ఉత్తరాయణం

సమ్మక్క జాతర ఘనంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరను ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించాలి. ఫిబ్రవరి 17న నుండి 20వ తేదీ వరకు జరిగే ఈ జాతరకు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. కేవలం తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడ ప్రజలు తండోపతండాలుగా వస్తారు. ఈ సందర్భంగా వనదేవ తలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొని పునీతుల వుతారు. జాతర పనులకోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయంచినా, పనులు మాత్రం నత్త నడకన సాగుతున్నాయ. వివిధ ప్రాంతాలనుంచి మేడా రానికి చేరుకునే దారులు అధ్వాన్నంగా మారాయ. గతం లో నిర్మించిన స్నానఘట్టాలు, మరుగుదొడ్లు ఇతర అభివృద్ధి పనుల్లో అవినీతి తీవ్రస్థాయలో చోటుచేసుకో వడంతో, కాంట్రాక్టర్లు చేసిన నాసిరకం పనుల పుణ్య మాని, అవన్నీ ధ్వంసమైపోయాయ. కానీ కాంట్రాక్టర్లు మాత్రం కోట్లాది రూపాయలు లాభపడ్డారు. ఈ నేపథ్యం లో తెలంగాణ ప్రభుత్వం కేటాయంచిన నిధులు సద్వి నియోగమయ్యేలా, పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా తగిన చర్యలు తీసుకోవాలి. లక్షలాది గిరిజ నులకు చెందిన పండుగ పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలి. సీనియర్ ఐఏఎస్ అధికారిని జాతర ఇన్‌చార్జ్‌గా నియమిం చాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, పరకాల
బిఎస్‌ఎన్‌ఎల్ సేవలు మెరుగుపడాలి
దేశవ్యాప్తంగా రోమింగ్ ఉచితం అంటూ బిఎస్‌ఎన్‌ఎన్ ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇతర నెట్‌వర్క్‌లకు చెందిన వినియోగదార్లు బిఎస్‌ఎన్‌ఎల్‌కు క్యూ కడతారని అంతా అనుకున్నారు. నిజానికి బిఎస్‌ఎన్‌ఎల్‌కు ఉన్నన్ని వసతు లు, సిబ్బంది, అవకాశాలు మరే ఇతర నెట్‌వర్క్ లకు లేని మాట వాస్తవం. కాకపోతే సిబ్బంది ఉదాసీనత పుణ్య మాని వినియోగదారులకు తగిన స్థాయలో సేవలు అందడం లేదు. ఇప్పటికైనా అధికార్లు ఇతర సిబ్బంది తమ కస్టమర్లకు ఏవిధమైన అంతరాయం లేని సేవలు అందించాలి. బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్ బ్యాండ్ సేవలు సరిగ్గా లేవు. ఇంటర్నెట్ ఎప్పుడు కనెక్ట్ అవుతుందో, ఎప్పుడు డిస్‌కనెక్ట్ అవుతుందో ఆ దేముడికే ఎరుక. బిఎస్‌ఎన్‌ఎల్ తన లోపాలను సరిదిద్దుకొని వినియోగదార్లకు ఉత్తమ సేవలు అందించడానికి కృషి చేయాలి.
-చామర్తి వెంకట రామకృష్ణ, హైదరాబాద్
అంకుర పరిశ్రమలకు చేయూత
అంకుర పరిశ్రమలకు చేయూతనందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంచడం ముదావహం. ఈ రంగానికి ప్రభుత్వం కల్పిస్తామన్న రాయతీలను నిజంగా అమలు చేస్తే అంకుర పరిశ్రమలు నిలదొక్కుకొని దేశ ఆర్థిక ప్రగతికి దోహద పడతాయ. ఇప్పటి వరకు దేశంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఏవిధమైన ప్రోత్సా హకరమైన వాతావరణం లేదు. సరైన సమయానికి రుణం లభించక, మార్కెట్ సహకరించక, ప్రభుత్వ అనుమ తులు అందక వేరే దేశాలకు తరలిపోవడం అంకుర పరిశ్రమలకు తప్పనిసరైంది. దేశ జనాభాలో అధిక శాతం యువత. వీరిలో నిరుద్యోగులు అధికులు. ప్రభుత్వ రంగంలో అతిచిన్న ఉద్యోగాలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయ వారు కూడా వీటికోసం దరఖాస్తు చేసుకోవడాన్ని చూస్తుంటే దేశంలో ఎంతటి నిరాశామయ వాతావరణం నెలకొన్నదో అర్థమవుతోంది. దేశ రాజధానిలో అంకుర పరిశ్రమలకు సంబంధించిన ప్రభుత్వం నిర్వహించిన వర్క్‌షాపునకు రెండు లక్షలమంది హాజరయ్యేందుకు ముందుకు రావడం యువతలో ఆకాంక్షలకు ప్రతీక. నిజానికి ప్రభు త్వం 1500 మందికే ఇందులో అవకాశమివ్వాలని భావించింది. ఇక రెండో విషయం, పరిశ్రమలు అంకుర స్థాయలో ఉన్నట్టే, దేశంలోని కొన్ని ప్రాంతాలు కూడా అంకుర స్థాయలోనే ఉన్నాయ. విభజన తర్వాత అప్పుల ఆంధ్ర ప్రదేశ్‌గా అంకురం తొడిగిన నవ్యాంధ్రకు సరైన చేయూత దొరకకపోతే అభివృద్ధి కష్టమే. ప్రస్తుత ముఖ్యమంత్రి ఔత్సాహిక పారిశ్రామిక వేత్త మాదిరిగానే పెట్టుబడులకోసం గట్టిగా కృషి చేస్తున్నారు. విశాఖలో పారిశ్రామిక సదస్సు అయనా, దావోస్ వెళ్లినా రాష్ట్రంలో నాలుగు పరిశ్రమల ఏర్పాటు కోసమే. ఈ దశలో కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలి. ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రా నికి కేంద్రం బాసటగా నిలవకపోతే అధివృద్ధి దారు ణంగా దెబ్బతింటుంది.
-డివిజి శంకరరావు (మాజీ ఎంపి), పార్వతీపురం
సర్వీసులు క్రమబద్ధీకరించాలి
కాకతీయ యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ విభాగముంది. ఇది యూనివర్సిటీకి మంజూరైన భవన నిర్మాణాలు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ సిస్టం, నీటి సరఫరా, విద్యుత్ సంబంధమైన పనులు చేస్తూంటారు. ఐతే ప్రస్తుతం ఇద్దరు గ్రాడ్యుయేట్ సివిల్ ఇంజనీర్లు మాత్రమే వున్నారు. వీరు దాదాపు 23 సంవత్సరాల పైబడి బిల్డింగ్స్ డివిజన్‌లో పనిచేస్తున్నా యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగానికి ప్రత్యేక సర్వీస్ నిబంధనలు లేని సూపర్ వైజర్లుగా పిలువబడుతూ టైమ్ స్కేలు సూపర్‌వైజర్లుగా సర్వీసు క్రమబద్ధీకరణ కాక పూర్తి తాత్కాలి