సంపాదకీయం

సురేశ్ ప్రభు జాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేగం భద్రత విస్తరణ, స్వచ్ఛత వంటి పదజాలంతో నిర్మించిన పట్టాలపై ధూమశకటాలు దూసుకొని పోతున్న దృశ్యాన్ని రైల్వేమంత్రి సురేశ్ ప్రభు గురువారం పార్లమెంట్‌లో మరోసారి ఆవిష్కరించారు. ‘‘ఆయన తీరు వేరు..’’ అన్నది మరోసారి ధ్రువపడింది. ధూమశకటాలు-పొగబండ్లు-నిర్థూమ-పొగలేని-శకటాలుగా మారుతున్నాయన్న ఆదర్శాన్ని వాస్తవం చేయనున్నట్లు మంత్రి ప్రకటించడం స్వచ్ఛతకు నిదర్శనం కావచ్చు. కానీ 2016-17వ సంవత్సరానికి ఆయన ఆవిష్కరించిన రైలు బడ్జెట్ ప్రస్ఫుటించిన పదసౌందర్యం ప్రతినిధులను, ప్రయాణీకులను సైతం విచిత్ర అనుభూతికి గురిచేసింది. అనుభూతి నుండి ప్రతిపక్షాలు, విమర్శకులు సైతం బయటపడక ముందే సురేశ్ ప్రభు ప్రసంగం ముగిసిపోయింది. రైళ్ల వ్యవస్థ వేగంగా ముందునకు దూసుకొని పోతోందన్నది ఆయన కల్పించ గలిగిన విచిత్ర అనుభూతి. ప్రభు ఈ మంత్రిత్వశాఖను చేపట్టడానికి ముందు బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన సందర్భాలలో రైల్వే మంత్రులు చేసిన ప్రసంగాలకు పూర్తి భిన్నమైన రీతిలో సురేశ్ ప్రభు గత ఏడు తన వక్తృత్వ చమత్కృతిని ప్రదర్శించారు. ఈ ఏడు కూడ అదే ప్రసంగరీతి పునరావృత్తమైంది. చిన్న పిల్లలను కూచోబెట్టి బడిపంతులు దబాయించి పాఠం చెప్పినట్టుగా రైల్వేమంత్రి రైళ్ల సర్వతోముఖ ప్రగతి చిత్రాన్ని దర్శింపజేశారు. అత్యధికం దీర్ఘకాల పథకాలు కాబట్టి ఈ ప్రగతి నిజంగా పట్టాలపై పరుగురు తీస్తుందని విశ్వసించి తీరవలసిందే నన్నది సురేశ్ ప్రభు ‘సుస్వర గీతా’నికి ఇతివృత్తం. రైళ్లలోని వంట పెట్టెలలోకి ఎలుకలు చొరబడి పోతున్నాయని, నిన్నటి బోజన అవశేషాలు నేటి కంచంలో కనిపిస్తున్నాయని చెప్పదలచిన వారికి ఆ విషయాల ధ్యాస తప్పడం మంత్రిగారి ‘స్వచ్ఛత’ ప్రభావం. పెట్టెలలో స్వచ్ఛత గురించి దూరవాణి ద్వారా సందేశాలను సంధించి తక్షణ ఫలితాలను పొందడానికి మంత్రి వీలు కల్పించారు మరి! మన ఖాజీపేటలో రైలుపెట్టెల కర్మాగారం-కోచ్ ఫ్యాక్టరీ- నిర్మిస్తారా? లేదా? అన్నది తేలలేదు. కానీ ఖాజీపేట రైల్వే కార్యశాల-వర్క్‌షాప్- ఆధునికీకరణకు నిధులను కేటాయించినట్టు మంత్రి చెప్పుకొచ్చారు. కోచ్ ఫ్యాక్టరీకే నిధులిచ్చారన్న భ్రమ వ్యాపించడం సురేశ్ జాలం! విశాఖ పట్టణం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న ప్రస్తావన ఇప్పుడెవరికీ గుర్తు లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ మార్గాలకు పనె్నంటు వందల కోట్ల రూపాయలకు పైగా కేటాయించారట! ఈ నిధులు, రైల్వే జోన్ సంగతిని మరపింపజేశాయి. ఇదీ ప్రభు ప్రభావం!
