సబ్ ఫీచర్

దేశభక్తిపై చర్చ జరగాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ జిన్నా యూనివర్సిటీగా మారింది. అక్కడ అల్లా హో అక్బర్ నినాదాలిచ్చే విద్యార్థులు కనబడుతన్నారు. రాహుల్ గాంధీ కూడా వారితో కలిసిపోయారు. అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలిస్తున్న వారిలో రాహుల్ గాంధీ కలవడం విమర్శలకు తావిచ్చింది. అఫ్జల్ గురుపై ఎనిమిదేళ్ల విచారణ తరువాత ఉరిశిక్ష వేసింది తమ ప్రభుత్వమేనన్న యింగితం కూడా ఆయనకు లేకుండా పోయింది. గుంపులతో కలవడలో ఆయన కేజ్రీవాల్‌ను మించిపోయారు. ఆ గుంపు ఎవరనేది కూడా ఆయన చూడలేదు. ఆయన దేశభక్తిని శంకించాల్సి వచ్చింది. తన నాయనమ్మ, తండ్రి తీవ్రవాదానికి బలి అయ్యారన్న స్పృహ ఆయనకు లేదు. కాగా జెఎన్‌యు వివాదంతో సంబంధం ఉన్న సోకాల్డ్ మేధావుల తీరుతెన్నులు చూస్తే దేశభక్తి గురించి మరోసారి చర్చించాల్సిందే. అదే జెఎన్‌యులో చదువుకొని సైన్యంలో పనిచేసిన అనేకమంది మాజీ సైనికులు జెఎన్‌యులో సంఘటనలకు చాలా నొచ్చుకున్నారు. తమ డిగ్రీలను వాపసు చేస్తానన్నారు. జెఎన్‌యు విద్యార్థుల్ని ఉద్యోగాల్లో తీసుకోమని టాటా, అంబానీలు ప్రకటించారని సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. జెఎన్‌యులో చదువుతున్న విద్యార్థుల సాలుసరి ఫీజు రూ.400లు. సంవత్సరానికి వారికి ప్రజలు కడుతున్న పన్నుల నుంచి యిస్తున్న సబ్సిడీ ఒక్కొక్కరికి రూ.3 లక్షలు. కాని వారు మాత్రం లాల్ సలామ్, ఇండియా గోబ్యాక్, కాశ్మీరుకు స్వాతం త్య్రం కావాలని, భారత వినాశనం వరకు పోరాడతామంటూ నినాదాలిస్తున్నారు. అఫ్జల్ గురుకు అనుకూలంగా వారు ఊరేగింపులు చేస్తారు. కాని అదే జెఎన్‌యులో చదువుకుని సైన్యంలో పనిచేస్తూ కాశ్మీరులోని పాంపోర్‌లో శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారి పక్కనున్న ఎంటర్ ప్రీనర్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ భవనంలో దాక్కున్న ముగ్గురు తీవ్రవాదులను హతమార్చి ఆ ఘటనలో నేలకొరిగిన జవానులకు మద్దతుగా ఆ విద్యార్థులు ఎందుకు ఊరేగింపు జరపరు? వారిని అలా ఊరేగింపులు జరిపేందుకు సోకాల్డ్ కమ్యూనిస్టు నాయకులు, కాంగ్రెస్ వారు, ఎందుకు యత్నించరు? కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు జవానులకు మద్దతుగా ఎందుకు ఊరేగింపులు జరపవు? జాతీయవాదం, దేశభక్తి కమ్యూనిస్టులకు రుచించవా?
దేశంలేదు, మతంలేదు, కుటుంబం లేదు, ఆస్తి లేదు, వివా హం లేదు అన్న ఐదు విషయాలకు కట్టుబడ్డామన్న సిద్ధాంత రాద్ధాంతం చేసే కామ్రేడ్లు భారత్‌లో హాయిగా వివాహాలు చేసుకొని, సంసారాలు చేసుకుంటూ, ఆస్తులు కూడబెట్టుకుంటూ, జిహాదీలకు మద్దతిస్తూ, దేశ వ్యతిరేకులతో చేతులు కలపడం దేశ ప్రజలు గమనించరని భావిస్తున్నారా? తమ దేశ వైశాల్యం విస్తరించుకునేందుకు చైనా కమ్యూనిస్టులు పడే తపన కూడా వీరికి ఆదర్శం కాదు. రంజాన్ సందర్భంగా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం విధించిన ఆంక్షలు అక్కడి ముస్లింలకు కోపం తెప్పించినా చైనా ప్రభుత్వం వెరవలేదు. ఆస్ట్రేలియా,జర్మనీలు మైనారిటీలు ప్రత్యేక చట్టం చేయమంటే వినలేదు. కాని మనదేశంలో నెహ్రూ ఆనాడే కాశ్మీర్‌కు ప్రత్యేక చట్టం చేశాడు. ముస్లిం పర్సనల్ లా, అందుకోసం ఓ బోర్డును ఏర్పరిచాడు. భింద్రన్ వాలాను సృష్టించిన ఇందిరాగాంధీ ఏకుమేకు అయిన తరువాత అతన్ని తుదముట్టించింది. అందుకు తీవ్రవాదులుగా ప్రవర్తించిన స్వీయ అంగరక్షకుల ఆగ్రహానికి గురైంది. ఈ దేశాన్ని ద్వేషించడం భావ ప్రకటనా స్వేచ్ఛ ఎలా అవుతుంది? స్వేచ్ఛ పేరున భారత్‌కు వ్యతిరేకంగా ముద్రించబడిన పోస్టర్లు, చేసిన నినాదాలను కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు ఎందుకు ఖండించడం లేదు? జెఎన్‌యులో గడిపినంత సమయం లాన్స్ నాయక్ హనుమంతప్పను పరామర్శించేందుకు లేకపోయింది.
