వీరాజీయం

ఎంతవారలైనా అవినీతి దాసులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎంతవారైనా కాంతాదాసులే’ అంటూంటారు గానీ యిక మీదట ఎంతవారలైనా కరప్షన్ దాసులే- మంత్రులైనా గానీ, ముఖ్యమంత్రులైనా గానీ, ఆర్మీ ఆఫీసర్లయినా గానీ... కరప్షన్‌దాసులే... వాళ్ల హోదాకి, ఉద్యోగ భృతికి మించి అమితంగా స్థిరచరాస్థులని వెనకేసుకున్న కేసు కొత్తదొకటి తెల్లారేపాటికి మీడియాలో పొడుచుకు వస్తూ వుంటుంది.
అవతల కేరళ ముఖ్యమంత్రి ఊమెన్‌చాంద్ మీద ఎఫ్.ఐ.ఆర్. (ప్రాథమిక నేర ఆరోపణ) పత్రాలు దాఖలు చేయమన్న కోర్టు ఆదేశాలు పడ్డాయి. సోలార్ కుంభకోణంలో పీకలమొయ్యా కూరుకుపోయిన ముఖ్యమంత్రికి తోడుగా పవర్ మంత్రి తోడున్నాడు లెండి. సరే! రాజకీయ నాయకులు ముదురు కేసులు. వాళ్లు తిమ్మినిబమ్మి- బమ్మిని తిమీ చేయగల సమర్థులేగానీ పవిత్ర భారతదేశంలో ఆర్మీ అధికారులు యిద్దరి మీద- వారి అంతస్తుకు మించిన ఆస్తులు- ప్రమోషన్‌లకోసం లంచం యిచ్చారన్న ఆరోపణలు రావడం- సామాన్య జనాలకి చిన్నపిసరు ‘షాక్’ యిచ్చింది. పైగా రుూ యిద్దరు సైన్యాధిపతులు ప్రస్తుతం సర్వీసులోనే వున్నారు. చిత్రం ఏమిటీ? అంటే రుూ యిద్దరికీ పోయినేడాది వారి అపార అమూల్య సేవలకు గాను అతి విశిష్ఠసేవా పతకాలు లభించాయి. ఈ ఇద్దరిమీదా వెల్లువెత్తిన ఆరోపణల మీద ‘శషబిషలు’లేకుండా- నేరుగా దేశరక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ గారే పరిశీలనకు పూనుకొని- చాలినంతకన్నా ఎక్కువ ‘‘సంచితార్థపు మూట’’ రుూ యిద్దరి దగ్గరా వున్నదనుకుని వెంటనే ‘బులావ్’ సి.బి.ఐ.కో’’- అని, దర్యాప్తుకు ఆదేశించారు అన్న వార్త జనాల్ని నిద్దురలేపి పలకరించింది.
ఈ ఇద్దరి మీదా కేంద్ర నేర పరిశోధక సంస్థవారు దర్యాప్తు చెయ్యాలి. ఐతే యింకా రుూ యిద్దరికీ నోటీసు యివ్వలేదు. వారి పేర్లు బయటపెట్టడం బాగోదు అం టూనే, అన్ని పత్రికలూ రుూ యిద్దరు మేజర్ జనరల్స్ పేర్లు- వారివారి జాతకాలతో సహా వేడివేడిగా వడ్డించేశాయి. ఒక మేజర్ జెనరల్‌గారి పేరు- మేజర్ జెనరల్ అశోక్‌కుమార్ ప్రస్తుతం ఆయనకి లెఫ్ట్‌నెంట్ జెనరల్ ‘పదోన్నతి’ రావల్సి వుందిట. ఈయన కలకత్తాలో కొలువయి వుండగా రెండో సైనిక దురంధరుడు యస్. యస్. లాంబాగారు ఢిల్లీ ఆర్మీలో కొలువుతీరి వున్నాడు. ఈ యిద్దరి ప్రమోషన్లు పరిశీలనలో వున్నాయి. పాపం! లెఫ్ట్‌నెంట్ జెనరల్స్‌గా ప్రమోషన్స్ వచ్చి పోస్టింగ్స్ వస్తాయనుకుంటే- పిడుగు లాంటి వార్త వాళ్ల మెడలకు చుట్టుకుంది. అత్యున్నత పదవులలో వున్న సైన్యాధికారుల మీద యిలాంటి ఆరోపణలు రావడం మాట ఎలావున్నా, ఆ ఆరోపణల నిగ్గుతేల్చమని, నేరుగా సి.బి.ఐ.ని పిలవడం యిదే మొదటిసారి అంటూ ఇందుకు పూనుకున్న మోదీ పరిపాలనని చాలామంది ‘‘కేకా’’అంటూ కీర్తిస్తున్నా- రుూ యిద్దరి గుట్టుమట్లు యిప్పుడు జాతీయం అయిపోయేలాగా వున్నాయి.
