సబ్ ఫీచర్

ప్రాంతీయ పార్టీలవైపే ప్రజల మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్‌కు స్వర్ణయుగం 1952-67 మధ్య కాలమని చెప్పవచ్చు. దేశా న్ని పాలించే హక్కు ఒక్క కాంగ్రెస్‌కే ఉంది అన్నట్లుగా ఉండేది పరిస్థితి. అధికారంలోకి అది రాకపోతే ఎవరొస్తారనిపించేది. ఆ తర్వా త కాంగ్రెస్ అంతటి ధీమాను ఎన్నడూ కనబరచలేక పోయింది. సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ సమాజంలోని అ పెద్ద వర్గాలను ప్రాంతీయ పార్టీలకు కోల్పోడం ప్రారంభించింది. కేంద్రం ఎప్పు డూ పటిష్టంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వాలు దానికి విధేయులుగా ఉండాలని ఇందిరాగాంధీ అభిప్రాయపడేవారు. రాజ్యాంగంలో ని 356 అధికరణం ద్వారా ఒక్క కలంపోటుతో రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేయవచ్చని భావించేవారు. కానీ ప్రాంతీయ పార్టీలు దానిపై తిరుగుబాటు పోరాటం ప్రారంభించాయి. సమాఖ్య రాజ్యాంగం చట్టం కింద ఇప్పటికే అవి పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. పటిష్టమైన కేంద్రమూ, పటిష్టమైన రాష్టము కూడా ఉండాలని తార్కికంగా సరిగ్గానే వాదించే వోటరు కేంద్ర విషయంలో కాంగ్రెస్‌ని, రాష్ట్రాల విషయంలో ఇతర పార్టీలను విశ్వసించడం ప్రారంభించాయి. 1977- 80 మధ్యకాలంలో జనతాపార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కాని ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఆ తరువాత ఏ.బి.వాజ్‌పేయి నేతృత్వంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం విజయవంతమై కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రూపమిచ్చింది.
కాంగ్రెస్ పార్టీ బలపడటానికి ప్రాంతీయ పార్టీలలో వచ్చిన చీలికలు పనిచేయలేదు. తమిళనాడులో డి.ఎం.కె. చిత్తచాంపల్య మా ర్గాలతో ప్రజలు విసిగిపోయినప్పుడు కాంగ్రె స్ ఎన్నిక కావలసింది కాని, దానికి బదులుగా దాని చీలికవర్గమైన అన్నాడి.ఎం.కె. అధికారానికి వారసురాలైంది. బిహార్‌లో లాలుప్రసాద్‌యాదవ్, నితీష్‌కుమార్‌లకు పొసగక పోయినప్పటికీ ఒకే పార్టీలో కొనసాగుతూ వచ్చా రు. లాలుకు అహంకారం పెరిగిపోయింది. నితీష్‌కుమార్ లాలుకన్నా ఎక్కువకాలం కాం గ్రెస్‌ను బిహార్‌కు దూరంగా ఉంచుతానని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పాతికేళ్ళక్రితమే కుప్పకూలింది. ములాయంసింగ్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాది పార్టీ, బి.జె. పి. ఒకటి తర్వాత ఒకటిగా అధికారానికి రావ డం ప్రారంభించాయి. వోటర్లు ఈ మూడు పార్టీలతో విసిగిపోయినప్పుడు కాంగ్రెస్ పంచన చేరలేదు. నాల్గవ శక్తిఅయిన మాయావతిని అక్కున చేర్చుకున్నారు.
బెంగాల్‌లో వామపక్షాలు చీలిపోలేదు. కాంగ్రెస్ చీలిపోయింది. వామపక్షాలు కుప్పకూలినప్పుడు మరోసారి వోటరు ప్రత్యామ్నాయంగా మమతా బెనర్జీని విశ్వసించారు. కానీ కాంగ్రెస్‌ని కాదు. రాష్ట్రంలో జనాభిప్రాయం మేరకు అధికారాన్ని వికేంద్రీకరించే బదులు, కేంద్రం సకల అధికారాలు గుప్పిట్లోపెట్టుకుని అపరిమిత అధికారాలను చెలాయిస్తుంది. ఫలితంగా ప్రాంతీయ ఆకాంక్షలు కొనే్నళ్ళుగా కొత్తపుంతలు తొక్కుతున్నాయి. కేంద్రం ఉదాసీనతతో విసిగిపోతున్న ప్రజలు తమ సమస్యలు తామే పరిష్కరించుకుంటామంటున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ అధికారంలోనికి రావటానికి కారణమిదే. ఆ పార్టీలైతేనే తమ ఆకాంక్షమేరకు నడుచుకొనగలవని, తమ సమస్యలు సానుభూతితో పరిశీలించి పరిష్కరించగలవని వోటర్లు భావించారు. జాతీయ పార్టీల చేతిలో పదేపదే మోసపోతున్న ప్రజలు ఇప్పటికే విసుగెత్తిపోయారు. ప్రాంతీయ పార్టీలు మెరుగైన పరిపాలన అందించలేకపోయినాసరే. ఇప్పట్లో జాతీయ పార్టీల జోలికి వెళ్ళరాదనుకుంటున్నారు. జాతీయ పార్టీలు తమ సమస్యలను పరిష్కరించబోవని, జీవన ప్రమాణాలని మెరుగుపరచలేవని నమ్ముతున్న ప్రజలు ఇక ప్రాంతీయ పార్టీ నచ్చకపోతే మరో ప్రాం తీయ పార్టీని అక్కున చేర్చుకునేందుకు సిద్ధపడుతున్నారు.
