సబ్ ఫీచర్

నిజాం షుగర్స్‌పై నెరవేరని హామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేం అధికారంలోకి రాగానే నిజాం సుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని చక్కెర కర్మాగారంపై ఆధారపడిన రైతులు, కార్మికుల జీవితాల్లో వెలుగు ప్రసాదిస్తామన్న టిఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కార్మికుల పొట్టకొట్టింది. కార్మికులు, ఉద్యోగులు నిజాం దక్కన్ సుగర్స్ లేఆఫ్‌ను వెంటనే ఎత్తివేయాలని ఆందోళన బాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వానికి ఈ సమస్య సవాల్‌గా మారింది. తీపిని అందించే చక్కెర కర్మాగారం రైతులు, కార్మికులకు చేదును మిగుల్చుతోంది. ఆసియాలోనే అరుదైన గుర్తింపును పొందిన నిజాం దక్కన్ సుగర్స్ లిమిటెడ్ లేఆఫ్‌కు చేరుకోవడం కార్మికులు, రైతులు ఉద్యోగుల భవితవ్యం అగమ్యగోచరం అయింది. నిజాం దక్కన్ సుగర్స్ యామాన్యం నిజామాబాద్ జిల్లా బోధన్, మెదక్ జిల్లా ముంబోజుపల్లి, కరీంనగర్ జిల్లా ముత్యంపేట చక్కెర పరిశ్రమలను 2015-16 క్రషింగ్ సీజన్‌కు గాను లేఆఫ్‌ను ప్రకటిస్తూ ఈ నెల 23న నోటీసు బోర్డును అంటించారు. ఇటీవల జరిగిన ఎన్‌డిఎస్‌ఎల్ బోర్డు ఆఫ్ డైరక్టర్స్ సమావేశంలో లేఆఫ్ నిర్ణయం తీసుకున్నట్టు యాజమాన్యం ప్రకటించడం తెలంగాణలో కార్మికుల ఆందోళన జరుగుతోంది.
నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం సుగర్స్‌కు అనుబంధంగా 1985-86లో ముత్యంపేట కర్మాగారం మొదటిసారి లేఆఫ్‌కు గురైంది. ఆ తర్వాత కర్మాగారం దినదినాభివృద్ధి చెందింది. లాభాల్లో వున్న దీన్ని 2000 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం డెల్టా సుగర్స్ సంస్థకు ఉప్పు, పుట్నాల వలె తక్కువకు అమ్మింది. 300 కోట్ల విలువ వున్న వాటిని 36 కోట్లకే టిడిపి పార్టీ తమ అస్మదీయులకు కట్టబెట్టి కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేసింది. 51 శాతం ప్రభుత్వ వాటా, 49 శాతం ప్రైవేట్ వాటాతో జాయింట్ వెంచర్లలో ఎన్‌డిఎస్‌ఎల్‌గా కర్మాగారం రూపాంతరం చెందింది. తెలుగుదేశం పార్టీ ఈ కర్మాగారాన్ని సర్వనాశనం చేసిందని అప్పట్లో కార్మికులు ఆవేదన వ్యక్తం చేసారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు చేసిన ద్రోహాన్ని, ప్రైవేటీకరణను రాజశేఖర్‌రెడ్డి తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిజాం సుగర్స్‌ను స్వాధీనం చేసుకుంటుందని రాజశేఖర్‌రెడ్డి ప్రకటించడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేసారు. 2004 జూలైలో దీనిపై శాసనసభ సంఘాన్ని ఏర్పాటు చేసారు. ఈ సభాసంఘం 2006 జూలై 28న మూడువందల పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించింది. నిజాం సుగర్స్ ఫ్యాక్టరీ యూనిట్లను ప్రైవేటీకరణలో అనేక అక్రమాలు జరిగాయని, వెంటనే స్వాధీనం చేసుకోవాలని సభాసంఘం తన సిఫార్సులో పేర్కొంది. ఎన్నికల్లో ఉచిత హామీలను ఇచ్చిన రాజశేఖర్‌రెడ్డి ఆ తర్వాత సభాసంఘం సిఫార్సులను పట్టించుకోలేదు. అక్రమాల మీద చర్యలు తీసుకోలేదు.