‘‘ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్- రుూ మూడూ దేశాన్ని యిరవై నాలుగ్గంటలూ కనిపెట్టుకుని వుండాలి. కానీ, కంచే చేను మేసిందన్న చందాన ఆరోపణలు ఎదుర్కోడం దేశాన్ని బద్నామ్ చేసెయ్యదా?’’అంటూ ఫీలయ్యే అమాయకులు యింకా వున్న భారత్ దటీజ్ ఇండియా యిది. అది సరే, అది అట్లుండనిండు, దీని నేపథ్యం కూడా గొప్ప ‘‘ఆర్కెస్ట్రా’’గా వినబడుతోంది. పోయినేడాది స్పెషల్ ప్రమోషన్ బోర్డువారు - అప్పటికి ఖాళీలున్న ఉన్నత పదవులు మూడింటికీ- మొత్తం ముప్ఫయిమూడు మందిని పరిశీలించి ముగ్గురి పేర్లని తాజాలిస్టులో పెట్టారు. అప్పటికి డిఫెన్స్ సెక్రటరీగా వున్న లెఫ్ట్‌నెంట్ జెనరల్ ఆర్.్భల్లా యిప్పుడు రిటైరయిపోయాడు. ఎన్నో వడపోతల తర్వాత రుూ నియామకాలు- లేదా ‘పదోన్నతులు’- రక్షణమంత్రి దగ్గరకు వెళ్తాయి. అడ్డగోలుగా ప్రమోషన్లు సంపాదించుకోడానికి ‘లంచగొండి’ దారులుతొక్కారన్న తీవ్రమయిన ఆరోపణలు రుూ జంట అధికారుల మీదికి రావడం దురదృష్టకరం. కానీ, తీగె లాగితే డొంక కదుల్తుందిగా! అది ఈ దేశ జనాలు చేసుకున్న అదృష్టం. సరే, రుూ యిద్దరికీ లాకర్‌లెన్ని? ప్లాట్‌లెన్ని లాంటి కూపీలు సాగుతాయి. లోగడ కూడా యిటువంటి నిందల మీద దర్యాప్తు ఎదుర్కొన్న ఆర్మీ ఆఫీసర్లున్నారు. ఆమాటకొస్తే రుూ యిద్దరిలో ఒకరి మీద కొన్ని సంవత్సరాల క్రితమే - ‘‘బోర్డర్ రోడ్ల నిర్మాణం’’కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు సందర్భంగా కక్కుర్తి పడ్డాడన్న నిందపడ్డది- అని, పి.టి.ఐ. వార్త సంస్థ భోగట్టా. అప్పుడు ఆయనగారికి సి.బి.ఐ. క్లీన్‌చిట్ యిచ్చిందిట. కానీ, రుూసారి రుూ ఆఫీసర్లు యిద్దరికీ ముందుగా స్థిరాస్తులు, చరాస్తులు బయటపడతాయి.
నిజానికి లంచగొండి కేసులలో మన దేశం ఏనాడూ వెనుకబడిలేదు. 2015లో జరిగిన ఒక అంతర్జాతీయ స్థాయి సర్వేతో మన దేశం 176 దేశాలలో 76వ ర్యాంకు సంపాదించుకుంది. పొలిటికల్ కరప్షన్ సంగతి సరే- సర్వీసులలో లంచగొండితనం ప్రవేశిస్తేనే- భవిష్యత్ మాట ఎలావున్నా- వర్తమానం అంధకారమయం అయిపోతుంది పోదా?
పొలిటీషియన్స్‌లో ఒకడుపోతే మరొకడు వస్తాడు. కానీ సీనియర్ సైన్యాధికారులు యిలా పెద్ద పాము నోట్లో పడిపోతే ఎలా? - ఆ జాగా భర్తీ ఎలా అవ్వాలి?
ఓ మైగాడ్! సేవ్ మై కంట్రీ ఫ్రమ్ కరప్షన్!