తేజస్ ఉదయ్ అంత్యోదయ వంటి వేగవంతమైన రైళ్లు పరుగులెత్తనున్నాయి. ఎన్ని రైళ్లు ఏయే మార్గాల గుండా పరుగులు తీస్తాయన్నది మీమాంస! కానీ సురేశ్ ప్రభు ఈ వేగవంతమైన రైళ్ల గురించి వర్ణించిన తీరు మీమాంసను మరపింపజేసింది. ఈ రైళ్లు పేదలకోసం మధ్యతరగతి వారికోసం నడుపుతున్నారన్నది ప్రధానం! తక్కువ చార్జీలతోనే ఎయిర్ కన్డీషన్డ్ వంటి సౌకర్యాలు గల అధునాతన బోగీలలో ప్రయాణం చేయగలడం మధ్యతరగతి పాలిట వరమన్నది సురేశ్ ప్రభు ధ్వనింప చేస్తున్న వాస్తవం. కానీ మనదేశంలోని అన్ని మార్గాలలోను ఈ తేజస్ రైళ్లు ఎప్పటికి పరుగులు తీస్తాయన్నది ప్రభ్వు వెల్లడించని సుదీర్ఘ ప్రణాళిక. ఈ బడ్జెట్ తనది కాదని ప్రజలే ప్రవేశపెడుతున్న బడ్జెట్ అని అభివర్ణించడం మంత్రివర్యుని మాటల చాతుర్యానికి నిదర్శనం. అందువల్ల ప్రజలు తాము ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను తాము విమర్శించుకోలేరు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడ రైల్వే ప్రగతిలో భాగస్వాములు కానున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బడ్జెట్ గురించి వ్యతిరేకంగా మాట్లాడటానికి వీలులేక పోవడానికి బహుశా ఈ భాగస్వామ్యం కారణం! గతంలో లాలూ యాదవ్, మమతా బెనర్జీవంటివారు ‘బిహార్’ రైల్వే బడ్జెట్‌ను, ‘బెంగాల్’ రైల్వే బడ్జెట్‌ను రూపొందించిన కీర్తిని గడించారు. అలాంటి వైపరీత్యానికి సురేశ్ ప్రభు గురికాకపోవడం దేశ ప్రజలందరూ మెచ్చదగిన పరిణామం. అమరావతిలో పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిన రైల్వే విశ్వవిద్యాలయాన్ని వాడోదర-బరోడా-లో ప్రభు ఏర్పాటు చేయిస్తున్నారు. వాడోదర ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వౌనం వహించవలసిందే!
రైలు వేగం పుంజుకొనడానికి వీలుగా జీవిత బీమా సంస్థ-ఎల్‌ఐసి- లక్షకోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెడుతుండడం, స్వదేశీయ స్ఫూర్తికి నిదర్శనం. జీవితబీమా, నిధులు నిజానికి ప్రజలధనం. బీమాను భాగస్వామిని చేయడం రైల్వేల నిర్మాణ, ప్రగతి కలాపాలలో ప్రజలకు ప్రాధాన్యం ప్రాతినిధ్యం కల్పించడం. అందువల్ల తమది ప్రజల బడ్జెట్ అని ప్రభు చేసిన వర్ణనకు సార్థకత ఏర్పడుతోంది. ఇది భారత్‌లో తయారు చేయండి-మేక్ ఇన్ ఇండియా- స్ఫూర్తికి అనుగుణం. మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే రెండు చోట్ల రైలు ఇంజెన్ల నిర్మాణ కర్మాగారాలు ఏర్పాటు చేయనున్నారట. ఈ ఏడాది రెండువేల ఎనిమిది వందల కిలోమీటర్ల కొత్త రైలు మార్గాలు నిర్మాణం కానున్నాయట. సికిందరాబాద్-మహబూబ్ నగర్‌ల మధ్య రెండవ సమాంతర మార్గం, కాజీపేట- విజయవాడ మధ్య మూడవ సమాంతర మార్గం, ఈ కొత్త ఇనుప దారులలో భాగం కావచ్చు. రైలు వ్యవస్థ కూలబడలేదని ప్రగతి పట్టాలపై పరుగులు వేగవంతం అవుతోందని సురేశ్ ప్రభు ధ్వనింప చేశారు. మరో రెండువేల కిలోమీటర్ల మేర ఇనుప దారులను విద్యుదీకరిస్తారట. రోజూ సగటున దాదాపు ఏడు కిలోమీటర్ల కొత్తపట్టాలు ఏర్పడుతుండగా, రానున్న రెండేళ్లలో ఈ సగటును పదునాలుగు కిలోమీటర్లకు పెంచనున్నారట. ఆ తరువాత పంతొమ్మిది కిలోమీటర్ల సగటును సాధించాలన్న లక్ష్యం సురేశ్ ప్రభు వేగం...సరకు రవాణా రైళ్ల-గూడ్సుట్రైన్స్-రాకపోకలకోసం ప్రత్యేక మార్గాలను నిర్మించడం, కాపలాలేని అన్ని కూడళ్ల వద్ద వంతెనలు నిర్మించడం దీర్ఘకాల ప్రణాళికలో భాగం. ఇందుకోసం ఎనిమిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులను సమకూర్చనున్నారట. ఈ ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయల ప్రస్తావన గత బడ్జెట్‌లో కూడ ఉంది. ఈ నిధులను ఎలా సమకూర్చుకుంటారో మాత్రం చెప్పకపోవడం సురేశ్ ప్రభు గడుసుతనం...
రైలు ఛార్జీలు పెరగలేదన్నది సామాన్య ప్రజలకు అత్యంత ప్రియమైన సమాచారం. వచ్చే ఏడాది- 2016-2017లో లక్షా ఎనబయి ఐదువేల కోట్ల రూపాయల ఆదాయాన్ని రైల్వేలు పొందనున్నాయట. 2015-16లో కంటె ఇది పదిశాతం ఎక్కువ. ఛార్జీలు పెంచకుండానే ఆదాయాన్ని పెంచుకోవడమే విశ్వాసానికి పెరిగిన వేగం.