వీరాజీయం

మనకన్నా ‘వాళ్లే’ సంతోషంగా వున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోషానికి కొలతబద్దలు ఏమిటీ? అన్న ప్రశ్నకి జవాబు తరువాత చూద్దాము. 2016 సంవత్సరానికి గాను అత్యంత సంతోషంగా వున్న దేశాల మీద సర్వేచేసి 156 దేశాల లిస్టుచేసి సమితి సంతోషం ర్యాంకులు నిర్ణయిస్తూ ఆ రిపోర్టు రిలీజ్ చేసింది. అందులో మన ఇండియా దటీజ్ భారత్‌కు- 118వ ర్యాంకు మాత్రం దొరికింది! ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం- ఓహో!... సెక్యులరిస్టు దేశం అంటూ జెబ్బలు చరుచుకునే వాళ్లకి రుూ నూట 18వ ర్యాంకు కూడా దిగజారుడు ర్యాంకు అని మాత్రం మనవి చెయ్యాలి- పోయినసారి మన ర్యాంకు 117 స్వామీ!... దానికి కూడా. ‘‘నో వర్రీ’’- చింత లేదు. ‘‘జిస్ దేశ్ మేఁ గంగాబెహతీ హై...’’అనగా ఏ దేశంలో ఒకప్పటి పవిత్ర నది గంగా ప్రవహిస్తూందో... ఆ దేశంలో వున్న జనాలకి ‘‘్థడేమేఁ గుజారా హోజాయేగా...’’ అన్నాడు సినిమా కవి- అంటే ‘‘కాస్తంత’’లోనే జీవితం వెళ్లబారుతుందీ.
అంచేత దరిద్రరేఖ మీదున్నా చాలు... మనం ‘‘హ్యాపీస్’’- కాని ఈ రిపోర్ట్ చూడగానే చూసిన వాళ్ళల్లో అందరికీ అంటే మన ఇండియన్స్ (్భరతీయులు అనొచ్చా?) మొహాలు మాడిపొయ్యాయి. మనకన్నా అన్ని రకాలుగా వెనుకబడినవి అని మనం అనుకుంటున్న రెండు దేశాలున్నాయి. ‘‘కుడి ఎడమల ‘డొక్క’లో కత్తులు’’అన్నట్లుగా వున్నాయని కొందరి వ్యాఖ్యానం. అయితే ఆ రెండు దేశాలు రుూ కొలమానంలో చూస్తే మనకన్నా ఎంతో సంతోషంగా వున్నాయి. పాకిస్తాన్ 92వ మెట్టుమీద వుంది. బంగ్లాదేశ్ మాత్రం నెం.110- సోమాలియా దేశం కూడా బెటర్... 76వ మెట్టుమీద హ్యాపీగా వుంది. పోనీ నెత్తిమీద శూలంలాగా నిరంతరం వ్రేలాడే చైనా ఏమైనా ఆనందహేలలో మనకన్నా దిగజారి వున్నదా? అంటే అదీ నెం.83.
ఐక్యరాజ్యసమితి 2012నుంచి యిస్మంటి సంతోష తరతమబేధాల చిట్టాని చేయించి రిలీజు చేస్తోంది. పోయినసారి రిపోర్ట్‌లో స్విడ్జర్లాండు నెం.వన్‌గా వుండేది. అందుకేగా మనవాళ్ళు సినిమా షూటింగ్‌లకి అక్కడకి పోతూ వుంటారూ... అన్నదో ‘‘మొబైల్ రాణి’’. కాని యిప్పుడు ‘‘స్విస్’’ దేశం డెన్మార్క్‌కి దారిచ్చేసింది. డెన్మార్క్ నెం.1, నార్వే నెం.3- వారెవ్వా- ఫిన్‌ల్లాండ్ కూడా నెం.5 కాగా, ఐస్‌లాండు థర్డ్ టాపర్‌గా మనల్ని వెక్కిరిస్తోంది. అంటే వెంటనే అమెరికా? అని అడగకండి. రూపాయలుంటేనా? ఆనందమా? కాసులతోనే కడుపు నిండుతుందా?.... గ్రేట్ యునైటెడ్ స్టేట్స్‌కి నెం.13వ ర్యాంకు మాత్రం దక్కింది.
