మెయన్ ఫీచర్

కుల, మత ఘర్షణలు శ్రేయస్కరం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్యాంధ్రప్రదేశ్‌లో ఆదివారం నాడు కాపుగర్జన సభ జరిగింది. కాపు కులస్థులను బీసీ వర్గంగా గుర్తించాలనేది ఈ సభ ప్రధాన లక్ష్యం. అందుకు వారు ఆందోళనలో భాగంగా రత్నాంచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగులబెట్టారు. పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టారు. అసంఖ్యాకమైన వాహనాలను దగ్ధం చేశారు. విశాఖ-విజయవాడ మధ్యలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఇదంతా కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌ల ప్రమేయంతో జరిగిన దుశ్చర్య అని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖా మాత్యులు యనమల రామకృష్ణుడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిజానిజాలు నిజనిర్ధారణ కమిటి విచారణలో తేలవచ్చు. ఐతే అసలిప్పుడు సమస్య ఏమిటంటే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగులబెట్టడానికి ఆరక్షణ విధానానికి ఏమిటి సంబంధం?
భారతదేశంలో ఆరక్షణ విధానాన్ని రాజకీయలబ్దికోసం అన్ని రాజకీయపార్టీలు యధాశక్తి ఉపయోగించుకున్నాయి. కాపులకు లోగడ రిజర్వేషన్లు ఇచ్చారు, మళ్లీ రద్దుచేశారు. ముస్లింలకు ఒక ప్రభుత్వం నాలుగుశాతం ఇస్తే మరొక ప్రభుత్వం పనె్నండు శాతం ప్రకటించింది. గుజరాత్‌లో నాటి చిమన్‌భాయ్ పటేల్ నుంచి నేటి ఆనందీ బీన్ పటేల్ వరకు అంతా పటేల్ కులస్థులదే రాజకీయాల్లో కీలకపాత్ర. వీరు ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డి-కమ్మ కులాల వలె ప్రధానంగా భూమిపుత్రులు. వీరికి రిజర్వేషన్లు కావాలని మొన్న ఒక పిల్లవాడు బ్రహ్మాండమైన ఉద్యమాన్ని నడిపి గుజరాత్‌ను గడగడలాడించడం వెనుక ఉన్న రాజకీయ కారణాలేమిటి? ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం చట్టబద్ధంగా ఎన్నికైంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీ మెజారిటీతో ఎన్నికైంది. దీన్ని విధ్వంసక శక్తులు సహించలేకపోతున్నాయి. నరేంద్రమోదీ మెతకతనం ఈ అరాజక శక్తులకు ఊతం ఇచ్చినట్లయింది.
1990లో ముద్రగడ పద్మనాభం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. చిరంజీవి కాంగ్రెస్ ఎంపిగా ఉన్నారు. వీరు కాపుకులస్థులను రాజకీయంగా ఏమేరకు ఆదుకున్నారు? రత్నాంచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగులబెట్టడమంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే. మాల్దాలో, తునిలో, ఛత్తీస్‌గఢ్‌లో పోలీసు స్టేషన్లు తగులబెట్టడం ఏమిటి? చైనాలో-రష్యాలో ఇలా జరుగుతుందా? ప్రతి పనికి ఒక కార్యాకారణ సంబంధం ఉంటుంది. ప్రతి కార్యానికి ఫలము-ప్రతిఫలము ఉం టాయి. రాహుల్ గాంధీ ఒకటికి రెండు సార్లు హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఎందుకు తిరుగుతున్నట్టు? దీని ఫలము-్ర పతిఫలము ఏమిటి? ప్రతిపక్ష నాయకుని స్థాయిలో ఉండి కులద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందటం తగునా? భారతదేశానికి దక్షిణాన గల చిట్టచివరి రాష్ట్రం కేరళ. అక్కడ సౌరవిద్యుత్ కుంభకోణం కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉమన్ చాందీ మెడకు చుట్టుకుంది. భారతదేశానికి ఈశాన్యంలో ప్రాంతంలో ఉన్న చిట్టచివరి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 2010 జనవరిలో కూలిపోతే రాష్టప్రతిపాలన విధించారు. శివలింగాలపై మూత్రం పోయండి అన్న పెద్దమనిషికి రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి స్థానిక లింగాయతులు కంకణం కట్టుకున్నారు.
