సబ్ ఫీచర్

సమస్యను ఎదుర్కొనడం నేర్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగా టీచరైన కాలంలో పాఠం చెప్పేటప్పుడు నా ఉపోద్ఘాతమంతా కూడా లెక్కల గురించి గొప్పతనం చెప్పడమే చేశాను. లెక్కలు మనిషి యొక్క అద్భుతమైన ఆవిష్కరణలో ఎంత కీలకమైన పాత్ర వహించాయో చెప్పటం, పిల్లల యొక్క అటెన్షన్ పెంచటం. లెక్కలు నేర్చుకోవటం ఆషామాషీ కాదు. ఎంతో కష్టపడితే అర్థమవుతుందని చెప్పటం నా తొలి ఉపాధ్యాయ రంగంలో వేసిన అడుగులవి. కానీ నాకు ఆ తర్వాత అర్థమైంది ఏమిటంటే? లెక్కల గొప్పతనం చెప్పి పిల్లలను భయపెట్టాను. భయానికి, కఠినానికి సంబంధం ఉంటుంది. లెక్కలు కఠినమని చెప్పి భయాన్ని సృష్టించాను. అది తప్పు అని తరువాత తెలుసుకున్నాను. దానికి బదులుగా లెక్కల్లో ఉన్నటువంటి కాఠిన్యంకన్నా ఎదుర్కొనే సమస్యలను మొదలు పిల్లలకు చెబితే బాగుండేది కదా అనిపించింది. తప్పులు ఎక్కువగా క్యాలిక్యులేషన్స్‌లో వస్తాయి కాబట్టి తప్పులకు కారణమేమిటో ఆలోచించాను. లెక్కలు చేసే చేతితో మెదడులోవున్న ఆలోచనకు సంధానం ఉంటే తప్పు జరుగదు. చేయి పని చేయి, మెదడు పని మెదడు చేస్తే తప్పులు వస్తాయని తెలుసుకున్నాను. కాబట్టి బోర్డుపై లెక్కలు చేసేటప్పుడు పిల్లల అటెన్షన్ ఉండాలి. తరగతి గదిలో నేను చదువు చెప్పేటప్పుడు బైటనుంచి ఎవరొచ్చినా కానీ ‘‘ప్లీజ్ డోంట్ డిస్టర్బ్‌మి’’ అనేది. ఈ మాట ఎందుకన్నానంటే పిల్లలు కూడా లెక్కచేసేటప్పుడు అదే విధంగా పక్క విద్యార్థితో వ్యవహరించాలని నా ఆలోచన. శ్రద్ధ ఉంటే, ఏకాగ్రత ఉంటే గుణకార భాగాహారాల్లో తప్పులు పోవు. ఏకాగ్రత గురించి పిల్లలకు నేర్పగలిగితే లెక్కలు వస్తాయని నేర్చుకున్నాను.
లెక్క చేసే పద్ధతి గురించి ఆలోచించటం వేరు. గుణకార భాగాహారాలు చేయటం వేరు. లెక్కల పరిష్కారం గురించి ఆలోచించటం వేరుగా ఉంటుంది. ఆలోచించకుండా లెక్క మొదలుపెడితే ఆ లెక్క మధ్యలో ఆగిపోతుంది. ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంటే ప్రయాణ సందర్భంలో ఏమి ఆటంకాలు వస్తాయో వూహించుకుందాం కదా! అదే విధంగా లెక్క మొదలుపెట్టే ముందే ప్రణాళిక వేసుకోవాలి. లెక్క చేసే పద్ధతి గురించి ఆలోచన చేయాలి. ఆ పద్ధతి సరికావొచ్చును. కాకపోవచ్చును. ఒకరి ఇల్లు తెలుసుకునేటప్పుడు తప్పుడు దారిలో, రోడ్డులో పోవచ్చును. అప్పుడు ఏం చేస్తామన్నది ప్రశ్న? అక్కడే తలపట్టుకుని కూర్చుంటారా? నడుం బిగించి మరొక రోడ్డుపై ప్రయాణం చేస్తామా? అని అడుగుతాం. అదే విధంగా పిల్లలకు లెక్క ఇచ్చి తరగతి అంతా తిరుగుతుండేవాడిని. పిల్లలు తప్పు పద్ధతిలో లెక్క చేస్తున్నా ఏమి అనకపోయేవాణ్ణి. కానీ ఆ విద్యార్థి నిస్పృహ చెందుతున్నప్పుడు అక్కడికి వెళ్లి ఇది కాకపోతే మరో పద్ధతిలో ఆలోచించమని చెప్పేవాణ్ణి. అంటే టీచర్ తన పద్ధతిని విద్యార్థిపై రుద్దిన దానికన్నా వేరొక పద్ధతిలో ప్రయాణించటానికి ప్రోత్సహించాలి. దాంతో ఉపాధ్యాయునికి లాభమే. దీంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లెక్కలు కష్టమని చెప్పిన దానికన్నా ఆ లెక్క చేసేటప్పుడు కష్టాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆ విద్యార్థిలో ఆత్మవిశ్వాసం నింపటం ప్రధానం. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపితే ఆ లెక్కలు తాము కూడా చేయగలుగుతామని నమ్మకం కలుగుతుంది. అదే జీవితంలో కూడా పని మొదలుపెట్టేముందే అది కష్టం అని చెప్పిన దానికన్నా కొత్త మార్గాలు అనే్వషించే శక్తి నీలో ఉందని చెప్పటం, పిల్లల్లో విశ్వాసాన్ని కలిగించటం చేయాలి. నిత్యం తరగతి గదిని ఉపాధ్యాయుడు చురుకుగా ఉంచాలి. ఏ పనికూడా కష్టమని కాదు, కష్టాన్ని ఎదుర్కునే శక్తిని పిల్లల్లో కలుగచేయాలి. భయంతో నిరుత్సాహం వస్తుంది. భయంతో ఉన్న శక్తికూడా క్రుంగిపోతుంది. ఉపాధ్యాయుడు తరగతి గదిని నీరుగార్చకుండా చూసుకోవాలి. పనిలో ఉన్నటువంటి కఠినత్వాన్ని పిల్లలకు చెప్పటంకన్నా, ఆ కాఠిన్యాన్ని ఎదుర్కునే శక్తిని పిల్లల్లో కలిగించాలని నేను లెక్కలు చెబుతున్నప్పుడు అనుభవ పూర్వకంగా తెలిసింది.
జీవితంలో కూడా సమస్యను ఎదుర్కొనటంలో ఉన్న ఆనందం ఉంటుందని చెప్పాలి. కానీ దానిలో వున్న చిక్కులను నెమరువేసుకొని వెనుకడుగు వేయవద్దని తరగతి గది ద్వారా పిల్లల్లో నూరిపోయాలి. సబ్జెక్టులో ఉన్న కాఠిన్యంపై ఉపన్యసించకూడదు.

- చుక్కా రామయ్య