వలస పాలకులైన టిడిపి, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలోని అన్ని పరిశ్రమలను మూతవేసాయని టిఆర్‌ఎస్ పార్టీ భారీ ప్రచారం చేసింది. తెలంగాణ రాష్ట్రం వస్తే వంద రోజుల్లో నిజాం ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని అదరగొట్టే ప్రచారం చేసారు. తెలంగాణ పరిశ్రమలు బాగుపడాలంటే టిఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని ప్రచా రం చేసారు. తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌ను గెలిపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సహా టిఆర్‌ఎస్ నేతలు పలుమార్లు ఎన్‌ఎస్‌డిఎల్‌ను సర్కారు స్వాధీనం చేసుకుంటుందని నమ్మబలకడంతో రైతులు కార్మికుల్లో ఆశలు చిగురించాయి. ఏప్రిల్ 30న ఎన్‌డిఎస్‌ఎల్ యూనిట్లను టేకోవర్ చేసుకోవడానికి తెలంగాణ సర్కారు జీవో జారీ చేసింది. టేకోవర్ సందర్భంగా విధి విధనాలను ఖరారు చేయడానికై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని వేసారు. జూలై 2015లో వేసిన కమిటీ సకాలంలో నివేదికను అందచేయలేదు. కమిటీ వేసి చేతులు దులుపుకున్న పాలకులు కనీసం సమీక్షా సమావేశం నిర్వహించలేదు. ఈలోపు పుణ్యకాలం గడిచిపోయింది. టిడిపి, కాంగ్రెస్ పార్టీలవలె టిఆర్‌ఎస్ పార్టీ కూడా విఫలమైంది. ఈ నేపథ్యంలో 2015-16 క్రషింగ్ సీజన్‌లో బోధన్, ముంబోజుపల్లి, ముత్యంపేట యూనిట్లలో క్రషింగ్‌ను నిలిపివేస్తు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ జోక్యంతో నిజామాబాద్ జిల్లా కామారెడ్డి శివారులో గల గాయత్రి కర్మాగారంలో ఎన్‌డిఎస్‌ఎల్ యూని ట్ల పరిధిలోని చెరుకును గానుగాడిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో ముత్యంపేట ఎన్‌డిఎస్‌ఎల్‌లో 106 మంది రెగ్యులర్ 200మంది సీజనల్ ఉద్యోగులు బజారున పడ్డారు. యాజమాన్యం పలు కారణలతో పర్మినెంట్ ఉద్యోగులను తొలగించడంతో కార్మికులు కర్మాగారం గేటు ముందు నిరాహార దీక్షలు చేశారు. క్రషింగ్ నిలిపివేయడంవల్ల వేతనాలు, హెచ్‌ఆర్‌ఎ, ఇతర అలవెన్సులు, పించను కార్మికులు ఉద్యోగులు కోల్పోయే ప్రమాదం ఉంది.
తెలంగాణలో కొత్త చక్కెర కర్మాగారాలను ప్రారంభించకపోయినా మంచిదే. కానీ మూతపడిన, ప్రైవేటీకరణకు గురైన వాటిని సర్కారు స్వాధీనం చేసుకుని మాట నిలుపుకోవాలి. తిలా పాపం తలాపిడికెడు అన్న చందంగా అన్నిరాజకీయ పార్టీలు కార్మికులకు, ఉద్యోగులకు అన్యా యం చేసాయి. తెలంగాణలో విదేశీ పరిశ్రమలను ఆకర్షిస్తున్నారు. 15రోజుల్లో ఐపాస్ ద్వారా పరిశ్రమలకు పర్మిషన్ ఇస్తున్నారు. వందరోజుల్లో నిజాం సుగర్స్‌ను సర్కా రు స్వాధీనం చేసుకుంటుందన్న కెసిఆర్ మాట సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

- రావుల రాజేశం