సంపాదకీయం

సంప్రదాయ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్టల్రో 1956 నుంచి అమలులో ఉన్న హైందవ దేవాలయ ప్రవేశాధికార శాసనం-హిందూ ప్లేస్ ఆఫ్ వర్‌షిప్ ఎంట్రీ ఆథరైజేషన్ యాక్ట్-లోని నియమావళిని అమలు జరపవలసిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బొంబాయి హైకోర్టు ఆదేశించడం ధార్మిక సంప్రదాయాల సమీక్షకు మరోప్రాతిపదిక! ఈ నియమావళిని కచ్చితంగా అమలు జరపనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డిహెచ్ వాఘేలా, న్యాయమూర్తి ఎమ్‌ఎన్ సోనల్‌లు అధిష్ఠించిన ధర్మాసనానికి శుక్రవారం హామీ ఇవ్వవలసి రావడం విచిత్రమైన పరిణామం! ఈ చట్టం అరవై ఏళ్లుగా అమలు జరుగుతోంది. అలాంటప్పుడు అమలు జరుపుతారా లేదా అని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని నిలదీయవలసిన అనివార్యం ఇప్పుడు ఏర్పడడం కూడ విచిత్రమైన పరిణామం! మహారాష్టల్రోని శని సింఘణాపూర్ ఆలయంలోని, నాసికాత్య్రంబకేశ్వరం ఆలయంలోకి మహిళలను ప్రవేశించనివ్వడంలేదని హక్కుల ఉద్యమకారిణులు హైకోర్టుకు నివేదించడం ఈ ఆదేశానికి, ప్రభుత్వం వారు హామీ ఇవ్వడానికి ప్రాతిపదిక! హైకోర్టు ఆదేశం, ప్రభుత్వపు హామీల ప్రాతిపదికగా సింఘణాపూర్‌లోని శనైశ్చరుని ఆలయంలోకి మహిళలు ఊరేగింపుగా వెళ్లి ప్రవేశించనున్నట్టు హక్కుల ఉద్యమాలవారు ప్రకటిస్తున్నారు! శని సింఘణాపూర్ ఆలయంలోకి మహిళలు ప్రవేశించకపోవడం అనాదిగా పాటిస్తున్న ఆచారం. ఈ సంప్రదాయాన్ని భక్తులు భక్తురాండ్రు ఇప్పటికీ గౌరవిస్తున్నారు. ఆలయ సంప్రదాయాన్ని విశ్వసిస్తున్న మహిళలు స్వచ్ఛందంగానే దూరంగానే దండం పెట్టుకుంటుండడం చరిత్ర! ఏ దేవాలయంలోకైనా ఎవరినైనా ప్రవేశించకుండా అడ్డుకునే వారికి ఆరు నెలల వరకు నిర్బంధ శిక్షను విధించడానికి మహారాష్టల్రో అరవై ఏళ్లుగా అమలులో ఉన్న చట్టం వీలు కల్పిస్తోంది! కానీ ఈ అరవై ఏళ్లుగా శని సింఘణాపూర్ ఆలయంలోకి తమను రానివ్వకపోవడం పట్ల భక్తి ప్రపత్తులు కల మహిళలు ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. ఇలా ఆలయంలోకి వెళ్లక పోవడం తమకు అవమానకరమన్న ధ్యాస కూడ ఆ మహిళలకు కలుగలేదు. అది ఆలయ సంప్రదాయమన్న విశ్వాసం మాత్రమే భక్తురాండ్రలో నెలకొని ఉంది! ఇప్పుడు హైకోర్టుకెక్కినవారు నిజానికి భక్తులు కారు, ఉద్యమకారిణులు! కేవలం ఈ దేశపు జాతీయ ధార్మిక సంప్రదాయాలను, విశ్వాసాలను భంగపరచడం ద్వారా సమాజంలో అలజడిని సృష్టించడమే దైవభక్తి లేని ఉద్యమకారిణుల లక్ష్యం! ఈ దేశంలో అనాదిగా పుట్టిపెరిగిన మతాలకు సంబంధించిన ఆచారాలను విశ్వాసాలను దెబ్బతీయడం ద్వారా సాంస్కృతిక సంక్షోభాన్ని సృష్టించడం ఈ ఉద్యమకారిణుల లక్ష్యం! మహిళల హక్కులపై ప్రేమతో కాక కుటుంబాలలోని వారిని మహిళలుగాను, పురుషులగాను వర్గాలుగా విడగొట్టి వైరుధ్యాలను సృష్టించడమే ఈ నకిలీ ఉద్యమాల లక్ష్యం...