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఇక ఈ శతాబ్దంలో కాంగ్రెస్ పునరుజ్జీవనం అసంభవం. ఐనా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. 2019లోపే కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాని కూల్చివేసి తాను ఆ కుర్చీలో కూర్చోవాలని తహతహలాడుతున్నాడు. దీపాన్ని చూసి పండు అని భ్రమించి మిడత అందులో దూకుతుంది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అల్లరి చేసి పోయిన అధికారం చేజిక్కించుకోవాలని తాపత్రయ పడుతున్నారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ అనే వడ్డెర కులస్థుడైన విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని అఖిల భారత స్థాయిలో ఉద్యమంగా మార్చారు. మొత్తం విద్యార్థి లోకాన్ని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడంలో పాక్షిక విజయం సాధించారు. ‘‘గోడ కట్టేవాడు పైకి వెళుతున్నాడు, బావి తవ్వేవాడు లోపలికి వెళుతున్నాడు’’ అన్న గౌతముని సూక్తిని గుర్తుకు తెచ్చుకోవాలి. బావి తవ్వేవాడు పైకివెళ్లలేడు సరికదా తాను తీసిన గోతిలో తానే పడతాడు.
రాహుల్, సోనియాల అక్రమాస్తుల కేసులు విచారణలో ఉన్నాయి. సుబ్రహ్మణ్యస్వామి, సోనియాగాంధీ, విదేశీ రహస్య ఖాతాల జాబితాను విడుదల చేశారు. కాబట్టి తర్వాత ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ లోపలే విద్యార్థులను ముస్లింలను (దాద్రీ) రెచ్చగొట్టి దేశంలో సివిల్ వార్‌ను సృష్టించే వ్యూహం మొదలైంది. ‘ఇండియాలో హిందువుగా పుట్టడం కన్నా, గాడిదగా పుట్టడం మంచిది’ అన్నాడు మోతీలాల్ నెహ్రూ. నేతాజీని ‘వార్ క్రిమినల్’ అన్నాడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ. ఢిల్లీలో ఒకే ర్యాంక్-ఒకే పెన్షన్ అనే నినాదంతో మాజీ సైనికులు సత్యాగ్రహం చేస్తుంటే రాహుల్ గాంధీ వారిని రెచ్చగొట్టవలసిన అవసరం ఏముంది? సైనికులు జాతికి రక్షణకవచం అందించేవారు. కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ కరాచీ వెళ్లి దునియా టీవీ ఛానల్‌లో ఐఎస్‌ఐ ఏజెంటుకు ఇంటర్వ్యూ ఇస్తూ ఢిల్లీలో ఉన్న నరేంమ్రోదీ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని పిలుపునివ్వడం నిన్నటి సంఘటనే కదా. అమెరికా-చైనాల్లో ఏ పౌరుడైనా ఇదేవిధంగా మట్లాడితే అక్కడి ప్రభుత్వాలు ఊరుకుంటాయా? కానీ ఇండియాలో అటువంటిది జరుగదు. ఈ దేశంలో అసమర్ధతను శాంతిగా భావిస్తారు. నిష్క్రియను సహనంగా నిర్వచిస్తారు.
