే ఇప్పటి ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్, నేపాల్, టిబెట్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, బర్మాలతో కూడిన ప్రాంతమంతా ఒకే సంస్కృతిగాను, రాజకీయపరంగాను ఒకటిగా ఉండిన భూమి అఖండ భారత ఖండం. సృష్టి విశాలమైనది. విస్తృతమైనదిగా గుర్తించినరోజే విశ్వమానవాళి సుఖసంతోషాలతో మనగలదు. ఇదే వసుదైక కుటుంబకమ్.’’

- బలుసా జగతయ్య