ఉత్తరాయణం

హిందుత్వ వ్యతిరేకతే- సిద్ధాంతమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీఫ్ ఫెస్టివల్‌లో హిందూ వ్యతిరేకత కనిపిస్తున్నది. నాకు పరిచయమున్న ముస్లిం సోదరులనడిగాను. వారు ఖురాన్‌లో ఆవును చంపి తినమని ఎక్కడా లేదన్నారు. తప్పనిసరిగా తినాలని గాని- తినకూడదని గాని లేదన్నారు. హిందువులు పూజిస్తారు కనుక తినాలని భారతదేశ ముస్లిం సోదరుల పంతం అన్నారు. క్రిస్టియన్ దేశాలలో ఆహారం క్రింద గోమాంసం తింటారు. ఈమధ్య మ్యాడ్‌కౌ జబ్బులు వచ్చి ఆహారం దొరకక వారు ఇబ్బంది పడ్డారు. వారు ఎవరికి వ్యతిరేకంగా ఆవుమాంసం తినటం లేదు.
మన కమ్యూనిస్టు సోదరులకు - సెక్యులరిస్టు సోదరులకు హిందూత్వాన్ని వ్యతిరేకించటమే వారి సిద్ధాంతమైంది. వారికి వేరే సిద్ధాంతాలు వున్నట్లు లేవు. భారతదేశం ముఖ్యంగా వ్యవసాయ దేశం. ఈరోజుల్లో మిషన్స్ వచ్చాయి కాని, 50-60 ఏళ్ళ క్రితందాకా పశువుల ద్వారానే వ్యవసాయం జరిగింది. అందుకే పశుగణాభివృద్ధి దృష్ట్యా, గో-పాలకి, గో-మూత్రానికి వున్న ప్రత్యేకతల దృష్ట్యా గోవుని మాతగా పూజించే లక్షణం మన జాతికి వచ్చింది. తల్లి లేని పిల్లలకి ఆవుపాలు పట్టేవారు. చవుటి భూమి- సాగుకావాలంటే రెండేళ్ళు గోపేడ, గో-మూత్రము భూమికి ఎరువుగా వాడితే పంట భూమిగా (సేంద్రీయ వ్యవసాయం) మారుతుంది. ఇప్పటికి పశు సంపద తగ్గి, వ్యవసాయం భారమై, రైతన్నలు మరణిస్తుంటే, అది పట్టకుండా మన సోకాల్డ్ రివల్యూషనిస్ట్ బీఫ్ ఫెస్టివల్స్ పెట్టి- ఉన్న కాస్త గోసంతతి నాశనం చేయమంటున్నారు. జాతీయవాదులు మా ఫెస్టివల్‌కి అభ్యంతరం చెప్పటం, మా వంటింటి తిండి మీద అభ్యంతరం అంటున్నారు. సెక్యులరిజానికి విరుద్ధం అంటున్నారు. ఒకవేళ పశుసంపద అయిపోయిన తరువాత, ఈడిఆమిన్‌లా ఎవరైనా మేము మనుషులను తింటామంటే దానికి అభ్యంతరం చెబితే అది కూడా సెక్యులరిజానికి వ్యతిరేకమంటారేమో.
