ఉత్తరాయణం

కాంగ్రెస్ గోహత్యకు సిద్ధమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్దరామయ్య తనకిష్టమైతే గోవుమాంసం తింటానని, ఇప్పటివరకు తినలేదని, ఎవరూ తనను అడ్డుకోలేరని బహిరంగంగా కాంగ్రెస్ సమావేశంలో ప్రకటించటం సిగ్గుచేటు. భరతమాత బిడ్డవై హిందూ సమాజం ఎంతో పవిత్రంగా పూజించే గోమాత మాంసాన్ని ముస్లింలు ప్రీతితో తింటారని, అవసరమనుకుంటే నేను గోవుమాంసాన్ని తింటానని, ముస్లింలను సంతోషపెట్టే ప్రకటన చేసియుండవచ్చు. ఇది కూడ ఓటు బ్యాంకు రాజకీయమే! ముస్లింలు గోవును తింటారని, ముస్లింలు బహుభార్యత్వాన్ని కోరుతున్నారని మీరుకూడ అదే కోరుకుంటారా? కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్దరామయ్య గోమాంసం తింటాననడమే మహాపాపము. భగవంతునిపై నమ్మకం వుండే వ్యక్తి ఎవరు గోవును హింసింపరు. గోమాతను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేయటం నీచాతినీచం. ఇప్పటికే పాకిస్తాన్, అరబ్ దేశాల ఆదేశాలను లోలోపల పాటిస్తూ ప్రతి జిల్లాలోను ఎన్నో మార్పు లు చోటుచేసుకున్నాయి. పరమత అసహనమనే సాకుతో శ్రీమతి సోనియా, ఆమె తనయుడు కాంగ్రెస్ పెద్దలు మన రాష్టప్రతికి మెమోరాండం సమర్పించటం సిగ్గుమాలిన తనం. రాజకీయ అంశాలను రాజకీయంగా తలపడలేక అడ్డదారుల్లో తలపడాలని భావించటం చేతగాని తనానికి నిదర్శనం. ఇస్లాం తీవ్రవాదులు పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ నుంచే గాక ఇండియాలో కూడా ముఠాలు తయారై దేశ ప్రజలపై దాడులుచేస్తూ వుంటే నోరు మెదపరు. నిరంతరం ఓటు బ్యాంకు రాజకీయాలేనా? మత మార్పిడులకు అడ్డు అదుపులేదు. మీకు అధికారం ధన సంపాదనేనా ముఖ్యం. ఛీ మీరు భరత మాత ముద్దుబిడ్డలా? ఆలోచించండి!!
- జి.శ్రీనివాసులు, అనంతపురం
అధిక ధరలను అరికట్టాలి!
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో టి.ఆర్.ఎస్. ప్రభుత్వాలు ఏర్పడిన నాటి నుంచి ఉప్పునుంచి పప్పు వరకు ధరలు అధికంగా పెరిగిపోయి, తారాజువ్వల మాదిరిగా ఆకాశానంటుకొని దిగి రావడం లేదు. అధిక ధరలను అరికట్టలేని ప్రభుత్వాలు ఒక ప్రభుత్వాలేనా? నిత్యావసర వస్తువుల ధరలను కేంద్రం ఏమాత్రం నియంత్రించలేకపోతున్నది. వేరుశనగ నూనె ధర, కందిపప్పు, బియ్యం, ఉల్లి, యెల్లి, పెసర, మినుప పప్పు ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. శుభ కార్యలకు అమితంగా ఉపయోగపడే బెల్లం విషయానికి వస్తే చెప్పనలవి కావటం లేదు. వృద్ధులకు, రోగులకు, పురుడుపోసుకొనిన బాలింతలకు, పసి పిల్లలకు సోనా మసూరి బియ్యం వంటి పెడదామనుకుంటే అధిక ధరలవలన అవి అందుబాటులోనికి రావటం లేదు. ఇక నిరుద్యోగుల అవస్థ చెప్పనలవి కావటం లేదు. నిజాయితీగా జీవనం కొనసాగించే వారి అవస్థలు చెప్పనలవి కావటం లేదు. ఇప్పటికైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాది మాటల ప్రభుత్వం కాదని నిరూపించుకోవటానికి నిత్యావసర వస్తువుల అధిక ధరలను అరికట్టి సామాన్య ప్రజానీకం కడుపునింపుకోవడానికి ఉపయోగపడే విధంగా ధరలను అరికట్టాలి.
- రంగినేని జగదీశ్వరుడు, కొల్లాపూర్
ఆ వైభవం మనకు దక్కదా?
ఆనాడు 1963 వెంపటి చినసత్యంగారు అనేక వ్యయప్రయాసలకు తొలగ్గి కూచిపూడి ఆర్ట్ కమిటీ స్థాపించి ఇతోధిక కృషిసలిపి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కళాప్రియుడు.