ఉత్తరాయణం

తెలుగునాట ఆయుర్వేదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రలో ఆయుర్వేద కళాశాలల్లో చదివిన వారికి వాస్తవిక పరిజ్ఞానం దాదాపు లేదు. ఆ కళాశాలల్లో ఔషధ మొక్కల్ని పెంచడం-ఆ మొక్కల గురించి విద్యార్థులకు వివరించే ఓపిక అధ్యాపకులకు ఉండదు. ఆయుర్వేదంలో యోగా ఒక భాగం. కానీ యోగా ప్రాముఖ్యం విద్యార్థుల కి తెలిసింది సున్న. చివరికి ఉమ్మెత్త, కానుగ, గుంటకల గర లాంటివి కూడా తెలియదు. చాలామంది ప్రాక్టీసు పెట్టుకున్న వారు, అల్లోపతి మందులు ఇస్తున్నారు. ఇక ‘పంచకర్మ’ పదాలను నేర్చుకోవడానికి ఆంధ్రలో చదివిన చాలామంది కేరళ వెళ్లి నేర్చుకుంటారు. కర్ణాటక సంగీ తాన్ని బతికించింది తమిళులైతే, ఆయుర్వేదాన్ని బతికిం చింది, బతికిస్తున్నదీ కేరళ. అక్కడ దాదాపు ప్రతి ఇల్లూ ఒక ఆఋర్వేద వైద్యశాల.
- సుగుణా మహీధర్, ఏలూరు
దీన్ని ఏం హక్కు అనాలి?
కర్ణాటకలో ఒక చిరు వ్యాపారి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రికి ఫోన్ చేసి స్రకమంగా విద్యుత్ సరఫరా కా వడం లేదు. ఇలా అయతే ఎలా వ్యాపారం చేసుకోవాలి? అని అడిగాడు. దాంతో మంత్రిగారికి కోపం వచ్చింది. ననే్న నిలదీస్తావా? అంటూ అతనిని అరెస్ట్ చేయమని పోలీసుల్ని ఆదేశిస్తే వాళ్లు అతనిని అరెస్ట్ చేశారు. ప్రజా స్వామ్యంలో ఎవరినైనా ముఖ్యంగా ప్రజల ఓట్లతో గెలిచిన వారిని నిలదీసే హక్కు రాజ్యాంగం సామాన్యుల కిచ్చింది. ఆ విషయం మంత్రిగారికి తెలి యదా? ఇదే భాజపా పాలిత రాష్ట్రంలో జరిగితే విపక్షాలు, మీడియా నానా యాగీ చేయవా? ఇప్పుడేమంటారు?
- లక్ష్మి, బృందావనం
పజిల్‌లో తప్పులు
948 మాటలతో ఇచ్చిన 5 అడ్డం ఆధారాలతో కుమార్తె అని ఇచ్చారు. దయత అంటే ప్రియురాలు అని శబ్ద రత్నా కరంలో ఉంది. 949లో ఇచ్చిన ఆధారాలో అందమైన బీచ్ ఉన్న నగరం అని ఇచ్చారు. దాని ప్రకారం గోవా అని వ్రాయాలి. గోవా ఒక రాష్ట్రం కాని పట్టణం కాదు. దానికి ముఖ్య పట్టణం పాంజిమ్.
- పవన్‌కుమార్, నెల్లూరు
సముచితం కాదు
విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో వివాహాలు జరుపకూడదని నిర్ణయం తీసుకొని ఆలయం అధికారులు రాష్టస్థ్రాయ ఉన్నతాధికారులకు ప్రతిపాదన లు పంపడం ఎంతమాత్రం సమంజసం కాదు. భక్తుల, ప్రజల మనోభావాలను దెబ్బతీయడం తప్ప ఇది మరోటి కాదు. దేవస్థానంలో పెళ్లిళ్లు జరిపితే రుసుము కింది తగిన ఆదాయం కూడా లభిస్తుంది. తాజాగా సంబంధిత దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవిధంగా నిర్ణయం తీసుకొని ప్రతిపాదించడం విచారకరం. దేవస్థానంలో పెళ్లిళ్లు జరపడం వల్ల బంధువులు ఎక్కువగా వస్తున్నారని, భక్తులకు ఇబ్బందులు జరుగుతున్నాయని ఆలయ అధికార్లు పేర్కొనడం సముచితంగా లేదు. పెళ్లిళ్లకు వచ్చే బంధువులు సయతం భక్తులే కదా! ఈ విషయాన్ని అధి కారులు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంచేత దేవస్థానం అధికారులు ఉన్నతాధికారులు పంపిన ప్రతిపాదనలు తిరస్కరిం చడమే సముచితం.
- వి. కొండలరావు, పొందూరు
స్మృతి ఇరానీ మాట్లాడిన తీరు భేష్
లోక్‌సభలో హెచ్‌ఆర్‌డి శాఖామాత్యులు స్మృతి ఇరానీ మాట్లాడిన తీరు భారతీయులు గర్వించే రీతిలో ఉంది. విపక్షాల వారికి దీటుగా సమాధానమిచ్చి ఔరా! అనిపిం చుకున్నారు. దేశం ఎటుపోయనా ఫరవాలేదు. ఓట్లు, సీట్లు ముఖ్యం. న్యాయం, ధర్మం, నీతి, నిజాయతీని తుంగలో తొక్కేస్తున్నారు. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, వామపక్షాలకు ఈ విషయంలో ఏమీ తేడా లేదు.
- గుడ్ల జగదీశ్వర్, న్యూ నల్లకుంట
దేశ వ్యతిరేకులకు వత్తాసు
ఢిల్లీలోని జెఎన్‌యులో జాతి వ్యతిరేకులకి వామపక్షా లు కొమ్ముకాసి, దేశద్రోహులకు వత్తాసు పలకడం వామపక్షాల సిద్ధాంతంలో భాగమే. అందువల్ల పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. స్వాతంత్య్ర సమయం లో బ్రిటిష్- రష్యా కూటమికి మద్దతుగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించారు. 1962లో దేశంపైకి దురాక్ర మణకు పాల్పడిన చైనాకు మద్దతుగా ప్రదర్శనలు, సభలు జరిపారు. ఇటువంటి వారికి జాతి వ్యతిరేక కూటమితో కలిసి పనిచేయడం పెద్ద సమస్య కాదు.
- వేదుల జనార్ధన్ రావు, వంకాయల గూడెం