మండల్ వ్యతిరేక ఉద్యమం ఉత్తరాదిన, దక్షిణాదిన వెనుకబడిన కులాల మధ్య ఐకమత్యం తీసుకురాగా, కేంద్రంలోని సంకీర్ణ రాజకీయాలు తమిళులను జాతీయ రాజకీయాలలో అతి తక్కువ పాత్రనుంచి అత్యంత కీలకపాత్రకు తీసుకుపోయాయి. తమ మద్దతులేకుండా కేంద్రంలో ప్రభుత్వాలు మనలేవని తమిళులు గుర్తించారు. మెజారిటీ బలం ఆధారంగా బ్రాహ్మణ వ్యతిరేకతను సొమ్ముచేసుకోవడంలో విజయం సాధించిన ద్రవిడ రాజకీయాలే, నిర్ణయాత్మకమైన మైనారిటీగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆడించగలమనే సూత్రా న్ని విజయవంతంగా అమలుచేసాయి. కలసికట్టుగా వ్యవహరించడం ద్వారా తమిళనాడుకు కేంద్రంలో మంత్రి పదవులను ఎక్కువ సంఖ్యలో రాబట్టుకోవడమే కాకుండా, టెలికాం లాంటి అత్యంత ఆకర్షణీయమైన శాఖలను తమ చేయిజారిపోకుండా చేసుకోవడం తమిళ రాజకీయాలకే సాధ్యమైంది. వాజ్‌పేయి సంకీర్ణ ప్రభుత్వంలోని అనేకానేక పార్టీల డిమాండ్లనన్నింటినీ నెరవేర్చడమే తన పనిగా పెట్టుకున్నారని భావించలేం. ఈ విషయంలో ఆయన లక్ష్మణరేఖను దాటి వెళ్ళలేదు. టెలిఫోన్ చార్జీల పెంపు విషయంలో మమతాబెనర్జీ కోపతాపాలకు ఆయన తలొగ్గి ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్, కాశ్మీర్‌లకు ఉదారంగా నిధులు మంజూరుచేసి ఉండవచ్చు. కాని కోర్టులో చార్జిషీటుదాఖలైన ముత్తయ్య, బూటాసింగ్‌లను వెనుకేసుకురావడానికి ఆ యన ససేమిరా అన్నారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం రద్దుకు జయలలిత చేసిన డిమాం డ్ తప్పని భావించడంవల్ల దాన్ని నెరవేర్చడానికి వాజ్‌పేయి ఒప్పుకోలేదు. రైల్వేమంత్రి నితీష్‌కుమార్‌ని తొలగించి ఆ పదవిని మమతాబెనర్జీకి కావాలనే ఒత్తిడికి వాజ్‌పేయి లొం గలేదు.
ప్రాంతీయ పార్టీలు మెరుగైన పరిపాలన అం దించలేకపోయినా సరే, ఇప్పట్లో జాతీయపార్టీల జోలికి వెళ్ళరాదనుకుంటున్నారు. జాతీయ పార్టీ లు తమ సమస్యలను పరిష్కరించబోవని, జీవన ప్రమాణాలను మెరుగుపరచలేవని నమ్ముతున్న ప్రజలు, ఒక ప్రాంతీయపార్టీ నచ్చకపోతే మరో ప్రాంతీయ పార్టీని అక్కున చేర్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. భారతదేశంలో రాజకీయాలను చాలావరకు వారసత్వంగా వచ్చే వృత్తిగానే పరిగణిస్తుంటారు. ఒరిస్సాలో అందరికి తలలోని నాలుకగా మెలిగిన రాజకీయ నాయకుడు బిజూపట్నాయక్‌లకు మాత్రం రాజకీయాలు ఏనాడు అలా కనిపించలేదు. ఆయన తన కుమారుడు నవీన్ పట్నాయక్‌ని రాష్ట్ర ఛాయలోకి రానివ్వలేదు. సిరిసంపదలు, పేరుప్రఖ్యాతలు బాగా ఉన్న వ్యక్తి కుమారునిగా పుట్టిన నవీన్ స్వయంకృషితోనే పైకి వచ్చారు. కేంద్రమంత్రిగాను, ముఖ్యమంత్రిగాను సమర్ధుడని పేరుతెచ్చుకున్నారు.

- జి.వెంకటరామారావు