- వల్లూరు రామకృష్ణ, హైదరాబాద్
వారితోనే అసలు సమస్య
సూడో సెక్యులరిస్టులతోనే అసలు సమస్య అంటూ ముదిగొండ శివప్రసాద్‌గారు చేసిన విశే్లషణ నిర్దుష్టంగా ఉంది. ఇప్పటికైనా కళ్లుతెరిచి వక్రీకరించిన చరిత్రను సరిచేసే బాధ్యత ప్రభుత్వానిదే. కాని అదంత సులభం కాదు. విద్యాపీఠాలు, సాహిత్య చరిత్ర సంఘాలు వామపక్ష సూడో సెక్యులరిస్టుల కబ్జాలో ఉన్నాయి. తపాలా బిళ్లల మీద ఇందిర, రాజీవ్ బొమ్మలు తొలగిస్తారనగానే వీళ్లు యాగీ మొదలుపెట్టేశారు. దేశం వెయ్యేళ్లు విదేశీ పాలనలో మగ్గడానికి ఒక ముఖ్యకారణం దేశం ఎప్పుడూ ఒకటిగా లేదు. చిన్న చిన్న రాజ్యాలు, సంస్థానాలుగా ఉండేది. జయచంద్రుడు లాంటి ద్రోహులు కోకొల్లలుగా ఉండి విదేశీయులకు ప్రచ్ఛన్నంగా సాయం చేస్తూ రాజుల్ని చంపించి రాజ్యాలు హస్తగతం చేసుకొని విదేశీయులకు తొత్తులు పడి ఉండేవారు. ఈ బానిస మనస్తత్వం ఇప్పటికీ కొనసాగుతోంది.
- చంద్ర, కాకినాడ
స్థల పురాణాలను కొనుగోలు చేయండి
తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా స్థలపురాణం లేదా సంబంధిత దేవస్థానం నెలనెలా ప్రచురించే సంచికలను కొనుగోలు చేయడం ఎంతైనా మంచిది. వేలాది రూపాయలని ఖర్చుపెట్టి సుదూరంలో ఉన్న దేవాలయాలకు వెళ్తుంటాం. వసతులకు, భోజనాలకు తదితరమైన వాటికి విచ్చలవిడిగా వ్యయం చేస్తుంటాం. అయితే ఎంతో అందుబాటు ధరల్లో లభించే స్థలపురాణం లేదా సంచికలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దానివల్ల సంబంధిత క్షేత్ర ప్రాధాన్యతను సరిగా అవగాహన చేసుకోలేకపోతున్నాం. అందుచేత యాత్రికులు ఈ అంశాన్ని గమనించి క్షేత్ర సాహిత్యాన్ని ఔపోసన పట్టాలి.
- వి.కొండలరావు, పొందూరు
తొలగని నిరక్షరాస్యత
స్వాతంత్య్రం వచ్చి ఇనే్నళ్లయినా ఇంకా నిరక్షరాస్యత పూర్తిగా తొలగిపోలేదు. ముఖ్యంగా పల్లెటూర్లలో వ్యవసాయం, చేతి వృత్తులు చేసుకొనేవారు, గృహిణులకు ఇప్పటికీ చదువురాని వయోజనులుగా ఉన్నారు. వారందరినీ జనజీవన స్రవంతిలోకి తీసుకురావలసి వుంది. అలా ఉన్నందున పల్లెపల్లెకు వయోజన విద్యాకేంద్రాన్ని మంజూరు చేసినట్లయితే వయోజనులైన ప్రజలందరూ చదువుకొంటారు. వయోజన విద్యాకేంద్రాలని నెలకొల్పవలసి వుంది. వారికి చెప్పేందుకు బోధకులను ఒక్కో కేంద్రానికి ఇద్దరు చొప్పున ఎంపిక చేయవలసి వుందని వర్తమాన టి.ఆర్.ఎస్. ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
- కూర్మాచలం వెంకటేశ్వర్లు, కరీంనగర్
కరెంట్ రిజర్వేషన్ ఓ పజిల్
రైల్వే రిజర్వేషన్ విధానంలో కరెంట్ రిజర్వేషన్ విధానం ఒక పెద్ద పజిల్‌లా మారింది. చార్టు తయారైన తర్వాత రద్దయిన సీట్లు కరెంట్ రిజర్వేషన్ ద్వారా లభిస్తాయని, దానికోసం స్టేషన్‌లలో రైల్వేశాఖ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేసింది. విశాఖలో ఈ కరెంట్ రిజర్వేషన్ విధానం ఒక ప్రహసనంగా మారింది.