సబ్ ఫీచర్

ఉత్తమ బోధనతోనే మంచి ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యాప్రమాణాలు పెంచటానికై పాఠశాలల్లో వౌలిక వసతులు పెంచిన దానికన్నా టీచింగ్‌ను పటిష్టం చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్న భావనకు రాష్ట్ర ప్రభుత్వం రావడాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. మన దేశంలోనే కాకుండా ఫిన్లాండ్, పోలెండ్, పోలెండ్ ప్రయోగాలు చూసిన తర్వాత అన్ని దేశాల్లో కూడా ఇలాంటి ప్రయత్నమే జరుగుతున్నది. ప్రమాణాలు పెంచడానికై మొదటి అడుగు సమర్ధులైన ఉపాధ్యాయులను నియమించడం జరగాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం అడిగిన ప్రశ్నలతో పాటుగా గణితం, సైన్స్‌లోపల ఉత్తమమైన ఉపాధ్యాయులను ఏ విధంగా పెంచాలి? అన్న సూచనలను కూడా అడిగారు. సాంకేతిక యుగంలో సైన్స్‌కు, గణితానికి ప్రాధాన్యత ఉంది కానీ ఇది డిజిటల్ యుగంలో కేవలం ఈ రెండు సబ్జెక్టుల వల్లనే సంపూర్ణంగా విద్యా ప్రమాణాలు పెరుగుతాయనుకోవడం సరైంది కాదు. ఒక సబ్జెక్టులో ఏర్పడిన నైపుణ్యం ఇతర సబ్జెక్టులలో కూడా ప్రతిబింబిస్తుంది. పాఠశాల నిర్వహణ దాన్ని విభజించవచ్చును కానీ విద్యార్థి మాత్రం దాన్ని విడివిడిగా చూడడు. ఈనాడు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ వస్తుంది అంటే అన్ని అంశాలపైన సబ్జెక్టులపైన సమన్వయ దృష్టి వచ్చింది. అదే క్రిటికల్ థింకింగ్‌కు మూలం. అదే కొత్త ఆవిష్కరణలకు కొత్త ఆలోచనలకు కొత్త భావాలకు మూలం. ఉత్తమమైన ఉపాధ్యాయులు లేదా సమర్ధులైన ఉపాధ్యాయుల నియామకం జరగడం ప్రాధాన్యం కానీ ఈ రెండు సబ్జెక్టులకే అంటే లెక్కలు, గణితానికే పరిమితం కావడం కాదు. రాబోయే ఉపాధ్యాయుడ్ని గుర్తించేది...చేస్తున్న తరగతి గది ఉపాధ్యాయుడే. కొందరి పిల్లల స్వభావం చూస్తాడు. విద్యార్థులు తమకు అవగాహన అయిన విషయాన్ని ఇతర పిల్లలకు సులభంగా బోధిస్తారు. విద్యార్థి ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడో తోటి విద్యార్థే గుర్తించగలుగుతాడు.
ఇతర దేశాలలో ఉపాధ్యాయ నియామకం చేసేటప్పుడే మీకు హైస్కూల్‌లో బోధించిన టీచర్ల పేర్లు చెప్పమని అడుగుతారు. ఉపాధ్యాయులను నియమించే అధికారి కొత్తగా నియమించబడే ఉపాధ్యాయులను తరగతి గది ప్రవర్తన గురించి అడుగుతారు. ఇది ఆబ్జెక్టివ్‌గా వుండాలనే ఉద్దేశంతో ఆధారాలతో సహా తను దానికి జవాబు రాయవలసి ఉంటుంది. గతంలో మీకు బోధించిన ఉపాధ్యాయుల తరగతి గది, గదిలో వారి గ్రాహ్యశక్తి ఎలా ఉండేది? విద్యార్థులకు బోధన ఎలా చేసేవారు? అర్ధంకాని పిల్లలకు ఎట్లా చెప్పేవారు ఇలాంటివి రెండుమూడు సంఘటనలు చెప్పమని సంబంధిత నియామక అధికారి అడుగుతారు. నియమించబడే టీచర్‌కు ఎంత మేరకు సొంత కృషి ఉందోనన్న విషయాలను, ప్రశ్నలు వేసి వారినుంచే సమాధానాలు రాబడతారు. అనేక నిర్దిష్ట ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసి వుంటుంది. కొత్తగా నియమించబడే ఉపాధ్యాయుడ్ని అతని గత తరగతి గది చరిత్రను వెలికి తీస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొ.రావాడా, కెమిస్ట్రీలో ప్రొ.సుబ్బారావులు కొంతమంది పిల్లలను పిలిచి ప్రైవేటుగా వారితో మాట్లాడుతూ మీరు బోధన రంగంలోకి రావాలని కోరేవారు. సమర్ధులైన పిల్లలు పేదవారైతే వారికి స్కాలర్‌షిప్‌లు ఇప్పించి ప్రోత్సహించేవారు. టీచర్ల నియామకంలో వారికి బోధన చేసిన టీచర్ల పాత్ర కూడా ఉండేది.
బోధనలో విద్యార్థి ప్రవీణత ఎంత ప్రధానమో, టీచింగ్‌లో నైపుణ్యం కూడా అంతే ప్రధానం. నియమించబడే ఉపాధ్యాయుని బోధనా విధానాన్ని కూడా పరిశీలించాలి. ఆ బోధనలో దాగివున్నటువంటి ప్రతిభ బైటికి వస్తుంది. కనబడని నైపుణ్యతను వెలికి తీయగలగాలి. అదేమాదిరిగా ఉపాధ్యాయులను నియమించిన తర్వాత రెండుమూడు సంవత్సరాలు అతన్ని పరిశీలనా స్థాయిలోనే వుంచాలి. ఆ కాలం లోపల విద్యార్థులతో ఆయన సంబంధాలు, తోటి ఉపాధ్యాయులతో వుండే సంబంధాలు తెలుస్తాయి. నియమించిన అధికారులు ఆ కాలంలో రెండుమూడుసార్లు వెళ్లి కొత్త టీచర్ విద్యా కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. ఉపాధ్యాయ నియామకం ఒక పరీక్షతో ఒకరోజుతో జరగదు. ఈ మాదిరిగా ఫిన్లాండ్, పోలెండ్, సౌత్ కొరియా కొన్ని దేశాలలో చాలా పకడ్బందీగా ప్రతి అభ్యర్థిని తదేక దీక్షతో పరిశీలించి ఉపాధ్యాయ నియామకం జరుగుతుంది. శ్రేష్టమైన ఉపాధ్యాయులుంటేనే సమర్ధవంతమైన విద్య విద్యార్థులకు అందుతుంది. అలాంటి విద్యార్థులతో వచ్చే మానవ సంపద దేశ ఆర్థిక సంపదకు దోహదపడుతుంది.

- చుక్కా రామయ్య