ఓ పక్క ముంబయిలో మేక్ ఇన్ ఇండియా సదస్సు ప్రారంభమైంది. మరోపక్క జెఎన్‌యు రగడ. మీడియా జెఎన్‌యు లీలలకే ప్రాధాన్యత నిచ్చింది. మేక్ ఇన్ ఇండియాలో రూ.15.2 లక్షల కోట్ల వ్యాపార ఒప్పందాలు కుదిరాయి. అందులో 10 శాతం కార్యరూపం దాల్చినా లక్షా 52 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లే. దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కైన కాంగ్రెస్ వారికి కమ్యూనిస్టులకు, ఆమ్ ఆద్మీ పార్టీ వారికి తాము చేస్తున్న శబ్దమే వినబడుతున్నది. కాని మోదీ ప్రభుత్వం ఈ గందరగోళానికి దూరంగా ప్రశాంతంగా ప్రగతి రథం నడిపిస్తున్నది. ఇదే సమయంలో దుబాయ్ ప్రభుత్వంతో కేంద్రం నాలుగు మిలియన్ల బ్యారెళ్ల సరఫరాకు చమురు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పడిపోయినప్పటికీ కేంద్రం మనదేశంలో ఆ ధరను తగ్గిన నిష్పత్తిలో తగ్గించకుండా ఈ రంగం నుండి లక్షా యాభైవేల కోట్లు సమీకరించింది. ఈ మొత్తాన్ని వౌలిక వసతుల అభివృద్ధికై ఖర్చుపెట్టనుంది. భారతీయ రైల్వేలు ఆన్‌లైన్ వేలం పద్ధతిలో పనికిరాని తుక్కు ఇనుమును విక్రయించి రూ.3వేల కోట్లు ఆర్జించాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మెట్రోకోచ్‌లు భారత్ నుండి ఆస్ట్రేలియాకు మొట్టమొదటి సారిగా ఎగుమతయ్యాయి. ప్రపంచ బ్యాంకు మోదీ స్వచ్ఛ భారత్‌ను అభినందిస్తూ 1.5 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. రాబోయే సంవత్సరాల్లో గూగుల్ మనదేశంలోని 100 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం కలిగించనుంది. జపాన్‌తో అణుశక్తి విషయంలో భారత్‌తో కుదిరిన ఒప్పందంపై అంతర్జాతీయ సంస్థ, ‘శక్తి ప్రత్యామ్నాయాలపైన పరిశోధన’ (నిశ్పళశఆజ్యశఒ చ్యి ళశళూక ఘఆళూశ్ఘఆజ్పళఒ) హర్షం వ్యక్తం ఛేసింది. రాబోయే సంవత్సరాల్లో గూగుల్ 20 లక్షల మంది యుతవకు ఆండ్రాయిడ్ డెవలపలర్స్‌గా శిక్షణనివ్వనుంది.