అదీ మన ‘‘క్రెడిటే’’అంటారు. ‘‘యెన్నారైలు’’ చాకిరీ చేయడానికి మనం అంటే ‘‘ఆసియన్‌లు’’అనగా చైనా, ఇండియా, పాకిస్తాన్ వగైరా దేశాల మేథావులున్నారు. హాయిగా అమెరికన్స్ ‘‘కారు- మీదో కాలుమీదో కాలువేసుకుని ‘‘య్యా...’’ అంటూ ఎంజాయ్ చేస్తూంటారు అంటారు చాలామంది- అదేమో తెలియదు, కాని మొత్తంమీద దీన్నిబట్టి చూస్తే చిన్న కుటుంబం చింతల్లేని కుటుంబం అన్నట్లుగా చిన్నచిన్న దేశాలే హ్యాపీ హ్యాపీగా జీవితం లాగించేస్తున్నాయి. అహో! మన భరత ఖండమెంత పెద్దది-అన్నది కాస్తా ఉపఖండం అయింది. అటు తరువాత పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లనే రెండు అతి పెద్ద దేశాలు ఏర్పాటైపోయాయి. దాయాదులన్నారు భారుూ భారుూ అన్నారు. ఏవేవో అన్నారు కాని నిత్య సవతిపోరు జ్ఞాపకం వస్తుంది. ఇండోపాక్ బాంధవ్యాలు చూస్తుంటే- పాకిస్తాన్‌లో...? ఏమో ఏమో లేవు... మన ఇండియాలో ఎన్నో ఎన్నో వున్నాయి అని చెప్పుకుంటాం మనం. సర్వమానవ సౌభ్రాతృత్వం- సర్వమత సమధర్మం లాంటి తెనుగు సమాసాలు నోరుతిరగవు గాని పక్కన బెట్టండి. సెక్యులరిజం వుందిగా. మత స్వేచ్ఛ వుంది. ‘‘వాక్’’అనగా యిష్టమొచ్చినట్లు నడిచే అన్య ‘టాక్’లనగా వదరే- స్వతంత్రం పుష్కళంగా వున్నాయి. ‘‘నారాయణా!’’అంటే బూతు మాట... అంటాడొకడు. ‘‘అమ్మా’’ అంటే అమ్మ అంటావురా? మోస్ట్ వల్గర్ ఫెలో? అంటాడు- యింకొకడు - మతాలకి ఫ్రీడం- కులాలకి కేటాయింపులు- వెనుకబాటు తనానికి- నిత్య నూతన వడ్డింపులు- అన్నీ వున్నాయి. పైగా ఎన్నికలకి ముందు ఎన్నికల తరువాత ఎల్లవేళలలా ప్రాజెక్టులే, ప్రాజెక్టులు, ప్రణాళికలు వగైరా నిత్యవాడకం వస్తువుల ప్రకటనల లాగా ‘చవు’లూరిస్తూనే ఉంటాయ్. గంగానదినో, కాల్వనో లేదా మురికిగుంటనో లేక డస్ట్‌బిన్‌నో దేన్నో ఒక దాన్ని ‘‘క్లీన్’’అనగా ‘‘ప్రక్షాళనం’’చేయడానికి ‘ప్లాన్’లు, పన్నాగాలు ‘పంఢ్స్’’ అన్నీ లభిస్తున్నాయి.
అయినా పాక్‌లో జనాలు సంతోషకరంగా వున్నారు. అదే మన ‘‘ఐసోర్’’ అక్కడ చివరికి ‘‘ముషార్రఫ్ మియాఁ’’కూడా విదేశయానానికి ‘‘పర్మిషన్’’సంపాదించాడు. మనకి- అలాలేదు దొంగతనంగా పారిపోవలసిందేగా- నేరుగా పాస్‌పోర్టు ‘‘నై మిల్తా’’-కాని అనగా బట్... యిక్కడ అన్ని మతాలవాళ్లు అన్‌హ్యాపీగా వున్నారు- టెర్రరిస్టులను మనమీదకి పంపించి వాళ్లు హ్యాపీ... ఇస్లామాబాద్ హ్యాపిగా వుంది. వాళ్లమీదకి పంపలేని ‘‘తిరుగుబాటుదార్ల’’తో మనం సతమతం అవుతున్నాము.
గ్రామీణ ప్రాంతాలలో మహాత్మాగాంధీ రూరల్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ పథకాలున్నాయి. ఐనా కూలినాలి దొరకని జనాలు కోట్లాది మంది వున్నారు. కారణంబెయ్యది? ఆడాళ్లు సగటున 75, మగాళ్లు సగటున 70 ఏళ్ళు బ్రతికేస్తున్నారు. అదీ కారణం అన్నాడో- తుంటరి. వాళ్లు మాత్రం ‘‘వోటరులు’’కారా? కావున వాళ్లని కూడా కేర్ చెయ్యాలి అన్నాడు- ఒక ‘‘రూరల్ లీడరు’’అద్సరే... అవును ఐదు రాష్ట్రాలలో ఎన్నికల నగారా మ్రోగింది కదా? అట్టి తరి ఒక సంతోషకరమైన వార్త యిప్పుడే అందింది. ఇకమీదట ప్రకటనలు అవి అబద్ధాలు అయినా సుబద్ధాలు అయినా- నాయకులందరికీ ‘‘గోడలు’’ ఎక్కే హక్కు వున్నది అహో.. అంటూ సుప్రీంకోర్టు వాక్రుచ్చింది. గవర్నర్, ముఖ్యమంత్రులతోపాటు ఇతర మంత్రులకు కూడా పోస్టర్లమీద, మీడియా పోర్టల్స్‌లోను పేపర్లలో ఫుల్‌పేజి ప్రకటనలలోను, తమతమ ముఖారవిందాల అందాలను ‘‘గ్రుద్దు’’కోవచ్చును. సొంత డబ్బా వాయించుకోవచ్చు!
దీనివల్ల ఫోటోగ్రాఫర్లకు, ఫ్లెక్సీల కళాకారులకు ఇలా ఎందరికో అదనపు ఉపాధి లభించును... భేష్!
జయహో ఎలక్షన్స్!-
లెట్ మీ కన్‌క్లూడ్ ఆన్ దట్ హ్యాపీ నోట్!