నిన్న బిహరీ విద్యార్థికి పాకిస్తాన్ నుండి పిలుపు వచ్చింది. ఐఎస్‌ఐలో చేరి ఖుదా సేవ చేసుకోండి..అని. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఐసిస్ బీజాలు వెలుగు చూశాయి. 26 జనవరి నాడు ఢిల్లీలో జరిగే ఉత్సవాన్ని భగ్నం చేయడానికి ప్రవేశించిన 19 మంది ఉగ్రవాదుల్లోనూ హైదరాబాదీలున్నారు. వీరితో ఎవరెవరు ఎన్నికల పొత్తులు పెట్టుకున్నారో గమనించండి. ఇదే మనస్తత్వం భారతదేశాన్ని వెయ్యేళ్లు బానిసతనంలో ఉంచింది. ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిస్తే వారు అధికారంలోకి వస్తారు. ఆ గెలిచిన వ్యక్తి యోగ్యతలతో అంతగా సంబంధం ఉండదు. ఇది ఈ ప్రక్రియలో ఒక లోపం. పార్లమెంటులో నలభయి ఐదుమంది ఎంపిలు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ఇందుకు చైనా-పాకిస్తాన్‌లు మద్దతు పలుకుతున్నాయి.
మరి నరేంద్ర మోదీ ఏం చేస్తున్నట్టు? విదేశీ బ్యాంకులలోని ధనం ఎందుకు ఇండియాకు తెప్పించడం లేదు? శశిథరూర్, మణిశంకర అయ్యర్, అసదుద్దీన్ ఒవైసీ, అజాంఖాన్‌లపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పురస్కార తిరస్కార వీరులు యాభైమంది విదూషకత్వం ప్రదర్శించిన తర్వాత కూడా వోల్గా (హైదరాబాదు), జయామోహన్ (తమిళనాడు)లకు ఎలా కేంద్ర పురస్కారాలు వచ్చాయి? 1965లో ఇండో-పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు దిలీప్‌కుమార్ బహిరంగంగా పాకిస్తాన్‌ను సమర్ధించడం నాకు బాగా గుర్తు. ఆయన ఇంటికి వెళ్లి మోదీ ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని ఇచ్చిందంటే వారికి తరీకా తెలియదని అర్థం. భారతదేశంలో అసహనం పెరిగింది అంటూ అమీర్‌ఖాన్‌లు, సల్మాన్‌ఖాన్‌లు మాట్లాడటం ఏమిటి?
గోమాంసం తింటాను, ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య. సరస్వతీ దేవాలయం అనదగ్గ ఉస్మానియా విశ్వవిదాయలంలో అరాజకాన్ని రెచ్చగొట్టే బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఆర్‌జెడికి చెందిన క్రిమినల్స్‌పై ఉన్న పోలీసు కేసులను నితీశ్ కుమార్ మూసివేయిస్తున్నాడు. దీన్ని ఎవరూ ఎందుకు తప్పు పట్టడం లేదు? ఆంగ్లంలో ‘లాస్ట్ స్ట్రా అండ్ ది క్యామెల్స్ బ్యాక్’ అనే ఒక సామెత ఉన్నది. దాన్ని నుడికారంలో తెలుగులో అనువదించుకోవాలంటే, ‘శిశుపాలుని నూరవ తప్పు’ అనవచ్చు. సోనియాగాంధీ గత ముప్పయ్యేళ్లుగా తన చిత్తానుసారం వ్యవహరించింది. స్వంత పార్టీకి చెందిన పివి నరసింహారావును వేధించింది. శవ సంస్కారం కూడ సరిగ్గా జరగనివ్వలేదు. ఆదివారం నాడు తుని వద్ద రత్నాంచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు. వాహనాలు ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్లు తగులబడ్డాయి. ఎందుకు మాల్దాలో లక్షన్నర మంది ఉగ్రవాద ప్రేరిత మైనారిటీలు రోడ్డుపైకి వచ్చి దుర్గాదేవి ఆలయాన్ని, పోలీస్ స్టేషన్లను తగులబెట్టారు? మమతా బెనర్జీ ఈ దుర్మార్గాన్ని అదుపు చేయలేకపోయింది. నరేంద్ర మోదీ 300 మంది ఎంపిలతో లోక్‌సభలో పూర్తి అధికారంలో ఉండి కూడ ఎందుకు చోద్యం చూస్తూ ఊరుకున్నారు?
