సంపాదకీయం

ఇల్లు ఇక పదిలం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లుకొనుక్కునేవారు, కట్టించుకునేవారు, దగాపడకుండా నిరోధించడానికి ఉపకరించగల స్థిరాస్థి- రియల్ ఎస్టేట్- బిల్లును రాజ్యసభ ఆమోదించడం శుభ పరిణామం. హేమ వాటికలు, హరిత ప్రాంగణాలు, విభవ ధామాలు, గృహనందన ఆనంద సముదాయాలు, అగ్రహారాలు, సముద్ర వీక్షణ సౌధాలు...అని అంటూ వివిధ విచిత్ర నామాలతో జనాన్ని ఆకర్షించి నాసిరకం బోసిరకం ఇళ్లను తగలకడుతున్న స్థిరాస్థి దళారీల ఆట కట్టించడానికి ఈ బిల్లు దోహదం చేయగలదు. నిర్మాతలు-బిల్డర్స్, ప్రగతి ప్రసాదకులు-ప్రమోటర్స్-, స్థల విక్రేతలు-డెవలపర్స్, ప్రతినిధులు- ఏజెంట్లు- పేర్లతో చెలామణి అవుతన్న స్థిరాస్థి దళారీలలో అత్యధికులు వంచకులన్నది వినియోగదారుల అనుభవం. నిజాయితీ పరులైన స్థిరాస్థి వినిమయదారులకు,పంపిణీదారులకు సైతం రాజ్యసభ ఆమోదించిన బిల్లు వల్ల భద్రత ఏర్పడబోతోంది. ఈ బిల్లు వల్ల వినియోగదారుడికి లాభించే ప్రధాన ప్రయోజనం స్థిరాస్థి నిర్వాహకులు తమ వాగ్దానాలను వందశాతం నిలబెట్టవలసి రావడం. వాగ్దానానికీ, వాస్తవానికీ మధ్య ఏమాత్రం తేడా కనిపించినప్పటికీ వినియోగదారుడు చెల్లించిన మొత్తం విక్రయధనాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. అంతేకాక వాగ్దానాలకు అనుగుణంగా ఇళ్లను నిర్మించని స్థిరాస్థి నిర్వాహకులు జరిమానాలు చెల్లించవలసి ఉంటుంది. అందువల్ల ఆకర్షణీయమైన వనె్నల చినె్నల వాణిజ్య ప్రకటనలతో స్థిరాస్థి నిర్వాహకులు ఇకపై వినియోగదారులను మభ్యపెట్టి మాయ చేయడానికి వీలు కాదు. ఇళ్లను కొనుగోలు చేయదలచిన వారి నుంచి వసూలు చేసిన మొత్తం విక్రయ ధనంలో కనీ సం డెబ్బయి శాతాన్ని బిల్డర్లు, ప్రమోటర్లు, ప్రత్యేక ఖాతాలో జమచేయవలసి ఉంటుంది. దీనివల్ల మోసం చేసి డబ్బును కాజేసిన దళారీలు ఉడాయించడానికి వీలుండదు. దేశంలో నల్లడబ్బు విపరీతంగా ఉత్పత్తి చేస్తున్న వ్యాపారం స్థిరాస్థి నిర్వహణ ప్రాంగణాలలోనే పరిఢవిల్లుతుండడం జనమెరిగిన వాస్తవం. అందువల్ల ప్రత్యేక ఖాతాలలో స్థలం విలువ ద్వారా వచ్చిన మొత్తాలను జమచేయడం వల్ల డబ్బు నిరోధక మార్గం... ఈ ‘జమ’లను నిర్మాణం కోసం వెచ్చించడానికి వీలుగా పారదర్శకమైన వ్యవస్థ ఏర్పడడానికి ఈ కొత్త బిల్లు దోహదం చేస్తుంది. ప్రతి రాష్ట్రంలోను స్థిరాస్థి నియంత్రణ అధికార మండలి- రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ-ని ఏర్పాటు చేయడం ఈ వాణిజ్య పారదర్శకతలో భాగం. ఐదువందల చదరపు మీటర్లు అంతకంటె విశాలమైన స్థలంలో జరిగే ఆవాస, వాణిజ్య సముదాయాలన్నింటికీ ఈ చట్టంలోని నిబంధనలు వర్తించనున్నాయి. ఎనిమిది అంతకంటె ఎక్కువ సంఖ్యలో ఇళ్లను నిర్మించే ప్రతి గృహ సముదాయ నిర్మాణ పథకానికీ కూడ ఈ చట్టం వర్తిస్తుంది. ఈ కనిష్ఠ పరిమితిని రాష్ట్రాలు మరింత తగ్గించవచ్చు కూడ.
