సబ్ ఫీచర్

గంగ శుద్ధికి సరికొత్త ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం’లో మన పాలకులు నిష్ణాతులు. పూటగడిస్తే చాలు, రేపటి సంగతి రేపు చూసుకొందాం అన్న ధోరణి మన నేతలలో ఎక్కువగా కనిపిస్తున్నది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా గంగా జలాల శుద్ధి ప్రాజెక్ట్‌ను చెప్పుకోవచ్చు. ఎనబైయ్యవ దశకం మధ్యలో ప్రారంభమైన గంగాజలాల శుద్ధీకరణ నేటివరకు పూర్తి కాలేదు. ఎప్పటికీ పూర్తి అవుతుందో ఎవరికీ తెలియదు. సాలీనా కోట్లాది రూపాయలు మాత్రం ఈ పథకం కింద ఖర్చు అవుతున్నాయి. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తరువాత గంగాజలాల శుద్ధి పట్ల ఒక్కింత చిత్తశుద్ధితో పనిచేయడం ప్రారంభించారు. నదీ జలాల శుద్ధిలో నిన్నమొన్నటి వరకు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు భాగస్వామ్యం కల్పించలేదు. ప్రజల భాగస్వామ్యంతో ఏడు ఐ.ఐ.టి.లు గంగాజలాల శుద్ధికోసం గంగారివర్ బేసిక్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను రూపొందించాయి. ఈ ప్రణాళిక రూపకల్పనలోముంబాయి, చెన్నై, కాన్పూర్, ఖరగ్‌పూర్, గౌహతి, రూర్కీ, ఢిల్లీలలోని ఐ.ఐ.టి. విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రణాళిక రూపకల్పన (బ్లూప్రింట్)కోసం 2010లో ఒక కమిటీని ఏర్పాటుచేశారు.
కమిటీ నివేదిక ప్రకారం, గంగానదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాలలో, ఒక్కొక్క ఐ.ఐ.టి ఐదేసి గ్రామాలను దత్తత తీసుకొంటుంది. దీనికి ఉన్నత భారత్ అభియాన్ అని పేరు పెట్టారు. ఐ.ఐ.టి. విద్యార్థులు తమకు కేటాయించిన గ్రామాలలోని మురుగునీటిని శుద్ధిచేసి, నదిలో కలిసేలా చేస్తారు. ప్రతి గ్రామంలోను మురుగునీరు శుద్ధి కేంద్రాలను ఏర్పటుచేసి, వాటి నిర్వహణ బాధ్యతలను వారే స్వీకరిస్తారు. ఇది ఇలా ఉండగా ఉన్నత్ భారత్ అభియాన్ కార్యక్రమంలో తమకు భాగస్వామ్యం కల్పించాలంటూ పాట్నా, హైదరాబాదు, భువనేశ్వర్‌లలోని ఐ.ఐ.టి. విద్యార్థులు కోరుతున్నారు.నదిలో కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు జిఐఎస్ పద్ధతిని ఏర్పాటుచేయాలని ఖరగ్‌పూర్ ఐఐటి విద్యార్థులు సూచిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో కాలుష్య పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయడం వలన, కాలుష్య నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవచ్చు. కేంద్ర మానవ వనరుల శాఖలోని వయోజన విద్యా విభాగం సిబ్బంది గంగానదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాలలో నదీ జలాలు కలుషితం అవడంవలన కలిగే కష్టనష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.గంగానదికి ఉప నదులు అయిన రామ్‌గంగా, కాళి నదులలో పారిశ్రామిక కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. గంగా జలాల శుద్దీకరణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘నమామి గంగే’ అనే ప్రాజెక్ట్‌ను చేపట్టారు. గంగాజలాల శుద్ధికోసం ఐ.ఐ.టి.లు రూపొందించిన బ్లూప్రింట్‌ను కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. గంగా జలాలు శుద్ధి చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాలని ప్రధాని నరేంద్రమోదీ ఐ.ఐ.టి.లను కోరారు. త్వరలో వీరు యాక్షన్ ప్లాన్‌ను రూపొందించి, ప్రభుత్వానికి అందచేయనున్నారు. అతి త్వరలో గంగా జలాల శుద్దీకరణ పనులు అవి వేగంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- పి.మస్తాన్‌రావు