జెఆర్‌డి టాటా, దాదాబాయి నౌరోజీ, గోద్రెజ్, హోమీబాబా, సోలీ సొరాబ్జీ, సైరన్ భరూ లాంటి వాళ్లు దేశప్రగతి కోసం నిరంతరం శ్రమించారు. వారు భారత్‌కు లభించిన భగవత్ ప్రసాదం. నవంబరు 26, 2008 దాడుల తరువాత మనదేశంలో, విదేశాలలో ఉన్న తమ హోటళ్ల మరమ్మతులకై తాజ్ గ్రూప్ టెండర్లను ఆహ్వానించింది. ఇద్దరు పాకిస్తాన్‌కు చెందిన పారిశ్రామిక వేత్తలు కూడా టెండర్లు దక్కించుకునేందుకు అనుమతి లేకుండా ముంబైలో రతన్ టాటాను ఆయన ఆఫీసులో కలిసేందుకు విఫలయత్నం చేసి, అప్పటి కాంగ్రెస్ మంత్రి ఆనందశర్మను కలిసి విషయం చెప్పారు. ఆనంద శర్మ రతన్ టాటాకు ఫోన్ చేసి వారి టెండర్లను పరిశీలించాలని గట్టిగా అడిగాడు. అప్పుడు రతన్ టాటా, ఆనంద శర్మతో..‘మీరు సిగ్గులేని వారు కావచ్చు, నేను కాదు’ అని ఫోన్ పెట్టేశారు. ఆ తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం టాటా సుమోల దిగుమతి చేసుకోవడం కోసం ఆర్డరు ఇచ్చింది. అయితే రతన్ టాటా ఒక్క సుమోను కూడా పాకిస్తాన్‌కు పంపడానికి అంగీకరించలేదు. ఆ అర్డరును తిరస్కరించారు. దేశమే ప్రధానం అన్నదానికి యింతకన్నా ఏం ఋజువు కావాలి?
‘దేశ వ్యతిరేక నినాదాలిచ్చినంత మాత్రాన వారి దేశభక్తిని శంకించాలా?’ అని కాంగ్రెస్ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వినాదం బయటకు వచ్చిందంటే, విధానం మారిందని అర్థం చేసుకోవాలి. ఇక్కడి ఉప్పు తింటూ, ఇక్కడి గాలి పీలుస్తూ, ఈ దేశం కేవలం ‘్భమి మాత్రమని’ తలవడం దేశభక్తి అవుతుందా? దేశం నాకేమిచ్చింది అని కాదు, దేశానికి నేనేమిచ్చాను అని ప్రశ్నించుకో అన్నాడు జాన్ కెన్నడీ. అందుకనుగుణంగానే అమెరికాలో పిల్లలకు చిన్నప్పుడే ‘అవర్ ఫ్లాగ్’ అనే పాఠం చదివిస్తారు. అందుకే వ్యక్తిగత శీలంకంటె అమెరికన్లు జాతీయతకే ప్రాధాన్యం ఇస్తారు. 4,5 ఏళ్ల క్రితం సంక్లిష్ట ఆర్థిక పరిస్థితిలో అమెరికన్లకు ఒబామా పిలుపునిచ్చాడు. తాము స్విస్ బ్యాంకులో దాచుకున్న ధనాన్ని దేశం కోసం ఇవ్వమని అడిగాడు. అందుకు అమెరికన్లంతా విరివిగా స్పందించారు. కాని మనదేశంలో చిత్తశుద్ధితో ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఎగతాళి చేస్తున్న ప్రతిపక్షాల తీరును ఏమని విశే్లషించగలం? మాస్కోలో పిల్లలకు ‘మాస్కో ప్రపంచ రాజధాని’ అన్న సినిమా చూపిస్తారు. ఏ దేశం ప్రజలకు, విద్యార్థులకు దేశ వ్యతిరేక పాఠాలు నూరిపోయదు. మనదేశంలోనే ఈ దౌర్భాగ్యం.
ప్రపంచంలోని 200 దేశాల్లో అమెరికా 500 సంవత్సరాల క్రితం పుట్టింది. ఇరాక్, ఇజ్రాయిల్‌లు 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి. చైనా 5000 సంవత్సరాల క్రితం ఉద్భవించిన దేశం. కాని భారత్ ఎప్పుడు పుట్టిందో చరిత్రకారుల కాలానికి అందనిది. ప్రఖ్యాత చరిత్ర కారుడు ఆర్నాల్ట్ టాయిన్ బీ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో 28 దేశాల సంస్కృతులు కాలగర్భంలో కలిశాయి. కాని భారతదేశం, భారతీయుల జాతీ య జీవనం అప్రతిహతంగా కొనసాగిపోతున్నది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడ పాకిస్తాన్ యుద్ధ సమయంలో జమ్మూలో జైమాతాదీ గుడికి ఐదు గంటలు నడిచివెల్లి తమ దేశానికి విజయం యివ్వమని ప్రార్థించింది. ఆమెను నాడు ప్రతిపక్షంలో ఉన్న వాజ్‌పేయి దుర్గ అన్నారు. కాని సోనియాలో ఆ స్ఫూర్తి లేదు. ప్రతిపక్షాల్లో వాజ్‌పేయిలోని రాజనీతిజ్ఞత లేదు. దేశం కూడా రాజకీయం అయితే ఎవరికీ నిలువనీడే ఉండదు. మనం అశాశ్వతం. దేశం అమరం. ఇదీ మనం నిత్యం వల్లించాల్సిన పాఠం.

- తాడేపల్లి హనుమత్ ప్రసాద్ సెల్ : 09676190888