1947లో భారతదేశం ‘మతం’ అనే ప్రాతిపదికపై మూడు ముక్కలు చేయబడింది. అంతటితో సమస్య ముగియడంలేదు సరికదా మొదలైంది. మనం చూచే టెలివిజన్‌కు దూరదర్శన్ అని పేరు పెట్టింది డాక్టర్ రఘువీర. వీరు లాహోరు నుండి కట్టుబట్టలతో ఇండియాకు వచ్చారు. అలాగే ఎల్‌కె అద్వానీ వంటి వేలాది మంది ఇండియాకు కాందిశీకులై వచ్చారు. ఆ తర్వాతనే కాశ్మీర్‌ను పాక్‌సైన్యం ఆక్రమించింది. పఠాన్‌కోట సరిహద్దు నుంచి మాదక ద్రవ్యాల వ్యాపారం నిరాఘాటంగా సాగుతున్నది. దేశంలో దొంగ కరెన్సీ ప్రవేశపెట్టారు. జిహాదీ ఐసిస్ రిక్రూట్‌మెంట్ సెంటర్లు ప్రారంభించారు. హైదరాబాదు పాతబస్తీలో అలాంటి ఒక కేంద్రం సక్రియగా పనిచేస్తున్నది. అంతేకాదు భారీగా మతమార్పిడులు మరోవంక మొదలుపెట్టారు. ఈ గణాంకాలు చూడండి. అస్సాం- బంగ్లాదేశ్ సరిహద్దులో శరవేగంగా ముస్లిం జనాభా నిష్పత్తి పెరిగిపోతున్నది. భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ దశాబ్ద కాలం సగటు పెరుగుదల 0.8 శాతం అయితే అస్సాంలో ముస్లింల పెరుగుదల 3.3 శాతం. అంటే 30.9 శాతం నుండి 34.2 శాతానికి పెరిగింది. మరి దీనికి స్థానిక తరుణ్ గొగోయ్ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? ఇక పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసలు ఎలా ఉన్నాయంటే త్వరలో అక్కడి స్థానిక బెంగాలీలకు, కాశ్మీరీ పండిట్ల గతి పట్టబోతున్నది. దీనికి మమత, మార్క్సిస్టుల ఏం సమాధానం చెబుతారు?
ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు ఆరక్షణ సౌకర్యాన్ని భారత రాజ్యాంగంలో తాత్కాలిక పద్ధతిలో పొందుపరిచారు. ఐతే రాజకీయ అవసరాల దృష్ట్యా ఈ నిర్దేశాన్ని మళ్లీ మళ్లీ పొడిగించడం జరిగింది. కానీ ఈ ఆరక్షణలను ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే వస్తున్నారు.
రాజకీయ పరమైన ఒత్తిళ్లు, మైనార్టీ వర్గాల ఓట్లు, రత్నాంచల్ ఎక్స్‌ప్రెస్ దహనాలు, ఈ రిజర్వేషన్ ప్రక్రియలకు ఇంధనాలు. విషయం నాయకులకు తెలుసు. కాని ఇందులోని ఔచిత్యం ప్రశ్నార్థకమే. కాపు-కమ్మ కులస్థుల మధ్య కొంతకాలంగా రాజకీయ ఘర్షణలు పెరిగాయి. కృష్ణదేవరాయలు మావాడు అంటే మావాడు అంటూ వ్యాసాలు ప్రచురించారు. కృష్ణదేవరాయలు మొత్తం తెలుగు జాతికి చెందినవాడు. కుల ఘర్షణలు జాతి ప్రయోజనాన్ని దెబ్బతీస్తాయి.

చిత్రం... తునిలోఆందోళనకారులు నిప్పు పెట్టడంతో దగ్ధమవుతున్న పోలీసు వాహనాలు

- ముదిగొండ శివ ప్రసాద్