ఇళ్లను కొనేవారిని వంచించే స్థిరాస్థి వ్యాపారులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందట. కానీ స్థిరాస్థి పేరుతో జన వంచన చేసే నేరస్థులకు ఇది చాలా తక్కువ శిక్ష. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మోసం చేసే వారిని ఇంతకంటె ఎక్కువ కాలం కారాగృహవాసం విధించడానికి వీలుంది. అలాంటప్పుడుప్రత్యేక చట్టంలో నేరస్థులకు విధించే శిక్షలు మరింత తీవ్రంగా ఉండాలి. లోక్‌సభలో బిల్లును ఆమోదించే సందర్భంగా స్థిరాస్థి రంగంలోని వంచకులకు మరింత తీవ్రమైన శిక్షలను నిర్ధారిస్తూ సవరణ చేయడం అభిలషణీయం. భారతీయ శిక్షా స్మృతిలోని 420వ సెక్షన్ ప్రకారం వంచన చేసేవారిని ఏడేళ్ల వరకు నిర్బంధ వాసాన్ని శిక్షగా విధించే అవకాశం ఉంది. అందువల్ల ప్రత్యేక చట్టంలో శిక్షలు మరింత తీవ్రంగా ఉండడం అవసరం. అన్ని రకాల అనుమతులను పొందిన తరువాత మాత్రమే బిల్డర్లు సంబంధిత స్థలంలో ఇళ్లను నిర్మించాలన్నది కొత్త బిల్లులోని నిబంధన. స్థానిక ప్రభుత్వం - నగర పాలిక లేదా పురపాలక- నుండి నియంత్రణ మండలి నుండి అన్ని రకాల అనుమతులు పొందడంలో కాలయాపన జరుగుతుండడం ప్రధాన వైపరీత్యం. ఈ వైపరీత్యాలు తొలగించడానికి వీలుగా అనుమతులను ప్రసాదించడానికి, సంబంధిత వివాదాలను న్యాయమండలి-ట్రిబ్యునల్-పరిష్కరించడానికి నిర్ణీత వ్యవధిని కొత్త చట్టంలో నిర్దేశించారు. నియంత్రణ మండలి నిర్ణయాలను వ్యతిరేకస్తూ బిల్డర్లు దాఖలు చేసే అప్పీళ్లను అరవై రోజులలోగా ఉన్నత న్యాయ మండలి పరిష్కరించాల్సి ఉంటుందట. నియంత్రణ మండలి వారు సైతం ఫిర్యాదులను అరవై రోజులలలోగా పరిష్కరించవలసి ఉంటుంది. దీనివల్ల నిజాయతీగల బిల్డర్లు కాలయాపనకు గురికాకుండా నిరోధించే అవకాశముంది..
పట్టణాలలోను నగరాలలోను కాలుష్యం కేంద్రీకృతమవుతుండడానికి భయంకరమైన రద్దీ ఏర్పడుతుండడానికి భూగర్భ జలాలు ఇంకిపోయి నేలతల్లి శుష్కించి పోతుండటానికి ప్రధాన కారణం నిబంధలకు వ్యతిరేకంగా నిర్మాణాలను కొనసాగించడం. ప్రాకృతికమైన వనరులను వినియోగించడం వల్ల ప్రకృతి గాయపడదు. కానీ ఈ వనరులను కొల్లగొట్టడం వల్ల ప్రకృతి గాయపడుతోంది. గాయపడి రోదిస్తున్న ప్రకృతి వైపరీత్యాలను సృష్టిస్తోంది. దేశ మంతటా ఈప్రాకృతిక వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. గతంలో హైదరాబాద్ నడిబొడ్డున జనవాసాలను హుస్సేన్‌సాగర్ వరదనీరు ముంచెత్తింది. ఇందుకు కారణం వరదనీరు ప్రహించే కాలువను దురాక్రమించి పూడ్చి ఇళ్లను నిర్మించడం. ఉత్తరఖండ్‌లో రెండేళ్ల క్రితం బురద తుపాను విరుచుకొని పడటానికి కారణం కూడా నిబంధనలను నీరు కార్చిన గృహనిర్మాణాలు. దేశంలో దాదాపు డెబ్బయి ఆరువేల స్థిరాస్థి వ్యాపార సంస్థలు నమోదై ఉన్నాయట. నగరాలలోను పట్టణాలలోను ప్రతి ఏటా సగటున పదిలక్షల మంది కొత్త ఇళ్లను కట్టించుకుంటున్నారు, కొనుగోలు చేస్తున్నారు. నమోదు కాని స్థిరాస్థి సంస్థలు, ఏజెంట్లు కూడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. నమోదయి ఆర్భాటంగా గృహ స్వర్గాన్ని వాగ్దానం చేస్తూ వాణిజ్య ప్రకటనలను ప్రచారం చేస్తున్న సంస్థలలో అధికశాతం ఏదోవిధంగా ఇళ్ల కొనుగోలు దారులను మోసం చేస్తూనే ఉన్నాయి. స్థలం కొనకుండానే రిజిస్టర్ కాకుండానే స్థిరాస్థి కామందులు వినియోగదారులకు స్థలాన్ని కేటాయించి డబ్బును వసూలు చేయడం ప్రధాన వైపరీత్యం. హైదరాబాద్‌లో ఇలాంటి వంచనలు కోకొల్లలు. ఇళ్లు కట్టించుకోదలచుకున్న వారు తమ పేరుతో స్థలం నమోదయిందని సంతోషిస్తున్నారు. కానీ నెలలు గడవక ముందే శివారు గ్రామాల భూమి యజమానులు వినియోగదారులను న్యాయస్థానాలకీడుస్తున్నారు. ఇల్లు కట్టించే కార్యక్రమం మూల పడుతోంది. డబ్బును దోచుకున్న స్థిరాస్థి దళారీ తిరిగి ఇవ్వడు. స్థలం కొన్నవారు కోర్డుల చుట్టూ తిరుగుతూ ఉండాలి. కొత్త చట్టం వల్ల ఈ ప్రమాదాలు తొలగిపోతాయన్నది ప్రభుత్వం చెబుతున్న మాట.
పూనా నగరం సమీపంలో ‘లావాసా’ అన్న సంస్థ హరిత నిబంధనలను ఇతర నిబంధనలను ఉల్లంఘించి పట్టణ వాటికలను నిర్మించడం అవినీతికి ఆకాశ హార్మ్యం. పశ్చిమ కనుమలలోని సహ్యాద్రిని తవ్వేసి చుక్క నీరు లేని ఎడారిని లావాసా సృష్టించింది. ఇలాంటి విదేశీయ స్థిరాస్థి సంస్థలను శిక్షించడానికి కొత్త చట్టం ఉపయోగపడుతుందా?