అందువల్ల నిజమైన భక్తురాండ్రు కోరినప్పుడు మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం ఔచిత్యం కాగలదు. నిజమైన భక్తిగల మహిళలు ఆలయ సంప్రదాయాలను కించపరచరు, ఉల్లంఘించరు, చట్టాలు నిజానికి అనాదిగా ఉన్న సంప్రదాయాలకు ధ్రువీకరణలు మాత్రమే! అందువల్లనే శనిసింఘణాపూర్ ఆలయంలోనికి తమకు ప్రవేశం కల్పించవలసిందేనని ధర్మ సంప్రదాయ బద్ధులైన మహిళలు ఎవ్వరూ పట్టుపట్టలేదు! సింఘణాపూర్ దేవాలయంలోకి వెళ్లి శనైశ్చరుని పూజించే పురుషులు నల్లబట్టలు కట్టుకోవాలన్న నియమం కూడా ఉంది! అలా కట్టుకోని పురుషులు సైతం ఆలయంలోకి వెళ్లడానికి వీ లులేదు. మేము నల్లబట్టలు కట్టుకోము..అయినా గుడిలోకి వెడతాము! అని పురుషులు అనవచ్చు. అలాంటివారిని నిరోధించిన వారిపై కూడ ఈ చట్టం ప్రకారం కేసులు పెడతారా? నల్లబట్ట కట్టుకోవాలన్నది ధార్మిక సంప్రదాయం. మహిళలు వెళ్లరాదన్నది ప్రాకృతికమైన సంప్రదాయం! సమానత్వం అని అంటే ప్రాకృతికమైన ఏకరూపతను సాధించడం కాదు. అలా సాధించడం అసాధ్యం. ప్రాకృతికంగా సహజంగా భిన్నమైన విరస్వరం విలక్షణమైన శారీరక స్వరూపాలను ధర్మాలను కలిగి ఉండడంవల్ల మాత్రమే స్ర్తి పురుషులు స్ర్తిపురుషులు అవుతున్నారు, భార్యాభర్తలవుతున్నారు, అమ్మానాన్న అవుతున్నారు, కుమార్తె కుమారుడు అవుతున్నారు!
ఈ ప్రాకృతికమైన అంతరం వైవిధ్యమే కాని అసమానత కాదు. ఇదే ప్రాకృతిక న్యాయ సూత్రం-ప్రిన్సిపుల్ ఆఫ్ నాచురల్ జస్టిస్! ఈ ప్రాకృతిక వైవిధ్యాన్ని భంగపరిచి స్ర్తి పురుషులకు సమాన శరీరాకృతులుగా ఏర్పాటు చేసినట్టయితే సృష్టిలేదు, కుటుంబం లేదు, కుల పాల శృంగారం లేదు, వివాహ వ్యవస్థ లేదు, సంస్కృతి లేదు...మానవాళి లేదు! ఈ ప్రాకృతికమైన వైవిధ్యాలు ప్రాతిపదికగా రూపొందిన, వికసించిన విస్తరించిన ధర్మం, సంప్రదాయం, ఆచారం, విశ్వాసం సమాజానికి కష్టనష్టాలు కలిగించనంతవరకు వాటిని కొనసాగనివ్వడమే సహజ న్యాయం...ఉన్నత న్యాయస్థానాలుగాని, సర్వోన్నత న్యాయస్థానం కాని సమాజ హితాన్ని మాత్రమే కోరుతున్నాయి. సింఘణాపూర్‌లోని ఆలయంలోకి మహిళలు ప్రవేశించరాదన్నది హైందవ స్వభా వ నిహితమైన ఆచారం. ఈ స్వభావమే తండ్రికంటె తల్లి వేయిరెట్లు పూజనీయురాలన్న సంస్కారాన్ని యుగాలుగా వ్యవస్థీకరించింది. దేశ కాలబద్ధమైనది సంప్రదాయం. ఋతుమతులైన మహిళలు తమంత తాముగానే ఏదేవాలయంలోకి వెళ్లరు. కానీ ఋతుమతులైన మహిళలు మాత్రం దేవాలయంలోకి ఎందుకు వెళ్లరాదని నకిలీ హక్కుల ఉద్యమకారిణులు కొందరు ఇటీవల ప్రశ్నించారు! భౌతికమైన కుతర్కం పరిధిలో సంస్కారాలను ధార్మిక విశ్వాసాలను బందీ చేయాలన్న నకిలీ ఉద్యమాలను సమాజం అంగీకరించదు...విశ్వాసాలు, ధార్మిక అనుభూతులు ఈ భౌతిక అగతితార్కికమైన గీటురాయిలకు అందవు! పూరీ జగన్నాధ క్షేత్రంలో నీల మాధవునికి బలభద్రునికి వారి చెల్లెలైన సుభద్రాదేవికి ఏడాదికోసారి జ్వరం వస్తుంది, ఔషధ సేవనం చేయించడం, పథ్యం తినిపిండం సంప్రదాయం! విష్ణుదేవునికి తులసి ప్రియకరం, శివుడికి బిల్వదళాలు ఇష్టం...శివుడిని కూడ తులసీ దళాలతోను మొగలి పువ్వులతోను పూజ చేయాలని ఉద్యమాలు జరుపుతారా? కొన్ని ఆలయాలలో విష్ణువును బిల్వ దళాలతో పూజించడం సంప్రదాయం! సంప్రదాయం వైవిధ్యం...అసమానత్వం కాదు!
కామరూపలోని ఒక శక్తిపీఠంలోని అమ్మవారి ఆలయంలో నెలనెల మూడురోజులు గర్భ గృహాన్ని మూసి ఉంచే సంప్రదాయం ఏర్పడి ఉంది! శని సింఘణాపూర్‌లోని ఇళ్లకు తలుపులు లేవు...శనైశ్చరుని ప్రభావంతో దొంగతనాలు జరగవన్నది సంప్రదాయ విశ్వాసం...ఎవరికి నష్టం? స్వదేశీయ మతాలలోని సంప్రదాయాలను ప్రగతికి ప్రతిబంధకాలుగా చిత్రీకరిస్తున్న కుహనా ఉద్యమకారులు విదేశాలనుంచి వ్యాపించిన మతాలలోని మూఢ విశ్వాసాలను సైతం వేలెత్తి చూపడంలేదు! ఏమయినప్పటికీ న్యాయ స్థానాల తీర్పులు శిరోధార్యం. చివరి సమీక్ష చేయలసింది సుప్రీంకోర్టు...