సబ్ ఫీచర్

కనుమరుగైన నిస్వార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలకు కొదవ లేదు. ప్రతి పార్టీకి ఆశయం ఒకటి వున్నది. కాని ప్రజలకు చేరువగా వుండి ప్రజల నిత్యజీవన సమస్యలు పరిష్కరించగలిగిన నాయకులు కరువయ్యారు. ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రజల జీవనం సుఖమయం చేయటం రాజకీయ పార్టీల కర్తవ్యం. ఆ విషయాన్ని ప్రక్కనపెట్టి తమ స్వార్థమే పరమార్థంగా భావించే నాయకులే ఆయా పార్టీలలో మెండుగా వున్నారు. ప్రతి పార్టీలోను మొదటితరం నాయకుల మాదిరిగా త్యాగధనులైన నాయకులు తయారుకాలేదు. మొదటి తరం నాయకులు స్వతంత్ర పోరాటంలో పాల్గొ ని ఎన్నో బాధలకుగురై తమ సర్వస్వం కోల్పోయారు. ఆ తరువాతవారు రెండవ తరం వరకు బాగానే ప్రజల కొరకు పనిచేశారు. 3,4 తరాలు ఎక్కువ శాతం అవినీతితో అక్రమ సంపాదన, వారసత్వ రాజకీయాలకు బాటవేశారు. పార్టీలవారీగా ఆలోచిస్తే కొంతవరకు అవగాహన కలుగుతుంది.
పురాతనమైనది స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన కాంగ్రెస్ ప్రకాశం, ఆచార్య రంగాగార్ల వంటివారు ప్రజలమధ్య వుండి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆ తరువాత వచ్చినవారు ఎక్కువ శాతం అవినీతిపరులై అక్రమ సంపాదన చేసి చివరికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను పరిపాలనను కోల్పోయారు. వారి నాయకులు ఎన్నోరకాల అవినీతి కేసులలో ఇరుక్కొని వున్నారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేకుండా చేశారు. కమ్యూనిస్టు పార్టీ ఒకనాడు ప్రజల హృదయాలలో తిష్టవేసి వారి సమస్యలు పరిష్కార మార్గంలో ఎన్నో పోరాటాలు చేశారు. ఎంతో త్యాగం చేశారు. సుందరయ్య, రాజేశ్వరరావుగారి లాంటి నాయకులు తరువాత క్షీణించి అంతర్గత కలహాలతో ఎన్నో ముక్కలై ప్రజాభిమానాన్ని కోల్పోయింది.
నందమూరి తారకరామారావుగారి తరువాత అంతటి ప్రజాభిమానాన్ని చంద్రబాబు పొందలేకపోయారు. నాదెండ్ల భాస్కరరావుగారి తిరుగుబాటుతో పార్టీ పతనదశ ఎలా వుంటుందో చూచింది. ఆ సమయంలో వెంకయ్యనాయుడు రామారావుపై ఉన్న గౌరవంతో వారి పార్టీ అధికార ప్రతినిధులను చెదిరిపోకుండా కాపాడారు. వెంకయ్యనాయుడుకు ఆ పార్టీ ఎంతో ఋణపడి వున్నది. చంద్రబాబు ఏకవ్యక్తి నిర్ణయాలు వారసత్వ రాజకీయాలు నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయ. అంటే కాంగ్రెస్‌వారి వారసత్వం అలవాటుకు వీరు దూరంకాదని జనాభిప్రాయం. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డి తనకు గట్టిపోటీ ఇస్తున్నాడని చంద్ర బాబు భావించారు. ఈ కారణంగానే ఏదో విధంగా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ప్రజలకు ఎన్నో ఎన్నికల వాగ్దానాలు చేసి చివరికి విజయం పొందారు. ఆ తరువాత జరుగుతున్న విషయాలు చెలరేగుతున్న ప్రజల వ్యతిరేకత తట్టుకొని ప్రజలకు సుస్థిరపాలన అందేలా చేయడానికి యత్నించాలి. ప్రస్తుతం అందుకు చాలినంత బలం చంద్రబాబుకు చాలిప్రజలలో వున్నది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కుల, మత పోషణ, అవకాశ ధోరణి, ప్రజలకు ఏ రకమైన మేలు చేయవు. మిగిలింది లోక్‌సత్తాపార్టీ వ్యవస్థాపకుడు ఉన్నత విద్య ఐ.ఎ.ఎస్. రాజకీయంలో ఉపయోగపడలేదు. ప్రస్తుతం ఏకసత్తా పార్టీ అయింది.
చివరిగా ప్రజల కోరిక మొదటితరం నాయకుల వంటి యువకులు ముందుకువచ్చి స్వార్థరహితంగా దేశాన్ని, ప్రాంతాన్ని అవకాశవాదులనుం డి తప్పించి తిరిగి గాడిలో పెట్టగలరని ఆశ. కానీ ఈ ఆశ నెరవేరేనా? ఇం తటి స్థాయ అవినీతి, బంధుప్రీతి, అధికార దాహాన్ని నిలువెల్లా నింపుకున్న నేటి నాయకులు నిస్వార్ధపరులు కావడమనేది కల్లోని మాట. అంతా డబ్బే పరమావధిగా రాజకీయాలు నడుస్తున్నాయ మరి.

- డి.పి.రామచంద్రరావు